Jump to content

యోని

వికీపీడియా నుండి
(భగం నుండి దారిమార్పు చెందింది)
యోని
యోని స్త్రీ జననేంద్రియ వ్యవస్థ
Vulva with vaginal opening
లాటిన్ Vagina
గ్రే'స్ subject #269 1264
ధమని superior part to uterine artery, middle and inferior parts to vaginal artery
సిర uterovaginal venous plexus, vaginal vein
నాడి Sympathetic: lumbar splanchnic plexus
Parasympathetic: pelvic splanchnic plexus
లింఫు upper part to internal iliac lymph nodes, lower part to superficial inguinal lymph nodes
Precursor urogenital sinus and paramesonephric ducts
MeSH Vagina

యోని స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము. సంభోగంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇది కండరాలతో చేయబడిన స్థూపాకారపు నిర్మాణము. ఇది క్షీరదాలలో గర్భాశయం నుండి బాహ్య జననేంద్రియంగా శరీరపు బయటకు వస్తుంది. పక్షులకు, సర్పాలకు, కీటకాలకు కూడా యోని ఉంటుంది. అయితే యోని ద్వారా జననం పొందేది ఒక్క వెన్నెముక ఉన్న జీవుల్లో మాత్రమే. మిగిలిన ప్రాణులలో యొని ద్వారా గుడ్లు పెట్టబడి, పొదుగు కాలం పూర్తయిన తరువాత అయా జీవులు గుడ్డును పగలకొట్టి బయటికి వస్తాయి. యోని ద్వారా జన్మించిన వారిని యోనిజులు అని, గుడ్డు (అండము) ద్వారా జన్మించిన అండజములు అని, కారణ జన్ములైన దేవతలను/దేవుళ్ళను అయోనిజ/అయోనిజుడు (అయోనిజులు) అని పిలుస్తారు.

తెలుగు భాషలో యోని పదానికి భగము, పూకు అని కూడా పేరు ఉంది.

వ్యుత్పత్తి

"యౌతి శిశ్నేన ఇతి యోనిః" అనగా "శిశ్నముతో (పురుషాంగముతో) కూడుకొనునది" అని యోని శబ్దమునకు ఉత్పత్తి.[1]

భాషా విశేషాలు

అయోనిజ, (సంస్కృత పదం) అనగా తల్లి గర్భం నుండి/ద్వారా పుట్టనిది. (పుంలింగం :అయోనిజుడు లేదా అయోని సంభవుడు, గర్భేతర జన్ముడు. సీతాదేవి అయోనిజగా జనకుని యింట జన్మించినట్లుగా రామాయణంలో ఉంది.

యోని నిర్మాణం

మానవులలో యోని స్థ్తితి స్థాపక కండర మయమైన గొట్టము. ఇది సెర్విక్స్ నుండి వుల్వా వరకు ఉంటుంది.[2] ఉద్రేక స్తిథిలో లేనప్పుడు యోని పొడవు ముందుగా సుమారు 6 నుండి 7.5 సెం.మీ. (2.5 నుండి 3 అంగుళాలు) ఉంటుంది.[3] సంభోగం సమయంలో యోని పొడవు, వెడల్పు శిశ్నం కొలతను బట్టి పెరుగుతుంది.[4] దీని యొక్క అత్యంత సాగే లక్షణం (స్థితిస్థాపక లక్షణం) కారణంగా సంభోగం, శిశువు జననంలో అవసరమైనంత వరకు సాగుతుంది.[5]

నిటారుగా నిలబడి ఉన్న స్త్రీలలో యోని మార్గం, గర్భాశయానికి దాదాపు, 45డిగ్రీల కోణంలో ముందుకు, పైకి ఉంటుంది. యోని ద్వారం బాహ్య జననేంద్రియంలో మూత్ర ద్వారానికి వెనుకగా ఉంటుంది. యోని పైభాగం పురీషనాళం నుండి పెరిటోనియల్ సంచితో వేరుచేయబడి ఉంటుంది. యోని మార్గం, యోని ద్వారం మ్యూకస్ పొరలు ఎరుపు గులాబీ రంగులో ఉంటాయి.ఇది సంభోగంలో, వంశోత్పత్తిలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

యోని ద్రవాలు ప్రముఖంగా బార్తొలిన్ గ్రంథి నుండి విడుదలౌతాయి. ఇవి యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి. అండం విడుదల సమయంలో ఈ స్రావాలు పలుచగా మారి క్షారగుణం కలిగి ఉండి శుక్ర కణాలు ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడతాయి.

