వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - హ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
హంస ధ్వని(రాగమాలిక) [1] ఎల్.మాలకొండయ్య సాహిత్యం మాలకొండయ్య రచించిన గేయాల సంకలనం ఇది. దీనిని ప్రసిద్ధ కవి, రచయిత బోయి భీమన్నకు అంకితం చేశారు. 2020120034566 1881
హంస ధ్వని (లలితగీతాలు) [2] దుర్గాప్రసాద్ గీతాలు శ్రీ కృష్ణుని నాయకునిగా చేసుకుని ఆయనను ఉద్దేశించి రచించిన ఈ గీతాలను ప్రచురిస్తూ ఈ గ్రంథాన్ని రచయిత గోపాలునికే అంకితం చేశారు. కవికి ప్రమాదం జరిగి ప్రాణ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రిపై ఉండి రచించిన పుస్తకమిది. దీనిని అనంతర కాలంలో ఆయనకు నయమయ్యాకా ప్రచురించారు. 2020120004153 2000
హంస వింశతి [3] రచయిత: అయ్యలరాజు నారాయణామాత్యుడు, పరిష్కర్త: సి.వి.సుబ్బన్న శతావధాని సాహిత్యం అయ్యలరాజు నారాయణామాత్యుడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట వాస్తవ్యుడు. ఆయన సంపన్న నియోగి బ్రాహ్మణ కుటుంబీకుడని పరిశోధనకారుల అభిప్రాయం. ఆయన రచించిన ఈ హంస వింశతి గ్రంథం లోకోక్తులతో నిండిన అపురూపమైన రచనగా పేరుపొందింది. 2020120034563 1977
హంస వింశతి-విజ్ఞానసర్వస్వం(మొదటి సంపుటం) [4] జి.వెంకటరత్నం సాహిత్యం అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి అనే అపురూపమైన పద్యకావ్యానికున్న విజ్ఞానసర్వస్వ లక్షణాలను నిరూపించేందుకు జి.వెంకటరత్నం పరిశోధన చేశారు. ఆ పరిశోధనకు సంబంధించిన సిద్ధాంత గ్రంథం ఇది. 2020120029162 1989
హంసతారావళి & లలితాశతకము [5] ఎన్.విశ్వనాధశాస్త్రి సాహిత్యం హంసతారావళి, లలితా శతకమను రెండు పద్యరచనల సంకలనం ఇది. కవి స్నేహలతా కవితా సంఘానికి రాసిన లేఖలో రెండు పద్యాలలో లలితాదేవిని పిలుస్తున్నట్టుగా సంబోధన మకుటంగా రెండు మూడు పద్యాలు ఉండగా ఆ సంఘం వారు కోరి మరీ దీనిని వంద పద్యాలలో అదే మకుటంతో రాయించుకున్నారు. 2030020025199 1934
హంతక చూడామణి [6] జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి డిటెక్టివ్ నవల దశమారి, శతమారి, సహస్ర మారి అనే మారీత్రయము అపరాధపరిశోధకులను అల్లల్లాడించిన విధము ఇందులో ఉండడంతో ఇది పాఠకులకు అత్యంతాసక్తికరమైన నవలగా ఉందని ముందుమాటలో ప్రకాశకులు పేర్కొన్నారు. ఇది అనేకానేకమైన అపరాధ పరిశోధక నవలల్లో ఒకటి. 2020010005270 1953
హత్య కాని హత్య నిరుద్యోగి హత్య [7] చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి నవలిక ఒకనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అనేకమైన బాధలు పడిన నిరుద్యోగి జీవితాన్ని కథాంశంగా స్వీకరించి రచించిన నవలిక ఇది. మొదటి నుంచి తుదవరకూ మహా దు:ఖభాజనంగా సాగి విషాదోన్ముఖమైన గ్రంథంగా నిలిచింది ఇది అని ముందుమాటలో అక్కిరాజు ఉమాపతిరావు పేర్కొన్నారు. 2020120029453 1983
హత్యాపేటిక [8] జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి డిటెక్టివ్ నవల ఇది అపరాధ పరిశోధక నవల. దీనిలో మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి. 2020010005298 1954
హఠయోగ ప్రదీపిక [9] అనువాదం. ఓ.వై.దొరసామయ్య సాహిత్యం మూలగ్రంథాన్ని స్వాత్మారామయోగీంద్రులు రచించగా దీనికి బ్రహ్మానందయోగీంద్రులు వ్యాఖ్యానం రచించారు. స్వాత్మారామయోగీంద్రులు గోరఖ్ నాథునుకి స్వయంగా శిష్యుడు. ఈ గ్రంథం హఠయోగానికి సంబంధించి ఇంకా నిలిచివున్న అత్యంత ప్రభావశీలమైన రచన, మరియు హఠయోగానికి సంబంధించిన ప్రామాణికమైన మూడు రచనల్లో ఒకటి.మద్రాసులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలోని ఈ గ్రంథం దొరకగా దానిని దొరస్వామయ్య అనువదించారు. 2040100047114 1924
