వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
తగిన శాస్తి [1] మూలం: ద్విజేంద్రలాల్ రాయలు; అనువాదకులు: శ్రీపాద కామేశ్వరరావు నాటిక బెంగాలీలో రాసిన ప్రాయశ్చిత్తము అనే నాటికను కామేశ్వరరావు తెలుగులోకి అనువాదించారు. మూలంలో ఉన్నదాని కన్నా ఎక్కువ హాస్యప్రధానంగా చేసామని కామేశ్వరరావు తన పీఠికలో రాసారు. 12030020024812 1929
తగూ నెంబర్ త్రీ [2] మునిమాణిక్యం నరసింహారావు కథల సంకలనం మునిమాణిక్యం నరసింహారావు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్యరచయిత. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి. ఇవి ఆయన రచించిన హాస్య ప్రధానమైన కథల సంకలనం ఇది. 9000000004973 1950
తడిమంటకు పోడినీళ్ళు [3] బుచ్చిబాబు కథల సంపుటి బుచ్చిబాబు తెలుగు సాహిత్యంలో చాలా ప్రసిద్ధులు. నవలలు, కథాసంపుటులు రాశారు. ఇది బుచ్చిబాబు రాసిన కథల సంపుటిలలో నాల్గవది. 2990100049740 1994
తత్సమ చంద్రిక [4] సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి వ్యాకరణ గ్రంథం తత్సమాలు అంటే సంస్కృత సమాలైన పదాలు. ఈ తత్సమ శబ్దాలను సంకలనం చేసి, వాటిని గురించి సూత్రీకరించి వివరించే గ్రంథం ఇది. 2040100047338 1954
తత్సమ శతకము-1 [5] కోగంటి దుర్గామల్లికార్జునరావు సాహిత్యం, శతకం 9000000004433 1959
తత్త్వ ఘంటా శతకము [6] వాసిష్ఠ గణపతి ముని, గుంటూరు లక్ష్మీకాంతం సాహిత్యం, శతకం 2020010001765 1959
తత్త్వత్రయము [7] త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తత్త్వసాహిత్యం 2020120002089 వివరాలు లేవు
తత్వ సందేశం [8] ఉమర్ ఆలీషా కీర్తనలు ఉమర్ ఆలీషా ప్రఖ్యాత సూఫీ వేదాంత వేత్త,తెలుగు సాహితీ వేత్త.సంఘ సంస్కర్త.గ్రాంధికవాది. ఆయన రచించిన సందేశ గ్రంథమిది. 2020120029952 1977
తత్వమసి [9] గోపీచంద్ నాటిక సంపుటి గోపీచంద్ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబరు 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. ఆయన రాసిన నాటికల సంపుటి ఇది. 2020010002865 1957
తత్త్వ వేత్తలు [10] గోపీచంద్ తత్త్వసాహిత్యం 9000000004440 1957
తత్వ శాస్త్రం అంటే ఏంటి? [11] ఆంగ్ల మూలం: కె.విల్సన్, అనువాదం: పేరు లేదు తత్త్వ శాస్త్ర గ్రంథం మానవ మేధో పరిణామ క్రమంలో తాత్త్వికతది. చాలాగొప్ప స్థానం. మనిషి తనకు తెలిసో తెలియకో వివిధ తాత్త్విక కోణాల్లో ఉంటారు. ఆ తత్త్వశాస్త్రాన్ని వివరించేందుకు ఈ గ్రంథం అనువదించారు. 2020120002045 1989
తత్వ సూక్తి సాహస్రి [12] కొండూరు వీరరాఘవాచార్య తత్త్వ శాస్త్ర గ్రంథం తత్త్వాన్ని బోధపరిచే ప్రయత్నాలైన సూక్తులను క్రోడీకరించి ఈ గ్రంథంలో ప్రచురించారు. 2990100030422 1996
తత్త్వానుసంధానము [13] ఆదినారాయణరెడ్డి, కృష్ణారెడ్డి తత్త్వసాహిత్యం 2040100049741 1919
తత్త్వార్థ ముక్తా కలాపము [14] తిరుమలదాసు తత్త్వ చర్చ [[ సద్గురువుల ద్వారా జ్ఞానము సంపాదించనెంచి అందుగల యిబ్బందులను, నిర్వికల్పసమాధి, మనోమర్మము మొదలైన విషయాలను, స్వయంప్రకాశతత్వమునందు ఐకమత్యము కాగలుగుట మొదలైన విషయాలను చర్చించిన చిన్న పుస్తకము. 2020050018573 1905
తథాగతుడు [15] కిళాంబి రంగాచార్యులు సాహిత్యం 9000000004510 1960
తనలో [16] భమిడిపాటి కామేశ్వరరావు నవల భమిడిపాటి కామేశ్వరరావు (1897 ఏప్రిల్ 28 - 1958 ఆగస్టు 28) ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. హాస్య బ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది. వీరి కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ కూడా ఒక ప్రముఖ రచయిత. ఆయన రాసిన హాస్య రచనల సంపుటి ఇది. తమలో తాము పలు పాత్రలు మాట్లాడుకునే అంశాలతో ఈ వ్యాసాలు రాశారు. 2030020025633 1952
తనయ శతకము [17] కవి పేరు లేదు శతకం తెలుగు సాహిత్యంలో శతకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని నీతి శతకాలు అయితే, కొన్ని భక్తి శతకాలు. మరికొన్ని విరహ శతాకాలు. ప్రస్తుత పుస్తకం నీతి శతకాల కోవలోనికి చెందినది. తనయ మకుటంతో ఈ శతకంలో పద్యాలు రాయబడ్డాయి. 2020050016707 1944
తప్తచక్రాంకన ప్రమాణములు [18] రచయిత వివరాలు లేవు ఆధ్యాత్మికం, హిందూ మతం హిందూమతంలోని ప్రధాన శాఖల్లో వైష్ణవశాఖ ఒకటి. నిజానికి హిందూమతాన్ని సనాతన ధర్మంగా వ్యవహరించినప్పుడు వైష్ణవాన్ని మతంగా పరిగణించాల్సి వస్తుంది. వైష్ణవమతంలో విష్ణువును ప్రధానంగా ఆరాధిస్తూంటారు. ఆ క్రమంలో కొత్తవారిని వైష్ణవులుగా చేసేప్పుడు, వైష్ణవ యువకులకు ఒక వయస్సులోనూ యోగ్యత కోసం కొన్ని సంస్కారాలు చేస్తారు. తాపము-పుండ్రము-యాగము-నామము-మంత్రము అనే పంచ సంస్కారాలు అవి. వాటిలోని తాప సంస్కారమంటే శ్రీమహావిష్ణువు చిహ్నాలైన శంఖ చక్రాలను అగ్నిలో ఉంచి చెరొక భుజంపై వేస్తారు. దీనివల్ల వ్యక్తి వైష్ణవుడైనట్టు భావిస్తారు. ఆళ్వారులు-శ్రీమద్రామానుజుల అనంతర కాలంలో విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ విధానానికి సనాతనమైన వేదాలు మొదలుకొని పురాణాలు మొదలైన ప్రామాణిక గ్రంథాల ఆమోదం ఉన్నట్టుగా ఈ గ్రంథంలో రచించారు. వివిధ అధ్యాయాల్లో శ్రుతుల(వేదాల)లోని ప్రమాణాలు, స్మృతుల్లోని ప్రమాణాలు, పురాణాల్లోని ప్రమాణాలు మొదలైనవి వివరించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే-అనంతుడు, గరుడుడు, విష్వక్సేనుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవగణాలు, పితృదేవతాగణాలు, మరుత్గణాలు, మునులైన వశిష్టుడు, కాశ్యపుడు, యాజ్య్ఞవల్క్యుడు మొదలైన పలువురు చక్రాంకితులని వ్యాసాలు రచించడం. మొత్తంగా ఈ గ్రంథం కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన చక్రాంకిత సంప్రదాయానికి సనాతనమైన వేదాల నుంచీ, ప్రాచీనమైన పురాణాల నుంచీ ప్రమాణాలు సమకూర్చేందుకు యత్నిస్తూ రచించారు. 1990020102902 1971
తప్పనిసరి [19] మూలం.మోలియర్ అనువాదకులు.పేరు లేదు నాటిక మోలియర్ ఒక ఫ్రెంచ్ కవి. నాటకకారుకడు. సుమారు 30 నాటికలు రాశారు. ఇతని రచనల్లో హాస్యనాటికలు అధికం. ఈ నాటికలు చాలా భాషల్లో అనువదింపబడటమే కాకుండా, ఇప్పటికీ చాలా దేశాల్లో ప్రదర్శింపబడటం విశేషం. 2030020025303 1930
తపతి [20] ఉత్పల సత్యనారాయణాచార్య పద్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య, ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు. వీరు ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న జన్మించాడు. ఈయన సికింద్రాబాదులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశాడు. ఈయన రచన శ్రీకృష్ణ చంద్రోదయముకు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్ర్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము, యశోదనంద గోహిని ప్రముఖమైనవి. ఆయన రచించిన గ్రంథమిది. 2030020025256 1952
తపస్విని [21] రచయిత పేరు లేదు నాటిక (?) ఈ ప్రతిలో రచయిత గురించి, వివరాల గురించి సరైన సమాచారం దొరకలేదు. 2020050015022 1949
తపోభంగము [22] బి.ఎన్.శాస్త్రి గేయ కావ్యం 9000000004609 1960
