వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 5 | పాత చర్చ 6 | పాత చర్చ 7

alt text=2008 మే 14 - 2008 జూన్ 29 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2008 మే 14 - 2008 జూన్ 29

ఇది పాత చర్చలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా చర్చించాలంటే ఇక్కడ వ్రాయండి.

మల్లికార్జునరావు

[మార్చు]

జననం 1960 అని, వ్యాసములో 57సం. అని ఉంది. సరిచేయగలరు.


తెవికీ హిట్లు

[మార్చు]

ఇప్పటి వరకు మనకు అందుబాటులో లేని కొన్ని కొత్త గణాంకాలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. [1] తెవికీని ఎంతమంది చూస్తున్నారు అన్న ప్రశ్న శేషప్రశ్నగా మిగిలిపోకుండా ఇప్పుడు చూచాయగానైనా చెప్పగలిగే అవకాశం వచ్చింది. 2008 ఏప్రిల్ నెలలో 14 రోజులపాటు సేకరించిన సమాచారం ప్రకారం సగటున తెవికీకి 67,967 పేజీహిట్లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే తెలుగు అంతర్జాలంలో తెవికీ ఒక పెద్ద వెబ్ సైటుగా రూపొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వికీపీడియాల్లో కెల్లా 57వ స్థానంలోనూ, భారతీయ వికీల్లో రెండవ స్థానములోనూ ఉంది. భారతీయ భాషా వికీల్లో తమిళ వికీ 149,408 పేజీహిట్లతో అగ్రస్థానంలో ఉన్నది. మనకంటే తక్కువ పేజీలున్న తమిళవికీకి రెండున్నర రెట్లు ఎక్కువ హిట్లు రావటం ఆలోచించదగ్గ విషయం. మనం ఆ వికీ నుండి ఏం నేర్చుకోగలం? --వైజాసత్య 11:35, 14 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


తెలుగు వికీకి ఇన్ని హిట్లు వస్తున్నాయనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే తమిళ వికీతో పోల్చేటప్పుడు గమనించవలసింది - ముందుగా మనకంటే తమిళ వికీ అగ్ర స్థానంలో ఉందనేది మనకు తెలిసినదే. అంటే తమిళ వికీకి ఆదరణ తెలుగు వికీకంటే ఎక్కువ కాలంగా ఉంది. కాస్త పెద్ద వ్యాసాలు, అంటే చదువుకోవడానికి ఉపయోగకరమైన వ్యాసాలు, తమిళ వికీలో మనకంటే ఎక్కువ ఉండి ఉండవచ్చునని నా అభిప్రాయం. ఎంత ప్రచారం జరిగినా గాని, ఆ సైటులో ఉపయోగకరమైన సమాచారం ఉంటేనే హిట్లు వస్తాయి. క్రమంగా తెలుగు వికీకి కూడా ఆదరణ పెరుగుతుందనే ఆశిద్దాము. నేర్చుకోవలసినవి చాలా ఉండవచ్చు. కాని కృషి చేసే సభ్యులు పెరిగితేనే అభివృద్ధి సాధ్యం. కనుక క్రొత్త సభ్యులను చేర్చడానికి "రోడ్ షో" లాంటి ఉద్యమమేదైనా చేపట్టగలిగితే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:58, 14 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీకి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాటికొరకు మార్గాలు వెతకాలి. తెవికీ పట్ల అవగాహన పెంచాలి, సభ్యులను చేర్చాలి. అందులో భాగంగా, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ లను తరచుగా ఉపయోగించే వారి వద్దకు తొలుత ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. విశ్వవిద్యాలయాలు, కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగిస్తారు. తొలివిడత "తెవికీ పరిచయం" విశ్వవిద్యాలయాలు మరియు కాలేజీలలో చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలు కాలేజీలలోని అన్ని విభాగాలకు ఈ విషయాలను తీసుకెళ్ళాలి. అందుకు మార్గాలు : 1. ప్రతి విశ్వవిద్యాలయం మరియు ప్రతి కాలేజీనుండి 'తెవికీ ప్రతినిధి' ని యేర్పాటు చేసుకోవాలి, (ఇదో పెద్ద ఉద్యమం, ప్రారంభిస్తే ఒక్కో బిందువూ చేరి సముద్రం కావచ్చు, ఇప్పటికే సభ్యులుగా వున్న కాలేజీ విద్యార్థుల సహాయం తీసుకోవచ్చు). ఆ ప్రతినిధి నోటీసు బోర్డు ద్వారా మరియు సమావేశాల సమయాన పరిచయాల ద్వారా, స్నేహితులతోను తోటి విద్యార్థులతోనూ సంభాషణలు జరుపుతున్నప్పుడూ 'తెవికీ పరిచయం' చేయాలి 2. 'ఇ-మెయిల్' ఉద్యమం చేపట్టాలి. తెవికీ గురించి తెలిసిన వ్యక్తి, కనీసం పది మంది స్నేహితులకు మరియు పరిచయం ఉన్నవారికి తెవికీ గురించి తెలియ జేయాలి, వారునూ అదే పని చేపట్టాలి. 3. వార్తా పత్రికల ద్వారా (కనీసం వారానికోసారి) "తెవికీ న్యూస్" వచ్చేటట్లు యేర్పాటు చేసుకుంటే, సభ్యులూ పెరగవచ్చు మరియు తెవికీని విజ్ఞాన సర్వస్వంగా ఉపయోగించేవారి సంఖ్యా పెరగవచ్చు. రాను రాను ఫలితాలు కనబడవచ్చు. సభ్యుడు నిసార్ అహ్మద్ 17:45, 14 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


