వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఊ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఊపిరితిత్తుల ఊసు [1] వేదగిరి రాంబాబు వైద్యం వేదగిరి రాంబాబు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ రచయిత. ఈయన తలుగు సీరియల్ రచయిత మరియు వివిధ పుస్తకాల ప్రచురణ కర్త. 2020120000562 1993
ఊర్వశి(నాటకం) [2] జంపన చంద్రశేఖరరావు నాటకం జంపన చంద్రశేఖరరావు ప్రముఖ ప్రజా రచయిత, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు మరియు నిర్మాత. ఆయన వ్రాసిన నాటకం ఇది. 2030020024737 1948
ఊర్వశి(పుస్తకం) [3] మూలం:రవీంద్రనాథ్ ఠాగూర్, అనువాదం:బెజవాడ గోపాలరెడ్డి సాహిత్యం రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన సంధ్యాగీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు విర్గరేర్ స్వప్న భంగ, 'sangeetha prabhata అనే కావ్యాలను రచించాడు. ఆయన రాసిన ఊర్వశి అనే ఈ పుస్తకం చాలా ప్రసిద్ధమైనది. ఈ పద్య, గద్య సంపుటిని బెంగాలీ నుంచి బెజవాడ గోపాలరెడ్డి తెలుగులోనికి అనువదించారు. 2040100049751 1948
ఊర్వశీ ప్రణయ కలహం [4] వంగపండు అప్పలస్వామి పద్య కావ్యం వంగపండు అప్పలస్వామి ప్రజా గాయకుడు మరియు రచయిత. 1991లో ఊర్వశీ ప్రణయ కలహం అనే ఈ పద్యకావ్యాన్ని రచించారు. 2020120012757 1991
ఊర్జితారణ్యపర్వము తిక్కనదే [5] గోపీనాధ శ్రీనివాసమూర్తి విమర్శనాత్మక గ్రంథం భారతాన్ని నన్నయ్య, తిక్కనతో పాటుగా ఎఱ్ఱన వ్రాశాడన్నది తెలుగు సాహిత్యంలో సుస్థాపితమైన సంగతి. ఐతే రచయిత దానిని వ్యతిరేకిస్తూ అరణ్యపర్వశేషాన్ని కూడా తిక్కనే వ్రాశాడని ఈ గ్రంథంలో ఆధారాలు చూప ప్రయత్నించారు. రచయిత గోపీనాధ వేంకటకవి మనుమడు. 2020120029466 1998
ఊహాగానము [6] అబ్బూరి రామకృష్ణారావు పద్య కావ్యం అబ్బూరి రామకృష్ణారావు (1896-1979) ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. భావకవిగా పేరొందిన అబ్బూరి రాసిన పద్యకావ్యం ఇది. 2990100061911 1994