ముచ్చర్ల అరుణ
ముచ్చర్ల అరుణ | |
---|---|
జననం | కొత్తగూడెం, ఖమ్మం జిల్లా | 1965 సెప్టెంబరు 13
వృత్తి | సినీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1981– 1991 |
జీవిత భాగస్వామి | జి. మోహన్ |
ముచ్చెర్ల అరుణ ఒక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా సినిమా కెరీర్ లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. 1981లో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోకచిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకున్నది. సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత చండీగఢ్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని గృహిణిగా మారించి. ఈమెకు నలుగురు ఆడపిల్లలు.
నేపధ్యము
[మార్చు]అరుణ 1965 సెప్టెంబర్ 13న ఖమ్మం జిల్లా, కొత్త గూడెంలో జన్మించింది.[1] చదువంతా హైదరాబాదులోనే సాగింది. తండ్రి ఆదాయపన్ను శాఖలో ఆఫీసరుగా పనిచేసి మళ్ళీ వ్యవసాయం చేశాడు. ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు.
ఈమెకు 1987లో బిజినెస్‌మ్యాన్ మోహన్‌గుప్తతో పెళ్ళయింది. వీరికి నలుగురు కూతుర్లు.[2]వారి పేర్లు శిఖా, యస్వీ, శోభిక, ఇంకా రియా. అరుణ సామాజిక మాధ్యమాలలో గుర్తింపు తెచ్చుకుంది.<ఈనాడు.వసుంధర.22 September 2024.
కెరీర్
[మార్చు]మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- సీతాకోకచిలుక (1981) (తొలి పరిచయం)
- జేగంటలు (1981)
- జస్టిస్ చౌదరి (1982)
- అడవి సింహాలు (1983)
- ఆలయశిఖరం (1983)
- అగ్నిజ్వాల (1983)
- కళ్యాణ వీణ (1983)
- పుత్తడి బొమ్మ (1983)
- రాకాసిలోయ (1983)
- డార్లింగ్ Darling డార్లింగ్ (1983)
- ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
- రారాజు (1984)
- డాకు (1984)
- శ్రీవారికి ప్రేమలేఖ (1984)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- రావు - గోపాలరావు (1984)
- స్వాతి (1984)
- మూడిళ్ళ ముచ్చట (1985)
- దొంగల్లో దొర (1985)
- అరుణ కిరణం (1986)
- ఆత్మబంధువు (1986)
- చంటబ్బాయ్ (1986)
- దేశోద్ధారకుడు (1986)
- శ్రీమతి ఒక బహుమతి (1987)
- భానుమతి గారి మొగుడు (1987)
- శృతిలయలు (1987)
- సంసారం ఒక చదరంగం (1987)
- స్వర్ణకమలం (1988)
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- అడవిలో అర్ధరాత్రి (1989)
- గీతాంజలి (1989)
- ప్రజాప్రతిఘటన (1990)
మూలాలు
[మార్చు]- ↑ "ఆ హీరోను కొట్టక తప్పలేదు!". eenadu.net. ఈనాడు. 31 July 2018. Archived from the original on 31 జూలై 2018. Retrieved 31 జూలై 2018.
- ↑ "సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?". Sakshi. 2022-02-13. Retrieved 2022-02-14.