భారత ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


భారత ప్రభుత్వం, లేదా కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది దేశంలో గల 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల మీద అధికారాన్ని కలిగి ఉంది. భారత రాజధాని ఢిల్లీలో ఇది కేంద్రీకృతమైంది.

భారత ప్రభుత్వ యంత్రాంగం మూడు స్వతంత్ర విభాగాలుగా ఏర్పడి ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ . కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతి ఆద్వర్యంలో నడుస్తుంది. శాసన వ్యవస్థ (పార్లమెంటు) ఎగువసభగా పిలిచే రాజ్యసభను, దిగువసభగా పిలిచే లోక్‌సభను, రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. న్యాయ వ్యవస్థ శీర్షమున అత్యున్నత న్యాయస్థానమును (సుప్రీమ్ కోర్టు), 21 ఉన్నత న్యాయస్థానాలనూ (హై కోర్టు), ఇంకా జిల్లా స్థాయిలో పౌర (సివిల్), నేర (క్రిమినల్), కుటుంబ (ఫామిలీ) న్యాయస్థానములను కలిగి ఉంటుంది. భారత పౌరులకు దిశా నిర్దేశము చేయు పౌర విధాన స్మృతి, భారతీయ శిక్షా స్మృతి, నేర విధాన స్మృతి వంటి సాధారణ న్యాయ సూత్రాలను కేంద్ర శాసన వ్యవస్థ రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వము వలెనే ప్రతీ రాష్ట్ర ప్రభుత్వమూ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లను కలిగి ఉంటుంది. కేంద్రానికి, రాష్ట్రాలకి వర్తించు న్యాయ వ్యవస్థ ఇంగ్లీష్ కామన్, స్టాట్యుటరీ లా ఆధారంగా తయారు చెయ్యబడింది. భారతదేశము కొన్ని సౌలభ్యములతో అంతర్జాతీయ న్యాయ స్థానము ( ఇంటర్‌నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ) ను అంగీకరిస్తోంది. ప్రాంతీయ పరిపాలన కొరకు, అధికార వికేంద్రీకరణకు ఉపకరంచిన పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగములోని 73వ, 74వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.

వ్యక్తిత్వ బాధ్యతలు

[మార్చు]

భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ విధానాలు యునైటేడ్ కింగ్‌డమ్ (వెస్ట్ మినిస్టర్ సిస్టమ్) ను పోలి ఉంటుంది.

సమూహ బాధ్యతలు

[మార్చు]

నిర్వహణా శాఖ

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]