Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఒ

వికీపీడియా నుండి
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఒంటిమిట్ట రఘువీర శతకం [1] తిప్ప రాజు శతకం కడప నగరానికి సమీపంలోని ఒంటిమిట్ట చారిత్రిక ప్రసిద్ధి పొందిన క్షేత్రం. ఇక్కడి రఘువీర స్వామి ఒకనాడు చాలా ప్రసిద్ధుడు. తర్వాతి కాలంలో కారణాంతరాల చేత ప్రసిద్ధి కొంత తప్పింది. ఆ స్వామి వారిని ఉద్దేశించి చెప్పిన శతకం ఇది. దీనినే మకుటాన్ని అనుసరించి జానకీ నాయక శతకం అనీ అంటారు. ఈ రచన చేసిన కవి రాయల ఆస్థానంలో తన కృతులకు మెప్పు అందుకున్నవాడు. సాహిత్య చరిత్రలో రాయల యుగానికి చెందినవాడు. 2030020024977 1921
ఒక అనుభవం నుంచి [2] భూసురపల్లి వేంకటేశ్వరులు కవితా సంపుటి వివిధ సందర్భాల్లో భూసురపల్లి వెంకటేశ్వర్లు రాసిన కవితల సంకలనం ఇది. వెలసిన పూసల కోటు, బతుకు పెనం మీద, ఒక అనుభవం నుంచి, రేపటి యుద్ధం మొదలైన వచన కవితలు ఉన్నాయి. 2990100049496 2003
ఒక ఊరి కథ [3] యార్లగడ్డ బాలగంగాధరరావు కథ మానవ వికాసాన్ని గానీ, భాషా శాస్త్రాన్ని గానీ అధ్యయనం చేసేవారికి అత్యంత అవసరమైనది ఊళ్ళ పేర్లు. విజ్ఞాన సర్వస్వ అభివృద్ధిలో కూడా దీని ఉపయోగం చాలా ఉంది. అటువంటి అంశాన్నికూలంకుషంగా చర్చించిన విలువైన గ్రంథమిది. ఒక ఊరి కథ అని పేరు మాత్రానికి పెట్టినా అన్ని ఊళ్ళ కథగా రూపొందింది. గ్రామాల నామాల వెనుకనున్న ఫోక్ ఎటిమాలజీ, వాటికి ప్రామాణికత, భాషా శాస్త్ర విశేషాలు, వంటివి ఇందులో ప్రస్తావించారు. 2020120035110 1995
ఒకే కథ అనేక రకాలు [4] పోలవరపు శ్రీహరిరావు సాహిత్యం ఇతివృత్తం ఒకటే అయినా ఎన్నో విధాలుగా వ్రాయవచ్చునని నిరూపిస్తూ రచించిన గ్రంథమిది. ఒక చిన్న ఇతివృత్తం స్వీకరించి కథనం మార్చి అనేక రకాలైన కథలుగా తయారుచేసారు. ఇది కథా రచనను అభ్యాసం చేసేవారికీ పనికివస్తుంది. 2020010006605 1955
ఒక్క క్షణం వెనక్కి తిప్పి చూస్తే [5] అడవికొలను పార్వతి ఆత్మకథ స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప త్యాగజీవి రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ కుమార్తె, రచయిత్రి అడవికొలను పార్వతి. ఆమె తన ఆత్మకథను ఒక్క క్షణం వెనక్కి తిప్పి చూస్తె అన్న పేరుతొ వ్రాసుకున్నారు. అదే ఈ గ్రంథం. 9000000003934 1947
ఒక చిన్న దివ్వె [6] ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ కవితల సంపుటి వివిధ సందర్భములలో, అనేకమైన ఇతివృత్తాలతో కవయిత్రి రాసిన గేయముల సంపుటిగా ఈ ఒక చిన్న దివ్వె ఏర్పాటైంది. దీనిలో అనేకమైన సందర్భాలు, విషయాలతో వైవిధ్యమైన అంశాలతో కవితలు ఉన్నా సానుకూల దృక్పథం దారం వంటిది కనుక ఈ శీర్షికను ఉంచారు. 2020120035111 1980
ఒకే జాతిగా రూపొందడమెలా? [7] జి.వి.ఎల్.నరసింహారావు సాహిత్యం వైవిధ్యం ప్రాణంగా ఉన్న భారతదేశంలో వివిధ మతాలైన హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్ఖుల నడుమ ఎన్నోమారు గొడవలు చెలరేగి ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడింది. భారతీయులుగా కలవడానికి, హిందూ-ముస్లిం-క్రైస్తవాది మతాలుగా విడిపోకుండా ఉండడానికి ఈ గ్రంథంలో లోతైన అధ్యయనంతో సూచనలు చేశారు. 2020120035112 1987
ఒక యోగి ఆత్మకథ [8] పరమహంస యోగానంద ఆత్మకథ ఒక యోగి ఆత్మకథ ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. 2020010006604 1951
ఒక రోజు [9] కె.ఎల్.నరసింహారావు నాటిక హైదరాబాదు రెడ్డి హాస్టల్ సంగీత సమితి ఏర్పాటుచేసిన మాణిక్యరెడ్డి తదితరులు దానికి నిధి సమకూరాలని ఉద్దేశంతో ఈ నాటిక రాయించి, చేసిన ప్రదర్శన ద్వారా నిధి తయారుచేశారు. విద్యావంతురాలైన ఒక యువతి తన అభిరుచులకు అనుగుణంగా కళాసాధన, ప్రదర్శన చేస్తే సమాజంలో, పనిచేసే చోట, ఇంట్లో ఎలాంటి దుమారం రేగిందో దానిని ఆమె ఎలా ఎదుర్కొందో ఈ నాటిక కథాంశం. దీనిలో మధ్యమధ్య వచ్చే పాటలను అనంతరం ప్రసిద్ధ కవి, సినీగేయకర్తగా ఎదిగిన సి.నా.రె. రచించారు. 2020120001071 1951
ఒప్పందం [10] కనక్ ప్రవాసి కథల సంపుటి ఒప్పందం, కరుగ్గా ఉంటే, కలహం, మాతృవర్షీయసి వంటి కనక ప్రవాసి రాసిన కథల సంకలనం ఇది. 2020010006614 1960
ఒథెల్లో-వెనీసు నగరపు మూరు [11] ఆంగ్ల మూలం: షేక్స్పియర్, అనువాదం: గోగులపాటి వీరేశలింగం పంతులు నాటిక విలియం షేక్‌స్పియర్ (ఆంగ్లము : William Shakespeare) ( 26 ఏప్రిల్ 1564 న బాప్తిస్మం పొందినాడు - 23 ఏప్రిల్ 1616న మరణించాడు) [a], ఒక ఆంగ్ల కవి, నాటక రయయిత మరియు నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు.[1] ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 34 నాటకాలు, 154 చతుర్పాద కవితలు (సొన్నెట్ - పద్యాలు), రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు (narrative poems) మరియు ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి. ఒథెల్లో అనే ప్రఖ్యాతమైన నాటిక అనువాదం ఇది. 2020050016000 1927