కండరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: et:Lihas
చి యంత్రము కలుపుతున్నది: sah:Былчыҥ
పంక్తి 74: పంక్తి 74:
[[ro:Sistemul muscular]]
[[ro:Sistemul muscular]]
[[ru:Мышцы]]
[[ru:Мышцы]]
[[sah:Былчыҥ]]
[[simple:Muscle]]
[[simple:Muscle]]
[[sk:Sval]]
[[sk:Sval]]

18:18, 22 జనవరి 2009 నాటి కూర్పు

కండరాలలో రకాలు.

కండరాలు (Muscles) శక్తిని ఉపయోగించి చలనము కలిగిస్తాయి. ఈ చలనము బహిర్గతం కాని అంతర్గతంగా కాని ఉంటుంది. కండరాలలో మూడు రకాలున్నాయి. వీటిలోని గుండె, ప్రేగు కండరాల సంకోచ వ్యాకోచాలు మనిషి మనుగడకు అత్యవసరం. మనిషి శరీర చలనానికి సంకల్పిత కండరాలు ముఖ్యం. మనశరీరంలో ఇంచుమించు 639 కండరాలున్నట్లు ఒక అంచనా. గుండె, ప్రేగుల కండరాలు అసంకల్పిత కండారాలు అనగా వీటి కదలిక మనకు తెలియకుండానే జరిగిపోతుంది.

కండరాల నిర్మాణం

అస్థి కండరాలు

కండర తంతువులు (Muscle fibres or Myocytes) అనే కండర కణాలతో ఈ కండరాలు ఏర్పడి ఉంటాయి. కండరం మొత్తాన్ని ఆవరించి కొల్లాజన్ తంతువుల ఎపీమైసియమ్ (Epimyceum) అనే సంయోజక కణజాల నిర్మితమైన తొడుగు ఉంటుంది. ఈ తొడుగు లోపలికి విస్తరించి, కండరాన్ని కొన్ని కట్టలు (Fascicles)గా విభజిస్తూ వాటి చుట్టూ ఆచ్ఛాదనంగా పనిచేస్తుంది. దీనిని పెరిమైసియమ్ (Perimyceum) అంటారు. ఇది కండరపు కట్టలోకి ప్రవేశించి ప్రతి కండర కణం చుట్టూ మరో సున్నిత ఆచ్ఛాదనం ఏర్పరుస్తుంది. దీనిని ఎండోమైసియమ్ (Endomyceum) అంటారు. కండర కణజాలం వెలుపలికి విస్తరించిన ఈ తంతు నిర్మిత కణజాలపు తొడుగులు అన్నీ కలసి స్నాయు బంధనాలుగా ఏర్పడతాయి. ఇవి ఎముకలతో అంటి పెట్టుకోవడమే కాకుండా, వాటిలోని కొల్లాజన్ తంతువులు అస్థిక చుట్టూ ఉండే సంయోజక కణజాల నిర్మితమైన పరి అస్థిక (Periosteum) తో కలసిపోయి ఎముక - కండరం మధ్య సంధానం దృఢంగా అతికి ఉండేందుకు తోడ్పడతాయి.

ముఖ్య లక్షణాలు

  • క్ష్యోభ్యత (Irritability) : కండారాలు ఉద్దీపనలను గ్రహించి వాటికి అనుగుణంగా అనుక్రియను జరుపుతాయి.
  • సంకోచత్వం (Contractility) : కండరాలు ప్రేరేపణలు, వాటి బలాలను బట్టి సంకోచిస్తాయి.
  • వహనం (Conduction) : కండరంలో ఒకచోట గ్రహించబడిన ఉద్దీపనాన్ని కండరమంతా ప్రసారం చేస్తాయి.
  • స్థితిస్థాపకత (Elasticity) : కండరం సంకోచం లేదా సడలిక చెందిన తరువాత తిరిగి తన మామూలు స్థితికి చేరుకుంటుంది.

వ్యాధులు

  • కండరాల వాపు
  • మయోపతీ
  • కండరాలు చిక్కిపోవడం
  • కాన్సర్
"https://te.wikipedia.org/w/index.php?title=కండరం&oldid=377873" నుండి వెలికితీశారు