వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఇ
Jump to navigation
Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.
అంకెలు - అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ
డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్షడీఎల్ఐలోని తెలుగు పుస్తకాలు
[మార్చు]పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం ఇక్బాల్ కవిత [1] మూలం: ఇక్బాల్, అనువాదం: బెజవాడ గోపాలకృష్ణ కవితలు మహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ, పారశీక భాషల్లో ప్రముఖ కవి. ఆయనకు అల్లామా (మహాపండితుడు) అనే బిరుదుంది. సారే జహాసె అచ్ఛా గేయాన్ని రచించి దేశవ్యాప్తంగా చిరకీర్తి పొందినవాడు. ఆయన రాసిన కవితల అనువాదం ఈ గ్రంథం. 2020120029181 1978 ఇక్బాల్ ఫిర్యాదు, జవాబు [2] మూలం: ఇక్బాల్, అనువాదం: బెజవాడ గోపాలకృష్ణ సాహిత్యం మహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ, పారశీ భాషల్లో ప్రముఖ కవి, పండితుడు. మహాపండితుడు అన్న అర్థం కలిగిన అల్లామా అన్న బిరుదు కలవాడు. ఈ గ్రంథం ఆయన ఇంగ్లాండులో విద్యాభ్యాసం చేసివచ్చాకా వ్రాసినది. ఇక్బాల్ భగవంతుణ్ణి ముద్దాయిని చేసి ఇస్లాంను ప్రచారం చేసే మహాభక్తులు దౌర్భాగ్యంలోనూ, బ్రిటీషర్లు వంటివారు ఐశ్వర్యంలోనూ తులతూగడాన్ని, విగ్రహాలను ధ్వంసం చేసేవారు కష్టనిష్టూరాలు, విగ్రహాలు చెక్కేవారు సంపాదనలో ఉండడం వంటి వివాదాస్పదమైన అంశాలు స్వీకరించి వ్రాశారు. ఈ రచన అటు ముస్లిమేతరులను, ఇటు భగవంతుని నిందించినందుకు సంప్రదాయ ముస్లిములను కూడా వ్యతిరేక ప్రభావం కలిగించి సంచలనాలకు వేదికైంది. 99029990034610 1989 ఇతిహాసమంజరి [3] మేడపాటి సూర్రెడ్డి ఆధ్యాత్మికం పృథురాజు, జడభరతుడు, దక్షప్రజాపతి, బసవేశ్వరుడు, పార్వతి, గరుత్మంతుడు వంటి పురాణపురుషుల గురించి అప్పటి గద్వాల ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుుడు మేడపాటి సూర్రెడ్డి గ్రంథంలో 2020010005409 1957 ఇద్దరు వైద్యులు [4] మూలం: హాజెల్ లీన్, అనువాద్ం: బి.వి.సింగాచార్య నవల చైనా సంప్రదాయ వైద్యవిధానంలో పేరుపొందిన కుటుంబంలో జన్మించి, పాశ్చాత్య వైద్యాన్ని అభ్యసించి అందులో గొప్ప పరిశోధనలు చేసిన యువతి గాథ ఇతివృత్తంగా స్వీకరించి దాన్ని నవలగా మలిచారు రచయిత. మాగంటి బాపినీడు ఆధ్వర్యంలోని జాతీయ జ్ఞానమందిరం వారు దాన్ని తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించారు. 2020050015025 1958 ఇదా నాగరికత? [5] మూలం: రాంగేయ రాఘవ, అనువాదం: భైరాగి నవల రాంగేయ రాఘవ గొప్ప హిందీ నవలాకారుడు, రచయిత. ఆయన వ్రాసిన గ్రంథమిది. దీన్ని బైరాగి అనువదించారు. 