తపోవనము [23] బెళ్లూరి శ్రీనివాసమూర్తి పద్యాలు రాయలసీమకు చెందిన తొలినాళ్ళ కవులలో బెళ్ళూరి ఒకరు. ఆయన వ్రాసిన ఈ పద్యసంపుటిలో ఒక వినిర్మలమైన జీవిత వర్ణన దొరుకుతోంది. 2020010008389 1954
తప్పెవరిది [24] సునీల్ కథల సంపుటి ఇది ఒక కథల సంపుటి. దీనిలో మూడు కథలున్నాయి. వాటి పేర్లు తప్పెవరిది, అపోహ, బియ్యపు బస్తా. 2020010008390 1958
తమిళ పంచ కావ్య కధలు [25] చల్లా రాధాకృష్ణ శర్మ కధల సంకలనం తమిళంలో పంచ కావ్యాలు చాలా ప్రసిధ్దం. మణిమేకలై, సిలప్పదిగారం, జీవక చింతామణి, కుండలకేశి, వళయాపతి అనేవి తమిళ పంచ కావ్యాలు. వీటిలో మొదటి మూడు చాలా ప్రసిద్ధమైనవి. ఈ కావ్యాలను తెలుగులోకి కధల రూపంలో అనువదించారు. 2030020024603 1955
తమిళ వేదము [26] చల్లా రాధాకృష్ణ శర్మ సాహిత్యం తిరువళ్ళువర్ తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త మరియు నీతిజ్ఞుడు. ఇతని రచన తిరుక్కురళ్, తమిళ సాహిత్యానికి మకుటం లాంటిది. నీతిబోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. ఆయన జీవితం, ఆయన రచనలలో మేటియైన తిరుక్కురళ్ గురించిన వివరం ఈ గ్రంథంలో వివరించారు. తిరుక్కురళ్ ప్రాముఖ్యత రీత్యా తమిళ వేదమని ప్రశంసిస్తూంటారు. ఆ నేపథ్యంలోనే రచనకు తమిళ వేదము అనే పేరు పెట్టారు. 2020010001846 1954
తమిళ సాహిత్య చరిత్ర [27] చల్లా రాధాకృష్ణ శర్మ సాహిత్యం చల్లా రాధాకృష్ణ శర్మ గారు తమిళ పంచ కావ్యాలను తెలుగులోకి కధల రూపంలో అనువదించారు. రాధాకృష్ణ శర్మ గారు తమిళ కావ్యాలను అనువదించిన వారిలో చాలా ప్రసిద్ధులు. ప్రస్తుత పుస్తకంలో తమిళ సాహిత్యం యొక్క చరిత్ర, భారత సాహిత్యంలో, సంస్కృతిలో తమిళం యొక్క ప్రాధాన్యత వివరించారు. 2990100071693 1976
తమిళనాడు జానపద సాహిత్యము, సంస్కృతి [28][dead link] ఎస్.నరసింహులు నాయకర్ విజ్ఞాన సర్వస వ్యాసాలు జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. జానపదాలలో వీరగాథలు, స్త్రీలపాటలు వంటి ఎన్నో విధాలైన విభాగాలుంటాయి.  భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజల ద్వారా తమిళ జానపద సాహిత్యంపై రాసిన ఈ గ్రంథం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128933 1982
తర తరాల భారత చరిత్ర [29] మూలం.రొమిల్లా థాపర్, అనువాదం.సహవాసి చరిత్ర స్వాతంత్ర్యానంతరం భారతచరిత్ర రచనలో ఏర్పడిన సంప్రదాయాల నిర్మాణంలో కీలకమైన చరిత్ర రచయితల్లో రొమిల్లా థాపర్ ఒకరు. బ్రిటీష్ వారి నిష్క్రమణానంతరం తొలినాటి ప్రభుత్వాల దృక్పథాలతో కొంతవరకూ అకడమిక్ చరిత్ర తిరగరాయబడిన ప్రాధాన్యత కల కాలంలో ఆమె ప్రాముఖ్యం వహించారు. రొమిల్లా థాపర్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ చరిత్ర రచయిత్రిగా ప్రాచుర్యం పొందాఉర్. విఖ్యాత కార్నెల్, పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయాలు, కాలేజ్ డి ఫ్రాన్స్‌లకు ఆతిథ్య ఆచార్యురాలిగా, 1983లో భారత చరిత్ర కాంగ్రెస్‌కు జనరల్ ప్రెసిడెంట్‌గా, 1999లో బ్రిటీష్ అకాడమీ ఫెలోగా గౌరవం పొందారు. చికాగో విశ్వవిద్యాలయం, ఇన్స్‌టిట్యూట్ డెస్ లాంగ్యుఎస్ ఎట్ సివిలైజేషన్స్ ఓరియంటల్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాపీఠాల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో విదేశీ గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తూ, "నేను అకడమిక్ సంస్థల నుంచే తప్ప ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకోనని" ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకమైన క్లూగ్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ(2008)ను మిలియన్ డాలర్ల ప్రైజ్‌తో పాటుగా పీటర్ బ్రౌన్‌తో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రచించిన భారత చరిత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గ్రంథాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు ప్రముఖ అనువాదకులు సహవాసితో తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించారు. 2990100061878 1984
తర్క సంగ్రహః [30] వివరాలు లేవు సాహిత్యం 2040100047348 1926
తర్కం-శాస్త్రీయ విధానం [31] ఆంగ్ల మూలం: ఎస్.పి.గుప్త, అనువాదం: ఎం.రాజగోపాలరావు తర్క గ్రంథం తర్క శాస్త్రం భారతీయ మేధో సమాజంలోనే కాక ఇతర దేశాల మేధో జీవులలోనూ ప్రాముఖ్యత సంపాదించుకున్న శాస్త్రం. ఏ విషయాన్నైనా అధ్యయనం చేసేప్పుడు, నిరూపించేప్పుడు అనివార్యంగా తర్కం అవసరం అవుతుంది. అటువంటి విషయాన్ని గురించి సవివరమైన పాఠ్య గ్రంథంగా దీన్ని రచించి ప్రచురించారు. 6020010029950 1986
తరంగములు [32] పి.వి.రెడ్డి కవితా సంకలనం "మానవా", "మా పల్లె", "రైతు", "భారతంబ" మొదలైన ఖండకావ్యాలు ఉన్న సంకలనం ఇది. కవి స్వాతంత్ర్యం, రైతు జీవనం, పల్లెల్లో జీవితాలు వంటి విషయాలను పరిపోషించారు. 2020120002041 1978
తరంగిణి [33] అడవి బాపిరాజు కథల సంపుటి అడవి బాపిరాజు స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. ఈయన రాసిన నారాయణరావు, గోనగన్నారెడ్డి నవలలు చాలా ప్రసిద్ధిమైనవి. 9000000004957 1945
తరిగొండ వెంగమాంబ విరచిత జలక్రీడా విలాసము [34] రచన: తరిగొండ వెంగమాంబ, పరిష్కర్త: కె.జె.కృష్ణమూర్తి యక్షగాన నాటకం తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. స్వామి మీద ఈమె రాసిన రచనలు చాలా ప్రసిద్ధికెక్కాయి. 2020120002042 1985
తలవని తలంపు [35] పులుగుండ్ల రామకృష్ణారావు నాటిక ఇది ప్రఖ్యాత రచయిత రామకృష్ణారావు రాసిన నాటిక. 9000000004481 1960
తల్లీ భూదేవి (ఆంగ్ల మూలం:మదర్ ఎర్త్) [36] ఆంగ్లమూలం: చింగీజ్ ఐత్ మాతోవ్, అనువాదం: ఉప్పల లక్ష్మణరావు నవలిక చిన్గీజ్ ఐత్మాతోవ్ – కిర్గిస్తాన్ కు చెందిన ప్రముఖ రచయిత. రష్యన్, కిర్గిజ్ భాషల్లో రచనలు చేసినా, అయన రచనలు వంద పైచిలుకు భాషల్లోకి అనువాదం అయ్యాయి. “ఒక అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టి పెరిగి కేవలం తన రచనల ద్వారానే విశ్వ వ్యాప్తినొందుతూ తనతో పాటు, ప్రపంచపటం మీద తన దేశానికీ గుర్తింపు తెచ్చిన అరుదైన మేటి రచయిత చిన్గీజ్ ఐత్మాతోవ్.” అని ఆయన గురించి విమర్శకులు పేర్కొన్నారు. ఇది చిన్గిజ్ 2990100071692 1983
తల్లి ప్రేమ[37] ఆంగ్లమూలం: కేథరిన్ ఫోర్బ్స్, అనువాదం: రామకృష్ణ నవల కేథరీన్ ఆండెర్సన్ మెక్ లీన్ అనే అమెరికన్ రచయిత్రి ఈ గ్రంథ కర్త. ఐతే ఆమె తన తన కలంపేరు కేథరీన్ ఫోర్బ్స్ తోనే సుపరిచితం. ఆమె రచయితగా, మరీ ముఖ్యంగా మెమోయిర్స్ రచయిత్రిగా పేరు పొందారు. ఆమె ఈ గ్రంథాన్ని రచించారు. 2020050016301 1957
తల్లి విన్కి [38] రచన: ఆదిభట్ట నారాయణదాసు, సంపాదకులు: ఓరుగంటి నీలకంఠశాస్త్రి కావ్యం అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఆయన రాసిన కావ్యమిది. 2020120012738 1975
తల్లి-బిడ్డ [39] దరశి సుభద్రమ్మ వైజ్ఞానిక గ్రంథం ఇది తల్లీ బిడ్డల సంరక్షణ గురించిన వైజ్ఞానిక గ్రంథం. 9000000004374 1956
తల్లి లేని పిల్లలు(పుస్తకం) [40] విశ్వనాథ సత్యనారాయణ నాటకం 9000000004359 1954
