ఘట్టమనేని మహేశ్ ‌బాబు

వికీపీడియా నుండి
(మహేశ్ ‌బాబు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మహేశ్ ‌బాబు
స్పైడర్ సినిమా లో మహేష్ బాబు
జననం
ఘట్టమనేని మహేశ్ ‌బాబు

(1975-08-09) 1975 ఆగస్టు 9 (వయసు 49)
మద్రాస్, భారతదేశం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుప్రిన్స్, సూపర్ స్టార్
పౌరసత్వంభారతదేశం
విద్యాసంస్థలయోలా కాలేజీ, చెన్నై.
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1979 - 1990 (బాల నటుడు); 1999 - ప్రస్తుతం
ఎత్తు6.3" అడుగులు
జీవిత భాగస్వామినమ్రత శిరోద్కర్
పిల్లలుగౌతమ్ కృష్ణ, సితార
తల్లిదండ్రులు
పురస్కారాలునంది పురస్కారం,ifa,siima
వెబ్‌సైటుhttp://www.princemahesh.com/

ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. సినీ నటి నమ్రత శిరోద్కర్ ను వివాహం చేసుకున్నాడు.

పూర్వరంగం

[మార్చు]

మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని గలరు. మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగాడు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు. మహేష్ బాబు తన నాలుగవ ఏట దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. మహేష్ బాబు మద్రాసులో చదివాడు. చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. మహేష్ బాబు, విజయ్ (నటుడు) చిన్ననాటి స్నేహితులు.[1] మహేష్ బాబు సినిమాల నుండి కొంత కాలం విరామం తీసుకుని లయోలా కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందాడు. బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించాడు. హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. వంశీ సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ. వీరికి 2012 జూలై 20 న కుమార్తె జన్మిచింది. ఈమె పేరు సితార. 2022 జనవరి 8 న మహేష్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు స్వర్గస్థులయ్యారు.[2]

సినీ జీవితం

[మార్చు]

బాలనటుడు (1989 నుండి 1990 వరకు)

[మార్చు]

మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు.[3] 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు.[4] ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రంలో మహేశ్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చాడు. అయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు. 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు.[5] 1988 లో విడుదలైన, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు.[6] 1988లో మరల తన తండ్రి, అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన గూడచారి 117 చిత్రంలో నటించాడు.[7] 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు.[8] 1990లో విడుదలైన బాలచంద్రుడు, అన్న - తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించాడు.[9]

1998 నుండి ఇప్పటి వరకు

[మార్చు]

మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి.

2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.మహేష్[permanent dead link] తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.

పోకిరీ తరువాత నిర్మాణమయిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన 'దూకుడు' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తరువాత 2019 లో త వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబుకు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం 11 జనవరి 2020 లో విడదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.[10] 2010 లోనే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్ సైటు అయిన ట్విట్టర్ లో సభ్యులయ్యారు.[11]

సినీ జాబితా

[మార్చు]

బాల నటునిగా

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
1979 నీడ బాలనటుడిగా తొలి సినిమా
1983 పోరాటం బాలనటుడు
1987 శంఖారావం రాజా బాలనటుడు
1988 బజారు రౌడీ మహేశ్ బాలనటుడు
1989 గూఢచారి 117 చిన్న బాలనటుడు
1989 కొడుకు దిద్దిన కాపురం వినోద్,
ప్రమోద్
బాలనటుడు
ద్విపాత్రాభినయం
1990 బాలచంద్రుడు చందు బాలనటుడు
1990 అన్న-తమ్ముడు మురళి బాలనటుడు

నటునిగా

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
1999 రాజకుమారుడు రాజా నంది ఉత్తమ నూతన నటుడు పురస్కారం
2000 యువరాజు శ్రీనివాస్
2000 వంశీ వంశీ
2001 మురారి మురారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2002 టక్కరి దొంగ రాజు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2002 బాబీ బాబీ
2003 ఒక్కడు అజయ్ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2003 నిజం సీతారామ్ నంది ఉత్తమ నటుడు పురస్కారం
2004 నాని నాని
2004 అర్జున్ అర్జున్ నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2005 అతడు నందగోపాల్ (నందు) / పార్థు నంది ఉత్తమ నటుడు పురస్కారం
2006 పోకిరి కృష్ణ మనోహర్ (పండు) దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2006 సైనికుడు సిద్ధార్థ
2007 అతిథి అతిథి
2010 ఖలేజా అల్లూరి సీతారామరాజు
2011 దూకుడు అజయ్ నంది ఉత్తమ నటుడు పురస్కారం
దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2012 బిజినెస్ మేన్ సూర్య పేర్కొనబడ్డాడు-దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్నోడు
2014 1 నేనొక్కడినే గౌతమ్
2014 ఆగడు శంకర్
2015 శ్రీమంతుడు హర్ష
2016 బ్రహ్మోత్సవం అజయ్‌
2017 స్పైడర్ శివ
2018 భరత్ అనే నేను భరత్ రమ్‌
2019 మహర్షి (2019 సినిమా) రిషి కుమార్
2020 సరిలేరు నీకెవ్వరు మేజర్ అజయ్ కృష్ణ
2021 సర్కారు వారి పాట మహేష్
2024 గుంటూరు కారం వెంకట రమణ