నిస్సార్ గారి సూచనల గురించి:

  • 'ఇ-మెయిల్' ఉద్యమాలు ఇంతకుముందు ప్రయత్నించాము. కొంత ప్రయోజనం కలిగింది. మళ్ళీ చేయవచ్చును.
  • ఇలా పది-పది లింకులు ప్రయోజనం లేకపోవడమే కాక చెయిన్ మార్కెటింగ్ వాసనలను అంటగడతాయి.
  • తెవికీ పరిచయం గురించి నిస్సార్ గారి సూచన నాకు చాలా నచ్చింది. ఒకో వూరికీ, ఒకో కాలేజీకి తెలుగు వికీ ప్రతినిధులను ఏర్పాటు చేయడం చాలా మంచి ఐడియా. యువతరాన్ని తెలుగు భాషవైపు ఆహ్వానించడమే భవిష్యత్తుకు మంచి పునాది. నిస్సార్ గారూ! ఒక ప్రచార లేఖ తయారు చేయడం ద్వారా దీనిని కార్య రూపంలో పెట్టడానికి మీరే ప్రణాళిక తయారు చేయండి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:12, 14 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మా కాలేజీలో మా క్లాస్ మేట్స్ కి(ఎంటెక్ మరియు బిటెక్) దీని గురించి చెప్పాను. చాలామంది జాయిన్ అయ్యారు.కానీ అదో ఉద్యమ పద్దతిలో కాక ఏదో అవకాశం వచ్చినపుడు వారిని తెవికీకి ఆకర్షిస్తున్నాను. ఇకపోతే రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాలలో (విశ్వవిద్యాలయాల్లో అయితే బావుంటుంది)తెవికీ అవగాహనా సదస్సులు నిర్వహించడం ద్వారా తెవికీకి ప్రజాధరణ పెంచవచ్చునని నా అభిప్రాయం. ముందు ఒకసారి తెవికీ గురించి ఈనాడులో రాసిన విలేఖరిని ఇలాంటి సదస్సులను కవర్ చెయ్యమని అభ్యర్థిస్తే రెండు విదాలా మేలు చేకూర్చవచ్చు. రవిచంద్ర(చర్చ) 05:48, 15 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇప్పటి వరకు అందరూ.. సభ్యులు పెరిగాలని, ప్రజల లోకి తీసుకెళ్ళాలని,ఉద్యమాలు చెయాలని అని మాట్లాడారు..కానీ తమిళం తొ పొల్చిన వారు ఇతర భాషాలతొ కూడా పోల్చితే బాగుంటుంది.Vükiped తో పొల్చిన దాని సభులు తెవికీ కన్నా తక్కువ.ఇతర భషలతొ పొల్చి సభ్యులు లేరని నిరాశ పడకుండా మనము మన శక్తి మేర ప్రయతనం చేద్దాం.--[సభ్యులు: శ్రీనాధుడు]
  • నాకు తెలుగు, ఇంగ్లీషు వచ్చినంత బాగా తమిళం రాదు. కనుక తమిళ్ విక్కీని చూసి అది తెలుగు విక్కీ కంటె ఎక్కువ ఆదరణ ఎందుకు పొందుతోందో చెప్పలేను. తెలుగు వికీ ని ఆక్షేపించటం నా ఉద్దేశ్యం కాదు కాని నేను చూసిన మేరకి తెలుగు వికీ లో రెండు దోషాలు కనిపిస్తున్నాయి. (1) చాల పేజీలు అసంపూర్ణంగా ఉంటున్నాయి - సూరత్వంతోనో, ఆబతోనో ఆరంభించి మధ్యలో ఆపేసినవయి ఉంటాయి. (2) ఇంగ్లీషు నుండి తెలుగు లోకి తర్జుమా చెయ్యటానికి ప్రయత్నించి మధ్యలో ఆపేసిన పేజీలు కూడ కనిపిస్తున్నాయి. మధ్యలో ఆపెస్తే చదివేవారికి ఉత్సాహం ఉండదు.