2020010005345 1960 ఇది త్యాగం కాదు [6][dead link] ముద్దంశెట్టి హనుమంతరావు నవల ఇది ముద్దంశెట్టి హనుమంతరావు వ్రాయగా నవజ్యోతి పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించిన సాంఘిక నవల. 2990100073374 1969 ఇది మన భారతదేశం [7] నందనం కృపాకర్ సాహిత్యం భారత దేశాన్ని గురించి వివిధాంశాలు తెలుపుతూ అనేకమైన విజ్ఞానసర్వస్వ శైలి వ్యాసాలూ, శీర్షికలతో ఈ పుస్తకం తయారుచేశారు. 2020120034455 1992 ఇదీ గుండె గుట్టు [8] సంపాదకుడు. వేదగిరి రాంబాబు వైద్యం ఆరోగ్యంపై అందరికీ అవగాహన కలిగేందుకు ఈ గ్రంథాన్ని ప్రచురించినట్టు వ్రాశారు. వివిధ అవయవాల గురించి, వాటి జబ్బలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే చికిత్స వంటివి ఓ సీరీస్ గా తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేశారు రాంబాబు. ఆ క్రమంలోనే హృద్రోగాలు, గుండె ఆరోగ్యం వంటి అంశాలపై ఈ గ్రంథాన్ని వ్రాశారు. 2990120032505 1993 ఇదీ మన సంస్కృతి! ఇదీ మన సంప్రదాయం! [9] మోపిదేవి కృష్ణస్వామి సాహిత్యం రచయిత మానవ ధర్మ శిక్షణ సంస్థ వ్యవస్థాపకులు. ఆయన వివిధ సమయాల్లో, వివిధ వేదికలపై భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఇచ్చిన ప్రవచనాల సంకలనం ఇది అని ముందుమాటలో కందర్ప రామచంద్రరావు పేర్కొన్నారు. 6020010034607 1989 ఇదీ తంతు [10] పోతుకూచి సాంబశివరావు నాటిక పోతుకూచి సాంబశివరావు 65 సంవత్సరాల సాహితీ సాంస్కృతిక సేవా జీవితం పూర్తిచేసుకున్నారు. 1948 ప్రాంతంలో హైదరాబాదు వచ్చి రచనారంగంలోనూ, కార్యకర్తృత్వంలోనూ, విశేషమైన కృషి చేశారు. కథా రచయితగా దాదాపు 350 కథలు వ్రాశారు. పన్నెండు కథా సంపుటాలు వెలువడ్డాయి. కొన్ని కథలు యితర భారతీయ భాషల్లోకి - హిందీ, కన్నడ, తమిళ మరియు ఆంగ్ల భాషల్లోకి అనువాదం అయ్యాయి. రష్యన్ భాషలో కూడా ఆయన కథలు అనువాదమై ఆయన కథా శీర్షికే సంకలన మకుటంగా నిర్ణయించబడింది. యావదాంధ్రదేశంలోనూ, సాహిత్య అకాడమీ సదస్సుల్లోన్నూ, అఖిల భారత రచయితల సభల్లోన్నూ, కథా సదస్సుల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఆయన రాసిన నాటిక ఇది. 2020010005018 1956 ఇదీ తంతు, దొంగ [11] పోతుకూచి సాంబశివరావు నాటికల సంపుటి పోతుకూచి సాంబశివరావు 65 సంవత్సరాల సాహితీ సాంస్కృతిక సేవా జీవితం పూర్తిచేసుకున్నారు. 