వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 4 | పాత చర్చ 5 | పాత చర్చ 6

alt text= - రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2008 ఫిబ్రవరి 15 - 2008 మే 4

రెండవ ప్రపంచ యుద్ధం:అనువాదకులు, రచయితలు కావలెను

[మార్చు]

మిత్రులారా,

ముందుగా ఒక విషయం: ఇలా అభ్యర్ధనలు, విన్నపాలు, విననిపాలు రాయవచ్చో లేదో నాకు తెలియదు. నేను తెవికీకి చాలా కొత్త.

ప్రపంచ చరిత్రలో అతి ప్రాముఖ్యతగల ఘట్టం రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం కారణంగా అంతకు ముందు లేని కొత్త దేశాలు ఏర్పడటం, ఎన్నో దేశాలకు సరిహద్దులు మారిపోవటం, కొన్ని దేశాలు (మనతో సహా) బానిసత్వం నుండి విముక్తం కావటం, కొందరు నియంతలకు కాలం చెల్లిపోవటం, మరి కొందరు నియంతలు పుట్టుకు రావటం, ప్రపంచం రెండు విభిన్న ధృవాలుగా విడిపోవటం లాంటివెన్నో జరిగాయి. దీన్నుండి మానవాళి నేర్చుకోగల పాఠాలెన్నో ఉన్నాయి. నాకు తెలిసి, తెలుగులో ఈ యుద్ధం గురించి వివరమైన పుస్తకాలు ఎక్కువ లేవు. ఆ లోటు తీర్చటానికి, తెవికీలో రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన వివరాలతో ఒక వ్యాసం రాయాలనే ఆలోచన నాకొచ్చింది. కానీ ఇది నా ఒక్కడి వల్లా పూర్తయ్యే పని కాదు. ఇటువంటి విషయాలపై కుతూహలంగల తోటి సభ్యుల సహకారం అవసరం. నేను కొంత సమాచారాన్ని రెండవ ప్రపంచ యుద్ధం పేజీలో ఉంచాను. యుద్ధంలో ముఖ్య సంఘటనలకు విడి విడి పేజీలు కేటాయించి, వాటి లింకులను ఈ ప్రధాన పేజీలో ఉంచాను. ఆసక్తిగల వారు ఆ పేజీలను సృష్టించటమో, పొడిగించటమో చేయమని నా అభ్యర్ధన. - అబ్రకదబ్ర 22:28, 15 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు మీ అభ్యర్థనను ప్రకటనగా (gif అనిమేషన్‌గా) చేయగలిగితే {{వికీపీడియా ప్రకటనలు}}లో చేర్చవచ్చు. ప్రస్తుతం ఈ ప్రకటనలు దాదాపు ప్రతీ తెలుగు వికీపీడియా సభ్యునికి చేరుతున్నాయి. δευ దేవా 06:28, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మా తెలుగు తల్లి

[మార్చు]

- శంకరంబాడి సుందరాచార్య గారు రచించిన 'మా తెలుగు తల్లి' పాట - ఈ తెలుగు తల్లి పాటను తగిన స్థానంలో ఉంచమని కోరుతున్నాను. Talapagala VB Raju 18:35, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ గీతం ఇప్పటికే ఉన్నది ఈ [లింకులో] అందువలన దీనిని తొలగిస్తున్నాను.విశ్వనాధ్. 05:14, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

robot కి మరమనిషి అంటే సరిగా వున్నట్టనిపిస్తూంది

                                          రామ

సాంకేతికంపరిజ్ణ్గా నంతో సహాయాన్ని అందింఛు వాడు అంటె బాగుండును. రమణ

Bot command translations

[మార్చు]

Hi. Could anybody translate me these interwiki bot commands to Telugu (they will be displayed in all interwiki bot summaries instead English)?'