ఏది ఏమయినా మనం వెనకబడిపోతున్నామని కంగారుపడి నాణ్యత తగ్గనివ్వకూడదు. భాషలోనూ, భావం లోనూ ఉదాత్తంగా ఉండాలి. మరొకరు రాసినది కత్తిరించేసే లోగా మన మనస్సులో వచ్చిన భావం, ఊహ సరీయినదే అని నిర్ధారణ చేసుకునే ఓరిమి ఉండాలి. ప్రజాదరణ అదే వస్తుంది. Vemurione 21:40, 17 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ హిట్‌ల గణాంకాలు మనకు అందుబాటులో ఉండటం సంతోషించదగ్గ విషయం. దీని వలన ఏయే వ్యాసాలకు హిట్‌లు పెరుగుతున్నాయో చూసి ఆ అంశాలకు సంబంధించిన వ్యాసాలు వృద్ధిచేయడానికి మనకు అవకాశం లభిస్తుంది. తెవికీకి ఇన్ని హిట్‌లు ఉంటాయని ఇదివరకు నేను అనుకోలేదు. అయినా మనకంటే తమిళ భాషకు రెండురెట్లకు పైగా హిట్లు ఉండటం వైజాసత్య గారు చెప్పినట్లు ఆలోచించదగ్గ విషయమే. గణాంకాల ప్రకారం చూస్తే రెండింటిలో మొదటి పేజీ హిట్లు దాదాపు సమానమే. సాధారణంగా సందర్శకులు మొదటిపేజీ నుంచే వస్తారు కాబట్టి తెలుగు, తమిళ వికీ సందర్శకులు సమానమే అని అనుకోవచ్చు. తెవికీ హిట్ల సంఖ్య తక్కువగా ఉండటానికి ఒక్కో సందర్శకుడు సందర్శించే పేజీల సంఖ్య తక్కువగా ఉండటమే అని నా అభిప్రాయం. దీనికి ప్రధాన కారణాలు అనువాదం కోసం తెచ్చిన ఆంగ్ల భాగాలు, నాణ్యత లేని వ్యాసాలు, సమాచారం లేని విభాగాలు, ఏక వాక్య వ్యాసాలు మొదలగునవి. ఇటీవల ఆంగ్ల భాగాల తొలిగింపు చాలా వరకు జరిగింది, ఇక మనం వ్యాసాల నాణ్యత పెంచడమే కాకుండా ఏక వాక్య వ్యాసాల నిర్మూలనపై దృష్టిపెట్టాలి. చిన్న వ్యాసాలపై ఇదివరకు చాలా సార్లు చర్చ జరిగింది కాని కొందరు సీనియర్ సభ్యులు కూడా డిక్షనరీలో అర్థం తెలిపే విధంగా ఉండే ఏక వాక్య వ్యాసాలను సృష్టించడం జరుగుతోంది. వీటి వలన సందర్శకులకు తెవికీపై దుష్ప్రభావం పడుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 12:02, 18 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిస్సార్ గారు చెపినట్లు ఈమైల్ విదానం చలా ఈజి గాను ఆచరన యౌగ్యం గాను ఉంది. దిని కొసం ఒక మంచి ఈమైల్ ని తయారు చెసి తెవికి సబ్యులందరికి పంపిస్తె మంచి ఆదరణ లబించవచు

50,000 లక్ష్యం మన ముందుంది. పదండి ముందుకు.