యోని ద్వారాన్ని కన్నెపొర (హైమెన్) అనే సన్నవి మ్యూకస్ పొర కప్పివుంచుతుంది. సాధారణంగా మొదటి లైంగిక కలియకలో (సంభోగంలో) కన్నెపొర చిరిగిపోయి చివరికి నిర్జీవంగా అయిపోతుంది.[6] కన్నెపొర లేకపోతే ఆ స్త్రీ ఇదివరకే రతిలో పల్గొందని, కన్నెపొర వున్నంత మాత్రాన ఆమె 'కన్య' అని నిర్ధారించలేము. అనేక సార్లు సంభోగంలో పాల్గొన్నా కన్నెపొర చిరగక పోవచ్చు. కొన్ని రకాల వ్యాయామాలు, ప్రమాదాలు మొదలైన కారణాల వల్ల కన్నెపొర చిరగనూ వచ్చు.

యోని ధర్మాలు

గర్భాశయ స్రావాలు

యోని నెలనెలా వచ్చే ఋతుచక్రం లోని రక్తం, స్రావాలు, ఇతరమైన స్రావాలు శరీరం నుండి బయటికి పోవడానికి మార్గంగా పనిచేస్తుంది. కొందరు స్త్రీలు ఈ స్తావాల్ని బయటకు పోనీయకుండా మెత్తని ద్రవపదార్ధాల్ని పీల్చుకొనే సానిటరీ నాప్కిన్స్ ఉపయోగిస్తారు.

శిశు జననం

శిశువు జననం సమయంలో యోని మార్గం తల్లి గర్భాశయం నుండి బాహ్య ప్రపంచంలోనికి త్రోవ చూపిస్తుంది. ఈ సమయంలో యోని యొక్క స్థితిస్తాపకత మూలంగా సాధారణ సమయంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా సాగి యోని ద్వారా శిశువు జననానికి తోడ్పడుతుంది.

సంభోగం

ఎడమ చిత్రంలో విశ్రాంతస్త్రీ యోని. కుడి చిత్రంలో సంభోగానికి తయారై ఉబ్బెత్తుగా శ్రావాలతో తడిబారిన యోని.

స్త్రీల యోనిలోని అధికంగా ఉండే నరాల మూలంగా రతి క్రీడ సమయంలో అధికంగా సుఖాన్ని అందిస్తుంది. రతి సమయంలో యోనిలో ముఖ్యంగా యోనిశీర్షం ప్రేరణ మూలంగా యోని మార్గంలో స్రావాలు ఎక్కువగా తయారౌతాయి. ఇవి రతి క్రీడ సమయంలో యోనిలో రాపిడిని తగ్గిస్తాయి.

స్త్రీలలో రతి ప్రేరణ మూలంగా యోని పొడవు పెరుగుతుంది.[7] పూర్తిగా ప్రేరేపించబడిన సమయంలో యోని వెడల్పు కూడా పెరిగి ఒక గుడారం మాదిరిగా తయారౌతుంది.[8] శిశ్నం పరిమాణాన్ని బట్టి యోని గోడలు సాగి కటి కండరాల సాయంతో సంకోచ వ్యాకోచాలతో పురుషుని కదలికలకనుగుణంగా నడుచుకుంటుంది. దీని మూలంగా ఎంత చిన్నదిగా ఉన్న యోని అయినా చూడడానికి పెద్దదిగా ఉన్న శిశ్నాన్ని తీసుకోగలుగుతుంది.[9][10]

జి. స్పాట్

జి స్పాట్ అనేది ఒక కామ కేంద్రము. ఇది యోని ముందు గోడలో యోని ద్వారానికి ఐదు సెంటీమీటర్ల పైన ఉంటుంది. సంభోగ సమయంలో ఈ కేందాన్ని ప్రేరేపింపచేస్తే స్త్రీలు అత్యంత సుఖానుభూతిని పొందుతారు. దీని మూలంగా కొందరు స్త్రీలలో భావప్రాప్తి (Orgasm) కూడా కలుగుతుంది.[11][12][13] అయితే కొంతమంది పరిశోధకులు అసలు జి స్పాట్ ఉనికినే సంశయిస్తున్నారు.[14]

ఆరోగ్యం , పరిశుభ్రత

యోని సాధారణంగా ఏ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినా పరిశుభ్రంగా ఉంచబడుతుంది. వైద్యులు ఏ విధమైన క్రీములు లేదా ద్రవాలు ఉంచడాన్ని ప్రోత్సహించరు. ఆరోగ్యమైన యోనిలో కొన్ని రకాల బాక్టీరియా సహజీవనం చేస్తాయి. ఇవి లాక్టిక్ ఆమ్లం తయారుచేసి వ్యాధి కారక క్రిముల నుండి రక్షిస్తాయి. అయితే ఏ కారణం చేతనయినా ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు వ్యాధులు కలుగుతాయి.