త్యాగరాజ యోగవైభవం [41] పెద్దాడ చిట్టి రామయ్య తత్త్వనిరూపణ త్యాగమను శబ్ద వ్యుత్పత్తి, అర్థ నిరూపణ, స్థూలసూక్ష్మ త్యాగ వివరణలతో కూడుకొన్న ఈ 54 పేజీల చిరు పుస్తకమునందు మాయామయ హృత్తాపమును త్యజించుటయే సర్వోత్తమమైన త్యాగరాజమని ప్రాచీన శ్లోకములు, కీర్తనలు, వేమన పద్యములతో సహా ఉదహరిస్తూ నిరూపించబడింది. కాశీనాథుని వీరమల్లయ్య గారిచే సంస్కరింపబడింది. 2020050019070 1912
త్యాగం [42] గుడిపాటి వెంకట చలం నాటకం చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఇది ఆయన రచించిన సాంఘిక నాటకం. 2030020025339 1938
త్యాగధనుడు [43] వల్లపాటి హనుంతరావు, సేకరణ:గూడూరి నమశ్శివాయ స్వీయ చరిత్ర 2020120002104 1983
త్యాగధనులు [44] ఆదిరాజు చంద్రమౌళీశ్వరరావు, గబ్బిట మృత్యుంజయశాస్త్రి సాహిత్యం 9000000004599 1950
త్యాగి [45] భాట్టం సూర్యప్రకాశశర్మ నవల 9000000004741 1949
తాజ్ మహల్ (నవల)[46] నండూరి వేంకట సుబ్బారావు పంతులు నవల తాజ్‌మహల్ నిర్మాణం వెనుక ప్రేమ కథ ఉందని ప్రతీతి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణంతో బాధపొంది ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మించినట్టు ప్రఖ్యాతి పొందిన గాథను రచయిత నవల వ్రాశారు. 2020050016611 1934
తాటికొండ, గేయమాలిక[47] అడ్లూరి అయోధ్య రామకవి గేయాలు విశ్వనాథ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు అనే రచన అఖిలాంధ్రంలోని భావుకుల హృదయాలనూ కదిలించింది. ఆ పాటలు విని పరవశించిన అడ్లూరి అయోధ్యరామకవి తాటికొండ అని ఈ గ్రంథాన్ని రచించారు. ఆ విషయాన్ని స్వయంగా గ్రంథకర్త ముందుమాటలో చెప్పుకున్నారు. విశ్వనాథకు పరిచయమున్న కిన్నెరసాని వాగును గురించి ఆయన రాసినట్టే, అయోధ్యరామకవి తనకు చిన్నతనం నుంచీ తెలిసిన తాటిచెట్లున్న ప్రాంతాన్ని గురించీ ఈ రచన చేశారు. దీనికి ముందుమాట విశ్వనాథ రాయడం మరో విశేషం. 2030020025331 1945
తాతా చరిత్రము [48] కొమండూరి శఠకోపాచార్యులు జీవిత చరిత్ర, చరిత్ర విఖ్యాత పారిశ్రామిక వేత్త జంషెడ్జీ టాటా జీవిత చరిత్ర గ్రంథమిది. దూరదృష్టీ, సాహసం, వ్యాపారవేతృత కలగలిసిన జంషెడ్జీ టాటా భారతదేశంలో స్వాతంత్ర్య పూర్వపు పారిశ్రామికవేత్తల్లో దిగ్గజం. భారతదేశంలో అతిపెద్ద బహుళ ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన టాటా ఇండస్ట్రీస్‌ను నెలకొల్పినది జంషెడ్జీ టాటానే. ఆయనను భారతీయ పారిశ్రామిక పితామహునిగా గుర్తిస్తారు. అటువంటి వ్యక్తి జీవితచరిత్ర కావడంతో దేశ వాణిజ్య అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికీ ఇది మరో దర్పణంలా నిలుస్తుంది. టాటా అనే పదాన్నే మరో ఉచ్చారణతో గ్రంథంలో తాతా అని వ్యవహరించారు. పుస్తకం పేరు కూడా తాతా చరిత్రము కావడం గమనార్హం. 2030020029722 1936
తాన్ సేన్ [49] అయ్యగారి విశ్వేశ్వరరావు నాటకం మియాఁ తాన్‌సేన్ (1493 లేదా 1506 – 1586 లేదా 1589), హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో ఘనమైన చరిత గలవాడు. ప్రముఖ వాగ్గేయకారుడు. మధ్య ఆసియా కు చెందిన రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. బాల్యం పేరు 'రమ్తాను పాండే', అక్బర్ ఇతన్ని మియాఁ (మహా పండితుడు) అనే బిరుదునిచ్చి గౌరవించాడు. ఆయన జీవితాన్ని చిత్రీకరిస్తూ రాసిన నాటకమిది. 9000000005138 1947
తానాషా అక్కన్న మాదన్న [50] వేదము వెంకటరాయశాస్త్రి చరిత్ర శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పుతున్న రోజుల్లోనే దక్కన్‌లో గోలుకొండ పాలకుడు అబుల్ హసన్ కుతుబ్ షా(తానాషా), ఆయన మంత్రులు అక్కన్న, మాదన్నలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదిరించి నిలిచారు. ముస్లిం పాలకుడైనా తానీషా హిందూమతాభిమానిగా ముద్రపడ్డారు. పరమత సహనం, ధార్మిక వర్తనంతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. అక్కన్న, మాదన్నలు నిశిత బుద్ధులైన మంత్రులుగా ఆయనకు సహకరించారు. ఔరంగజేబు వీరిని అంతం చేసేందుకు అంతఃపుర కుట్రకు ప్రేరేపించి రాజును మోసపుచ్చి అక్కన్న, మాదన్నలను బంధించారు. ఆపైన అదే అదనుగా ఔరంగజేబు, ఆయన అనుచరులు మరొక కుట్రలో తానీషాను చంపించారు. శివాజీతో పాటుగా దక్షణ భారత చరిత్రలో వీరి జీవితం మరువరానిదని భావించి వేదం వేంకటరాయశాస్త్రి ఈ చారిత్రిక గ్రంథాన్ని రచించారు. 2030020024489 1949
తాపీ ధర్మారావు జీవితం-రచనలు [51] ఏటుకూరి ప్రసాద్ జీవిత చరిత్ర తాపీ ధర్మారావు నాయుడు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?, పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు, రాలూ రప్పలు, రాముడికి సీత ఏమవుతుంది వంటి పుస్తకాలు, సాహిత్యాంశాలపై సాహిత్య మొర్మొరాలు, పాతపాళీ, కొత్తపాళీ వంటి గ్రంథాలు, విజయవిలాస కావ్యంపై హృదయోల్లాస వ్యాఖ్య వంటివి ఆయన రచించారు. తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబరు 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నారు. ఇది ఆయన జీవిత చరిత్ర. ఈ గ్రంథంలో ఆయన జీవితం గురించే కాక ఆయన రచించిన సాహిత్యం గురించి కూడా ఉంటుంది. 2990100061875 1989
తామరకొలను (నవల)[52] మూలం: త్రివేణి, అనువాదం: శర్వాణి నవల ఇది ఒక సాంఘిక నవల. త్రివేణి అనే రచయిత్రి రాసిన నవలను శర్వాణి తెలుగులోకి అనువదించారు. త్రివేణి ఈ నవల అనువాదానికి అనుమతిని ఇచ్చిన కొద్దిరోజులకే మరణించడంతో ఈ నవలను ఆమెకి అంకితం చేశారు. 2990100071690 1963
తారకమ్ [53] ఆదిభట్ల నారాయణదాసు సాహిత్యం 2020010001717 1929
తారక బ్రహ్మ రాజీయము[54] రచన:చింతలపూడి ఎల్లనార్య, పరిష్కర్త: అక్కిరాజు వేంకటేశ్వరశర్మ ప్రభంధం రాధామాధవం, విష్ణుమాయా నాటకం వంటి కృతుల కర్తయైన రాధామాధవ బిరుదాంకితుడైన చింతలపూడి ఎల్లనార్యుడు ఈ కృతికర్త. కవి కృష్ణదేవరాయల కాలం వాడు అయినా ఆయన మరణ అనంతర కాలంలో అచ్యుతదేవ రాయల పరిపాలన కాలంలో ఈ గ్రంథ రచన చేశారు. ప్రతి సంవత్సరం వెంకటేశ్వరునికి సత్కావ్య ప్రబంధ వాక్పుష్పాంజలి సమర్పించే సన్నియమం కల అచ్యుత రాయలు కవిచే దీనిని వేంకటేశునికి అంకితం ఇప్పించారు.(రచానాకాలం ప్రచురణకు కొన్ని దశాబ్దాల క్రితమే జరిగింది.) 2020120012739 1985
తారకామృత పరమహంస ప్రభోదిని [55] దయానంద రాజయోగి రాజయోగమునకు సంబంధించిన గ్రంథం రాజయోగంతో సహా మరికొన్ని యోగాలకు మూలమైన గ్రంథం, ప్రమాణముగా అందరూ అంగీకరించిన గ్రంథం భగవద్గీత. ఆ పూర్వ గ్రంథాల నుంచి స్వీకరించిన రాజయోగాన్ని తమదైన పద్ధతిలో విశదీకరిస్తూ సాగిన రచన ఇది. 2020120002039 1960
తారకామృతసారం[56] గుజ్జుల నారాయణదాసు ఆధ్యాత్మిక గ్రంథం ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో రచయిత అన్ని దేవుళ్ళపైనా స్తోత్రాలు రాశారు. వినాయకుని స్తోత్రంతో మొదలుపెట్టి అనేక దేవీ, దేవతా స్తోత్రాలు ప్రచురించారు. 9000000004628 1955
తారకాసుర వధ [57] చెర్విరాల భాగయ్య యక్షగానము 2020120002088 1965