[మార్చు]

తెలుగు వికీ 40,000 వ్యాసాల మైలురాయిని చేరుకొన్నసందర్భంగా వికీ కృషీవలులందరికీ అభినందనలు. సభ్యుల కూర్పులను బట్టి వారు ఎంతెంత శ్రమ పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చును. దాదాపు అందరూ తమ తమ ఉద్యోగ, గృహ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ దీనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వ పోషణ గాని గాని, స్థానిక సంస్థల చేయూత గాని లేకుండా, ఏ విధమైన ఆర్ధిక ప్రయోజనం లేకుండా, తెలుగు రచనా రంగంలో ఈ విధమైన కృషి జరిగినవి చాలా కొద్ది మాత్రమే అనుకొంటాను. అసలు ఇటువంటి ప్రాజెక్టును సుసాధ్యం చేసిన వికీమీడియా ఫౌండేషన్‌కు హృదయపూర్వక ప్రశంసలు.

నాకు ఉత్సాహం కలిగించే మరొక విషయం ఏమంటే వికీ వీరులలో దాదాపు అందరూ తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన ప్రవేశం లేని ఔత్సాహికులు. చాలా మంది యువతరం. అవాంతరాలను, నిరుత్సాహాన్ని అధిగమించి ఈ పనిని తమ స్వకార్యంలా నిర్వహిస్తున్నారు. అందరికీ మరల మరల నా అభినందనలు.

ఇప్పటికి ఈ మజిలీని చేరుకోవడంలో ఈనాడు పత్రికలో వచ్చిన వార్తా శీర్షికలు మనకు ఎంతో గుర్తింపును తెచ్చాయి. క్రొత్త సభ్యులను పరిచయం చేశాయి. ఈ నాడు పత్రికకు, ప్రధానంగా అందులో వ్యాసాలకు సూత్రధారి అయిన బలరామశర్మ గారికి ఈ సందర్భంగా తెలుగు వికీ సభ్యులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇప్పటి వరకు జరిగిన కృషిని పరిశీలించి, ముందు జరగాల్సిన పనిని ఒక ప్రణాళిక ప్రకారం సాగిస్తే తెలుగు వికీ నాణ్యత పెరుగుతుందని ఆశిస్తున్నాను. అందుకు చర్చించాల్సిన విషయాలను, చేయవలసిన పనులను, అనుసరించదగిన విధానాలను అంచెలంచెలుగా చేపడదాము. త్వరలో అందుకు అవుసరమైన ప్రతిపాదనలను చేసి చర్చించుకొందాము.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:00, 18 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అర్థం కాని పదాలు

[మార్చు]

