అమర్‌నాథ్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్‌నాథ్
జననం
మానాపురం సత్యనారాయణ పట్నాయక్

1925
మరణం1980 ఫిబ్రవరి 22(1980-02-22) (వయసు 55)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఎం.ఎస్.పట్నాయక్
విద్యఇంటర్‌మీడియట్
వృత్తిసినిమా నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1953-1963
గుర్తించదగిన సేవలు
అమర సందేశం
వదినగారి గాజులు
పిల్లలురాజేష్, శ్రీలక్ష్మి

అమర్‌నాథ్ తెలుగు చలనచిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అమర్‌నాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. ఇతడు విశాఖపట్నానికి చెందినవాడు. ఇతడు 1925లో జన్మించాడు. ఇతడికి చిన్నతనం నుండే నటన, సంగీతాల పట్ల మక్కువ ఉండేది. వాటిలో విశేషమైన కృషి చేశాడు. సంగీతంలో బాగా కృషి చేసి లలితసంగీత కచేరీలు ఇచ్చేవాడు. మధురమైన కంఠస్వరంతో శ్రోతలను రంజింప చేసేవాడు. నాటకాలలో ప్రధానపాత్రలలో నటించి పెద్దల మెప్పులను సంపాదించుకున్నాడు. హాస్యరసంతో కూడిన గీతాలను రచించి స్వరపరిచి గ్రామ్‌ఫోన్ రికార్డులను ఇచ్చాడు. 1950లలో ఎం.ఎస్.పట్నాయక్ పేరుతో ఇచ్చిన రికార్డులకు మంచి గిరాకీ ఉండేది. ఇతడు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివాడు. చదువు తరువాత విశాఖపట్నం లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా పనిచేశాడు.

సినిమా రంగం[మార్చు]

అమరసందేశం చిత్రంలో అమర్‌నాథ్

భారత ఆహార సంస్థలో పనిచేస్తూ ఇతడు సినిమా అవకాశాలకోసం ప్రయత్నించాడు. జి.కె.మంగరాజు, ఎం.ఎస్.నాయక్ ఇతనికి సహకరించి కొందరు నిర్మాతలకు సిఫారసు చేశారు. ఫలితంగా ఇతడికి 1953లో అమ్మలక్కలు, నా చెల్లెలు చిత్రాలలో నటించడానికి అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నప్పుడే ఇతడి నటనాశక్తిని గమనించి నిర్మాతలు ఇతడిని తమ చిత్రాలలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన అమర సందేశం చిత్రంలో ఇతడికి నాయకపాత్ర లభించింది. ఇతడు మగవారి మాయలు అనే సినిమాను నిర్మించాడు. అది ఆర్థికంగా పరాజయం పాలయింది. తరువాత ఇతనికి సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగు అయ్యాడు. 1973లో అమరచంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి బాలయోగి అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో ఇతడు, విజయనిర్మల నాయకానాయికలు. అయితే ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఇతని సంతానం రాజేష్, శ్రీలక్ష్మి చిత్రసీమలో నటీనటులుగా రాణిస్తున్నారు. ఇతని సోదరుడు మానాపురం అప్పారావు సినిమా దర్శకుడు.[2]

నటించిన సినిమాల జాబితా[మార్చు]

మరణం[మార్చు]

ఇతడు 1980, ఫిబ్రవరి 22వ తేదీన స్వర్గస్థుడయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. "అమర్‌నాథ్ - ఆరిపాక సూరిబాబు - ఆంధ్ర సచిత్రవారపత్రిక - 26-10-1990 - పేజీ: 36". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-23.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-01-07.