స్వరం అందించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
2008 జల్సా వ్యాఖ్యాత వాయిస్-ఓవర్
2013 బాద్‍షా వ్యాఖ్యాత వాయిస్-ఓవర్
2018 మనసుకు నచ్చింది[12] వ్యాఖ్యాత వాయిస్-ఓవర్

పురస్కారాలు

[మార్చు]

నటునిగా మహేష్ వయసు తక్కువే అయినా ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

  • ఉత్తమ నూతన నటుడు (నంది): రాజకుమారుడు (1999)
  • ఉత్తమ నటుడు (నంది): నిజం (2002)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: ఒక్కడు (2002)
  • ఉత్తమ నటుడు (నంది): అతడు (2005)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు : అతడు (2005)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: పోకిరీ (2006)
  • ఉత్తమ నటుడు (నంది): దూకుడు (2011)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: దూకుడు (2011)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
  • ఉత్తమ నటుడు (నంది): శ్రీమంతుడు (2015)

సైమా అవార్డులు

మహేశ్‌బాబు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ అవార్డును అందుకున్నాడు.[13]

మీడియా

[మార్చు]
  • మే/జూన్ 2022లో, ప్రముఖ మ్యాగజైన్‌ ద పీకాక్‌ కవర్‌ పేజీపై మహేశ్ బాబు కనిపించి తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు.[14]
  • అక్టోబరు 2023లో, ఎంతో పేరుగాంచిన హలో అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌ పేజీపై మహేశ్ బాబు ఫొటోలను ప్రచురించింది.[15] ఇదే మ్యాగజైన్ 2021లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ఇంటర్వ్యూ ప్రచురించింది.[16]
  • విజయ్ దళపతి జి.ఓ.ఎ.టి సినిమాలో విజయ్ నటనకు బాబు ప్రశంసలు కురిపించారు.[17]

మూలాలు

[మార్చు]
  1. "Did you know Mahesh Babu can't read or write in Telugu? Some fun facts about the actor you must know". Hindustan Times. 16 June 2021. Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.
  2. crazymovieupdates (2021-10-21). "Actor Mahesh Babu Biography, Height, Weight, Age, Awards" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-11. Retrieved 2022-01-10.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-08. Retrieved 2013-08-05.
  4. http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Poratam/Telugu/wxdkqkb8f4[permanent dead link]
  5. http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Sharada/Telugu/j7x7ndlb61[permanent dead link]
  6. http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Raj-Koti/Telugu/yd2vjy653r[permanent dead link]
  7. http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Gudachari%20117/Telugu/qeugdw8nsf[permanent dead link]
  8. http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Vijayashanti/Telugu/6eimjgxmey[permanent dead link]
  9. http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Anna%20Thammudu/Telugu/ptrpv09mt5[permanent dead link]
  10. [1] Archived 2019-11-23 at the Wayback Machinemahesh babu bio
  11. Mahesh Babu on Twitter.
  12. | - | 2022 !scope="row"| ఆచార్య | వ్యాఖ్యాత | వాయిస్ -ఓవర్ మహేష్ ... ఆమెకు ‘లవ్ యు టు’ చెప్పేశాడు! సమయం 15 February 2018.
  13. Sakshi (25 September 2021). "Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్‌". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
  14. Magazine, The Peacock (2022-05-30). "A STAR UNPARALLELED – MAHESH BABU". The Peacock Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-16.
  15. "#HELLOExclusive: At Home with Mahesh Babu". HELLO! India (in ఇంగ్లీష్). 2023-10-16. Archived from the original on 2023-10-16. Retrieved 2023-10-16.
  16. "హాలో మ్యాగజైన్‌ కోసం తన 'సూపర్‌ ఉమెన్‌'తో సూపర్‌ స్టార్‌ ఫొటోలు వైరల్‌ | Mahesh Babu And Namrata Shirodkar Hello Magazine Photoshoot - Sakshi". web.archive.org. 2023-10-16. Archived from the original on 2023-10-16. Retrieved 2023-10-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. "The GOAT Movie team hails Super star Mahesh Babu and in return Mahesh babu was amazed by Vijay's performance in GOAT film". YouTube. 2024-03-06. Retrieved 2024-09-10.

బయటి లింకులు

[మార్చు]