  • robot - 'యంత్రము' - mara manishi

robot అనే మాట రబోతా (rabOtA) అనే మాట నుండి పుట్టింది. రబోతా అంటే పని కనుక, రోబాట్ అంటే 'పని చేసేది' అనే అర్ధం స్పురిస్తుంది. ఈ పని చేసేది మనిషి ఆకారంలోనే ఉండాలని లేదు. కాని 'మర మనిషి' అనే మాట వాడుకలో ఉన్న మాట మాత్రం నిజమే. ప్రతీ ఆధునిక రోబాట్ లోనూ ఒక కలనయంత్రం లేదా గణకయంత్రం (కంప్యూటరు) విధాయకంగా ఉంటోంది. మనకి సంస్కృతంలో 'కర' శబ్దం చేతిని, హిందీలో 'కర్' పనిని (చేత్తో పని చేస్తాము కనుక) సూచిస్తాయి కనుక రబోతాని బారతీయ భాషలలో 'కర్' గా అనువదించవచ్చు. కనుక రోబాట్ గణకర్ (దినకర్ లా) అనొచ్చు. ఇదంతా ఇప్పుడు, ఇక్కడ చేసిన ఊహాగానం. Vemurione 14:37, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

  • Adding - 'కలుపుతున్నది'
  • Removing - 'తొలగిస్తున్నది'
  • Modifying - 'మార్పులు చేస్తున్నది'

Thank you. lt:User:Hugo.arg 10:23, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఆడింగ్ కు కలుపుతున్నది కన్నా 'జతచేయుచున్నది' బావుంటుందేమో !

అలాగే మోడిఫైంగ్ కి 'నవీకరిస్తూంది' అంటే సరిగా వున్నట్టనిపిస్తూంది.

                           ़~~़ఆర్.వి.వి.రాఘవరావు 61.17.45.54 18:20, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆడింగ్ కు 'జతచేయు' మరియు మోడిఫైంగ్ కు 'మార్పు - చేర్పు' ఎలా ఉంటుంది ? విజ్ఞులు ఆలోచించ ప్రార్ధన . --- వెంకట సుధాకర్ (బెంగుళూరు) మోడిపైంగ్ కు 'ఆధునీకరించు'సరైందేమో! ------ రాజేందర్ అవధాని (మంథని)

ఈ-మెయిలు ద్వారా ఈ వారం వ్యాసాలు

[మార్చు]

విపరీతమైన పనివత్తిడి వలన నేను ఇంకో 3-4 వారాలపాటు వికీపీడియా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను వారం వారం ఈ-మెయిలు ద్వారా పంపించే "ఈ వారం వ్యాసాలను" ఈ 3-4 వారాల పాటు పంపించలేను. ఈ బాధ్యతను ఇంకెవరయినా తీసుకోవాలని మనవి. వ్యాసాలను tewiki-maiku మరియు teluguwiki అనే సమూహాలకు పంపితే సరిపోతుంది. అలాగే పూర్తి వ్యాసాలను కూడా పంపించనవసరం లేదు, వాటి సంక్షిప్త సమాచారాన్ని పంపిస్తే సరిపోతుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:18, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్నయ సూరి ఆంధ్ర ధాతుమాల

[మార్చు]

1930 సంవత్సరంలో చిన్నయ సూరి రచించిన 'ఆంధ్ర ధాతుమాల' Internet Archive నుండి అందరికీ అందుబాటులో ఉన్నది. ఇది 100 పేజీలుంది. దీనిని తెవికీ స్క్రిప్ట్ లోకి ప్రోగ్రాం ద్వారా మార్చే అవకాశం ఉన్నదా. సాఫ్ట్ వేర్ లో అనుభవం ఉన్న ఎవరివల్లనైనా ఇది సంభవమైతే వికీపీడియా మూలాలలోకి దీనిని మనం కాపీ చేయవచ్చును. ఇదే అనుమానం కొంతమంది నా స్నేహితులు కూడా అడిగారు. వాళ్ళదగ్గర ఉన్న ప్రాచీనమైన పుస్తకాలు మన తెవికీ కోసం వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాటిని ఒక్కొక్క పేజీక్రింద తెలుగులో టైపు చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి వాటిని ప్రత్యేకమైన ప్రోగ్రాంతో మనం ఉపయోగించుగలిగితే వికీ మూలాలకు మంచి బూస్ట్ అవుతుంది.Rajasekhar1961 06:06, 22 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్ద పేజిలను (75 కిలోబైట్లు)32కిలో బైట్లు గల పేజీలుగా ఎలా విడదీయాలి=

