మలయాళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 30: పంక్తి 30:
ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు [[తమిళ భాష|తమిళం]], [[సంస్కృతము|సంస్కృతం]], [[ప్రాకృతం]], [[పాళీ భాష|పాళీ]], [[హీబ్రూ భాష|హీబ్రూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[పర్షియన్ భాష|పర్షియన్]], సిరియాక్, [[పోర్చుగల్|పోర్చుగీసు]], [[డచ్ భాష|డచ్]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] మరియు [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.
ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు [[తమిళ భాష|తమిళం]], [[సంస్కృతము|సంస్కృతం]], [[ప్రాకృతం]], [[పాళీ భాష|పాళీ]], [[హీబ్రూ భాష|హీబ్రూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[పర్షియన్ భాష|పర్షియన్]], సిరియాక్, [[పోర్చుగల్|పోర్చుగీసు]], [[డచ్ భాష|డచ్]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] మరియు [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.


20వ శతాబ్ది తొలినాళ్ళలో [[సాహిత్యం|సాహిత్య]] పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది. ఆ మహాకవిత్రయం కుమారన్, ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్‌లు<ref>{{cite book|last1=అళిక్కోడ్|first1=సుకుమార్|title=మహాకవి ఉళ్ళూర్|date=1983|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaakavi%20ul%27luur&author1=shrii%20bommakan%27t%27i%20shriinivaasaachaaryulu&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1983%20&language1=telugu&pages=108&barcode=2990100051706&author2=&identifier1=&publisher1=Sahitya%20Akademi%20,%20Rabindra%20Bhavan,%20New%20Delhi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=%20SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-17&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/711|accessdate=9 December 2014}}</ref>.
20వ శతాబ్ది తొలినాళ్ళలో [[సాహిత్యం|సాహిత్య]] పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది. ఆ మహాకవిత్రయం కుమారన్, ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్‌లు<ref>{{cite book|last1=అళిక్కోడ్|first1=సుకుమార్|title=మహాకవి ఉళ్ళూర్|date=1983|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=https://archive.org/details/in.ernet.dli.2015.386237|accessdate=9 December 2014}}</ref>.


== లిపి ==
== లిపి ==

05:01, 25 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

మలయాళము (മലയാളം) దక్షిణ భారతదేశములోని కేరళ రాష్ట్రములో అధికార భాష. మూడున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళము మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల తర్వాత మలయాళం అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు.

మలయాళము (മലയാളം)
మాట్లాడే ప్రదేశం: భారతదేశము
ప్రాంతం: కేరళ, లక్షద్వీపాలు, మరియు ఇరుగుపొరుగు రాష్ట్రాలు
మాట్లాడే వారి సంఖ్య: 3.57 కోట్లు
స్థానం: 29
అనువంశిక వర్గీకరణ: ద్రావిడ

 దక్షిణ
  తమిళ-కన్నడ
   తమిళ-కొడగు
    తమిళ-మలయాళ
     మలయాళం

అధికార స్థాయి
అధికార భాష: కేరళ మరియు లక్షద్వీపాలు (భారతదేశం
నియంత్రణ: --
భాష కోడ్‌లు
ISO 639-1 ml
ISO 639-2 mal
SIL MJS
చూడండి: భాషప్రపంచ భాషలు

మలయాళము ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి ఉంది.

భాషా పరిణామము

మలయాళం దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన నవీన భాష. తమిళం, కన్నడం, కోట, కోడగు భాషలు కూడా ఈ భాషా ఉపకుటుంబానికి చెందినవే. వీటిలో తమిళానికి మలయాళంతో పోలిక ఎక్కువ. తమిళ, మలయాళ భాషలకు మూలమైన ఆది తమిళ-మలయాళ భాష తొమ్మిదొ శతాబ్దం నుండి వేర్పడటం ప్రారంభమై ఆ తరువాత నాలుగైదు శతాబ్దాలుగా రెండుగా చీలిపోయిందని నమ్మకం. అలా మలయాళం తమిళం నుండి వేరుపడి స్వతంత్ర భాషగా వెలసింది. మలయాళం అవతరించిన తొలి దశలలో తమిళం అధికార భాష మరియు పండిత భాష కావడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మలయాళ సమాజంలో బ్రాహ్మణుల రాకతో భాష మీద సంస్కృత ప్రభావం హెచ్చింది. కానీ సంస్కృత ప్రభావంలేని కోదుం మలయాళం అను స్వఛ్చమైన మలయాళ మాండలికం ఇప్పటికీ కేరళలోని కొన్ని చోట్ల వ్యవహరంలో ఉంది. నంబూద్రీలు కేరళ సాంస్కృతిక జీవితంలో అడుగుపెట్టడం, అరబ్బుల వర్తక సంబంధాలు, కేరళపై పోర్చుగీసు దండయాత్ర, సామంతరాజ్యాల స్థాపన అనేక రోమాన్స్, సెమెటిక్ మరియు ఇండో-ఆర్యన్ భాషాగుణాలు మలయాళ భాషలో ఇమిడిపోవడానికి దోహదం చేశాయి.

