వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - అం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
అంతిమధర్మ శాస్త్రోపదేశకుడు [1] ఎం.వందేర్మన్ ఇస్లాం మతం, ఆధ్యాత్మికం ఇస్లాం మత ప్రవక్త జీవింతం గురించి, సందేశం గురించి పలువురు ప్రముఖుల అభిప్రాయాలతో ఉన్న గ్రంథం 2020120019717 1935
అంటరాని వసంతం [2] జి.కళ్యాణ రావు నవల, సాంఘిక నవల అంటరాని వసంతం జి.కళ్యాణరావు రాసిన నవల. కులప్రాతిపదికన ఓ వర్గం ఎదుర్కొన్న అనేకరకాల అక్రోశాల, బాధల, అన్యాయాల, తిరుగుబాటు వివరణలను చిత్రీకరించిన నవల ఇది. రూతు జ్ఞాపకంగా, రూబేను జీవితంగా ఆరంభమైన అంటరాని వసంతం నవల, తరతరాలను తడుముతుంది.దాదాపు ఎనిమిది తరాల్లోని వారి జీవితాన్ని తడుముతుంది అంటరాని వసంతం నవల. ఇలా ఎందరెందరి జీవితాలనో కలుపుకు సాగిన ప్రవాహం అంటరాని వసంతం. జీవిత అవసరాలకే నిత్యం ఆరాటపడే నిమ్నవర్గాలవారికి, కల పట్ల ఆసక్తి, అభినివేశం ఉండడమే అబ్బురం. అటువంటిది దానికోసం ప్రాణాలనైనా లెక్కచేయకపోవడం మరీ అద్భుతమంటారు ఈ కథాంశాన్ని విశ్లేషిస్తూ నవలా హృదయంలో వి.రాజారామమోహనరావు. అంటరాని వసంతంలో ప్రధానంగా ఈ అంశం కదులుతూ వారి జీవన నేపథ్యం ఆవిష్కరించింది. ఏడెనిమిది తరాల కథను చెప్పినా, వారి జీవితంతో పాటు ఈ అంశాన్ని జమిలిగా ముడిపెట్టడం జరిగింది. 2990100051605 2000
అంతేవాసులతో హంపీ విహారయాత్ర [3] ముమ్మన్నేని లక్ష్మీనారాయణ చరిత్ర విజయనగరం 13-16శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఆ కాలంలో ప్రపంచంలోని ముఖ్యమైన, వైభవోపేతమైన మహా నగరాల్లో ఒకటిగా కీర్తించబడింది. తళ్ళికోట యుద్ధంలో సుల్తానుల సేనల చేతిలో విజయనగర సైన్యం ఓటమి పాలయ్యాకా అత్యంత క్రూరంగా 5 నెలల పాటు సుల్తానులు మకాము ఉండి మరీ నాశనం చేశారు. ఆ మహా నగరం యొక్క అపురూపమైన శిథిలాలు నేటి కర్ణాటకలోని హంపీ గ్రామం సమీపంలో ఉన్నాయి. యాత్రికులకు, చారిత్రికులకు గమ్యస్థానం వంటి ఈ ప్రాంతంలో 1950 దశకంలో గుంటూరు జిల్లాలోని పెదపులివర్రు గ్రామంలోని నాదెళ్ళ సుబ్బరాయ చౌదరి బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థులు విహార యాత్రకు వెళ్ళారు. వారిలో పాఠశాల హిందీపండితులైన రచయిత కూడా ఉన్నారు ఆయన ఈ గ్రంథాన్ని ఆనాటి యాత్రానుభవాలతో రచించారు. 2030020024427 1955
అంతఃపురము [4] మూలం.రెనాల్డ్స్, అనువాదం.మొసలికంటి సంజీవరావు నవల, చారిత్రిక నవల, అనువాదం రెనాల్డ్స్ అనే ఆంగ్లరచయిత రచించిన లవ్స్ ఆఫ్ ది హరెం అనే నవలకు ఇది అనువాదం. ఈ రచనలో ఖలీల్ అనే సామాన్యుడు కాన్‌స్టాంటినోపుల్ అనే మహానగరాన్ని నిత్యం యుద్ధాలు, ఘోరరక్తపాతం నుంచి కాపాడి చక్రవర్తిగా మారడం కథాంశం. 2030020024601 1928
అంపశయ్య [5][dead link] అచ్యుతుని వేంకటాచలపతిరావు నాటకం, పౌరాణిక నాటకం మహాభారత యుద్ధంలో కౌరవ పాండవులకు పితామహుడైన భీష్ముని జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు. ఈ నాటకంలో భీష్ముడు అంపశయ్యపై కృష్ణపరమాత్ముని గురించి చేసిన ప్రఖ్యాత విష్ణుసహస్రనామ పారాయణతో ముగుస్తుంది. 2030020025037 1939
అంబి మొండి శిఖండి [6] చిలుకూరి వీరభద్రరావు నాటకం, పౌరాణిక నాటకం తెలుగు సాహిత్య భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రారంభమైన వ్యవహారిక భాషోద్యమానికి ఈ గ్రంథానికి సంబంధం ఉంది. భాషావేత్త, మహా పండితుడు గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషోద్యమానికి లక్షణకర్తగా సిద్ధాంత పరమైన పోరాటం చేస్తూండగా, శ్రీపాద, చిలుకూరి వంటి వారు తమ రచనలు వాడుక భాషలో రచించి బలోపేతం చేశారు. అదే క్రమంలో ఈ నాటకాన్ని వాడుక భాషలో భీష్మ-శిఖండి చరిత్రముగా రచించారు. రచయిత చిలుకూరి వీరభద్రరావు సంగీతం, పద్యాలు, ఔచిత్యానికి సంబంధం లేని గ్రాంథికాల నుంచి నాటకాలను బయటపడేసి వాడుక భాషలో ఒరవడి పెట్టేందుకు రాశారు. ముందుమాటలో దీన్ని గ్రాంథికంలోకి మార్చి ప్రదర్శించవద్దని నటులు, దర్సకులను విజ్ఞప్తి చేశారాయన. 2030020024697 1933

మూలాలు[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]