1948 ప్రాంతంలో హైదరాబాదు వచ్చి రచనారంగంలోనూ, కార్యకర్తృత్వంలోనూ, విశేషమైన కృషి చేశారు. కథా రచయితగా దాదాపు 350 కథలు వ్రాశారు. పన్నెండు కథా సంపుటాలు వెలువడ్డాయి. కొన్ని కథలు యితర భారతీయ భాషల్లోకి - హిందీ, కన్నడ, తమిళ మరియు ఆంగ్ల భాషల్లోకి అనువాదం అయ్యాయి. రష్యన్ భాషలో కూడా ఆయన కథలు అనువాదమై ఆయన కథా శీర్షికే సంకలన మకుటంగా నిర్ణయించబడింది. యావదాంధ్రదేశంలోనూ, సాహిత్య అకాడమీ సదస్సుల్లోన్నూ, అఖిల భారత రచయితల సభల్లోన్నూ, కథా సదస్సుల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఆయన రాసిన నాటికల సంపుటి ఇది. 2020010002560 1956 ఇదీ మన జీవితం [12][dead link] మూలం.దిలీప్ కౌర్ తివానా, అనువాదం.వేనరాజు భానుమూర్తి అనువాదం, నవల ఈ నవలను పంజాబీ భాషలో తివానా రచించిన ఏ హమారా జీవనా అనే నవల నుంచి అనువదించారు. రచయిత్రి దిలీప్ కౌర్ తివానా పంజాబీ సాహిత్యంలో ఆంగ్ల రచయిత్రి జేన్ ఆస్టిన్‌తో పోల్చబడ్డారు. ఉన్నత వర్గపు స్త్రీల మానసిక స్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఆమె రచనలు పాఠకులను ఆసక్తికరంగా చదివించడమే కాక గహనమని పలువురు పేర్కొనే స్త్రీహృదయాన్ని అర్థంచేసుకునే సమర్థతను కలిగించవచ్చు. 99999990128982 1995 ఇదీలోకం [13] కొండముది గోపాలరాయశర్మ నాటకం, సాంఘికనాటకం పద్యాలతో నిండిన నాటకాలు, పదిహేనంకాల నాటకాలు, పౌరాణిక ఇతివృత్తం కలిగినవి ప్రదర్సితమవుతున్న రోజుల్లో ప్రయోగాత్మకంగా కొద్ది అంకాలతో, పద్యాలు లేకుండా పూర్తివచనంలో సాంఘిక నాటకం రచించి ప్రచురించారు నాటకకర్త. ఆ క్రమంలో ఇది రెండవ నాటకం 2030020025224 1946 ఇదే ప్రపంచం [14] పెనుపోలు నాటిక భూస్వామ్య వాతావరణంలో రైతుల కష్టనష్టాలు, వాటిపై వారు స్పందించాల్సిన తీరు వంటి వాటిని ఈ నాటికలో చిత్రీకరించారు. రచయిత ఈ నాటిక ప్రదర్శనకు ఏ విధమైన అనుమతులూ, ఆంక్షలు పెట్టకపోవడం విశేషం. 2020010005019 1957 ఇదేనా విముక్తి [15] చదలవాడ పిచ్చయ్య నాటిక "విదేశీయ భావదాస్యం నుంచి అచ్చమైన జ్ఞానం వైపుకు భారతీయ సమాజం చేస్తున్న ప్రయాణంలో ఈ నాటికల సంపుటి ఓ వెలుగు దివ్వె" అని ప్రయాగ కొదందరామశాస్త్రి ఈ గ్రంథం ముందుమాటలో పేర్కొన్నారు. సమాజంలో చెలరేగిన పోకడలు, జనంపై ఎలా దుష్ప్రభావం చూపుతాయో ఈ నాటికల్లో తెలుస్తుందన్నారు. ఈ గ్రంథాన్ని "భారతీయ జాతీయ జీవన విధానమే అత్యుత్తమమైనదని విశ్వసించిన" కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు అంకితం చేశారు. 2020120029131 1956 ఇదేమిటి? [16] భమిడిపాటి రాధాకృష్ణ నాటిక భమిడిపాటి రాధాకృష్ణ (1929 - 2007) ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత, "హాస్య బ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు వీరి తండ్రి. భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ,హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. ఆయన రాసిన ప్రఖ్యాత నాటిక ఇదేమిటి. 