[మార్చు]

'ఇంటి పేర్లు' పేజీ సైజు 75 కిలోబైట్లు ఉంది; ఆ పేజీని 32kb సైజులోకి విడగొట్టటం ఎలా? Talapagala VB Raju 16:51, 22 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోటోగ్రఫి,కెమెరా,మూవీ కెమెరా,చలనచిత్రీకరణ,సినిమాటోగ్రఫీ,యానిమేషన్,ధ్వని,దృశ్యం,గింప్,అడోబ్

[మార్చు]
  • ఫోటోగ్రఫి(Photography)*ఇమేజ్ ఎడిటింగ్(Image editing)*గింప్(GIMP)*అడోబ్ ఫోటోషాప్(Adobe Photoshop)*యానిమేషన్ (Animation)*స్టాప్ మోషన్ యానిమేషన్(Stop motion animation)*రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు(Raster graphics editing software)*గింప్(camera)*చలనచిత్రీకరణ(movie making*సినిమాటోగ్రఫీ(Cinematography)*మూవీ కెమెరా (movie camera)* డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా(Digital SLR camera)*అర్రి(ARRI)*దృశ్యం(Video)*ధ్వని‎(Audio)*పానావిజన్(Panavision)*కోడాక్ (Kodak)*అడోబ్(Adobe)*డ్రీమ్ వీవర్(Dreamweaver)*మల్టిమీడియా(Multimedia)*కెనడా(Caneda)*కోడాక్(Kodak) పేజీలు సృష్టించి కొన్ని విషయాలు వ్రాసాను, దయచేసి అందరూ తలొక చెయ్యేసి మొలకలన మొక్కలుగా,చెట్టుగా పెంచి పువ్వులు, పళ్ళు కాసేట్టు చేస్తారని విజ్ఞప్తి ...వందనాలతో బొజ్జ వనానా

నా పెరు గన్నొజి నిషికాంత్ మాది అవల్పూర్ నెము మా ఊరి గురింఛి రాయలనుకుంటున్నను

బొమ్మల కాపీహక్కులు

[మార్చు]

సభ్యులందరికీ మనవి. ఇటీవల తెలుగు వికీలో కాపీ హక్కులు లేని బొమ్మల గురించిన హెచ్చరికలు, వాటిని తొలగించాలన్న సూచనలు తరచు వెలువడుతున్నాయి. తెవికీని ఆదినుండీ మంచి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నది మన సంకల్పం. ఇది ఒక చోర్ బజార్ లాగా కాకూడదు. ఇందువలన కాపీ హక్కులను అన్నింటినీ సరి చేయాలని, సరైన కాపీ హక్కులు లేనివాటిని తొలగించాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో నేను గమనించినదేమంటే

  • చాలా మంది సభ్యులు (మొదట్లో ) తమ స్వంత చిత్రాలనే అప్‌లోడ్ చేశారు గాని వాటి కాపీ హక్కులు తెలియజేయలేదు. అందువలన ఆ చిత్రాలను తొలగించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది.
  • కనుక సభ్యులు తాము ఇదివరకు అప్‌లోడ్ చేసిన బొమ్మలకు సరయిన కాపీ హక్కుల వివరాలను చేర్చవలసినది.
  • కాపీ హక్కులు ఉల్లంఘిస్తున్నాయని మీకు స్పష్టంగా తెలిసిన బొమ్మలను తొలగించమని ఒక నోటీసు పెట్టండి.

అందరూ సహకరించవలెను. ఒక నెల సమయంలో కాపీ హక్కుల విషయమై ఇంకా సందిగ్ధంగా ఉన్న బొమ్మలు దాదాపు అన్నీ తొలగించబడుతాయి.