వారసవాహిక, కర్బనోదకం, బణువు మొదలైన పదాలు శాస్త్రీయంగా అందరికీ అమోదమైనవా కాదా నాకు తెలియదు. అంగీకారం కాకపోతే వాటిని ఉపయోగించకపోవడమే మంచిదని నా అభిప్రాయం. వేమురి వంటి నిఘంటు కర్తలు మనకు అవసరం. అయితే వీరు కొత్తగా తయారుచేసిన తెలుగు పదాలు విజ్ఞాన శాస్త్రంలో అందరి చేతా ఆమోదింపబడ్డాయా లేదా అనేది తెలియదు.ఇలాంటి కొత్త తెలుగు పదాల గురించి మనం ఒక పాలసీ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు వికీపీడియా ఒక ప్రయోగశాల కాదు. కొత్త ప్రయోగాలు చేయడం వల్ల వికీపీడియాలోని సమాచారం ఎవరికీ అర్థం కాకుండా పొతుంది.Rajasekhar1961 07:23, 26 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ చెప్పిందానితో నేను ఏకీభవిస్తున్నాను. కాకుంటే ప్రస్తుతం ఇలాంటి పదప్రయోగాలు తెవికీలో ఎక్కువగా లేవు. కనుక ఈ మాత్రం వ్యాసాలు మనకొక్క క్రొత్త flavour అని అలా ఉంచుదాము. కొంత అభివృద్ధి తరువాత పాలిసీ గురించి పునఃపరిశీలించవచ్చును అని నా అభిప్రాయం.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:05, 26 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అంతే కాక ఇవి తెలుగు వికీలోని ప్రయోగాలు అని చెప్పలేము. ఎందుకంటే వీటిని రచయిత అంతకుముందే కొన్ని రచనలలో వాడారు. తెలుగులో చాలా శాస్త్రీయ పదాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు గనుక ఇలాంటి ధర్మసందేహాలు తప్పవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:28, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఉదజని, ఆమ్లజని, కర్బన ద్వి ఆమ్లజనిదము, గంధకికామ్లము, గంధకిదము, గంధకితము, కాంతి సంవత్సరం, కశేరుకలు, వృక్క ధమని, మొదలైనవి ఎవ్వరి ఆమోదం పొందేయి? ఆంధ్ర దేశంలో ఆమోద ముద్ర వేసే సంస్థ ఏదైనా ఉందా? ప్రజలు పుట్టిస్తేనా కదా మాటలు పుట్టేది? పుట్టిన మాటలని వాడి చూస్తేనే కదా ప్రజాదరణ పొందేదీ లేనిదీ తెలిసేది? ఆ వాడకానికి ఒక వేదిక ఉండాలి కదా? తెలుగులో మనకి ఆ సదుపాయం తక్కువ. కంప్యూటర్‌ రంగంలో మనం వాడే ఇంగ్లీషు మాటలు ఎప్పుడు, ఎలా పుట్టేయో, ఎలా పెరిగేయో మనలో చాల మంది చూసేం. ఇవన్నీ మన కళ్ళ ఎదుట పుట్టి, పెరిగిన మాటలే. తెలుగు దేశంలో, తెలుగువాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి పరిశోధనలు చేసిననాడు, మనకి మన బుర్రల్లో పుట్టే సరికొత్త ఆలోచనలకి తెలుగు పేర్లు పెట్టుకోమూ. మనం కొంచెం వెనకబడి ఉన్నాం కనుక కొంత వరకు ఇటువంటి ఏ ప్రయత్నం చేసినా అది ఏటికి ఎదురీతే అవుతుంది.

ఇంగ్లీషులో కూడ నాకు తెలిసినంత వరకు ఆమోదముద్ర వేసే సంఘాలు లేవు. వికీలో ఉన్న సదుపాయం ఏమిటంటే ఎవ్వరి ఆమోద ముద్ర లేకుండానే మనకి నచ్చని భాగాలని స్వేచ్చగా తొలగించవచ్చు. సాంకేతిక పదాలు మొదటిసారి వాడినప్పుడు, పక్కని ఇంగ్లీషులో రాస్తూ, ఆ పక్కనే ఆ మాట పుట్టుపూర్వోత్తరాలు రాస్తూ ఉంటే చదివేవారికి అర్ధవంతంగా ఉంటుంది. మనం చూసుకోవలసినది, "ఇది చదువుతూ ఉంటే అర్ధం అవుతోందా?" అని కాని "ఈ మాటలు ఆమోదం పొందేయా?" అని కాదు. అర్ధం అవుతూన్నంత సేపూ వ్రతం చెడలేదన్నమాట. ఆర్ధం కాకుండా గందరగోళంగా ఉంటే వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు.

సైన్సుకి కావలసినది నిర్దిష్టత. సైన్సులో సాధారణంగా వాడే చాల మాటలకి ఈ నాటికీ తెలుగులో నిర్ధిష్టమైనవీ, సులభంగా అర్ధం అయేవీ, రకరకాల సందర్భాలకి అనుకూలంగా ఒంగేవీ అయిన మాటలు లేవు: Work, power, energy, mass, momentum, acceleration, frequency, atom, molecule..... తెలుగు వాడకమే గగనమయిపోతూన్న ఈ రోజుల్లో ప్రయోగాలు చెయ్యటం సాహసమే. Vemurione 16:22, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

  • కొత్త పదాల మంచిదే ప్రయోగం అవసరమైనదే కాకపోతే బ్రాకెట్లలో కొంతకాలం ఆంగ్ల పదాన్ని ఇవ్వచ్చు.మరీ అర్ధం కాకపోతే రచయితను వివరణ అడగవచ్చు

ఈ విషయంలో తమిళులు ఎంతో ముందు ఉన్నారు.వారు బస్సు,టెలివిషన్,టెలిఫోన్ లాంటి అనేక పదాలకు తమిళ పదాలు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. సంకేతిక,శాస్త్రీయ పదాలకు మనమూ పదాలు సృష్టించడం ప్రోత్సాహకరం.కొత్తలో కష్టంగా ఉన్నా పోను పోను అల్లవాటవుతాయి.కాకపోతే మాటలు చిన్నవిగానూ,సరళంగానూ ఉండటం అవసరం.కొన్ని పడాలను చర్చించి నిర్ణయించవచ్చు.--t.sujatha 16:38, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్నికలకు సిద్ధమౌతున్నారా?