2020010002571 1960 ఇచ్చినీకుమారి [17] కేతవరపు వెంకటశాస్త్రి చారిత్రిక నవల ఘార్జర దేశ చరిత్రమైన-రాస మాల నుంచి ఈ కథ స్వీకరించారు. ఈ కథ చారిత్రిక వ్యక్తులైన ఇచ్చిని, పృథ్వీరాజు, భీమరాజుల నడుమ తిరుగుతుంది. 2020120034454 1919 ఇంటితోటలు [18] తమ్మన్న మరియు నిర్మల (రచయిత్రి) వృక్షశాస్త్రం, ఉద్యానశాస్త్రం ఇంటి పెరడులోనో, ఏ కాస్త ఖాళీ స్థలంలోనో మొక్కలు పెంచుకోవడం వల్ల మానసికారోగ్యం అభివృద్ధి చెంది మనసు ఉల్లాసభరితమౌతుంది. పైగా కూరగాయలు, ఆకుకూరలు పెంచడం వల్ల వాటిని తాజాగా కోసికొని తినే అపురూపమైన అవకాశం లభిస్తుంది. అందుకే తితిదే ప్రచురణగా వెలువడ్డ ఈ పుస్తకంలో రచయితలు ఎలా ఇంటి వద్ద తోటలు పెంచుకోవచ్చో వివరించారు. 2990100071340 1984 ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు [19] టి.రవికుమార్ సాహిత్యం ఆంగ్లంలోని జాతీయాలు, పదాలు, వాటి వాడకం గురించి తెలుగులో రాసిన పుస్తకమిది. 2020120000376 2002 ఇంగ్లీష్ లో ఒకలాగే ఉండే వేర్వేరు అర్ధాలనిచ్చే పదాలు [20] టి.రవికుమార్ సాహిత్యం ఆంగ్లంలోని కొన్ని పదాలు ఒకలానే ఉన్నా వేర్వేరు సందర్భాలలో వాటి వాడకాన్ని బట్టీ అర్ధాలు మారుతూ ఉంటాయి. ఆ పదాల గురించీ, వాటి వాడకం గురించీ, వాటి వేర్వేరు అర్ధాల గురించీ తెలుగులో రాసిన పుస్తకమిది. 02020120000377 2002 ఇంగ్లీష్ గ్రామర్ [21] ముంగర కోటేశ్వరరావు సాహిత్యం ఆంగ్ల వ్యాకరణం గురించి తెలుగులో రాసిన పుస్తకమిది. 2020120000375 1997 ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ [22] ఎస్.కె.వెంకటాచార్యులు సాహిత్యం ఆంగ్లం-తెలుగు డిక్షనరీ ఇది. 2020120029286 1998 ఇంగ్లీష్-హిందీ డిక్షనరీ [23] ఎం.విశ్వనాధరాజు సాహిత్యం ఆంగ్లం-హిందీ డిక్షనరీని తెలుగులో రాసిన పుస్తకమిది. 2020120004095 1998 ఇంటా బయటా [24] మూలం: రవీంద్రనాధ్ ఠాకూర్, అనువాదం: శోభనాదేవి, వైకుంఠరావు సాహిత్యం రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో వ్రాసిన ఘరే బాయిరే నవలను ఈ రూపంలో తెనిగించారు. 2020050016320 1928 ఇంద్ర సహస్ర నామ స్తోత్రమ్ [25] కావ్యకంఠ గణపతిముని ఆధ్యాత్మికం అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (1878 - 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. ఆయన వేదాల్లో ప్రస్తుతించిన ఇంద్రునిపై వ్రాసిన ఇంద్ర్ సహస్రనామ స్తోత్రమిది. 2020120032491 1999 ఇంద్రధనస్సు(కథలు) [26] మూలం: హరీంద్రనాధ్ చటోపాధ్యాయ, అనువాదం: దాసు త్రివిక్రమరావు కథలు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ బెంగాళీ ఆంగ్ల కవి, హిందీ సినిమా నటుడు, సరోజినీ నాయుని సోదరుడు మరియు లోక్ సభ సభ్యుడు. రవీంద్రనాథ్ టాగూర్ ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.