స్త్రీల వ్యాధి నిపుణులు యోని లోపలి భాగాల్ని పరీక్ష చేయడానికి స్పెక్యులమ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. పాప్ స్మియర్ పరీక్ష కోసం యోని ద్రవాల్ని గాజు పలకల మీద పలుచని పొరగా తయారుచేస్తారు.

వ్యాధి లక్షణాలు

యోని వ్యాధులలో ముఖ్యంగా వ్రణాలు, స్రావాలు, పుండ్లు ఏర్పడతాయి.

  • వ్రణాలు[15]

యోని లోపల ఏ విధమైన వాపు కూడా అసాధారణంగా గుర్తించాలి. అన్నింటికన్నా సామాన్యమైనవి బార్తోలిన్ తిత్తులు. ఇవి బార్తోలిన్ గ్రంథుల నుండి ద్రవాల్ని తీసుకొని పోయే నాళాలు ముసుకొని పోయినప్పుడు వాపు కలుగుతుంది. హెర్పిస్ వంటి వైరస్ వలన చిన్న చిన్న నొప్పి కలిగించే పొక్కులు ఏర్పడతాయి. యోనికి కాన్సర్ రావడం అరుదు, సామాన్యంగా 70 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది.[16]

  • స్రావాలు[17]

ఎక్కువ మందిలో యోని స్రావాలు సామాన్యమైనవిగా ఉంటాయి. ఇవి క్లియర్ గా ఏ విధమైన వాసన లేకుండా ఉంటాయి. వ్యాధి కారక బాక్టీరియా, ఈస్ట్, గనేరియా, ట్రైకోమోనాస్, క్లమీడియా మొదలైన వాని వలన ఈ స్రావాలు ఎక్కువగా తయారౌతాయి. ఈ స్రావాలు చెడు వాసనతో తెలుపుగా చీము వలె గాని లేదా ఎర్రగా రక్తం రంగులో ఉంటాయి. తెలుపు లేదా లేత పసుపు రంగు స్రావాలు ఎక్కువగా వస్తే దానిని తెల్లబట్ట అంటారు.

  • పుండ్లు[18]

యోని మ్యూకస్ పొర దెబ్బతిన్నప్పుడు పుండ్లు ఏర్పడతాయి. ఇవి సామాన్యంగా రాపిడి కారణం. లోపలి దుస్తులు ఎక్కువగా గీసుకోవడం, రతి క్రీడలో గాని ముఖ్యంగా బలవంతంగా చేసేటప్పుడు పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది. వ్యాధులలో సిఫిలిస్ పుండ్లు నొప్పి లేకుండా ఉంటాయి. గనేరియా వంటి వ్యాధులలో ముత్రంలో మంట కలుగుతుంది. యోని ద్వారా సంప్రాప్తించే ఎయిడ్స్లో ఏ విధమైన బాధ ఉండదు.[19]

ఈ వ్యాధులన్నీ చాలా సులువుగా నయం చేయవచ్చును. అయితే వీటి కోసం ఎక్కువ మంది స్త్రీలు సిగ్గుతో వైద్యుల్ని సంప్రదించక పోవడం మూలంగా ఇవి ముదిరి ఇతరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు.[20]

సంస్కృతి-కళలు

గస్తేవ్ కోర్బెట్ ప్రపంచ జన్మస్థానం తైల చిత్రపటం.

చిత్రలేఖనంలో యోని, ఇతర జననేంద్రియాలను చిత్రించడం ప్రాచీనకాలం నుండి ఉంది. కొన్ని సంస్కృతులలో యోని భాగాన్ని పూజించగా మరి కొన్ని ప్రాంతాలలో దీనిని సిగ్గుపడే విషయంగా పరిగణిస్తారు.