హనుమచ్చతకము [10] దిట్టకవి వేంకట నరసింహాచార్యులు శతకం హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. హనుమంతుని జననం, బాల్యక్రీడలు, విద్యాభ్యాసం, సుగ్రీవుని సేవకత్వం, రామలక్ష్మణులతో సమాగమం మొదలైన కథను ఈ శతకంలో జొప్పించి రచించారు. సాధారణంగా శతకపద్యాలు వేటికి అవే అన్నట్టు ఉంటాయి తప్ప ఒక నిర్దిష్టమైన ఇతివృత్తం మొత్తంగా ఉండదు. ఐతే ఇది ఆ సాధారణ నియతిని ఉల్లంఘించి విశిష్టరచనగా నిలుస్తోంది. 2020050015295 1924
హనుమచ్చరిత్రము [11] మూలం: ప్రభుదత్త బ్రహ్మచారి, అనువాదం: కె.శివసత్యనారాయణ ఆధ్యాత్మికం ప్రభుదత్త బ్రహ్మచారి రచించిన ఈ హనుమచ్చరిత్రను ఆయన ఆదేశాన్ని అనుసరించి శివసత్యనారాయణ తెలుగులోకి అనువదించి ఇలా ప్రచురించారు. ప్రభుదత్త బ్రహ్మచారి ఆయనను ప్రయాగలో 1977లో జరిగిన మహాకుంభమేళాలో ఈ ఆదేశాన్ని ఇచ్చారు. ఇది హనుమంతుని జీవిత వివరాల గురించిన రచన. 2020120034567 1990
హనుమద్విజయము [12] జనమంచి శేషాద్రిశర్మ కావ్యం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', 'కళాప్రపూర్ణ','మహాకవి','సంస్కృతసూరి' మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు. ఆయన హనుమంతుని గురించి రచించిన కావ్యమిది. 2020120000479 1927
హనుమద్విలాసము [13] శిష్ట్లా చంద్రమౌళిశాస్త్రి సాహిత్యం హనుమంతుని గురించిన ఈ గ్రంథాన్ని హనుమత్ ఉపాసకుడు, మంత్రశాస్త్ర ప్రవీణుడూ అయిన శిష్ట్లా చంద్రమౌళిశాస్త్రి రచించారు. 2020120000480 1949
హనుమద్రామ సంగ్రామము [14] డి.లక్ష్మీనరసింహం నాటకం రామాంజనేయ యుద్ధం ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శించబడే ఒక పౌరాణిక నాటకం. ఈ నాటకంలో పరమ రామ భక్తుడైన హనుమంతుడు యయాతి ని రక్షించడం కోసం రామునితో యుద్ధానికి సన్నద్దం కావల్సి వస్తుంది. ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. ఈ కథాంశంతో రచించిన నాటకమిది. 2020050015188 1931
హనుమద్రామ సంగ్రామము(శ్రీరామాంజనేయ యుద్ధము) [15] ద్రోణంరాజు సీతారామారావు నాటకం రామాంజనేయ యుద్ధం ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శించబడే ఒక పౌరాణిక నాటకం. ఈ నాటకంలో పరమ రామ భక్తుడైన హనుమంతుడు యయాతి ని రక్షించడం కోసం రామునితో యుద్ధానికి సన్నద్దం కావల్సి వస్తుంది. ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. ఈ కథాంశంతో రచించిన నాటకమిది. 2020120034568 1922
హనుమద్రామ సంగ్రామము [16] ఎన్.పార్ధసారధశర్మ నాటకం రామాంజనేయ యుద్ధం ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శించబడే ఒక పౌరాణిక నాటకం. ఈ నాటకంలో పరమ రామ భక్తుడైన హనుమంతుడు యయాతి ని రక్షించడం కోసం రామునితో యుద్ధానికి సన్నద్దం కావల్సి వస్తుంది. ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. ఈ కథాంశంతో రచించిన నాటకమిది. 2020050015164 1940
హనుమత్ప్రభ [17] పురాణపండ రాధాకృష్ణమూర్తి పూజా స్తోత్రాలు హనుమత్ ఉపాసనకు ఉపకరించే అనేకమైన స్తోత్రాలతో తయారైన సంకలనం ఇది. 2990100071330 1997
హనుమత్ప్రబంధము-2 [18] కొండేపాటి సుబ్బారావు వచన కావ్యం హనుమంతుని జీవితాన్ని కథాంశంగా స్వీకరించి జననం నుంచి సముద్ర తరణం వరకూ మొదటి భాగం, సముద్ర లంఘనం నుంచి రెండవభాగంగా రచించిన రచన యిది. 2020120000484 1998