ఆయన గొప్ప కవి మాత్రమే కాదు. గాయకుడుగా, నటుడుగా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటకరచయితగా ఇలా ఒకటేమిటి సృజనాత్మక కలలన్నింటిలోనూ తనదైన ముద్రతో గొప్పవాడుగా వెలుగొందిన బహుముఖ ప్రతిభాశాలిగా స్వదేశంలోనే గాక విదేశాల్లో సైతం యశస్సు పొందాడు. ఇది ఆయన వ్రాసిన కథల సంకలనం 2020010005377 1958 ఇంధ్రధనస్సు [27][dead link] వాస్సిలేవస్కాంవాడ సాహిత్యం ఇది అనువాద నవల. మూలరచయిత పేరు వాస్సిలేవస్కాంవాడ. అనువాదకుని పేరు ప్రతిలో వివరంగా దొరకడంలేదు. 2030020024691 1954 ఇందిర [28][dead link] వివరాలు లేవు కథా సాహిత్యం ఇది రచయిత తొలి రచన. కథాసంపుటం. 2020050015321 1926 ఇంద్రాణి(కథల సంపుటి) [29] దాసరి సుబ్రహ్మణ్యం కథల సంపుటి దాసరి సుబ్రహ్మణ్యం (Dasari Subrahmanyam) చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో (కొడవటిగంటి కుటుంబరావు కంటే నాలుగు సంవత్సరాల ముందు) చందమామలో చేరి, 2006 దాకా (అంటే 55 సంవత్సరాల కాలం) అందులోనే కొనసాగాడు. తెలుగు బాలసాహిత్య విభాగంలో సుప్రసిద్ధులైన దాసరి సుబ్రహ్మణ్యం వ్రాసిన కథల సంపుటి ఇది. 2020120034614 1955 ఇంద్రాణి(నవల) [30] పాటిబండ మాధవశర్మ నవల పాటిబండ మాధవశర్మ వెంకటరామయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.ఎం.ఎ. ఆనర్స్ చదివాడు. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. ఆండ్ సి.వి.ఆర్. కళాశాలలోను హైదరాబాదులోని న్యూ సైన్స్ కాలేజీలోను ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. ఆయన వ్రాసిన నవల ఇది. 2020010005378 1958 ఇందిరా వసంతం [31] గుర్రం వెంకటేశయ్య నాటకం, అనువాద నాటకం షేక్స్ పియర్ వ్రాసిన మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకానికి ఇది ఆంధ్రానువాదం. 2020010005374 1957 ఇందుమతీ కల్యాణం [32][dead link] తెనాలి రామభద్రకవి పద్య కావ్యం తెనాలి రామభద్రకవి వ్రాసిన కావ్యం ఇది. ఈ ప్రతి వ్రాత ప్రతి కావడం విశేషం. 5010010088295 1920 ఇందుమతీ పరిణయం [33][dead link] తెనాలి రామభద్రకవి, పరిష్కర్త: దివాకర్ల వేంకటావధాని పద్య కావ్యం తెనాలి రామభద్ర కవి వ్రాసిన ఇందుమతీ పరిణయాన్ని, దివాకర్ల వేంకటవధాని పరిష్కరించగా ముద్రించిన ప్రతి ఇది. 2990100061577 2000 ఇందుశేఖర విలాసము [34][dead link] వాసా కృష్ణమూర్తి వచనం, అనుసృజన శ్రీనాథ కవిసార్వభౌముడు పద్యకావ్యంగా వ్రాసిన హరవిలాసం కావ్యాన్ని రచయిత చదివి చదివి తృప్తిచెందక ఈ రూపంలో వచన రచనగా మలచినట్టు స్వయంగా రచయితే చెప్పుకున్నారు. 