నిసార్ అహ్మద్ కక్రూ
నిసార్ అహ్మద్ కక్రూ | |||
పదవీ కాలం 2010 పిభ్రవరి, 19 – 2011 అక్టోబర్, 25 | |||
నియమించిన వారు | ప్రతిభా పాటిల్ | ||
---|---|---|---|
ముందు | అనిల్ రమేష్ దావె | ||
తరువాత | మదన్ లోకుర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం |
1949, అక్టోబరు 26 న నిసార్ అహ్మద్ కక్రూ జన్మించారు. 1975 లో ప్లీడర్ గా, వకీలుగా 1979 లో, అడ్వకేట్ గా 1982 లో నమోదు అయి జిల్లా, సెషన్స్ కోర్టు, ఇతర కోర్టులలో న్యాయవాది అనుభవం గడించాడు. ప్రభుత్వ న్యాయవాదిగా 197 8లో జిల్లా, సెషన్స్ కోర్టు, బారాముల్లాలో నియమించబడ్డాడు. 1981 లో ప్రభుత్వ న్యాయవాదులు స్వంత ప్రాక్టీసుకి వ్యతిరేఖంగా ప్రభుత్వ ఉత్తర్వు ఇచ్చినప్పుడు రాజీనామా చేశాడు.1984లో ప్రధాన న్యాయస్థానము, జమ్ము, కాష్మీర్ లో పౌర, నేర, రాజ్యాంగ, సేవ, కార్మిక, కంపెనీ వ్యవహారాల్లో, అనుభవంగడించాడు. ఫిభ్రవరి1988 నుండి డిసెంబరు 1990 వరకు ప్రధాన ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. ఆ తరువాత మరల స్వంత ప్రాక్టీసు కొనసాగించి, నవంబరు 1997లో హైకోర్టు ధర్మాసనం సభ్యుడిగా నియమించబడ్డాడు. స్థానాపన్న ప్రధాన నాయమూర్తిగా చాలా సార్లు పనిచేసాడు. పదోన్నతి పై 2010 పిభ్రవరి, 19న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా నియమించబడ్డాడు. పదవీవిరమణ నిబంధనలప్రకారం, 62సంవత్సరాల వయస్సులో 25.10.2011 న పదవీవిరమణ చేశాడు