ఎన్.జి.రంగా

వికీపీడియా నుండి
(గోగినేని రంగనాయకులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గోగినేని రంగనాయకులు
N.g.ranga.jpg
ఎన్.జి.రంగా
జననంగోగినేని రంగనాయకులు
నవంబరు 7, 1900
మరణంజూన్ 9, 1995
ఇతర పేర్లుఎన్.జి.రంగా
భారత రైతాంగ ఉద్యమపిత
వృత్తిలోక్ సభ సభ్యుడు , రైతు నాయకుడు
ప్రసిద్ధిభారత స్వాతంత్ర్య సమరయోధుడు,
రాజకీయ పార్టీకాంగ్రెసు పార్టీ
భారత కృషికార్ లోక్ పార్టీ
మతంహిందూ మతము హేతువాది
తండ్రిగోగినేని నాగయ్య
తల్లిఅచ్చమాంబ
Gogineni Ranga.JPG
NG Ranga 2001 stamp of India.jpg

ఆచార్య ఎన్.జి.రంగా [ N.G.RANGA] గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.[1]. 1991 లో భారత ప్రభుత్వం నుండి  పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసారు.

జీవిత ప్రథమార్థం[మార్చు]

రంగా, 1900, నవంబరు 7గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది . 1920లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.

రంగా నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఈ పాఠశాల గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది.

స్వాతంత్ర సమరంలో[మార్చు]

1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత 1936 లో స్వామి సహజానంద సరస్వతి తో కలసి భారతీయ కిసాన్ సభను (AIKS) స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.

1931 డిశంబరులో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో రంగా ఒక సంవత్సరకాలం జైలు శిక్ష అనుభవించాడు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర పొరాటం లొ భాగం చెసారు.తన బార్య భారతి దేవి తొ కలసి వ్యక్తి గత సత్యాగ్రహం లొనూ, క్విట్ ఇండియా ఉద్యమం లొ పాల్గొన్నారు. 1940లో మద్రాసులొ శాసనోలింఘనజేసి చెరసాలలొ ఏడాది పున్నాడు. 1941 జైలునుండి విడుదల చేసి వెనువెంటనే డెటిన్యూగా రాయవేలూరు జైలుకు తీసుకొని వెళ్ళి 1942 విడుదల చేశారు. మరల క్విట్ ఇండియా ఉద్యమంలొ పాల్గొన్నందులకు 1942 నవంబ్రు 4 న నిర్బందించి రాజపుట్లనా దగ్గర దామో జైలోి ఉంచి 1944 అక్తోబరు 9 తేదీన విడుదల చేశారు.ఈ సమయంలొ ఆయన ఆనేక గ్రంథాలు రాశాడు.

రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు.1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.

రాజకీయ జీవితము[మార్చు]

రంగా 1952 లో కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీని స్థాపించారు. నెహ్రు గారి కొరికపై 1955లొ కె.యల్.పి.ని కాంగ్రెస్ లొ విలినీం చేసారు. ఆ తరువాత 1959 లో చక్రవర్తి రాజగోపాలాచారి కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సహకార వ్యవసాయాన్ని, దానిని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకించారు.1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.

లోక్ సభ పదవీకాలం నియోజకవర్గం పార్టీ
2వ లోక్ సభ 1957-1962 తెనాలి కాంగ్రెసు పార్టీ
3వ లోక్ సభ 1962-1967 చిత్తూరు స్వతంత్ర పార్టీ
4వ లోక్ సభ 1967-1970 శ్రీకాకుళం స్వతంత్ర పార్టీ
7వ లోక్ సభ 1980-1984 గుంటూరు కాంగ్రెసు (ఐ)
8వ లోక్ సభ 1984-1989 గుంటూరు కాంగ్రెసు (ఐ)
9వ లోక్ సభ 1989-1991 గుంటూరు కాంగ్రెసు (ఐ)

1952-57 ఉమ్మడి మద్రాస్ నుండి, 1977- 80 ఆంద్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిద్యం వహించారు.

తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి (1957-1991) లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.

1952 నుంచి 1991 వరకు, కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, పార్లమెంట్ లో రాజకీయప్రతినిధిగా పనిచేసారు.సుధీర్గకాలము నిస్వార్దంగా సేవలనందించిన రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు.