2020050014331 1958 ఇండియా [35][dead link] ముడియం సీతారామారావు సాహిత్యం ప్రపంచ భూగోళము సీరీస్ లో భాగంగా భారతదేశ నైసర్గిక, భౌగోళిక స్థితిగతుల గురించి వ్రాసిన గ్రంథమిది. 2990100061576 1920 ఇండియా భవిష్యత్తు [36] కె.రాధాకృష్ణమూర్తి సాహిత్యం ప్రపంచయుద్ధం పూర్తవుతున్న సమయంలోని గ్రంథమిది. 1943 అక్టోబరులో రచయిత గుంటూరు జాకోలిన్ లాడ్జిలో జరిగిన రాజకీయ పాఠశాలలో ఇచ్చిన ఉపన్యాస పాఠమీ గ్రంథం. 2020120034611 1944 ఇండియా స్వాతంత్ర్య సమస్య [37] మూలం: డి.ఎన్.ప్రిట్, అనువాదం: శశి సాహిత్యం ఇండియా అవర్ అల్లీ?(ఇండియా మన మిత్రరాజ్యమా?) అన్న ఆంగ్లగ్రంథానికి ఇది అనువాదం. రెండవ ప్రపంచయుద్ధం చివరిదశకు వస్తూన్న 1942లో భారత స్వాతంత్ర్యం, పాకిస్తాన్ ఏర్పాటు వంటి విషయాలపై జరుగుతున్న తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దీన్ని వ్రాశారాయన. దాన్ని తన దేశీయులైన బ్రిటీష్ ప్రజలను ఉద్దేశించి వ్రాశారు. ఆంగ్లదేశంలోని కొందరు ప్రజలు భారత స్వాతంత్ర్యాన్ని గురించి చేస్తున్న ఆలోచనలు తెలిపేందుకు దీన్ని అనువదించామని ప్రకాశకులు పేర్కొన్నారు. 2020010005373 1945 ఇండియాలో విప్లవం [38] కె.రాధాకృష్ణమూర్తి సాహిత్యం 1943లో క్విట్ ఇండియా ఉద్యమం దేశాన్నీ, రెండవ ప్రపంచయుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో రచయిత వ్రాసిన గ్రంథమిది. అప్పటి కమ్యూనిస్టుల దృక్పథంలో జరుగుతుందని భావించిన విప్లవాన్ని గురించి ఈ గ్రంథాన్ని వ్రాశారు. 2020010005363 1943 ఇండోనేసియా [39] ఏడిద కామేశ్వరరావు సాహిత్యం ఇండోనేసియా ఆగ్నేసియాలో అతి ముఖ్యమైన దేశం ఇండోనేసియా. అనేక దీవుల సముదాయమైన ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా అతిఎక్కువ ద్వీపాల సమాహారమైన దేశము. ఇండోనేసియా గురించి వ్రాసిన గ్రంథం ఇది. 2020010005354 1948 ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటం [40] శేఖర్ చరిత్ర భారతదేశం రాజకీయంగా చైతన్యమై పలువురు రచయితలు ప్రపంచవ్యాప్తంగా వలసపాలనలో కష్టాలు పడుతున్న దేశాలు, వారు చేస్తున్న పోరాటాలు వంటివి వ్రాశారు. ఆ క్రమంలో వ్రాసిన గ్రంథమిది. 2020010005376 1946 ఇట్లు మీ విధేయుడు [41] భమిడపాటి రామగోపాలం కథా సంకలనం భరాగోగా సుప్రసిద్ధులైన భమిడిపాటి రామగోపాలం ఆరు కథా సంపుటాలు, మూడు నవలలు వెలువరించారు. తన ఆత్మకథను "ఆరామ గోపాలమ్" పేరుతో సచిత్రంగా ప్రచురించారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై 17 సావనీర్లు రూపొందించారు. మిత్రుడి జ్ఞాపకార్థం నెలకొల్పిన జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ తరపున అనేక పుస్తకాలు ప్రచురించారు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సంపాదించిపెట్టిన కథల సంపుటం ఇది. 