తారాశంకర్ బందోపాధ్యాయ(జీవిత చరిత్ర)[58] ఆంగ్ల మూలం: మహాశ్వేతాదేవి, అనువాదం: ఎస్.ఎస్.ప్రభాకర్ జీవిత చరిత్ర తారాశంకర్ బంధోపాధ్యాయ్ ప్రముఖ బెంగాల్ కవి, రచయిత. ఆయన రచించిన నవలలు బెంగాలీ సాంఘిక, రాజకీయ జీవితాన్ని ప్రతిబింబించాయి. వారి జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి ఈ గ్రంథంలో రచించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారి భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షిక కింద ఇది తెలుగులోకి అనువాదమై ప్రచురితమైంది. 2990100061877 1978
తారాబాయి[59] కేతవరపు వేంకటశాస్త్రి చారిత్రిక నవల కేతవరపు వెంకటశాస్త్రి రచించిన ఈ నవల తారాబాయి అనే త్యాగమూర్తి జీవితాన్ని గురించిన చారిత్రిక నవల. 9000000004486 1954
తారా రాఘవం[60] జి.వి.సుబ్బారావు పద్య నాటికల సంపుటి విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం బాలకాండం చదివి ఉద్వేగంలో అహల్య పాత్రను ఆధారం చేసుకుని "విమోచనం", అమరావతీ శిల్పాలు చూసిన సమయంలో "పాదాభివందనం", రామాయణంలో తార పాత్ర ప్రధానంగా "తారా రాఘవం", మండోదరి పాత్ర ముఖ్యపాత్రగా "మండోదరీ రావణం", విశ్వనాథ వ్రాసిన "కిన్నెరసాని పాటల" ప్రభావంతో కిన్నెరసాని వంటి పద్యనాటికలు రచించారు సుబ్బారావు. ఇది వాటి సంపుటం. 2020120021318 1997
తారా శశాంకం[61] కొప్పరపు సుబ్బారావు నాటకం తార, చంద్రుడు, బృహస్పతి మున్నగువారు ముఖ్యపాత్రలుగా కలిగిన పౌరాణిక కథ-తారాశశాంకం. దీనిని రోషనారా, నేటినటుడు, నూర్జహాన్, వసంతసేన మొదలైన నాటకాలకు కర్త అయిన కొప్పరపు సుబ్బారావు రాశారు. 2020010008396 1951
తారాశశాంకము [62] దరిశి వీరరాఘవస్వామి నాటకం 2020120035961 1959
తారాస్ బుల్బా [63] గొగోల్ కథ 9000000004458 1957
తాలూకా గ్రంథాలయ మహాసభ ప్రత్యేక సంచిక[64] సంపాదకులు: గరికపాటి రామారావు, వెలగా వెంకటప్పయ్య సావనీర్ సంచిక ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన అయ్యంకి వెంకటరమణయ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమాలలో భాగం వహించింది. ఉద్యమంలో భాగంగా తెనాలి తాలూకాలోని గ్రంథాలయాల వివరాలతో తయారుచేసిన ప్రత్యెక సంచిక ఇది. 2990100061874 1963
తాలాంక నందినీ పరిణయం [65] రచన.ఆసూరిమరింగింటి వేంకట నరిసింహాచార్యులు. సంపాదకులు. రంగాచార్య కావ్యం 19వ శతాబ్దం అంతంలో వచ్చిన ఈ కృతి ముద్రణ రూపంలో అంతకు వందేళ్ళు గడిచే దాకా రాలేదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు 1980లలో ప్రచురించిన ఈ ప్రతే తోలిముద్రణ ప్రతి. ఈ రచన చేసిన కవి ఈ గ్రంథం రామాయణం భూమిపై ఉన్నన్నాళ్ళు ఉంటుందని ఆత్మవిశ్వాసం ప్రకటించారు.ముద్రణ కాలం 1980(అంతకు దాదాపు శతాబ్దం క్రితమే కావ్య రచన జరిగింది) 2990100061873 1980
తాళదశ ప్రాణదీపిక [66] రచన.పోలూరి గోవిందకవి సంగీత శాస్త్రము తాళగుణ ప్రాణదీపిక సుప్రసిద్ధ లక్షణ గ్రంథం భరతశాస్త్రములోని తాళాధ్యాయానికి ఇది స్వతంత్రానువాదం కావచ్చని పండితులు అభిప్రాయపడ్డారు. సంగీతంలో మరీ ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో తాళానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ కారణంగా తాళాలు ఎన్ని విధాలుగా ఉంటాయో, వాటి మధ్య భేదాలేమిటో మొదలైన విషయాలతో ఈ గ్రంథం రచించారు. తంజావూర్ సరస్వతీ మహల్ సీరీస్ పేరిట సరస్వతీమహల్‌లోని గ్రంథాలు వెలికితెచ్చే ప్రయత్నంలో భాగంగా ఇది ప్రచురితమైంది. 1950(అంతకు శతాబ్దాల క్రితమే గ్రంథ రచన జరిగింది) 2030020025472 1950
తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు(జీవితచరిత్ర) [67] సి.రమణయ్య జీవితచరిత్ర తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు అన్నమాచార్యులు కుమారుడు. అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం పొందడంలో ఈయన పాత్ర చాలా విశిష్టమైనదని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అన్నమాచార్యుని పాటలను నేర్పి ఆ గాయకులను దక్షిణ భారతంలోని వివిధ సంస్థానాలకు, దేవస్థానాలకు పంపి ఆ కీర్తనలకు ప్రాముఖ్యతను పెంచారు. ఆ కీర్తనలను రాగి రేకులపై రాయించడంలోనూ ఆయన పాత్రా చాలా ఎక్కువ ఉంది. 2990100067548 1989
తాళ్ళపాక చిన్నన్న సాహితీ సమీక్ష [68] ఎస్.టి.వి.రాజగోపాలాచార్య సాహిత్య సమీక్ష తాళ్ళపాక వంశంలో అన్నమాచార్యుల అనంతరం ఆయన ప్రారంభించిన పదకవిత రచన సంప్రదాయాన్ని వారసులు తాళ్ళపాక పేదతిరుమలాచార్యులు, చిన్నన్న మొదలైన వారు కొనసాగించారు. ఆ క్రమంలో వెలువడ్డ చిన్నన్న రచనల సాహిత్యపరమైన సమీక్ష ఇది. 2990100030421 1992
తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు [69] జి.ఉమాదేవి సాహిత్య సమీక్ష తాళ్ళపాక అన్నమాచార్యులు, ఆయన వంశస్తులు పదకవితను ఎన్నో విధాలుగా సుసంపన్నం చేశారు. అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించగా, వాటిని పెద తిరుమలాచార్యులు రాగిరేకులపైకి ఎక్కించి ప్రాచీన తెలుగు సాహిత్యంలో అపూర్వమైన ముద్రణ కృషికి తెరతీశారు. పేద తిరుమలాచార్యులు, చిన్నన్న వంటి అన్నమయ్య వారసులు కూడా గొప్ప సారస్వతం సృష్టించారు. వారి రచనల్లో కవి సమయాలు పరిశోధించే రచన ఇది. 6020010002036 1993
తాళ్ళపాక వారి పలుకుబళ్ళు [70] సంపాదకులు: ఆరుద్ర రామలక్ష్మి సాహితీ విశ్లేషణ తాళ్ళపాక అన్నమాచార్య పదబంధాలు చాలా శతాబ్దాల క్రితం తెలుగు పదాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు. నిజానికి చాలా పదాలు మనకు అర్ధం కాకపోవడానికి కారణం ఆ పదాలు వాడుకలో లేకపోవడమే. కొన్ని పలుకుబళ్ళు ఇప్పటికి అంతరించిపోయయి కూడా. 19వ శతాబ్దంలో అన్నమాచార్య కీర్తనలు వెలుగులోకి తెచ్చిన తితిదే రాళ్ళపల్లి వారు లాంటి సంగీతపండితుల చేత స్వరాలు చేయించి, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి భాషా పండితుల చేత ఆ కీర్తనల పదాలను, పలుకుబళ్ళను పరిష్కరింపజేశారు. అదే కోవలోకి చెందిన ఈ పుస్తకం అన్నమాచార్య కీర్తనల్లోని పలుకుబళ్ళను వివరించింది. 2020120029944 1971
తిక్క కుదిరింది(పుస్తకం) [71] ఐతా చంద్రయ్య హాస్యం, నాటిక 2020120002108 1995
తిక్కన కావ్యశిల్పము [72] కేతవరపు వేంకటరామకోటిశాస్త్రి సాహిత్యం 2990100061899 1973
తిక్కన చేసిన మార్పులు-ఔచిత్య తీర్పులు [73] పి.సుమతీ నరేంద్ర సాహిత్యం 2990100051834 1982
తిక్కన పదప్రయోగకోశము-ద్వితీయ సంపుటి [74] సంపాదకులు:అబ్బూరి రామకృష్ణారావు, భద్రిరాజు కృష్ణమూర్తి,దివాకర్ల వేంకటావధాని సాహిత్యం 2990100051835 1974
తిక్కన భారతము-కర్ణ పర్వము [75] మరువూరు కోదండరామరెడ్డి సాహిత్యం 6020010029987 1972
తిక్కన భారతము-రస పోషణము [76] ఆండ్ర కమలాదేవి సాహిత్యం 2990100051832 1991
తిక్కన సోమయాజి [77] చిలుకూరి వీరభద్రరావు జీవిత చరిత్ర 99999990125905 1917
తిన్నడు, గుణనిధి [78] వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి సాహిత్యం 2020120002099 1929
తిబ్బె అక్బర్ షాహి [79] హకీం.డి.రహంతుల్లా బేగ్ సాహెబ్ యునానీ వైద్యం 5010010032641 1931