రంగా గారు ఎందరినొ ప్రజా నాయకులుగా తీర్చి దిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు , కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యులే .

రచనలు[మార్చు]

రంగా గారు ఆంగ్లం లొ 65 పుస్తకాలను, తెలుగులొ 15 పుస్తకాలను రాసారు. వాటిలొ ముఖ్యమైనవి.

1.రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులు ' అనే పేరుతో గ్రంథస్తం చేశాడు.

2.1931 లో కారాగారం ఉన్న్న సమయంలో 'ఆధునిక రాజ్యాంగ సంస్థలు 'అనే గ్రంథాన్ని రెండు భాగాలుగా రాశాడు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కారాగారం లొ ఉన్నప్పుడు మూడు పుస్తకాలను రాసారు.

3.Kisans and Communists,

4.Challange of the World role of National Revolution.

5.Life and thoughts of a political prisoner వంటి పుస్తకాలు రాసారు.

ఆంధ్రా ఎకనామికల్ సీరీస్ క్రింద వెలువడిన రంగా గారి పరిశోధన గ్రంథాలు

6. Economic organisation of Indian villages vol 1 (Deltaic villages) 1926.

7. Economic organisation of Indian villages vol II (Dry Deltaic villages) 1928.

8. The Tribes of Nilagiries - Their Economic and Social conditions - 1928.

9. The Handloom Weaving Industry - 1930.

10. Economic condition of the Zamindary ryots 1933.

11. Labour in South India - 1934.

12. A guide to Rural Economics.

13.Colonial And Colored Peoples' Programme For Their Freedom And Progress

14 కాకతీయ, విజయనగర, తంజావూరు, చంజి, మధుర రైతాంగ ప్రజల, భరతపూర్, సిక్కు, మహారాష్ట్ర, ప్రజల రాజ్యాంగ నిర్మాణ చరిత్రలను పరిశీలించి ' కాకతీయ నాయకులు ' పేరుతొ రైతులకు రాజ్యాంగ నిర్మాణ, నిర్వహణ, చరిత్ర, కలవని నిరూపించారు.

రైతు గ్రంథమాల పేరుతో వెలువడిన రంగా గారి పరిశోధన గ్రంథాలు

15. హరిజన నాయకుడు

16. రైతు భజనావళి (ఇది అనేక భాషల్లొ అనువదించ బదినది)

17.నిలగిరి కొండజాతులు - వారి ఆర్దిక, సాంఘిక పరిస్థితులు-1928

18, ప్రపంచ ధనికవాదం, సామ్రాజయవాదులకు ప్రపంచ రైతాంగము సవాలు -1942

మరణం - పురస్కారాలు[మార్చు]

ఆచార్య యన్.జి.రంగా 95 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో 1995 జూన్‌ 8వ తేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన 'గోభూమి'లో తుదిశ్వాస విడిచారు.

  • రైతాంగానికి వీరు చేసిన  విశిష్టసేవలకు తార్కాణంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా 1997 లో నామకరణ చేసారు.
  • 1991 లో భారత ప్రభుత్వం వీరికి  పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
  • పార్లమెంట్ లొ రంగా గారి కాంస్య విగ్రహం 27 జులై 1997లొ అవిష్కరించారు.
  • ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2007-08-08.

2. 9th Lok Sabha Members Bioprofile

3.ఎన్.జి.రంగా, నవ భారత నిర్మాతలు, అధరాపురపు తేజోవతి, పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము, న్యూ ఢిల్లీ, 2006

4.ఆచార్య గోగినేని రంగనాయకులు జీవితం - కృషి - గొర్రెపాటి వంకటసుబ్బయ్య , 1948 అనుబ్ంధం: డా. నాగభైరవ ఆదినారాయణ - 2017

5. పార్లమెంట్ లొ రంగా గారి కాంస్య విగ్రహం

6."రైతు బాంధవుడు రంగా", ఎన్ ఇన్నయ్య ,ఆంధ్రజ్యోతిలో 7 నవంబరు 2009 ప్రచురితమైన వ్యాసం[permanent dead link]

7. ఎన్.జి.రంగా గురించి

8. ఆంగ్ల వికీలో వ్యాసం

9. Rangaji English Books -

10. Rangaji Telugu Books