2020120034473 1990 ఇప్పుడే [42] అంతటి నరసింహం కవితా సంపుటి అంతటి నరసింహం రాసిన వచన కవితల సంపుటి ఇది. ఇప్పుడే, మారినవేదం, బుద్ధిజీవి, దోపిడీ, రక్తంలో నుంచి రక్తాక్షి వంటి వచన కవితల సంకలనం "ఇప్పుడే". 2020120000379 1987 ఇయఱ్పా [43] పరిష్కర్త.ప్రతివాద భయంకర అణ్ణఙ్గరాచార్య సాహిత్యం ఇయఱ్పా అనే పేరుతో ఉన్న ఈ గ్రంథము తమిళభాషలో, తెలుగు లిపిలో ఉన్న వైష్ణవ సాహిత్యము. ప్రతివాద భయంకర అంగరాచార్యులు దీన్ని పరిష్కరించారు. 5010010017413 1959 ఇరువది నాలుగవ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ(సంచిక) [44] ప్రకాశకులు.ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము నివేదిక, సంచిక గ్రంథాలయోద్యమం తెలుగునాట గ్రంథాలయాలను అభివృద్ధి చేసి, విజ్ఞాన వ్యాప్తికీ తద్వారా ప్రజా ఉద్యమాల ఏర్పాటుకూ పనికి వచ్చింది. ఆ ఉద్యమాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం అప్పట్లో తెలుగు నాట ఉన్న గ్రంథాలయోద్యమకారులను అందరినీ కలిపేందుకు, ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకునేందుకు మహాసభలు నిర్వహించేవారు. ఆ క్రమంలో ఈ 24వ మహాసభ 1942లో జరిగింది. దానిని గురించిన సంచిక 1943లో ప్రచురించారు. 2020050002683 1943 ఇల్లరికం [45] మూలం: తెంద్ర్యికోవ్, అనువాదం: పరుచూరి నవల తెంద్ర్యికోవ్ రాసిన ఈ రష్యన్ నవలను 1958లో తెలుగులోకి పరుచూరి అనువదించారు. 2020010005045 1958 ఇల్లాలు ఉసురు [46] యర్రా వెంకటకృష్ణారావు కథా సాహిత్యం ఇల్లాలు ఉసురు అన్న ఈ నవలలో కథాంశం భార్యను కష్టాలుపెట్టి, తాను దాచుకున్న డబ్బంతా వేశ్య పాలుచేసి చివరకు వేశ్యచే వంచింపబడే వ్యక్తి జీవితం. 2020010005348 1955 ఇలినాయిస్ లో ఎబిలింకన్ [47] మూలం: రాబర్ట్ ఇ.షెర్ వుడ్, అనువాదం: అద్దేపల్లి వివేకానందాదేవి సాహిత్యం అబే లింకన్ ఇన్ ఇల్లినాయిస్ అనే నాటకం ప్రఖ్యాత అమెరికన్ నాటక కర్త రాబర్ట్ ఇ.షేర్ వుడ్ 1938లో రాశారు. ఈ నాటకంలోని మూడు అంకాలు అబ్రహాం లింకన్ ఇల్లినాయిస్ లోని చిన్నతనం నుంచి వాషింగ్టన్ లో ఆయన చివరి ప్రసంగం వరకూ సాగుతుంది. మేరీ టోడ్ తో ఆయన శృంగార అనుబంధం, స్టీఫెన్ ఎ. డగ్లస్ తో వాదనలు కూడా ఇందులో నాటకీకరించారు. లింకన్ స్వయంగా మాట్లాడిన కొన్ని కొటేషన్లు కూడా వాడారు. షేర్ వుడ్ ఈ నాటక రచనకు 1939లో పులిట్జర్ బహుమతి పొందారు. దీన్ని 1940లో సినిమాగా చిత్రీకరించారు. ఈ నాటకాన్ని తెలుగులోకి 1939లోనే అనువదించడం విశేషం. 