వైవిధ్యాలు , పరిమాణం

ప్రధాన వ్యాసం : మానవ యోని పరిమాణం దాని సాధారణ స్థితిలో, పిల్లల మోసే వయసున్న ఒక మహిళ యోని పొడవు శరీర నిర్మాణ సంబంధమైన తేడా ఉంది. పొడవు పూర్వ కంటే లోతుగా పృష్ఠ వంపు దీనితో సుమారు 7.5 సెం.మీ. ( 2.5 నుండి 3 ) పూర్వ గోడ అంతటా (ముందు),, 9 సెం.మీ. (3.5 in) పొడవు పృష్ఠ గోడ ( వెనుక) అవతల ఉంది. లైంగిక ప్రేరేపణ సమయంలో, యోని పొడవు, వెడల్పు రెండు విస్తరిస్తుంది. ఒక మహిళ నిటారుగా నిలిచి, ఊర్ధ్వ - వెనుకబడిన దిశలో యోని ట్యూబ్ పాయింట్లు, గర్భాశయం, సమాంతర గురించి 60 డిగ్రీల సుమారు 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. యోని ప్రారంభ, కన్నెపొర కూడా మారుతూ పరిమాణం; పిల్లలలో, కన్నెపొర ఒక సాధారణ రూపాన్ని నెలవంక ఆకారంలో అయినప్పటికీ, అనేక ఆకారాలు సంభవం.</ref>[21]

మందులు

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. నాగర సర్వస్వం (1962). యోని స్వరూపము - నాడీ భేదములు. అభిసారిక ప్రచురణ.
  2. http://www.womenshealth.gov/glossary/#vagina Archived 2008-10-14 at the Wayback Machine Womenshealth.gov
  3. Gray's Anatomy
  4. "The sexual response cycle". EngenderHealth. Archived from the original on 2007-10-30. Retrieved 2007-10-13.
  5. http://www.metrokc.gov/HEALTH/famplan/flash/grades11-12/G1112-L17.pdf Archived 2008-10-02 at the Wayback Machine Metrokc.gov
  6. Rogers DJ; Stark M (1998). "The hymen is not necessarily torn after sexual intercourse". BMJ. 317: 414. PMC 1113684. PMID 9694770.
  7. "Does size matter". TheSite.org. Archived from the original on 2007-02-21. Retrieved 2006-08-12.
  8. "do big penises hurt?". AskMen.com. Retrieved 2006-08-14.
  9. "The female reproductive system". birth.com.au. Archived from the original on 2007-03-10. Retrieved 2007-05-07.
  10. "Facts about penis size". netdoctor.co.uk. Archived from the original on 2009-03-16. Retrieved 2007-05-14.
  11. Crooks, R; Baur, K. Our Sexuality. California: Brooks/Cole.
  12. Jannini E; Simonelli C; Lenzi A (2002). "Sexological approach to ejaculatory dysfunction". Int J Androl. 25 (6): 317–23. doi:10.1046/j.1365-2605.2002.00371.x. PMID 12406363.
  13. Jannini E; Simonelli C; Lenzi A (2002). "Disorders of ejaculation". J Endocrinol Invest. 25 (11): 1006–19. PMID 12553564.
  14. Hines T (2001). "The G-Spot: A modern gynecologic myth". Am J Obstet Gynecol. 185 (2): 359–62. doi:10.1067/mob.2001.115995. PMID 11518892.
  15. Mayo Clinic Staff Bartholin’s Cyst. January 19 2008 accessed http://www.mayoclinic.com/health/bartholin-cyst/DS00667/DSECTION=1 23 March 2008
  16. Manetta A, Pinto JL, Larson JE, Stevens CW, Pinto JS, Podczaski ES (1988). "Primary invasive carcinoma of the vagina". Obstet Gynecol. 72 (1): 77–81. PMID 3380510.
  17. Spence D; Melville C (2007). "Vaginal discharge". BMJ. 335 (7630): 1147–51. doi:10.1136/bmj.39378.633287.80. PMC 2099568. PMID 18048541.
  18. మూస:EMedicine
  19. Mayo Clinic Staff HIV/AIDS. January 20 2008 accessed at https://www.mayoclinic.com/health/hiv-aids/DS00005 on 23rd March
  20. Butcher J (1999). "ABC of sexual health: female sexual problems II: sexual pain and sexual fears". BMJ. 318 (7176): 110–2. PMC 1114576. PMID 9880287.[permanent dead link]
  21. బ్లుఎవ్ వఫ్ఫ్లెస్ (২০০২), "blue-waffles ", బ్లుఎ వఫ్ఫ్లెస్ ২৪ঃ ২৪৯—২৬৪।[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=యోని&oldid=4319382" నుండి వెలికితీశారు