త్రివేణి [80] ఏటుకూరి వెంకట నరసయ్య ఖండకావ్యాలు కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నరసయ్య (జననం: 1911 ఏప్రిల్ 1 - మరణం 1949 నవంబరు 10) క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది, కవి ఐన ఏటుకూరి వెంకట నరసయ్య, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడులో, గండికోట కమ్మ కుటుంబంలో, తల్లి తండ్రులకు ఐదుగురు కొమరులులలో రెండవవాడుగా, 1911 ఏప్రిల్ 1 న జన్మించాడు. చినగూడూరు,అమృతలూరు మరియు సిద్ధాశ్రమం (తెనాలి తాలూకా) లో విద్యాభ్యాసం జరిగింది. కవిరాజు త్రిపురనేని ప్రభావంతో పరస తాళ్ళూరు గ్రామానికి చెందిన యువతితో దండల వివాహం చేసుకొన్నాడు. నలుగురు పిల్లలు. బెంగాలీ సంస్కృతి ప్రభావంతో కుమారులకు రవీంద్రనాథ్ (చనిపోయాడు), హిమాంశు రాయ్ (విశ్రాంత ఉప తహసిల్దారు) అని నామకరణం చేశాడు. కుమార్తెలు ఝాన్సీ లక్ష్మి, మాంచాల. తొలుత గురిజాల ఆ తరువాత నిడుబ్రోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో (1948 -1949 ) అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇది ఆయన రాసిన ఖండకావ్యాల సంకలనం. 2030020025076 1950
తిరుగుబాటుదారులు పురోగమించాలి [81] రామమనోహర్ లోహియా సాహిత్యం 9000000004311 1931
తిరుపతి వేంకటేశ్వర కృతులు-3 [82] తిరుపతి వేంకట కవులు నాటకాలు దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. ఈ షష్టిపూర్తి సాహిత్య సర్వస్వం సంపుటిలో ప్రసిద్ధమైన వారి నాటకాలు-పాండవ ఉద్యోగం, పాండవ విజయం మున్నగునవి ఉన్నాయి. 2030020024913 1934
తిరుపతి వేంకటేశ్వర కృతులు-8 గీరతం [83] తిరుపతి వేంకట కవులు వివాద సాహిత్యం తిరుపతి వేంకట కవులకు మరీముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి సాహిత్యపరంగా ఎన్నో వివాదాలు, శతృత్వాలు ఉన్నాయి. కారణమేమైనా ఎందరో చిన్నా పెద్ద సాహిత్యవేత్తలు, కవులు, పండితులు వీరితో వివాదాలు, జగడాలు, వాదప్రతివాదాలు జరిపారు. ఆయా వివాదాలన్నీ సాహిత్యరూపం తీసుకున్నాయి. గద్యంలోనూ, పద్యంలోనూ ఖండన మండన గ్రంథాలు వారి కర్తృత్వంలో వచ్చాయి. ముఖ్యంగా కొప్పరపు సోదరకవులతో జరిగిన వివాదాల గురించి సవివరంగా గ్రంథరూపంలో పదిలపరిచారు. దాని పేరు గుంటూరి సీమ. అలాగే ఇతరమైన వాదప్రతివాదాలతో కూడా వందలాది పుటల సాహిత్యం విస్తరించింది. ఇది వేంకట రామకృష్ణకవులకూ, తిరుపతి వేంకట కవులకూ మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి చివరకు ఇలా గీరతమనే గ్రంథం రూపాన్ని సంతరించుకుంది. వివాదాలే ఐనా సాహిత్య పరమైనవి కావడంతో వీటి ద్వారా ఆనాటి సాంఘిక జీవనం తెలియడమే కాక ఆనాటి కాలంలోనే పలువురు కవులు, పండితులు వీటిని చదివి ఎన్నో నేర్చుకున్నామని వివరించారు. ప్రముఖ కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ ఆత్మకథలో ఈ వివాద సాహిత్య పఠనం గురించి ప్రస్తావిస్తూ వాటి వల్ల సంవత్సరాల కొద్దీ గ్రంథాలు మథించి నేర్చుకొనేవి ఎన్నో కొద్ది సమయంలోనే నేర్చుకున్నామన్నారు. 2030020025039 1934
తిరుప్పావై [84] గోపాలాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120002101 1992
త్రిపుర విజయము [85] అల్లంశెట్టి అప్పయ్య నాటకం విద్యున్మాలి, తారకాక్షుడు మరియు కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారు. వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడి కొడుకులు. వీరి తండ్రి కుమార స్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా వారు కామగమనం కలిగిన బంగారం, వెండి, రాగితో చేసిన మూడు నగరాలు నిర్మించి ఇమ్మని; అవి అంతరిక్షంలో తిరుగుతూ వేయి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు; అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. బ్రహ్మ ఆజ్ఞపై మయుడు వారికి అలాంటి నగరాలు ఒక్కొక్కటీ యోజన విస్తీర్ణం ఉండేలా నిర్మించి ఇచ్చాడు. వారు దేవతలను హింసిస్తూ జీవిస్తూండగా దేవతలు శివునితో మొరపెట్టుకోవడం, తుదకు శివుడు త్రిపురాలను ఒక్కసారే ధ్వంసం చేయడం మిగిలిన కథ. దీనిని రచయిత పౌరాణిక నాటకంగా మలిచారు. 2030020025129 1940
త్రిపురాంతకోదాహరణము [86] రావిపాటి త్రిపురాంతకుడు పద్యాకావ్యం కాకతీయ కాలానికి చెందినవానిగా భావిస్తున్న రావిపాటి త్రిపురాంతకుడు రచించిన గ్రంథమిది. ఇది వీరశైవానికి సంబంధించిన కృతి. పాల్కురికి సోమన రాసిన బసవ పురాణం తర్వాత కాలంలో వెలువడ్డ వీరశైవ రచనగా దీనిని పేర్కొన్నారు పండితులు. త్రిపురాంతకుడు ప్రేమాభిరామమనే కృతిని సంస్కృతంలో రాశాడనీ దానిని తాను అనువదించాననీ క్రీడాభిరామ కర్త వినుకొండ వల్లభరాయుడు పేర్కొన్నాడు. ఆ త్రిపురాంతకుడు ఈయనేనని ఈ గ్రంథ పరిష్కర్త (సంస్కర్త అని వ్యవహరించారీ ప్రతిలో) నిడదవోలు వేంకటరావు పేర్కొన్నారు. ఈ కృతిని గురించి, కృతికర్త విశేషాలు, కాలం, ఇతర కృతులు, ఈ గ్రంథం ఎలా పరిష్కరించినాడన్న వివరాలు వేంకటరావు రచించిన విపులమైన పీఠికలో దొరుకుతోంది. 2030020025419 1946
తిమ్మరసు మంత్రి [87] చిలుకూరి వీరభద్రరావు జీవిత చరిత్ర 99999990125901 1937
తిరుమల దేవి నాటకము [88] వెంకట సుబ్బయ్య నాటకం, ఆధ్యాత్మిక సాహిత్యం 9000000004847 1935
తిరుమలై తిరుపతి యాత్ర [89] ఎస్.వి.లక్ష్మీనారాయణరావు యాత్రా సాహిత్యం తెలుగునాట యాత్రా సాహిత్యం కొంత తక్కువగానే వచ్చిందని చెప్పుకోవాలి. 19వ శతాబ్ది తొలినాళ్లలోనే యేనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర రచించినా అది వెలుగులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఆపైన కూడా కొంతవరకూ ఆ లోటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1920దశకంలో తిరుమల యాత్ర చేసి ఆ యాత్రను తిరుమలై తిరుపతి యాత్ర గ్రంథంగా మలచిన ఎస్.వి.లక్ష్మీనారాయణరావు సాహిత్యకృషి అపురూపమైనదే. మహంతుల పాలనలో తిరుపతి కోనసాగుతున్న ఆ కాలంలో ఈ గ్రంథముద్రణకు హథీరాంజీ మఠం వారు సహకరించారు. ఆనాటి తిరుమల యాత్ర ఎలా ఉండేదో, నాటి సాంఘిక జీవనమెలా సాగేదో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది 5010010077043 1923
తిలక్ మహాశయుని జీవితము [90] మానికొండ సత్యనారాయణశాస్త్రి జీవితచరిత్ర బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak)(మరాఠీ: बाळ गंगाधर टिळक) (1856 జూలై 23 - 1920 ఆగస్టు 1)ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు. ఈయనకు లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది. ఆయన జీవితంతో పాటుగా ఆయన సంపూర్ణ ఉపన్యాస పాఠాలు కూడా ఈ గ్రంథంలో అందించారు. 2020010001221 1950
త్రివర్గము [91] పూతలపాటి శ్రీరాములురెడ్డి ద్విపద కావ్యం 2020010008943 1955
త్రివేణి(1934 జులై, ఆగస్టు సంచిక) [92] సంపాదకుడు: కె.రామకోటేశ్వరరావు మాసపత్రిక 2020050003974 1934
త్రివేణి(1948 జూన్ సంచిక) [93] సంపాదకుడు: కె.రామకోటేశ్వరరావు మాసపత్రిక 2020050003978 1948
త్రివేణి(1934 నవంబరు, డిసెంబరు సంచిక) [94] సంపాదకుడు: కె.రామకోటేశ్వరరావు మాసపత్రిక 2020050003976 1934
త్రిశూలము(పుస్తకం) [95] విశ్వనాథ సత్యనారాయణ చారిత్రాత్మక నాటకం 9000000004526 1956
తీర్థపు రాళ్ళు [96] వివినమూర్తి కథా సంపుటి 2990100071711 2003