--కాసుబాబు 19:03, 1 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల చర్చలు - సూచనలు

[మార్చు]

ఈ మధ్య మన వ్యాసాల గురించిన చర్చలు కొంత నిశితంగా ఉంటున్నాయి. ఎక్కువ మంది సభ్యులు ఇది తగునా? కాదా? అన్న విషయాలపై ఆసక్తి చూపుతున్నారు. కాని చాలా చర్చలు సభ్యుల పేజీలలో జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. కొంత కాలం తరువాత ఆ వ్యాసాన్ని చూసేవారు వ్యాసం చర్చా పేజీ చూడవచ్చును గాని రచయితల చర్చా పేజీలు చూడరు. అంతే కాకుండా ఇవి వ్యక్తిగతాలు ఏమాత్రం కావు (కాకూడదు కూడాను) కనుక వ్యాసాల గురించిన చర్చలను ఆయా వ్యాసాల చర్చా పేజీలలోనే వ్రాయండి. ఒకవేళ మీరనుకొన్న సభ్యులు ఆ వ్యాఖ్యలను చూడకపోతే (రెండు మూడు రోజులయ్యాక) ఫలాని చోట చూడండి అని చిన్న సందేశం ఇవ్వండి.


మరొక విషయం. అందరికీ అన్ని విషయాల గురించి ఒకే విధమైన అవగాహన ఉండదని గుర్తుంచుకోండి. "ముందు నియమాలు చదవక్కరలేదు. చొరవగా దిద్దుబాట్లు చేయండి. తరువాత రూల్సు గురించి నేర్చుకోండి" అన్నది వికీ సంప్రదాయం. కనుక ఇతర సభ్యులు వికీకి తగని మార్పులు చేస్తే చికాకు పడవద్దు. నిదానంగా తెలియజేయండి. (ఈ మధ్య నియమాలు చదువుతున్న కొద్దీ నాకు వికీలో అసలు వ్యాసాలు వ్రాయడానికి తీరిక దొరకడం లేదు.)


మూడో విషయం. ఏదైనా అనుచితమని మీకు అనిపిస్తే అప్పకుండా రచయితల దృష్టికి అది తీసుకురావచ్చును. అదే సమయంలో దానికి పరిష్కారం కూడా సూచించండి. ముఖ్యంగా క్రొత్త రచయితలు వ్రాసేవాటిని మెరుగుపరచాలి గాని వారిని నిరుత్సాహపరచడం తగదు.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:11, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సగటు దిద్దుబాట్లు 4.01

[మార్చు]

సభ్యులు గమనించారో లేదో! తెలుగు వికీపీడియా సగటు దిద్దుబాట్లు (Edit Rate) ఇప్పుడు 4.01కు చేరింది. ఇప్పటికి 39,627 వ్యాసాలతో, మొత్తము 70,716 డేటాబేసు పేజీలతో ఈ స్థాయికి చేరుకోవడం చాలా ముఖ్యమైన మైలురాయి. అందరికీ అభినందనలు. ఈ మధ్యకాలంలో క్రొత్తగా చేరిన సభ్యుల కృషి ఈ ప్రగతిలో ఎంతో ఉంది. గణాంకాలు చూడండి. 50,000 వ్యాసాలకు చేరేనాటికి దిద్దుబాటు రేటు 5.0 దాటుతుందని ఆశిస్తున్నాను. ఇందుకు సహకారంగా సభ్యులను కోరేది

  • రాశి కంటే వాసి ముఖ్యమని గుర్తుంచుకొనండి.
  • చిన్న వ్యాసాలు మనకు ముఖ్యంగా నామోషీగా ఉన్నాయి. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఉన్న చిన్న వ్యాసాలను పెద్దవిగా చేసే పనిపై అధికంగా దృష్టి పెట్టండి.
  • అక్షర దోషాలను సవరించడంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి.

ఇవన్నీ వికీ విలువను గణనీయంగా పెంచుతాయి. తెవికీ అంటే పనికిమాలిన వ్రాతల పోగుగా కాకూడదని, చదువరులకు అమూల్యమైన విజ్ఞాన భాండాగారంగా రూపొందించాలని లక్ష్యంగా ముందుకు సాగండి. పదండి ముందుకు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:10, 1 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, ఇది చాలా ముఖ్యమైన మైలురాయి. చాలారోజులు కష్టపడి సాధించినది. ఇందుకు కృషి చేసిన సభ్యులందరికీ అభినందనలు. 50వేలకు చేరేలోపు కనీసం ఇంకో లక్షన్నర దిద్దుబాట్లు చేస్తే కానీ 5.0కు చేరదు. వాసిని పెంచే దిశగా మనకు ఇంకో ముఖ్యమైన మైలురాయి, మొలకల శాతం. ప్రస్తుతం 56% మొలకలున్నాయి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గించాలి. మొలకల శాతాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ చూడవచ్చు. --వైజాసత్య 14:55, 1 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దినోత్సవాలు

