Jump to content

బత్తుల సుమిత్రాదేవి

వికీపీడియా నుండి
బత్తుల సుమిత్రాదేవి

బి.సుమిత్రాదేవి (1918, అక్టోబరు 8 - 1980) హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు, రాజకీయ నాయకురాలు, సంఘసేవకురాలు.[1]హిందీ మీడియంలో మెట్రిక్యులేషన్ పాసయ్యారు. 1938 42లో వార్ధా మహిళా ఆశ్రమంలో గ్రామ సేవిక కోర్సును చేసారు. - భర్త ప్రోత్సాహంతో ఆమె సాంఘిక జీవితాన్ని ప్రారంభించారు.

జననం

[మార్చు]

ఈమె అక్టోబరు 8, 1918న హైదరాబాదులో జన్మించారు[2] 1938లో ఆర్యసత్యాగ్రహం సమితి నిర్వహించిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను 20 రోజులు జైలుశిక్ష అనుభవించారు. చిక్కడపల్లిలో ఆర్య యువజన పాఠశాలను స్థాపించి దానిని ఎంతో శ్రద్ధగా నడిపించారు. హైదరాబాదు నగరంలో ఖాదీ ప్రచార సంఘాలు, చరఖా కేంద్రాలు నెలకొల్పి ఖాదీ ప్రచారం చేసారు. 1942లో స్టేట్ కాంగ్రెస్లో మెంబరయ్యారు. నారాయణగూడాలో జగజ్జీవన్ పాఠశాలను స్థాపించి విద్యావ్యాప్తికై కృషి చేసారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సుల్తాను బజారు దళంలో పనిచేస్తూ అరెస్టు అయ్యారు. 1947-48లో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని రజాకార్లపై పోరాడి జైలుకువెళ్ళారు. 1948 సెప్టెంబరులో నిజాం సంస్థానం భారతదేశంలో విమోచనం వరకు ఆమె కంటికి నిద్రలేకుండా కృషిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు నగరపాలక సంస్థ ఉపాధ్యక్షులైనారు. 1957 నుంచి ఈమె ఐదు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనది. ఈమె తొలిసారి 1957లో అప్పుడే కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎన్నికైంది. 1962లో హైదరాబాదు తూర్పు నియోజకవర్గం నుండి, 1967, 1972 లో మేడ్చల్ నియోజకవర్గం నుండి, 1978లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యింది.[3]


మరణం

[మార్చు]

1980 లో ఈమె మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. Devulapalli, Rahul (February 18, 2014). "One from that rare breed of politicians". The Hindu. Retrieved 3 November 2014.
  2. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు మహిళలు, రచన: వాసా ప్రభావతి, పేజీ 144
  3. Eenadu (26 October 2023). "పోటీ ఎక్కడైనా విజయం ఆమెదే". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.