తీరని కోరిక-తరువాత [97] గంగాధర రామారావు నాటిక వాగనుశాసనుడు, మేనక వంటి పాత్రలతో, కానిస్టేబుల్ వంటి ఇటివలి పాత్రలు కలిపి రాసిన నాటిక ఇది. పిఠాపురం యువరాజైన గంగాధర రామారావు దీనిని రాసి, అనంత కాలచక్రంలో నలిగిపోతున్న సామాన్యులకు అంకితమిచ్చారు. 2020120002047 1941
తీరన కోరికలు(పుస్తకం) [98] శ్రీవాత్సవ నాటకం 9000000004684 1952
తీరని బాకీ(పుస్తకం) [99] మలయాళ మూలం:కుట్టిపుజ కృష్ణపిళ్ళై, అనువాదం:పుట్టపర్తి నారాయణాచార్యులు నాటకాల సంపుటి, అనువాదం 9000000004981 1959
తీరని భయం(పుస్తకం) [100] ఎస్.గంగప్ప కథా సాహిత్యం, కథల సంపుటి 2020120002100 1985
తీర్పు(పుస్తకం) [101] ధనికొండ హనుమంతరావు నవలిక 2020050015030 1957
తీర్పు మీదే(పుస్తకం) [102] ఎస్.వివేకానంద నాటిక 2020120029985 1984
తుపాను(పుస్తకం) [103] అడివి బాపిరాజు నవల 9000000005057 1945
తుఫాన్ మెయిల్(పుస్తకం) [104] కె.ఎల్.నరసింహారావు డిటెక్టివ్ నవల 9000000004988 1955
తురుష్క ప్రజాస్వామికము [105] అయ్యదేవర కాళేశ్వరరావు చరిత్ర అయ్యదేవర కాళేశ్వరరావు 20వ శతాబ్ది మధ్యలో తెలుగు వారికి ప్రపంచదేశాల పోకడలు, చరిత్ర వంటివి తెలిపి విజ్ఞానవంతులని చేయడంలో అపురూపమైన పాత్ర పోషించారు. అనేకమైన ఖండాంతర విశేషాలతో ప్రామాణికమైన చరిత్ర గ్రంథాలు రచించి తెలుగువారిని ఉత్సాహపరిచారు. ఈ క్రమంలోనే ఆయన రాసిన టర్కీ చరిత్ర ఈ గ్రంథం. టర్కీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వివేకవంతంగా తటస్థ పాత్ర పోషించింది. అటు ఐరోపా, ఇటు ఆఫ్రికా, మరోవైపు ఆసియా ఖండాల నడుమ విస్తరించిన ఈ విలక్షణమైన దేశం బైజాంటియన్ కాలం నుంచీ ప్రపంచ చరిత్రలో ప్రాధాన్యత వహించింది. సంపద్వంతమైన ఆసియా ప్రాంతాలకు భూమార్గంగా ఉపయోగపడే ప్రాంతం కావడంతో ఇక్కడి అంగుళం అంగుళం పొందేందుకు కూడా రక్తసిక్త యుద్ధాలు జరిగాయి. అలాగే అద్భుతమైన సామ్రాజ్యాలు ఇక్కడ నిర్మితమయ్యాయి. క్రమంగా పాశ్చాత్యులకు అమెరికా ఉందని తెలియరావడం, భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత తగ్గింది. ఐతే 20వ శతాబ్దంలో కెమెల్ బాషా అనే మహానేత పరిపాలనలో ఈ ప్రాంతపు ఆదర్శాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మధ్యప్రాచ్యంలో పురోగామిగా ప్రజాస్వామ్య విలువలు, లౌకికత్వం పుణికిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ భారతదేశపు పౌరులను, నేతలను ఉత్సాహపరిచేందుకు ఆ దేశ విజయగాథ వివరించారు కాళేశ్వరరావు 2990100051839 1959
తులసీ దేవి [106] ముత్తనేని వెంకట చెన్నకేశవులు నాటకం తులసీ జలంధర అని పురాణ ప్రసిద్ధమైన గాథను స్వీకరించి నాటకంగా రచించారు. ఈ నాటకాన్ని సినిమా స్క్రిప్టుగా చిత్రీకరించేందుకు అనుకూలంగా తయారుచేసినట్టు ప్రచురణలోనే ప్రకటించారు. 2030020024910 1932
తులసీ రామాయణం [107] భాగవతుల నృశింహశర్మ పద్యకావ్యం, అనువాదం వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు. సంస్కృత రామాయణాన్ని కొన్ని చోట్ల విభేదించినా తులసీ రామచరితమానస్ వాల్మీకం కన్నా ప్రామాణికమని హిందీ భాషీయులు నమ్ముతూంటారు. ఆ తులసీ రామాయణానికి ఇది అనువాదం. 2030020025425 1925
తులసి పూజా విధానము [108] పాటిల్.నారాయణరెడ్డి వైద్య శాస్త్రం ఈ గ్రంథంలో 40 రోగాలకు చికిత్సా విధానాలను తెలియజేయడం జరిగింది. 2020120007746 1994
తూర్పురేఖలు [109] వేదుల శకుంతల సాహిత్యం ఇది సాంఘిక నవల. కుటుంబజీవనానికి సంబంధించిన కథాంశంతో రచయిత్రి ఈ నవలను రచించారు. 2020120033067 1976
తూలిక(పుస్తకం) [110] ముద్దా విశ్వనాథం కథల సంపుటి 9000000004692 1937
తెగిన జ్ఞాపకాలు [111] సంజీవదేవ్ ఆత్మకథ డా.సూర్యదేవర సంజీవ దేవ్ (ఆంగ్లం: Suryadevara Sanjeevdev) (1924 జూలై 3 - 1999 ఆగస్టు 25) ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను తెగిన జ్ఞాపకాలు పేరిట రచించాడు. 2020120002048 1970
తెనాలి రామకృష్ణ [112] మూలం: టి.సుందరమ్మ, అనువాదం:పి.రాధా చలపతి జీవితచరిత్ర 2020120007735 1991
తెనాలి రామకృష్ణ కవి చరిత్రము [113] వేంకట సూర్యప్రకాశరావు సాహిత్యం తెలుగు సాహిత్యంలో తెనాలి రామకృష్ణకవి ప్రబంధ యుగానికి చెందిన పాండురంగ మహాత్మ్య కవిగా పేరుపొందితే చాటు సంప్రదాయంలో, జానపదుల కథల్లో కృష్ణదేవరాయల ఆస్థానంలో హాస్యం, చమత్కారాలతో మెప్పించే వికటకవి. తెనాలి రామకృష్ణుని ఈ రెండు రూపాలను అనుసంధిస్తూ కవిగా, వికటకవిగా పేరుపడ్డ కథలను చేర్చి ఈ గ్రంథం రచించారు. అమ్మవారి వరంతో కవిగా, శాపంతో వికటకవిగా మారిన అనంతరం రామకృష్ణుడు కృష్ణరాయల ఆస్థానంలో పలువురితో చేసిన సల్లాపాలను గ్రంథంగా రచించారు. 2030020024406 1954
తెనాలి శతావధానము [114] వేలూరి శివరామ శాస్త్రి సాహిత్యం 2020120002081 1911
తెనుగు కవుల చరిత్ర [115] నిడదవోలు వెంకటరావు సాహిత్య విమర్శ, సాహిత్యం, చరిత్ర తెనుగు కవుల చరిత్రమన్న పేరు పెట్టినా నిజానికి ఇది తెలుగు సాహిత్యంలోని వివిధాంశాలను కలిపి రచించారు. ప్రాౙ్నన్నయ యుగం నాటె తెలుగు శాసనాల్లోని సాహిత్యం నుంచి మొదలుపెట్టి తెలుగు కవుల, సాహిత్యాంశాల, ఛందస్సుల పరిణామ క్రమం, చరిత్ర వంటివి ఆధారసహితంగా వివరించారు. ఈ గ్రంథ రచయిత నిడదవోలు వెంకటరావు నాటీ మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థకు అధిపతిగా వ్యవహరించారు. ఈ గ్రంథాన్ని మద్రాసు విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. 2990100051830 1953
తెనుగు-ఇంగ్లీష్ నిఘంటువు [116] సి.పి.బ్రౌన్ భాష చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (ఆంగ్లం:Charles Phillip Brown) (1798 నవంబరు 10 - 1884 డిసెంబరు 12) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. 2990100073465 1953
తెనుగు తల్లి [117] వేదాంత కవి నాటకం 2030020025106 1954
తెనుగు తోట [118] రాయప్రోలు సుబ్బారావు సాహిత్యం 2020120002084 1913
తెనుగు తోబుట్టువులు [119] మారేపల్లి రామచంద్ర శాస్త్రి సాహిత్యం, భాష 2030020025649 1935
తెనుగు దుక్కి [120] ఖండవల్లి లక్ష్మీరంజనం వ్యాస సంపుటి 2020120002082 1936
తెనుగు మీరా [121] రామచంద్ర కౌండిన్య సంగీతం 2020010002736 1956
తెనుగు లఘు వ్యాకరణము [122] వేదము వేంకటరమణ శాస్త్రి సాహిత్యం, భాష, వ్యాకరణం 9000000004392 1951
తెనుగు లెంక తుమ్మల సమగ్ర సాహిత్యము-3(ఖండకావ్యములు) [123] తుమ్మల సీతారామమూర్తి సాహిత్యం 2990100051831 2001
తెనుగు సాహితి [124] దేవులపల్లి రామానుజరావు సాహిత్యం 2990100071702 1986
తెనుగు సీమ [125] జంధ్యాల పాపయ్య శాస్త్రి సాహిత్యం 2020120002083 వివరాలు లేవు
తెరచాటు [126] జాషువా నాటకం 2020050015535 1946
తెరలో తెర [127] కొర్రపాటి గంగాధరరావు నాటకం 2020010002579 1957
తెరువరి [128] చివలూరి లక్ష్మీనరసింహాచార్యులు గేయ నాటిక 2030020025371 1954
తెలంగాణా రైతు సమస్యలు [129] చలసాని వాసుదేవరావు, నండూరి ప్రసాదరావు న్యాయ సంబధిత గ్రంథం 1950వ దశకంలో హైదరాబాదు సంస్థానంలో రైతుల సమస్యలు, న్యాయ సంబధమైన సలహాలు, వ్యవసాయ చట్టాల గురించి ఈ పుస్తకంలో రచయితలు వివరించారు. 9000000004500 1952