[మార్చు]

బాలల దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ఒక వర్గం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మంచి పేరు ప్రతిపాదించండి.Rajasekhar1961 13:10, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాలల దినోత్సవం లాంటి ఉత్సవాలు, అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ జరుపుకుంటారు. కాన, ఈ విషయాన్నీ దృష్టిలో వుంచుకొని, పేరూ, దాని వర్గాలూ, ఉపవర్గాలూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. nisar 12:52, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

న్యూయార్క్

[మార్చు]

న్యూయార్క్ వ్యాసాన్ని న్యూయార్క్ రాష్ట్రంగా దారిమార్పు చెందింది.న్యూయార్క్ నగరానికి,న్యూయార్క్ రాష్ట్రానికి విడివిడిగా పేజీలు ఉంటే వ్రాయడానికి వసతిగా ఉంటుంది. --t.sujatha 15:02, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య గారు 1889 జూన్ 2న జన్మించి, 1928 జూన్ 10 న అస్తమించారు.40 ఏళ్ళ లోపే జీవితం ముగిసినా,బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు,భారత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి,చీరాల-పేరాల పన్నుల సహాయ నిరాకరణోద్యమ రధసారధి,హాస్య సంభాషణా చతురుడు,ఆధ్యాత్మిక వాది,విద్యావేత్త,త్యాగమయ జీవనుడు,రామదండు సేనాధిపతి,గాంధేయవాది,జనసామాన్యాన్ని అవలీలగా విశేషంగా ఆకర్షించిన స్ఫురద్రూపి,ఆంగ్లేయ ఉన్నతాధికారులెంతటివారినైనా అనాయాసముగా సమ్మోహితం చేయగల అమోఘవాక్చాతుర్యపటిమగల దిట్ట మన ఆంధ్రరత్న

అట్టి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్యగారి 120వ జయంతి మరియు 80వ వర్ధంతి ఉత్సవాలను 2008 జూన్ 2 నుండి 10 వరకు తొమ్మిది రోజులపాటు చీరాల-పేరాల మరియు పరిసర గ్రామాల్లో నిర్వహించుటకు 27-4-2008 న కార్యనిర్వాహక కమిటీ ఏర్పడింది. అధ్యక్షులుగా డా.సూరం శ్రీనివాసులు (9440242348);ప్రధాన కార్యదర్శిగా చంగవల్లి సత్యనారాయణ శర్మ (94402 42069); కోశాధికారిగా పూర్ణా సత్యం (9866103010)పనిచేస్తారు. సాహిత్య,విద్యా,సామాజిక,ఆధ్యాత్మిక,స్థానిక సుపరిపాలన,సేవాదళ,హాస్య ప్రియత,ఇత్యాది తొమ్మిది రంగాలలో అంధ్రరత్నకృషిని వివరించడానికి నవగోష్టులూ,వివిధ పోటీలు,ప్రచురణలు-ఆంధ్రరత్న పేర విశ్వవిద్యాలయ సాధన,కళాప్రాంగణము ఏర్పాటు,ఆధ్యాత్మిక ధ్యానకేంద్రం,ఆధునిక గ్రంధాలయము,వ్యాయామ క్రీడా ప్రాంగణం,శాశ్వత సహాయ కార్యక్రమాల కొరకు నిధి ఏర్పాటు-ఇవీ కృషి ప్రణాళిక. అందరూ అన్నివిధాలా సహకరించాలని విజ్ఞప్తి ( ప్రధాన కార్యదర్శి ; సత్యం_చంగవల్లి॰యాహో.కామ్ కు ఈ-మెయిల్లో సంప్రదించండి!)

Wrong impression about sysops

[మార్చు]

ఆంగ్లం లో వ్రాస్తున్నందుకు క్షమించండి. నాకు దీన్ని అనువందించేంత తెలుగు రాదు.