సాహిత్యము యొక్క అభివృద్ధి

మలయాళంలో లభ్యమైన ప్రప్రథమ లిఖిత ఆధారం కీ.శ.830కి చెందిన వాయప్పళ్లి శాసనం. ఆది మలయాళ సాహిత్యాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • తమిళ పట్టు రీతిలో కృతులు
  • సంస్కృత సాంప్రదాయంలో మణిప్రవాలం కృతులు
  • మలయాళంలో జానపద గేయాలు

ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పాళీ, హీబ్రూ, హిందీ, ఉర్దూ, అరబిక్, పర్షియన్, సిరియాక్, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి మరియు ఆంగ్లం. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.

20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది. ఆ మహాకవిత్రయం కుమారన్, ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్‌లు[1].

లిపి

మలయాళ అక్షరమాల చూడండి

అఖిల భారత బ్రాహ్మీ లిపి నుండి గ్రంథి లిపి ద్వారా వట్టెఱుతు (గుండ్రపాటి వ్రాత) గా మలయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మలయాళ లిపికూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు.

౧౯౬౦లో మలయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి.

మలయాళంలో ప్రస్తుతం ౫౩ అక్షరాలు ఉన్నాయు. వీటిలో ౨౦ అచ్చులు, మిగిలినవి హల్లులు. ౧౯౮౧లో కొత్త వ్రాత పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఈ కొత్త పద్ధతి typesetలోని మొత్తం అక్షరాలను ౯౦౦ల నుండి ౯౦కి తగ్గించింది. ఇలా చేయడం వలన మలయాళ లిపి టైపురైటర్ల మీద కంప్యూటర్ కీబోర్డుల మీద ఇమడగలిగింది.

౧౯౯౯లో చిత్రజకుమార్ మరియు కేహెచ్ హుస్సేన్ స్థాపించిన 'రచన అక్షర వేది' అనే సంస్థ మెత్తం ౯౦౦లకు పైబడి సంయుక్తాక్షరాలు గల ఫాంటులను తిరువనంతపురంలో విడుదల చేసింది. దీనితో బాటు ఒక editor software ను కూడా విడుదల చేసారు. ఇక ౨౦౦౪లో వీటినే ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ యొక్క రిచర్డ్ స్టాల్మన్ గారు GNU License క్రింద కొచ్చిన్లో విడుదల చేసారు.

భాషలో అంతరాలు, బయటి ప్రభావాలు

ప్రాంతం, కులం, వృత్తి, సామాజిక స్థాయి, శైలి మరియు register లను బట్టి ఉచ్ఛారణా పద్ధతులు, vocabulary, and distribution of grammatical and phonological elements లో తారతమ్యాలు కనిపిస్తాయి. సంస్కృతం యొక్క ప్రభావం బ్రాహ్మణ మాండలికాలలో అధికంగాను, హరిజన మాండలికాలలో అత్యల్పంగానూ ఉంటుంది. ఆంగ్లం, సిరియాక్, లాటిన్ మరియు పోర్చుగీసు భాషల నుండి అరువుతెచ్చుకున్న పదాలు క్రైస్తవ మాండలికంలోనూ, అరబిక్ మరియు ఉర్దూ పదాలు ముస్లిం మాండలికంలో విరివిగా కనిపిస్తాయి. మలయాళం సంస్కృతం నుండి వేలకొద్ది నామవాచకాలు, వందలాది క్రియాపదాలు మరియు కొన్ని indeclinables అరువుతెచ్చుకున్నది. కొన్ని పదాలు సంస్కృతం నుంచి మలయాళ భాషకు చేరుకున్నాయ్యి.

సంస్కృతం తర్వాత మలయాళ భాషను అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. ఆధునిక మలయాళ భాషలోని వందలాది individual lexical items and many idiomatic expressions ఆంగ్లభాషా సమన్వితాలే.

ప్రణాళిక మరియు అభివృద్ధి

అధికార భాషగా మరియు పాఠశాలలు, కళాశాలలో బోధనా మాధ్యమంగా మలయాళం అభివృద్ధి చెందుతున్నది. భాషలో శాస్త్రీయ పరిభాష నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది. ఉదార స్వభావులైన మలయాళీలు తమ భాషతో సహా ఇతరభాషలు సహజీవనం సాగించడానికి ఎల్లప్పుడూ ఆహ్వానించారు. ఇతర భాషలతో జరిగిన ఈ పరస్పరలే మలయాళ భాష యొక్క వృద్ధి అనేక రీతులలో దోహదం చేశాయి.

చూడండి

బయటి లింకులు

  1. అళిక్కోడ్, సుకుమార్ (1983). మహాకవి ఉళ్ళూర్. న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. Retrieved 9 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=మలయాళం&oldid=2343004" నుండి వెలికితీశారు