వరుణ్ సందేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ సందేశ్

జన్మ నామంవరుణ్ సందేశ్
జననం (1989-07-21) 1989 జూలై 21 (వయసు 35)
రాయగడ, ఒడిషా, భారతదేశం,[1] నివాసం : న్యూ జెర్సీ, అమెరికా
హైదరాబాద్, భారత్
భార్య/భర్త వితికా శేరు
పిల్లలు రుద్ర, మహేష్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్,
కొత్త బంగారు లోకం

వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన 2019లో బిగ్‌బాస్‌ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.[2]

నేపధ్యము

[మార్చు]

ఒడిషాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ మారడంతో అక్కడ నాలుగేళ్ళు ఉన్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి పోయాడు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. హైదరాబాదుకు తన మకాం మార్చాడు.

కుటుంబము

[మార్చు]

ఇతను ప్రముఖ రచయిత [[జీడిగుంట రామచంద్ర మూర్తి|జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి]] మనవడు. ఇతని బాబాయి [[జీడిగుంట శ్రీధర్]] పేరుగల నటుడు.[3][4] వీరి కుటుంబంలో తల్లి రమని జీడిగుంట్ల గృహిణి, తండ్రి విజయ్‌ సారధి ఐ.బి.ఎంలో ఉద్యోగి. చెల్లెలు వీణా సాహితీ అలా మొదలైంది చిత్రానికి సాహిత్యాన్ని సమకూర్చింది.[5] తన సహనటి శ్రద్దా దాస్తో కొన్నాళ్ళు సహజీవనం చేశాడు.[6][7][8]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2007 హ్యాపీ డేస్ చంద్రశేఖర్ "చందు" తొలి సినిమా
2008 కొత్త బంగారు లోకం బాలు
2009 ఎవరైనా ఎప్పుడైనా వెంకట్
కుర్రాడు వరుణ్
2010 మరో చరిత్ర బాలు
హ్యాపీ హ్యాపీగా సంతోష్
ఏమైంది ఈవేళ శీను
2011 కుదిరితే కప్పు కాఫీ వేణు
బ్రమ్మిగాడి కథ శివ
ప్రియుడు కార్తీక్
2013 చమ్మక్ చల్లో శ్యామ్
ప్రియతమా నీవచట కుశలమా[9] వరుణ్
సరదాగా అమ్మాయితో సంతోష్
అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్[10] శ్రీ
ఢి ఫర్ దోపిడి విక్కీ
2014 నువ్వలా నేనిలా కృష్ణ మోహన్
పాండవులు పాండవులు తుమ్మెద వరుణ్
ఈ వర్షం సాక్షిగా[11] జై
2015 పడ్డానండి ప్రేమలో మరి రామ్
మామ మంచు అల్లుడు కంచు గౌతం నాయుడు
లవ కుశ ప్రేమ్ / కుశాల్ ద్విపాత్రాభినయం
2016 మిస్టర్ 420 అవినాష్
2018 మర్లపులి వరుణ్
2019 నువ్వు తోపు రా కౌశిక్
2022 ఇందువదన వాసు 25వ సినిమా
2023 మైఖేల్ అమర్నాథ్
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు నటుడు అతిధి పాత్ర
యద్భావం తద్భవతి TBA చిత్రీకరణ
20232024 చిత్రం చూడరా
నింద [12]
విరాజి

వెబ్ సిరీస్

[మార్చు]
  • అన్ని సినిమాలు తెలుగులోనే ఉంటాయి, వేరే చెప్పకపోతే తప్ప.
సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర లభ్యత గమనికలు
2018 హే కృష్ణా కృష్ణుడు యప్ టీవీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర ఛానెల్ గమనికలు
2019 బిగ్ బాస్ 3 పోటీదారు (3వ రన్నరప్) స్టార్ మా రియాలిటీ టీవీ సిరీస్

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వరుణ్ సందేశ్ పేజీ

మూలాలు

[మార్చు]
  1. "Varun Sandesh". www.idlebrain.com. Retrieved 2008-10-30.
  2. Sakshi (25 July 2019). "హ్యాపీడేస్‌ నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  3. http://www.maastars.com/3097/varun-sandesh-interview
  4. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/waiting-for-the-turn/article3388744.ece
  5. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article902496.ece
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-29. Retrieved 2013-02-07.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-24. Retrieved 2013-02-07.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-25. Retrieved 2013-02-07.
  9. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
  10. "Abbai Class Ammayi Mass (2013) | Abbai Class Ammayi Mass Movie | Abbai Class Ammayi Mass Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 15 May 2020.
  11. http://www.123telugu.com/mnews/varun-sandeshs-new-film-launced-hm.html
  12. Chitrajyothy (10 May 2024). "వరుణ్ సందేశ్ 'నింద' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.