From my RFA, I can see that there is a wrong impression about sysops in te.wiki.

  1. Adminship is not a crown. It is not given as a record of achievement.
  2. Admins "run" the wiki. They don't "write".
  3. Eligibility for Adminship does not depend on how much the user has contributed to the mainspace.

చర్చసాయీరచనలు 15:36, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఇది కొంతవరకూ నిజమే. నిర్వాహణ ఒక భాద్యత, గౌరవ సూచకం కాదు. దానివలన నిర్వాహకులకు కొన్ని హక్కులు కూడా వస్తాయి, ఇతర సభ్యులను రచనలు చేయనివ్వకుండా నిరోధించగలగటం, వ్యాసాలను తొలగించాగలగటం. ఈ హక్కులను ఆ సభ్యుడు సరైన విచక్షణతో ఉపయోగిస్తాడా లేదా అనేది, ఆ వికీ సమాజంలో ఉన్న మిగతా సభ్యులకు అతనిపై ఉన్న నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దానికోసం సాధారణంగా ఆ సభ్యుడు అప్పటివరకూ తోటి సభ్యులతో మెలిగిన విధానాన్ని, వికీపీడియా అభివృధికి ఏవిధంగా సహాయపడగలడు అనే విషయాలను తమకున్న అభిప్రాయాలతో బేరీజువేసుకుని నిర్ణయిస్తారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:56, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


గ్రామాల వ్యాసాలు

[మార్చు]

వికీలో గ్రామాల వ్యాసాలుండడం మంచిదే, మనరాష్ట్ర సమగ్ర డేటానూ పొందుపర్చగలిగినవారమవుతాము. మనరాష్ట్రంలో లక్షల గ్రామాలున్నాయి. గ్రామాలకు ఇన్ఫోబాక్స్ వుంచడం వల్ల 'సాధారణ పరిజ్ఞాన పరిధి' ఏర్పరచవచ్చు. అలానే అన్ని గ్రామాలకూ ఒక నిర్ణీత "ఫార్మేట్" ను ఏర్పరిస్తే, రచయితలు వాటిని పూరించగలరు. ఉదాహరణకు: జోను>జిల్లా>రెవెన్యూ డివిజన్>మండల>గ్రామపంచాయతీ>గ్రామం; వ్యాస భాగాలు:: భౌగోళికం; చరిత్ర; జనాభా; విద్య, సాంఘీక విషయాలూ; మతపరమైన విషయాలూ; నదులు; పంటలు; పరిశ్రమలు; రాజకీయాలూ; సంస్థలూ; వ్యక్తులూ; మరియు ఇతరములు. దీనికన్నా ఎక్కువ సమగ్ర సమాచారాలుంచగోరేవారూ సమాచారాన్ని వ్రాసి వాటిని విస్తరించగలరు. సభ్యులు గమనించగలరు. మన గ్రామాలవ్యాసాలు చిన్నవిగా ఉండిపోకుండా చూడవలెనని సభ్యులందరికీ మనవి. సభ్యుడు nisar 09:36, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మామూలుగా వికీ వ్యాసాలలో విషయం లేకుండా ఉత్తినే శీర్షికలు, ఫార్మాట్‌లు చేయడం అంతగా ప్రోత్సహింపబడదు. కాని చిన్న గ్రామాల విషయంలో సభ్యులు ఏం వ్రాయాలో తెలియక తికమక పడుతున్నారు (వారి గురించి, వారి కుటుంబాన్ని గురించి వ్రాస్తేనేమో ఒప్పుకోమయ్యే!). కనుక కనీసం కొన్ని గ్రామాలకన్నా ప్రయోగాత్మంకా ఇలా వ్యాస భాగాలు చేసి చూడవచ్చును. (గణాంకాల ఫార్మాట్ గురించి వైజా సత్య ఇప్పటికే కొంత పని చేస్తున్నాడనుకొంటాను) ప్రస్తుతానికి నిస్సార్ సూచించిన విషయాలు వ్యాస భాగాలుగా చాలనుకొంటాను. మరొ కొన్ని సూచనలు ఇదివరకు వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1 అనే ప్రచార వ్యాసంలో వ్రాశాను

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:26, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]