హనుమత్ప్రబంధము-3 [19] కొండేపాటి సుబ్బారావు వచన కావ్యం హనుమంతుని జీవితాన్ని కథాంశంగా స్వీకరించి జననం నుంచి సముద్ర తరణం వరకూ మొదటి భాగం, సముద్ర లంఘనం నుంచి రెండవభాగంగా రచించిన రచన యిది. 2020120000483 2001
హనుమత్సందేశం [20] రాయప్రోలు రధాంగపాణి ఆధ్యాత్మికం 2040100028499 2002
హనుమత్ కథ [21] అన్నదానం చిదంబరశాస్త్రి ఆధ్యాత్మికం 2020120028883 1992
హనుమచ్ఛాస్త్రి కథలు[22] ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కథాసంకలనం ప్రచురణకు ఏడెనిమిదేళ్ళక్రితం వరకు వ్రాసిన ఆంధ్రపత్రిక, భారతి, ఉగాది సంచికలలో ప్రచురింపబడినకథల సంకలనం. ఇందులో సమాజపు కుళ్ళును కదిపి ప్రజలదృష్టికి తెచ్చే ఉద్దేశంతో ప్రచురింపబడినవి.ఇందులో వివాహమంగళం,అందని ఆశలు,6నెంబరుగది,యతిప్రాసమహాసభ మొదలైన కథలున్నాయి 2020050016547 1945
హరదత్త విజయము [23] ముదిగొండ నాగవీరయ్యశాస్త్రి పద్యకావ్యం శివ పురాణం మొదలుకొని ఎంతో శైవ సాహిత్యాన్ని తెలుగులో పద్యకావ్యంగా అనువదించారు. హరదత్త విజయం కూడా అటువంటి శైవ సంబంధ పద్యకావ్యమే. ఈ గ్రంథాన్ని కవి శ్రీశైల మల్లికార్జున స్వామికి అంకితమిచ్చారు. 2030020025517 1953
హర విలాసము [24] శ్రీనాథుడు కావ్యం, పద్యకావ్యం ఈ గ్రంథము పేరు హర విలాసము. వ్రాసిన కవి శ్రీనాథుడు. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైనశివుడుచేసిన పలు లీలల సంకలనం.శిరియాళుడు,చిరుతొండనంబిమొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం. 2030020024980 1916
హర లాలు [25] ములుగు వెంకటరమణయ్య సాహిత్యం నిష్కళంకుడు, సత్యస్వరూపుడు, తల్లిదండ్రులను ఎంతగానో గౌరవిన్చేవ్యక్తి అయిన హరలాల్ జీవితాన్ని ఈ నవలలో చిత్రీకరించారు. 2020050014333 1924
హర స్తుతి [26] గరికపాటి లక్ష్మీకాంతయ్య సాహిత్యం శివుని గురించిన స్తోత్ర శ్లోకాలతో తయారైన రచన. 2020010001785 1950
హర విలాస కావ్య విమర్శనము [27] ఎం.కె.జయభారతి విమర్శనాత్మక గ్రంథము ఈ గ్రంథము పేరు హర విలాసము. వ్రాసిన కవి శ్రీనాథుడు. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైనశివుడుచేసిన పలు లీలల సంకలనం.శిరియాళుడు,చిరుతొండనంబిమొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం. ఆ గ్రంథం యొక్క విమర్శ రచన ఇది. ఈ సిద్ధాంత గ్రంథానికి గాను రచయిత్రికి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్.డి. పొందారు. 2040100028501 1991
హరికథేతిహాసమంజరి [28] బాలాజీదాసు సాహిత్యం సువ్వి పాటలు, జావళీలు వంటి పాటలతో సంకలనం చేసిన అపురూపమైన గ్రంథమిది. 2020120004160 1922
హరికథా ప్రక్రియ-సామాజిక ప్రయోజనములు [29] డి.శారద సాహిత్య పరిశోధన ఆంధ్ర దేశంలో ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధ్రుల చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. సంగీత సాహిత్య నృత్యాల మేలుకలయిక వంటిది హరికథ. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది.దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వారు ఆదిభట్ల నారాయణదాసు. ఈ రచన హరికథ గురించి హరికథకుల వంశంలోని వ్యక్తి, స్వయంగా హరికథా భాగవతారిణి ఐన శారద చేసిన పరిశోధన గ్రంథం. 2020120034577 1995
హరి దాసి [30] పి.దుర్గారావు సాహిత్యం తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి తమిళంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఈ రచన తిరుప్పావైకు స్వేచ్ఛానువాదం. 2020120029164 1984
