వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఫ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఫాంటమారా [1] రచన:ఇగ్నీషియా సైలోన్; అనువాదం: నిడమర్తి అశ్వనీకుమారదత్తు నవల, అనువాదం 1933లో ఇటాలియన్ రచయిత ఇగ్నీషియో సైలోన్/ఇగ్నాజియో సిలోన్ రాసిన నవల ఫాంటమారా. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఇటలీలో ఏర్పడిన ఫాసిస్ట్ ప్రభుత్వపు పోలీసుల వల్ల ప్రవాసిగా స్విట్జర్లాండ్ వెళ్ళిన రచయిత ఆ సమయంలో ఈ నవల రచించారు. సిలోన్ తొలి నవలగానే కాక ఆయన రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా కూడా పేరొందింది. ప్రపంచప్రఖ్యాతినీ, అనేక భాషల్లోకి అనువాదమూ, పదిలక్షల కాపీలకు పైగా అమ్మకమూ పొందింది. సిలోన్ ఇటలీ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ఈ నవలను కమ్యూనిజం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనువాదం చేశారు. ఆ క్రమంలోనే తెలుగులోకి కూడా అనువాదమైంది. 2030020024655 1955
ఫాంటైన్ [2] చన: విక్టర్ హ్యూగో; అనువాదం: వి.దుర్గాప్రసాదరావు అనువాద నవల విక్టర్ హ్యూగో (ఫిబ్రవరి 26, 1802 – మే 22, 1885) సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. ఆయన రచించిన ఈ నవల 19వ శతాబ్దిలోకెల్లా అత్యున్నతమైన నవలలో ఒకటిగా పేరుపొందింది. ప్రపంచప్రఖ్యాతి పొందిన ఈ నవలను దుర్గా ప్రసాదరావు అనువదించారు. 2030020025194 1941
ఫాదరిండియా [3] విశ్వనాథం నవల 2020010005080 1882
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయం-మొదటి భాగము [4] అయ్యదేవర కాళేశ్వరరావు చరిత్ర ప్రపంచంలోని వివిధ దేశాల్లో పలువురు స్వాతంత్ర్యాభిమానులు, స్వేచ్ఛాపిపాసులను ఆకర్షించింది ఫ్రెంచి విప్లవ విజయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలతో జరిగిన ఈ విప్లవానికి భారతదేశంలోని పలువురు స్వాతంత్ర్యసమర యోధులు కూడా ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో కొమర్రాజు వేంకట లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ద్వారా తెలుగువారికి ఫ్రెంచి విప్లవం, దాని విజయం, ఆ విప్లవానికి నేపథ్యం వంటివి వివరించేందుకు ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఆ గ్రంథంలో ఇది మొదటిభాగం. తెలుగునాట స్వాతంత్ర్య సమరంలో సుప్రసిద్ధి పొందిన నాయకుడు అయ్యదేవర కాళేశ్వరరావు ఈ పుస్తకాన్ని రచించారు. 2020050005820 1923