2020120000373 1939 ఇల్లు-ఇల్లాలు [48] మునిమాణిక్యం నరసింహారావు కథా సాహిత్యం మునిమాణిక్యం నరసింహారావు ప్రముఖ తెలుగు హాస్యరచయిత. ఆయన కథానికా రచనలో పేరుపొందిన వ్యక్తి. ఆయన సృష్టించిన కాంతం పాత్ర తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచపోయింది. ఇది ఆయన వ్రాసిన కథల సంకలనం. 2020010005350 1960 ఇవాన్ ఇలిచ్ మృతి [49] మూలం: టాల్ స్టాయ్, అనువాదం: బెల్లంకొండ రామదాసు సాహిత్యం లియో టాల్ స్టాయ్ ప్రపంచప్రఖ్యాతుడైన రష్యన్ రచయిత. ఆయన వ్రాసిన నవలలు, కథలు ప్రపంచ సాహిత్యంలో ప్రముఖంగా నిలిచాయి. ఇవాన్ ఇలిచ్ మరణం అనే ఈ కథ కూడా సుప్రసిద్ధమైన పెద్ద కథ. దానికి బెల్లంకొండ రామదాసు చేసిన అనువాదమిది. 2020010005410 1957 ఇష్టలింగార్చన విధిః [50] సంగ్రహనకర్త: పెద్దమఠం రాచవీరదేవర ఆధ్యాత్మికం వీరశైవులందరికీ ఇష్టలింగార్చన ముఖ్యమైన విధి. ఆ ఇష్టలింగార్చన ఎలా చేయాలన్న విషయాన్ని సమంత్రకంగా ఇందులో వ్రాశారు. 2020120000530 1979 ఇష్టాగోష్టి ప్రసంగాలు [51] పిల్లలమఱ్రి వేంకటహనుమంతరావు సాహిత్యం పిల్లలమఱ్ఱి వెంకట హనుమంతరావు చేసిన ఇష్టాగోష్టి ప్రసంగాల సంకలనం ఈ గ్రంథం. దీనిలో ప్రతి మానవుడూ గాంధీ కావాలి, అక్టోబరు ఒకటి, ఆంధ్రులు క్రియాసాధకులు కావాలి మొదలైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. 2020010005031 1956 ఇస్లాం అపార్ధాల మబ్బుల్లో [52] మూలం: మహమ్మద్ కుత్బ్, అనువాదం: ఎస్.ఎం.మాలిక్ సాహిత్యం ఈజిప్ట్ కి చెందిన ఇస్లామీయ తత్త్వవేత్త మహమ్మద్ కుత్బ్. ఆయన ఇస్లామ్ తత్త్వాన్ని, ఆధునిక శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన అంశాలతో వ్రాసిన గ్రంథం ఇది. దీన్ని ఎస్.ఎం.మాలిక్ తెనిగించారు. 2020120034620 1992 ఇసుక గోడలు(పుస్తకం) [53][dead link] ఇతా చంద్రయ్య నవల ఐతా చంద్రయ్య వ్రాయగా జాతీయ సాహిత్య పరిషత్, సిద్ధిపేట వారు ప్రచురించిన నవల ఇది. కవితలు, అప్పటికి కథ, కవిత, నాటిక, ఏకపాత్ర వంటి గ్రంథాలను మొత్తం 47 ప్రచుంరించారు. ఇది ఆ సంస్థ ప్రచురించిన 48 గ్రంథమూ, తొలి నవలాను. 2990100066368 1995 ఇళాదేవీయము [54][dead link] మూలం: ముద్దు పళని, అనువాదం: బెంగుళూరు నాగరత్నమ్మ సాహిత్యం ముద్దుపళని రచించిన ఈ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రలో, స్త్రీవాద చరిత్రలో సుప్రసిద్ధి పొందిన గ్రంథ ప్రతి. 2020050005893 1960 ఇళ్ళూ-గుళ్ళూ [55][dead link] వేమరాజు భానుమూర్తి కథా సాహిత్యం ఆలయాలు, నివాస గృహాల గురించిన సృజనాత్మక రచన ఇది. 5010010019795 1957 మూలాలు
[మార్చు]