హరి శతకము [31] తూము సీతారామయ్య శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "శ్రీహరీ!" అనే మకుటంతో ఈ పద్యాలను తూము సీతారామయ్య రచించారు. మకుటం చిన్నది కావడం వలన ఏర్పడిన అవకాశాన్ని వినియోగించుకుని రచయిత ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం అనే నాలుగు ఛందోరూపాల్లోనూ రచించారు. 2020050014799 1924
హరి చరణుడు [32] కృత్తివాస తీర్థులు నవల హరిచరణుడు అనే పాత్రను ప్రధానపాత్రగా స్వీకరించి రచించిన సాంఘిక నవల ఇది. 2020010005275 1952
హరిలక్ష్మి [33] మూలం: శరత్, అనువాదం: గద్దె లింగయ్య కథాసాహిత్యం శరత్ చంద్ర చటోపాధ్యాయ్ (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (సెప్టెంబర్ 15,1876 - జనవరి 16, 1938)ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత. శరత్ చంద్రుడు బెంగాలీ రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు. ఇది ఆయన రచించిన కథల అనువాదం. 2020010005280 1955
హరహరి మహిమ్న స్తోత్రము [34] మూలం: పుష్పదంతుడు, అనువాదం: చర్ల గణపతిశాస్త్రి సాహిత్యం సంస్కృత సాహిత్యంలో శివమహిమ్నస్తోత్రం ప్రఖ్యాతమైన స్తుతి. గాంధర్వ రాజైన పుష్పదంతుడు తనకు అనుకోకుండా ఏర్పడిన శాపాన్ని నివారించుకునేందుకు శివమహిమ్నాస్తుతి చేశాడు. ఈ స్తుతిలోని వివిధ కవితాత్మక ప్రతీకలు సుప్రఖ్యాతము. ఈ స్తుతికి మధుసూదన సరస్వతి హరిహరులు ఇద్దరి పరంగానూ వ్యాఖ్యానం రాశారు. దాన్ని అనుసరించి ఈ అనువాదాన్ని చర్ల గణపతిశాస్త్రి రాశారు. 6020010004158 1995
హరిహర గురుభజన కీర్తనలు [35] రామలింగం సాహిత్యం భజన కీర్తనల సంకలనం ఇది. భక్తుల సౌకర్యార్థం ప్రచురించిన రచన. 2020120032478 1905
హరిజన నాటకము [36] ఉన్నవ లక్ష్మీనారాయణ నాటకం ఉన్నవ లక్ష్మీనారాయణ (Unnava Lakshmi Narayana) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ నాటకం మహాత్మా గాంధీ మార్గదర్శనంలో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ హరిజనాభ్యుదయం, హరిజన దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాల నేపథ్యంలో రాసిన నాటకం ఇది. 2020120007219 1933
హరిజన నాయకుడు [37] రంగనాయకులు నవల ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. రైతు గ్రంథమండలి వారు 1932 నాటి గాంధేయ ఉద్యమాన్ని గురించి రంగా రాసిన గ్రంథాన్ని ఇలా ప్రచురించారు. 2020120032479 1933
హరిజనాభ్యుదయం [38] పి.బాలకృష్ణ వ్యాసాలు 2020010005277 1947
హరిజన శంఖారావం [39] శంకరదేవ్ సాహిత్యం 2020010005279 1948
హరిపూజ-ప్రభాతగీతాలు(తిరుప్పావై పాటలకు స్వేచ్చానువాదం) [40] దుర్గాప్రాసద్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120029165 2000
హరివంశము [41] రచయిత: ఎర్రాప్రగడ, పరిష్కర్త: వేలూరి శివరామశాస్త్రి ఇతిహాసం, ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061573 1901
హరివంశము(భారతశేషగ్రంథము) [42] రచయిత: ఎర్రాప్రగడ, పరిష్కర్త: వేలూరి శివరామశాస్త్రి ఇతిహాసం, ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005282 1945
హరివినోదము [43] కవికొండల వెంకటరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005285 1949
హయగ్రీవ సహస్ర నామావళిః [44] బెల్లంకొండ రామరాయ ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005299 1953
హయలక్షణ సారము [45] పరవస్తు శ్రీనివాసాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100071333 1893