[మార్చు]

2009 ఎన్నికలకు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు సిద్ధమో కాదో తెలియదు. కాని తెలుగు వికిపీడియన్లు తయారౌతున్నట్లున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాలమీద పెరుగుతున్న వ్యాసాలే ఇందుకు నిదర్శనం. విజయోస్తు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:24, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి 'ఐడియా' ఇచ్చారండి, ఎన్నికలనాటికి, తెవికీని ఓ మోస్తరు 'రెఫరెన్సు'లా తయారు చేసి, సందర్శకుల సంఖ్య పెంచవచ్చు. (కానీ దీనికీ పరిచయం అవసరమే) నిసార్ అహ్మద్ 22:00, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఎన్నికలనాటికి సిద్ధం. నియోజకవర్గ వ్యాసాలకు, తలా ఓ చెయ్యి వేయండి, తెవికీ ఓ మంచి రెఫరెన్స్ లా తయారవ్వడం ఖాయం. నిసార్ అహ్మద్ 20:33, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న

[మార్చు]

ఉదాహరణకి 'వర్గం: భౌతికశాస్త్రం ' లోనికి వెళితే అక్కడ ఆకారాది క్రమంలో ఒక జాబితా ఉంది - అ, ఎ, క, తా, ద,... మొదలైన అక్షరాల కింద కొన్ని అంశలు ఉన్నాయి. ఈ జాబితాలో కొత్త అంశాన్ని జొప్పిద్దామని "మార్చు' నొక్కితే అక్కడ మార్చటానికేమీ కనిపించటం లేదు.

ప్రశ్న: ఈ జాబితాలో మాటలని మార్చాలన్నా, చేర్చాలన్నా ఎలా? వందనాలు -- Vemurione 22:59, 28 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

[[వర్గం:భౌతిక శాస్త్రము]]అని వ్యాసం చివరలో వ్రాస్తే ఆ వ్యాసం భౌతిక శాస్త్రము వర్గానికి చెందిపోతుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత వ్యాసాన్ని నేను భౌతిక శాస్త్రము వర్గానికి కలిపాను చూడండి. Chavakiran 04:30, 29 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

GDFL బొమ్మలు

[మార్చు]

తెలుగు వికీపీడియాలో నేను తీసిన కొన్ని వర్గం:GDFL బొమ్మలు చేర్చాను. కానీ ఇంగ్లీషు వికీపీడియా పేజీలలో వాటిని చేర్చలేకపోతున్నాను. ఈ బొమ్మలను రెండింటిలోనూ ఉపయోగించుకోవాలంటే ఏమి చెయ్యాలి.Rajasekhar1961 06:12, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రెండు మార్గాలున్నాయి (1) మళ్ళీ ఆ బొమ్మలను ఆంగ్లవికీలో అప్‌లోడ్ చేయడం (2) ఆ బొమ్మలను కామన్స్‌లోకి అదే పేరుతో అప్‌లోడ్ చేయడం. అందుకు మీరు కామన్స్‌లో సభ్యులుగా నమోదు చేసుకోవాలి. కామన్స్‌లోకి అప్‌లోడ్ చేసినాక తెలుగు వికీలో బొమ్మను ఆ తొలగించవచ్చును కూడాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:34, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఈ తెవికి కి కొత్తగ ఛేరిన సభ్యుడిని ఇప్పుడిప్పుడె రాయడం నెర్ఛుకుంటున్నాను.--Adimallikarjunareddy 10:04, 18 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీకోట్

[మార్చు]

వికీకోట్ లో తెలుగు స్క్రిప్ట్ పనిచేయడం లేదు. తెలుగు రచనలు చేయడం వీలుపడడం లేదు.Rajasekhar1961 14:13, 20 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సంవత్సరాల వర్గాలు - నామకరణ విధానం

[మార్చు]