తెలంగాణా ఆంధ్రోద్యమము [130] మాడపాటి హనుమంతరావు చరిత్ర, భాష నిజాం పాలనలో తెలంగాణా ప్రాంతంలో ఆంధ్రోద్యమాన్ని చేసిన మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహునిగా చరిత్రకెక్కారు. తెలంగాణా ప్రాంతంలో ఆనాడు కొనసాగుతున్న భాషా సంస్కృతుల పరంగా తెలుగువారి అణచివేతను ఎదుర్కునే ప్రయత్నాలు చేశారాయన. ఈ గ్రంథంలో నిజాం రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతాలు, వాటిలో ఆంధ్రుల భాషా సంస్కృతుల అణచివేత, దాన్ని ఎదిరిస్తూ ప్రారంభమైన ఆంధ్రోద్యమం, దానికి మద్దతు, వ్యతిరేకత వంటి వివరాలు అందించారు. ఈ అంశాలను పలు పత్రికల ఆధారంగా, స్వీయానుభవాల ఆధారంగా రచన చేశారు. 2020050005802 1949
తెలంగాణా రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం [131] జయాధీర్ తిరుమలరాఫు చరిత్ర, భాష తెలంగాణా సాయుధ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాదు‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాదు‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీనేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది. రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో వెలువడ్డ సాహిత్యంపై జరిగిన పరిశోధన ఇది. 2990100067551 1998
తెలంగాణా శాసనములు-2 [132] పరిశోధకులు: పి.శ్రీనివాసాచారి చరిత్ర, భాష తెలంగాణా ప్రాంతంలో దొరికిన కొన్ని శాసనాలను పరిశోధకులు శ్రీనివాసాచారి ఈ పుస్తకంలో పొందుపరిచారు. 2020050005903 1960
తెలంగాణాలో జాతీయోద్యమాలు [133] దేవులపల్లి రామానుజరావు చరిత్ర, భాష హైదరాబాదు‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు. ఆ హైదరాబాదు రాజ్యంలోని తెలుగు ప్రాంతం తెలంగాణాలో ఏర్పడిన జాతీయోద్యమాలకు సంబంధించిన గ్రంథమిది. 2990100061880 1991
తెలంగాణా ప్రజల సాయిధ పోరాట చరిత్ర [134] దేవులపల్లి వెంకటేశ్వరరావు చరిత్ర, భాష తెలంగాణా సాయుధ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాదు‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాదు‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీనేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది. రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఆ పోరాటాన్ని గురించిన రచన ఇది. 2040100047337 1988
తెల్ల చక్కెర వలని విపత్తు [135] మూలం: జె.ఎల్లిసుబార్కర్, అనువాదం:జ్ఞానంబ సామాన్య శాస్త్రం 2020120002092 1929
తెల్లని రక్తం [136][dead link] మూలం.నానక్ సింగ్, అనువాదం.పోకూరి శ్రీరాములు నవల, అనువాదం తెల్లని రక్తం నిస్సారమైన, నిస్తేజమైన సమాజానికి ప్రతీక. సారభూతమైన నీతి నియమాలు, నియతి వంటివి పోగొట్టుకున్న సమాజాన్ని దర్శింపజేసి దాన్ని సునిశితంగా విమర్శించారు రచయిత. ఈ నవలలో పంజాబీ సమాజాన్ని చిత్రీకరించారు. అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా పంజాబీ నుంచి అనువదించి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రకటించారు. 99999990175621 1972
తెలివిడి నుండి స్వేచ్ఛ [137] జిడ్డు కృష్ణమూర్తి తత్త్వం జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు. ఆ క్రమంలో చేసిన ప్రసంగ పాఠాల అనువాదం ఇది. 2990100051816 1990
తెలుగు అథర్వ వేద సంహిత-4 [138] అనువాదం: విద్వాన్ విశ్వం సాహిత్యం సంస్కృతంలోని అథర్వ వేద సంహితను విశ్వం తెలుగులోకి మంత్ర పద పాఠ సహితంగా అనువదించారు. ఇది నాలుగవ సంపుటి. 1990020047894 1989
తెలుగు అథర్వ వేద సంహిత-5 [139][dead link] అనువాదం: విద్వాన్ విశ్వం సాహిత్యం సంస్కృతంలోని అథర్వ వేద సంహితను విశ్వం తెలుగులోకి మంత్ర పద పాఠ సహితంగా అనువదించారు. ఇది ఐదవ సంపుటి. 1990020047895 1989
తెలుగు అధికార భాష [140] వావిలాల గోపాలకృష్ణయ్య భాష కళా ప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య (1906 సెప్టెంబరు 17 - 2003 ఏప్రిల్ 29)భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు మరియు పద్మ భూషణ పురస్కార గ్రహీత. అధికార భాషగా తెలుగు భాష నిర్ధారణ పొందిన కొన్నేళ్ళకు ఆ విషయంపై రాసిన రచన ఇది. 2020120029955 1975
తెలుగు ఉత్తర-భారత సాహిత్యాలు [141] భీమసేన్ నిర్మల్, ఇరువెంటి కృష్ణమూర్తి సాహిత్యం, భాష, ప్రత్యేక సంచిక మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు సాంస్కృతిక, కళలు, సాహిత్యం గురించి గ్రంథాలను రాయించారు. అలా తెలుగుకు ఇతర భారతీయ భాషలకు ఉన్న సంబంధాన్నీ, తెలుగు సాహిత్యం గురించి రాసిన ప్రత్యేక సంచికే ఈ పుస్తకం. 2990100067556 1975
తెలుగులో ఋతుకావ్యాలు [142] సి.వి.జయవీర్రాజు సాహిత్యం 2990100067557 1989
తెలుగు ఉపవాచకం-8తరగతి [143] ఎస్.గంగప్ప వాచకం 2020120021359 1985
తెలుగు (ద్విదశాబ్ది ప్రత్యేక సంచిక)-జులై, ఆగస్టు [144] సంపాదకుడు: వి.కొండలరావు త్రైమాసపత్రిక 2990100049742 1988
తెలుగు (1973 ఏప్రిల్-జూన్ సంచిక) [145] సంపాదకుడు: వి.కొండలరావు త్రైమాసపత్రిక 2990100066710 1973
తెలుగు కథలు(1910-2000) [146] ప్రధాన సంపాదకుడు:కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యం 2990100071697 2002
తెలుగు కథకులు కథన రీతులు-రెండవ సంపుటి [147] సంకలనం:మధురాంతకం రాజారాం, సింగమనేని నారాయణ సాహిత్యం, సాహితీ విమర్శ 2990100071698 2000
తెలుగు కథకులు కథన రీతులు-మూడవ సంపుటి [148] సంకలనం:సింగమనేని నారాయణ సాహిత్యం, సాహితీ విమర్శ 2990100071696 2001
తెలుగు కథకులు కథన రీతులు-నాల్గవ సంపుటి [149] సంకలనం:సింగమనేని నారాయణ సాహిత్యం, సాహితీ విమర్శ 2990100071706 2004
తెలుగు కథా సమీక్ష [150] సంకలనకర్త: వేదగిరి రాంబాబు కథా సమీక్షలు 1994లో వివిధ పత్రికల్లో ప్రచురించిన కథలను అప్పటి ప్రముఖ సాహితీవేత్తలతో సమీక్షింపజేసారు. ఈ కథలను వేదగిరి రాంబాబు సంకలనం చేశారు. వివిధ పత్రికల్లో వివిధ రచయితలు రాసిన కథల సమీక్షలు సంకలనం చేయడం కోసం రాంబాబు ఎంతో కృషి చేశారు. ఆయా వ్యాసకర్తలతో సమీక్షలు చేయించడంలో ఆయన కృషి ప్రశంసిచదగ్గది. ఈ పుస్తకాన్ని 1995లో ప్రచురించారు. 2990100071177 1995
తెలుగు కథా సమీక్ష [151][dead link] సంకలనకర్త: వేదగిరి రాంబాబు కథా సమీక్షలు 1996లో వివిధ పత్రికల్లో ప్రచురించిన కథలను అప్పటి ప్రముఖ సాహితీవేత్తలతో సమీక్షింపజేసారు. ఈ కథలను వేదగిరి రాంబాబు సంకలనం చేశారు. వివిధ పత్రికల్లో వివిధ రచయితలు రాసిన కథల సమీక్షలు సంకలనం చేయడం కోసం రాంబాబు ఎంతో కృషి చేశారు. ఆయా వ్యాసకర్తలతో సమీక్షలు చేయించడంలో ఆయన కృషి ప్రశంసిచదగ్గది. ఈ పుస్తకాన్ని 1997లో ప్రచురించారు. 2020120000003 1997