హరినారాయణ్ ఆప్టే [46] మూలం.ఎం.ఎ.కరందికర్, అనువాదం.ఎం.నాగభూషణశర్మ జీవిత చరిత్ర హరినారాయణ్ ఆప్టే సుప్రసిద్ధుడైన మరాఠీ రచయిత. ఆయన మరాఠీ సాహిత్యంలో చిన్నకథలు, నవలలకు కొత్త బాట నిర్మించిన వ్యక్తి. సమకాలీన సమాజాన్ని సాహిత్యంలో ప్రతిబింబించేలా రాయడం ద్వారా ఆయన వస్తువు రూపేణా కూడా సాహిత్యంలో భవిష్యత్ రచయితలకు మార్గదర్శకునిగా నిలిచారు. గులబకావళి, మంజుఘోష, ముక్తమాల వంటి ఆయన నవలలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఆయన జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. 99999990175544 1973
హరిశ్చంద్రోపాఖ్యానం [47] శంకర కవి పద్యకావ్యం హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు. ఈ కావ్యం హరిశ్చంద్రుని జీవితాన్ని అభివర్ణించింది. 2020120000488 1910
హరిశ్చంద్ర ద్విపద [48] గౌరన మంత్రి ద్విపద కావ్యం, పద్యకావ్యం తెలుగు సాహిత్యంలోని పద్యఛందస్సుల్లో ద్విపద అత్యంత ప్రత్యేకమైనది. వృత్తాలని పిలిచే చంపకమాల, ఉత్పలమాల వంటివి సంస్కృత ఛందస్సుల నుంచి రాగా ఆటవెలది, తేటగీతి, ద్విపద వంటివి తెలుగునాటనే పుట్టాయి. వాటిలోనూ ద్విపద అచ్చంగా జానపదుల సాహిత్యం నుంచి ఏర్పడ్డ చందస్సు అని చెప్పుకోవాలి. సామెతలు, జాతీయాలలో ఉండే లయకు, తూగుకూ దగ్గరలో ఉండే ఈ ఛందస్సులో పూర్తిగా కావ్యాలు రచించిన సందర్భాలు ఉన్నాయి. ఆ ద్విపద కావ్యాలు ప్రాచుర్యం పొందాయి. హరిశ్చంద్రుని జీవితాన్ని రచయిత పూర్తిగా ద్విపద చందస్సులో రచించారు. 2030020025611 1912
హరిశ్చంద్రలోపాఖ్యానము [49] రామరాజభూషణము కావ్యం 2020120032476 1930
హరిశ్చంద్ర చరిత్రము [50] నిడమర్తి జలదుర్గాప్రసాదరాయ వచన కావ్యం 2020120034575 1919
హ్రస్వరంగములు [51] కొత్తపల్లి సూర్యారావు నాటకం 2020010002612 1925
హస్తరేఖా శాస్త్రము [52] వి.ఆర్.కె.లక్ష్మీమోహన్ జ్యోతిష్య శాస్త్రం 2990100051660 2002
హస్తాభినయము [53] పి.ఎస్.ఆర్.అప్పారావు సాహిత్యం 2020120000495 1995
హస్కు [54] కె.అక్ష్మీరఘురామ్ వ్యాస సంపుటి 2020050015035 1951
హర్ష చరిత్రము [55] మూలం.బాణభట్టుడు, అనుసృజన.తిరుపతి వేంకట కవులు కావ్యం బాణోచ్ఛిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు. ఆయన రాసిన హర్ష చరిత్రాన్ని సంస్కృతం నుంచి తెనుగు పద్యాలలోకి అనుసృజించిన వారైన ఈ గ్రంథ కర్తద్వయం- తిరుపతి వేంకట కవులు. అవధానులుగా, నాటకకర్తలుగా, కావ్యకర్తలుగా వారు తెలుగునాట తిరుగులేని ప్రజాదరణ పొందినవారు. ఈ గ్రంథం పద్యాలలో తెలుగులోకి అనువాదమైన హర్ష చరిత్ర కావ్యం. 2030020024401 1920
హర్షుడు [56][dead link] మూలం.బి.డి.గంగల్, అనువాదం.ఆర్.రాఘవరావు జీవిత చరిత్ర హర్ష చక్రవర్తి ప్రాచీన భారత చక్రవర్తుల్లో ఒకానొక గొప్ప చక్రవర్తి. ఆయన అటు దండయాత్రల్లో, ఇటు పరిపాలనలోనే కాక సారస్వత రంగంలో కూడా గొప్ప పేరు తెచ్చుకున్నవాడు. ఆయన ఆస్థానంలోని గొప్ప కవి బాణుడు హర్షుని జీవితాన్ని వివరిస్తూ గ్రంథం కూడా రచించాడు. 99999990128976 1971
హారావళి [57] పురుషోత్తమ దేవుడు ఆధ్యాత్మికం 2990100071328 1928
హాలికుడు [58] చలమచర్ల రంగాచార్యులు నాటకం సత్కవుల్ హాలికులైననేమి, కందమూల గౌద్ధాలికులైననేమీ అంటూ సగర్వంగా హాలిక వృత్తిని అవలంబించిన కవి-పోతన. ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవతం ఎంత ప్రఖ్యాతమో, తన కృతిని భగవంతునికి తప్ప మనుజేశ్వరాధములకు ఇవ్వనని పట్టిన పట్టూ అంతే ప్రసిద్ధము. పోతన జీవితన్ని అల్లుకుని పాఠకుల్లో ఎన్నెన్నో కథలు ఉన్నాయి. వాటికి మూలసూత్రం పోతన, శ్రీనాథుడు బావ బావమరుదులు కావడం. ఇవన్నీ సాహిత్యలోకంలో పోతన, శ్రీనాథుల సాహిత్యాన్ని ఎలా చూస్తారన్న దానికి గీటురాయి. ఈ నాటక ఇతివృత్తం అటువంటి కథలతోనే అల్లుకుంది. 2030020024999 1946