సంవత్సరాల వర్గీకరణ, పేర్లకు వర్గం:930లు, వర్గం:10 వ శతాబ్దం ఇలా వాడుతున్నారు. ఇందుకు బదులుగా క్రింది నామకరణం బాగుంటుందనుకొంటున్నాను

మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఆమోదయోగ్యమైతే ఇప్పటికే తయారు చేసిన వ్యాసాలను, వర్గాలను బాట్ల సాయంతో తరలించవలసి ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:35, 24 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను, అలాగే సంవత్సరాల వ్యాసాలలో పైభాగంలో ఉన్న బాక్సులో దశాబ్దాలు, శతాబ్దాలలో 1950లు, 1960లు, 19 వ శతాబ్దం ఇలా ఎర్ర లింకులున్నాయి. పై లింకులకు వ్యాసం ఉండే అవకాశమే లేదు కాబట్టి వాటన్నింటినీ బాటుద్వారా తొలిగించాలని కోరుచున్నాను. దాని స్థానంలో శతాబ్దానికి ఒకటి చొప్పున మూసలు తయారుచేస్తాను. ఆ మూసలలో 100 సంవత్సరాల లింకులు మరియు శతాబ్దాల లింకులిస్తే సరిపోతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:03, 24 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
    • మంచి చర్చ జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం శతాబ్దం పదం సరైనది. సంఖ్యకు వ కు మధ్య ఖాళీ లేకుండా ఉంటేనే బాగుంటుంది. దశకం కన్నా దశాబ్దం అంటే బాగుంటుందని నాకనిపిస్తుంది. అంటే వర్గం:1830 దశాబ్దం ; వర్గం:850 దశాబ్దం ; వర్గం:11వ శతాబ్దం కానీ ఇప్పటికే చాలా వ్యాసాలున్నాయి. వీలుంటే బాటు సహాయంతో సవరిస్తే చాలా సమయం మిగులుతుంది. కానీ ఒక్క సందేహం. దశాబ్దం 1 తో ప్రారంభమై 10 వరకు ఉంటుంది. అనగా 1980 దశాబ్దం 1971 నుండి 1980 వరకు ఉండాలి కానీ ఇంతవరకు ఉన్న వర్గీకరణలో 0 సంవత్సరం తరువాత దశాబ్దంలోకి పోయింది. ఈ తప్పును కూడా సవరించాల్సి ఉంటుంది.Rajasekhar1961 16:18, 24 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 1951 నుండి 2004 వరకు పి.డి.ఎఫ్. ఫార్మాట్ లో ఎన్నికల సంఘం వెబ్ సైటులో ఉన్నాయి. నేను సాలూరు శాసనసభా నియోజకవర్గం లో లింకులిచ్చాను. ఇవి అందరికీ అందుబాటులో ఉంటే మన ఎన్నికల విషయంలో చేసే పని తొందరగా పూర్తి అవుతుంది. ఇంతవరకు రచించబడిన శాసనసభ వ్యాసాలలో 1979 లేదా 1984 నుండి మాత్రమే ఫలితాలు చేర్చబడ్డాయి.Rajasekhar1961 06:03, 28 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

'చరిత్రలో ఈ రోజు' శీర్షిక

[మార్చు]

'చరిత్రలో ఈ రోజు' శీర్షిక లో ఈ వెబ్ సైట్లు చేర్చమని మనవి (external websites).

This Day in HISTORY(BBC)------------------ www.bbc.co.uk/history/index.shtml

On This Day (BBC)---------------------- http://news.bbc.co.uk/onthisday

This day in HISTORY (INFOPLEASE)---------- www.infoplease.com

This day in HISTORY (SCOPESYS)------------ www.scopesys.com/anyday

THIS DAY IN HISTORY (English Wikipedia)--- www.wikipedia.com

On This Day (The New York Times)---------- www.nytimes.com/learning/general/onthisday

On This Day(On This Day in Canada)-------- www1.sympatico.ca/cgi-bin/on_this_day


'చరిత్రలో ఈ రోజు' శీర్షిక కోసం ఈ వెబ్ సైట్లలో కూడా కొన్ని విషయాలు ఉండే అవకాశం వుంది. గమనించగలరు.

Encyclopedia Britannica website ----- http://www.britannica.com

Encarta websites also

History websites of India and world

Talapagala VB Raju 11:38, 29 జూన్ 2008 (UTC)