"ఇలియానా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అరుణ భిక్షు దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ పొందిన తర్వాత 2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[మహేష్ బాబు]] సరసన [[పోకిరి]] సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.
 
ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ్[[తమిళ]] సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] సరసన [[ఖతర్నాక్]] చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది. కానీ [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] సరసన నటించిన [[రాఖీ (2006 సినిమా)|రాఖీ]] మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో [[ప్రభాస్]] సరసన నటించిన [[మున్నా]] చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా [[తెలుగు]] సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.
 
===2007-2011 : తెలుగు సినిమాల్లో ఎదుగుదల===
1,86,659

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1989903" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