హాలికులు కుశలమా! [59] మధురాంతకం రాజారాం సాహిత్యం 2020120032470 1994
హాస వ్యాస మంజరి [60] నల్లాన్ చక్రవర్తి శేషాచార్యులు వ్యాస సంపుటి 6020010034559 1993
హాస్య ప్రసంగాలు [61] మునిమాణిక్యం నరసింహారావు వ్యాస సంపుటి 2020010005293 1956
హాస్య కథలు [62] చింతా దీక్షీతులు కథా సాహిత్యం 2020050014994 1946
హాస్య వల్లరి [63] రెంటాల వెంకట సుబ్బారావు కథా సాహిత్యం 2020120004162 1910
హాస్య సంజీవని(తృతీయ భాగము) [64] కందుకూరి వీరేశలింగం సాహిత్యం ఈ పుస్తకంలో కన్యాశుల్కం లోని కామావధానులూ, రామశాస్త్రి, నాగరాజు పాత్రల మధ్య రెండు అంకాల హాస్య సన్నివేశాలు, వినాయక చతుర్థి, అతిబాల్యవివాహము, మ్యునిసిపల్ నాటకము, కామరూపమంత్రము, పూర్వాచారము, లక్కగేదె నాటకాలున్నాయి. 2020010005294 1949
హాహా హూహూ [65] విశ్వనాధ సత్యనారాయణ నవల 5010010031948 1923
హితోక్తి రత్నాకరము [66] వేదుల సత్యనారాయణ శాస్త్రి కథలు, బాలసాహిత్యం, అనువాదం సంస్కృత సాహిత్యం ప్రపంచానికి అందించిన అపురూపమైన సారస్వత నిధుల్లో పంచతంత్రం ఒకటి. మనిషి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని జంతువుల నడుమ జరిగినట్లుగా వివిధ కథల ద్వారా చెప్తూ వివేకాన్ని, వినోదాన్ని ఏకకాలంలో అందించే కథల మాలిక అది. దాన్ని విష్ణుశర్మ రచించారు. ఆ పుస్తకం విస్తారం కావడంతో ముఖ్యమైన కథలను స్వీకరించి నారాయణ పండితుడు అనే కవి తన స్వంత కల్పితాలైన మరికొన్ని కథలు చేర్చి హితోపదేశం అనే గ్రంథరచన సంస్కృతంలో చేశారు. దానిని ఈ గ్రంథ రూపంలో రచయిత తెనిగించారు. 2030020024803 1931
హిందీ కథానికల అనువాదం [67] అనువాదం.విశ్వప్రసాద్ కథా సాహిత్యం, అనువదం హిందీ సాహిత్యంలో సాలప్రాంశువులైన ప్రేంచంద్ మున్నగువారి 7 కథలను ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి చొప్పున అనువదించి ఈ గ్రంథంగా ప్రకటించారు విశ్వప్రసాద్ 2030020024639 1955
హిందూదేశ రాజ్యాంగ పద్ధతి [68] కే.సీతారామయ్య సాంఘిక శాస్త్రం, పాఠ్యగ్రంథం 1914 నాటి తెలుగు భాషలోనున్న సివిక్స్ పాఠ్యగ్రంథం ఇది. దీనిలో భారతదేశాన్ని అప్పటి పాలకులైన బ్రిటీష్ వారు ఏ పద్ధతిలో పరిపాలిస్తున్నారు, ఏ విధానాలు, పదవులు ఉన్నాయి వంటి వివరాలు రాశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటైన పోస్టాఫీసులు, తంతితపాలా, పోలీసు వ్యవస్థ, సైన్యం వగైరా విభాగాల వివరాలు రాశారు. దీనిని మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో అప్పట్లో ఉపన్యాసకునిగా పనిచేసిన సీతారామయ్య రాశారు. భారతీయ విద్యార్థుల్లో తమ సివిల్ వ్యవస్థల పట్ల, బ్రిటీష్ అడ్మినిస్ట్రేషన్ గురించిన అవగాహనతో పాటు గౌరవం, విశ్వాసం, రాజభక్తి ఏర్పడతాయని ఆశించారు. 5010010027233 1914
హిందూదేశ చరిత్ర [69] మామిడిపూడి వెంకట రంగయ్య చరిత్ర 2020010011402 1955
హిందూ ధర్మము [70] మూలం: మహాత్మా గాంధీ, అనువాదం: వెలిదండ శ్రీనివాసరావు సాహిత్యం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. హిందూ ధర్మాన్ని గురించి ఆయన రచించిన రచన ఇది. 2020120000505 1951
