Jump to content

జి.కిషన్ రెడ్డి

వికీపీడియా నుండి
(జి.కిషన్‌రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
గంగపురం కిషన్ రెడ్డి
జి.కిషన్ రెడ్డి

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు


కేంద్ర సహాయక మంత్రి
పదవీ కాలం
2019 మే 30 – 2024 ఫిబ్రవరి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
మే 2019 – 2021
ముందు బండారు దత్తాత్రేయ
నియోజకవర్గం సికింద్రాబాదు

శాసనసభ్యుడు
పదవీ కాలం
2004 – 2009
ముందు శ్రీకృష్ణ యాదవ్
తరువాత లేరు
నియోజకవర్గం హిమాయత్ నగర్

శాసనసభ్యుడు
పదవీ కాలం
2009 – 2019
ముందు లేరు
తరువాత కాలేరు వెంకటేశ్‌
నియోజకవర్గం అంబర్‌పేట

అధ్యక్షుడు, భారతీయ జనతా యువమోర్చా
పదవీ కాలం
2002 – 2005
ముందు శివరాజ్ సింగ్ చౌహాన్
తరువాత ధర్మేంద్ర ప్రదాన్
నియోజకవర్గం సికింద్రాబాదు

కేంద్రమంత్రి గా
పదవీ కాలం
జులై 8 2021 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-15) 1964 మే 15 (వయసు 60)
తిమ్మాపూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ
జీవిత భాగస్వామి కావ్య
సంతానం వైష్ణవి, తన్మయి రెడ్డి
నివాసం హైదరాబాదు
మతం హిందూ
వెబ్‌సైటు Official site

జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై [2] వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు. 2019,2024 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండో సారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

కిషన్ రెడ్డిని 2023 జూలై 4న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.[4][5][6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1964, మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించాడు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).[7]

రాజకీయ జీవితం

[మార్చు]

కిషన్ రెడ్డి 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నాడు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినాడు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినాడు.

కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో [8] గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి, అ తారువాత 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో అంబర్ పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి 62598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై 2016 నుండి 2018 వరకు బిజెపి శాసనసభాపక్ష నేతగా పనిచేశాడు.

కిషన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందాడు. ఆయన ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి గెలిచి నరేంద్రమోదీ క్యాబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి 2021లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు.[9][10][11]

2024లో 18 వ లోక్ సభ సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దానం నాగేందర్ పై 49,944 మెజారిటీ ఓట్ల తో గెలుపొందాడు.[12]

భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున జీ.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు.[13] ఈ యాత్ర 22 రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగీంది[14] పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి హాజరయ్యాడు.

ఆస్తులు-కేసులు

[మార్చు]
  • 2019 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 8,14,30,778 రూపాయలు.[15]
  • ఇతనిపై ఎలాంటి కేసులు లేవు.[15]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010
  2. సూర్య దినపత్రిక, తేది 17-05-2009
  3. Sakshi (1 June 2019). "కిషన్‌రెడ్డికి కీలక శాఖ". Sakshi. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  4. "BJP: ఏపీ, తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షులు వీరే." EENADU. Retrieved 2023-07-04.
  5. Andhra Jyothy (4 July 2023). "ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి." Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  6. Andhra Jyothy (5 July 2023). "కమల సారథి కిషన్‌రెడ్డి". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-08. Retrieved 2010-03-07.
  8. సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
  9. Sakshi (7 July 2021). "రైతు బిడ్డ నుంచి కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రస్థానం". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  10. Andhra Jyothy (8 July 2021). "కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  11. Sakshi (3 March 2024). "ఢీజేపీ రెడీ". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  12. Telugu, TV9 (2024-06-05). "Lok Sabha 2024 Election Results: తెలంగాణలో భారీగా పెరిగిన బీజేపీ స్థానాలు.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే." TV9 Telugu. Retrieved 2024-06-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  13. ఈనాడు దినపత్రిక, తేది 20-01-2010
  14. సాక్షి దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-01-2012
  15. 15.0 15.1 "Gangapuram Kishan Reddy(Bharatiya Janata Party(BJP)):Constituency- SECUNDERABAD(TELANGANA) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.