హిందూ మహాయుగము [71] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చరిత్ర ప్రముఖ చరిత్ర పరిశోధకులు, తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాత, వైతాళికుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు రచించిన హిందూ దేశ కథాసంగ్రహం అనే చరిత్ర గ్రంథంలో ఇది మొదటి భాగం. కొమర్రాజు వారు దేశాన్ని హిందువులు పరిపాలించిన యుగం, ముస్లిం పాలనా యుగం, ఆంగ్లేయ పరిపాలన యుగంగా విభజించుకు ఆ క్రమంలో చరిత్ర రచన చేశారు. చరిత్రలోని ప్రాచీన యుగం నుంచి ముస్లిం దండయాత్రికులు భారతదేశంపై వరుసదాడులు చేసి హిందువుల నుంచి పరిపాలన పొందేంతవరకూ ఈ గ్రంథం విస్తరించింది. 2990100068541 1910
హృదయ కుసుమాలు [72] హరికిషన్ నవల 2990100071335 1965
హృదయ ఘోష [73] అవదూత నిర్మలానందస్వామి కావ్యం 2020120034602 1988
హృదయ నేత్రం [74] వాసా ప్రభావతి కవిత కావ్యం 2020120004179 2001
హృదయ పద్యం [75] జె.బాపురెడ్డి సాహిత్యం 2020120032489 2003
హృదయ శిల్పం [76] అమరవాది ప్రభాకరాచారి కావ్యం 2020120034603 2002
హృదయాభిరామము [77] శిష్టా వెంకట సుబ్బయ్య కావ్యం 2020120034604 1940
హృదయేశ్వరి [78] తల్లావఝుల శివశంకరస్వామి పద్యకావ్యం, ఖండకావ్యం ఇది భావకవిత్వయుగంలో వచ్చిన భావకవితా సంకలనం. కవి దీన్ని ఖండకావ్యంగా మలిచారు. 2030020024905 1950
హెనోయ్ విశేషాలు కంబోడియా కబుర్లు [79] క్రొవ్విడి లక్ష్మన్న యాత్రా సాహిత్యం క్రొవ్విడి లక్ష్మన్న బహుభాషా కోవిదులు మరియు రచయిత. ఇది ఆయన కంబోడియా దేశానికి వెళ్లినపుడు రచించిన రచన ఇది. 2020010005303 1950
హెలెన్ కిల్లర్ [80] మూలం: వాన్ బ్రూక్స్, అనువాదం: ఎన్.ఆర్.చందూర్ జీవితచరిత్ర 2020010005301 1959
హెల్త్ అండ్ బ్యూటీ [81] డా.కె.వి.ఎన్.డి.ప్రసాద్ వైద్య శాస్త్రం దేహ సంరక్షనకు అనేక మార్గాలను, కేశ సంరక్షణకు, దేహ సంరక్షణకు శాస్త్రీయ తైలములు, అనేక ఆరోగ్య చిట్కాలను వివరించడం జరిగింది. 2020120000497 వివరాలు లేవు
హెర్ హైనెస్ [82] మూలం: ఋషభచరణ జైన్, అనువాదం: గద్దె లింగయ్య నవల 2020010005304 1956
హేమలత [83] చిలకమర్తి లక్ష్మీనరసింహం నాటకం చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇది ఆయన రచించిన నాటకం. 2990100068540 1986
హేమలత [84] చెన్నాప్రగడ భానుమూర్తి చారిత్రాత్మక నాటకం 2020120032483 1912
హేమాబ్జనాయికాస్వయంవరము [85] మూలం: మన్నారుదేవ, పరిష్కర్త: విఠలదేవుని సుందరశర్మ కావ్యం 2040100047115 1956
హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు [86] మూలం.ఖండేరావు కులకర్ణి, అనువాదం.నిఖిలేశ్వర్ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ప్రాచుర్యం పొందిన పోరాటాల్లో హైదరాబాద్ సంస్థానంలో చెలరేగిన తెలంగాణా సాయుధ పోరాటం ఒకటి. అటువంటి పోరాటం ముగిశాకా వివిధ సిద్ధాంతాల పేరుతో ఆ చరిత్రను సక్రమమైన విధంగా నమోదుచేయలేదనీ, ఆ సిద్ధాంత రాద్ధాంతాల హోరులో ఎందరో వీరులు, వీరగాథలు తెరమరుగయ్యాయని రచయిత ఈ గ్రంథ రచన చేసారు. ఈ క్రమంలో ఆయన సాయుధ పోరాటంలో తెరవెనుకకు వెళ్ళిపోయిన పలువురు అజ్ఞాత వీరులు, వారు చేసిన పోరాటాలు గ్రంథస్థం చేశారు. 2990100068539 1979
హైదరాబాదు 1952-56 [87] ప్రచురణ: సమాచార పౌర సంబంధముల శాఖ సాహిత్యం 2020010005339 1952
హైదరాబాదు నగర తెలుగు భాషా సాహిత్య వికాస చరిత్ర [88] ఓగేటి అచ్యుతరామశాస్త్రి సాహిత్యం 2020120000517 1985
హైదరాబాదు నగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము [89] ఓగేటి అచ్యుతరామశాస్త్రి శతకం 2020120034605 1987
హైదరాబాదు నూతన వ్యవసాయ సంస్కరణలు [90] కొమరగిరి నారాయణరావు సాహిత్యం 2020010005340 1950
హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం(అనుభవాలు, జ్ఞాపకాలు) [91] మూలం: స్వామి రామానంద తీర్థ, అనువాదం: హరి. ఆదిశేషువు ఆత్మకథాత్మకం 2020120004180 1984
హైదరాబాదు హత్యలు-నిజాం చెప్పలేని నీతులు [92] రాంమహాదేవ్ సాహిత్యం 6020010002405 1990
హైందవ థర్మపోలిలు [93] సురవరం ప్రతాపరెడ్డి చరిత్ర ప్రాచీన గ్రీసు దేశంలో థర్మపోలీ అనే కనుమ వద్ద జరిగిన యుద్ధం జగత్ప్రసిద్ధి పొందింది. జర్జిస్ అనే రాజు మరో రాజ్యంపైకి దండెత్తి వస్తుండగా అడ్డుకోలేమని తెలిసి కూడా ఏ కొద్ది సేపు అరికట్టినా చాలన్న లక్ష్యంతో లియోనిదాస్ అనే వీరుడు తన వద్దనున్న కొద్దిపాటి సైన్యంతో అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వేలాదిమంది సైన్యాన్ని అడ్డుకోబోతే తమకు మృత్యువు తప్పదనీ, ఒకవేళ ప్రయత్నించినా పూర్తిగా ఓడించలేమనీ తెలిసి కూడా ఆయన చేసిన ఆ వీరోచితమైన పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురానిదిగా నిలిచింది. భారతదేశ చరిత్రలో కూడా విదేశీ మూకలు దండెత్తి వస్తుండగా దేశాన్నీ, ధర్మాన్నీ నిలుపుకునేందుకు పూర్తిగా తెగించి పోరాడిన ఘట్టాలు ఈ పుస్తకంలో నమోదుచేశారు. 2020050005811 1939
హైందవ వివాహము [94] మూలం: ఆర్.ఎం.చల్లా, అనువాదం: సత్యవోలు శేషగిరిరావు కథా సాహిత్యం 2990100030368 1998
హైందవ సుందరాంగుల కథలు(మొదటి భాగము) [95] అయినాపురపు సుందరరామయ్య కథా సాహిత్యం 2030020024778 1936
హైమావతి విలాసము [96] పి.చిదంబరశాస్త్రి సాహిత్యం 2020120034561 1930
హైమావతీ పరిణయము [97] చాగంటి వెంకటకృష్ణయ్య సాహిత్యం 5010010086029 1894
హంగేరీ విప్లవం [98] అనువాదం: పురిపండా అప్పలస్వామి నవల, అనువాదం 2020010001762 1957
హంపీ [99] నూతలపాటి పేరరాజు చరిత్ర 2020010005336 1958
హంపీ విజయనగర మార్గదర్శిక [100] హెచ్.కె.నరసింహస్వామి చరిత్ర 14, 15 వశతాబ్దమునందు విదేశీ దురాక్రమణలను విధ్వంసాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ప్రజలను సర్వసౌఖ్యాలతో, సౌభాగ్యాలతో జనరంజకంగా పాలించిన విజయనగరము నేటి హంపికి ఒక మార్గదర్శికగా ఈ పుస్తకం రచింపబడింది.సింహాసనమంటపము, వంశవృక్షము, రాతి తేరు, హేమకూటమునుండి హంపి యొక్క దృశ్యము మొదలైన చిత్రములు. హంపి యందలి ప్రాచీన ధార్మిక అవశేషములు, విజయనగర రాజుల సంక్షిప్తచరిత్ర, హంపి యందలి దేవాలయములు, రాజభవనములు మొదలైన కట్టడములు, విజయనగరమును దర్శించిన విదేశీయాత్రికుల వివరములు ఇవ్వబడినాయి. 2040100047022 1941
హంపీక్షేత్రము (ఖండకావ్యం) [101] కొడాలి వెంకట సుబ్బారావు, కామరాజుగడ్డ శివయోగానందరావు ఖండకావ్యం, పద్యకావ్యం హంపీక్షేత్రము కొడాలి వెంకట సుబ్బారావు, కామరాజు గడ్డ శివయోగానందరావు రచించిన ఖండకావ్యము. హంపీక్షేత్రము ఖండకావ్యంలో విజయనగర రాజ్య స్థాపన, ఒడిదుడుకులు, వైభవం, మసకబారుట తుదకు దారుణంగా నేలమట్టమవడం ఇతివృత్తంగా స్వీకరించారు. చారిత్రిక పరిణామాలను కావ్యంగా రచన చేశారు. చారిత్రిక వ్యక్తులే ఇందులో ముఖ్యపాత్రలుగా కనిపిస్తారు. కథా వస్తువునకు సంబంధించని అనవసరమైన ఒక్క అక్షరము లేదు. కావ్యము వెదికి చూచినను ప్రత్యక్షరము, ప్రతి శబ్దము, ప్రతి వాక్యము, ప్రతి అలంకారము కావ్యరసోన్ముఖముగానే పరుగెత్తెను. ఇది మహా శిల్పము. మిక్కిలిగా మాట్లాడినచో ఇంతకన్న శిల్పము లేదన్నారు జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారి పీఠిక ప్రకారం ఈ రచనలో సింహభాగం సుబ్బారవుకే దక్కుతుంది. ఐతే ఈ రచన ముద్రణలు పొందే కాలమందే వారు అకాల మృత్యువు పాలవడంతో విశ్వనాథ ఎంతగానో బాధచెందారు. 2030020025100 1933

మూలాలు[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]