తెలుగు కథా సమీక్ష [152] సంకలనకర్త: వేదగిరి రాంబాబు కథా సమీక్షలు 1997లో వివిధ పత్రికల్లో ప్రచురించిన కథలను అప్పటి ప్రముఖ సాహితీవేత్తలతో సమీక్షింపజేసారు. ఈ కథలను వేదగిరి రాంబాబు సంకలనం చేశారు. వివిధ పత్రికల్లో వివిధ రచయితలు రాసిన కథల సమీక్షలు సంకలనం చేయడం కోసం రాంబాబు ఎంతో కృషి చేశారు. ఆయా వ్యాసకర్తలతో సమీక్షలు చేయించడంలో ఆయన కృషి ప్రశంసిచదగ్గది. ఈ పుస్తకాన్ని 1998లో ప్రచురించారు. 2020120028775 1998
తెలుగు కన్నడ భారతముల తులనాత్మక పరిశీలనము [153] బి.వి.ఎస్.మూర్తి సాహిత్యం 2040100047341 1991
తెలుగు కవిత:సాంఘిక సిద్ధాంతాలు [154] ముదిగొండ వీరభద్రయ్య సాహిత్యం, సాహితీ విమర్శ 2020120035932 1980
తెలుగు కవితా వికాసం(1947-1980) [155] కడియాల రామమోహన్ రాయ్ సాహిత్యం 2990100071700 1980
తెలుగు కవుల సంస్కృత ప్రయోగాలు [156] జాస్తి సూర్యనారాయణ సాహిత్యం, సాహితీ విమర్శ 2020120002055 1985
తెలుగు కవులు [157] మహావాది వేంకటరత్నం సాహిత్యం 9000000004680 1957
తెలుగు కావ్యదర్శనము [158] అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం, సాహితీ విమర్శ 5010010088596 1920
తెలుగు కావ్యమాల [159] కాటూరి వేంకటేశ్వరరావు సాహిత్యం 9000000004352 1959
తెలుగు కావ్యములు[160] మదిన సుభద్రయ్యమ్మ కావ్యాలు తెలుగు కావ్యములు మదిన సుభద్రయ్యమ్మ 1893 సంవత్సరంలో రచించిన పుస్తకం. దీనిని కవయిత్రి మేనల్లుళ్లయిన శ్రీ రాజా గోడె నారాయణ గజపతి రాయనింగారు సి. ఐ. ఇ. వారివల్ల ఎడిట్ చేయబడి శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యులయ్యవారలుంగారిచే విశాఖపట్నంన ఆర్యవర ముద్రాశాలలో అచ్చువేసి ప్రకటింపంబడెను. 2020050018439 1893
తెలుగు క్రీడా జగత్తులో ఆదిపురుషులు [161] ఏకా వేంకట సుబ్బారావు సాహిత్యం, సాహితీ విమర్శ 2990100071701 2000
తెలుగు గజళ్ళు [162] సి.నారాయణరెడ్డి భాష, సాహిత్యం సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. ఆయనకు 1988లో విశ్వంభరకావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గజల్ అనే ఉర్దూ కవితా ప్రక్రియను తెలుగులో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సినారె రాసిన తెలుగు గజళ్ళ సంకలనం ఇది. 2990100067553 1986
తెలుగు జాతీయములు- ప్రథమ భాగము [163] నాళము కృష్ణారావు సాహిత్యం 2020120021343 1940
తెలుగు జానపద గేయ గాథలు [164] వ్యాఖ్యాత, సంకలనకర్త. నాయని కృష్ణకుమారి తెలుగు సాహిత్యం జానపద సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్కృతిలోనైనా ప్రముఖమైన అంశం. జానపదులు అంటే జనసామాన్యం కాగా వారు రచించే సాహిత్యం వారి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ క్రమంలో అటు సాహిత్య అధ్యయన పరులు, ఇటు సామాజిక వేత్తలు కూడా జానపద సాహిత్యంపై ఆసక్తి చూపుతారు. తెలుగు జానపద సాహిత్యాన్ని గురించి ప్రామాణికమైన అధ్యయనం చేసి వివిధ స్త్రీల గీతాలు, వీరారాధన గాథలు వంటి బహుముఖీనంగా విస్తరించిన సాహిత్యంపై పరిశోధన ఫలాలు ప్రచురించిన రచయిత్రి నాయని కృష్ణకుమారి. ఆమె పలు రచనలు చేసినా జానపద సాహిత్యంపై చేసిన ఈ పరిశోధనకే తెలుగు సాహిత్యరంగంలో ప్రాచుర్యం కలిగింది. జానపద గేయాలను పలు అధ్యాయాలుగా వింగడించి ఈ గ్రంథం ద్వారా ప్రచురించారామె 2990100061883 1977
తెలుగు జానపద గేయ సాహిత్యము [165] బి.రామరాజు సాహిత్యం 9000000005142 1958
తెలుగు తమిళ లాలి పాటలు-భాషా సామాజిక పరిశీలన [166] పరిశోధన:డి.విజయలక్ష్మి భాష, సాహిత్యం, సిద్ధాంత వ్యాసం 2990100049744 1999
తెలుగు తల్లి (ఆంధ్ర బాల సర్వస్వము) [167] మాగంటి బాపినీడు విజ్ఞానసర్వస్వం మాగంటి బాపినీడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకడు. ఇతని భార్య మాగంటి అన్నపూర్ణాదేవి కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్రి, సమాజ సేవిక. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని "ఆంధ్ర సర్వస్వము" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించాడు. బాలల గురించి విజ్ఞాన సర్వస్వ తరహాలోనే వినోదాన్ని, విజ్ఞానాన్ని మేళవిస్తూ చక్కని ఫోటోలు, బొమ్మలతో రూపొందించిన గ్రంథమిది. 2030020025645 1946
తెలుగు నవల [168] అక్కిరాజు రమాపతిరావు వ్యాస సంపుటి అక్కిరాజు రమాపతిరావు మంజుశ్రీ పేరుతో ప్రసిద్ధులు. తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు. 1975ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి అప్పటినుంచి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం మొదలుపెట్టారు. మొట్టమొదటి మహాసభలకు తెలుగు సాంస్కృతిక, కళలు, సాహిత్యం గురించి గ్రంథాలను రాయించారు. అలా రమాపతిరావు తెలుగులోని నవల గురించి రాసినదే ఈ "తెలుగు నవలా" పుస్తకం. 2020120002063 1975
తెలుగు నవలల్లో తెలంగాణ జనజీవనం [169] మారంరాజు ఉదయ పరిశోధనాత్మక గ్రంథం 2990100067555 1999
తెలుగు నాటక వికాసం [170] పోణంగి శ్రీరామ అప్పారావు వ్యాస సంపుటి పోణంగి శ్రీరామ అప్పారావు నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈ పుస్తకమే కాక ఆంధ్ర సాహిత్య పరిషత్ వారు తెలుగు నాటక సాహిత్యం పుస్తకంలో తెలుగులో పౌరాణిక నాటకాల గురించి పోణంగి శ్రీరామ అప్పారావు ప్రసంగించిన వాటిని వ్యాసాలుగా ప్రచురించారు. 6020010029964 1967
తెలుగు నాటక సాహిత్యం [171] ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యాస సంపుటి ఆంధ్ర సాహిత్య పరిషత్ నిర్వహించే నెలవారీ సభలో తెలుగు నాటకాలు, నాటికల గురించి పలుఫురు వక్తలు చేసిన ప్రసంగాలను సంకలనం చేసి పరిషత్ వారు 1985-86 సంవత్సరంలో పుస్తక రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో తెలుగులో పౌరాణిక నాటకాల గురించి పోణంగి శ్రీరామ అప్పారావు, సామాజిక నాటకాల గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నాటికల గురించి కొర్రపాటి గంగాధరరావు ప్రసంగించిన వాటిని వ్యాసాలుగా ప్రచురించారు. 2020120002062 1986
తెలుగు నిఘంటువు [172] ఎస్.కె.వెంకటాచార్యులు నిఘంటువు 2020120021345 1998
తెలుగు నిఘంటువు [173] జి.ఎన్.రెడ్డి నిఘంటువు 2990100051820 1989
తెలుగు పర్యాయపద నిఘంటువు [174] జి.ఎన్.రెడ్డి నిఘంటువు 2020120012744 1990
తెలుగు పరిచయ వాచకం వ్రాతపని పుస్తకం [175] పి.దక్షిణామూర్తి సాహిత్యం 2020120021356 1981
తెలుగు పూలు [176] నార్ల చిరంజీవి బాలల సాహిత్యం, గేయాలు 5010010016850 1958
తెలుగు పొడుపుకథలు [177] కసిరెడ్డి సాహిత్యం 2990100051821 1990
తెలుగు బాలగేయ సాహిత్యం [178] ఎం.కె.దేవకి భాష, సాహిత్యం ఏ భాషలోనైనా బాలలకు ప్రత్యేక సాహిత్యం ఉండడం తప్పనిసరి అని అంటుంటారు సాహితీవేత్తలు. ఎందుకంటే చిన్నవయసు నుంచే సాహిత్యం చదవడం నేర్పాలి కానీ, అన్ని రకాల పుస్తకాలూ చదివి అర్ధం చేసుకోలేరు కాబట్టి వారి కంటూ కొంత సాహిత్యం ఉండి తీరాలనేది వారి వాదన. అసలు బాల సాహిత్యం అంటే ఏమిటి? ఆ గేయాలు ఏంటి? వంటి విషయాలు రచయిత ఈ పుస్తకంలో రాశారు. 2990100051817 1983
తెలుగు బ్రహ్మ పురాణం [179] జనమంచి శేషాద్రి శర్మ సాహిత్యం 5010010079808 1930
తెలుగు బోధన పద్ధతులు [180] డి.సాంబమూర్తి భాష, సాహిత్యం తెలుగు భాషను బోధించాల్సిన విధానాన్ని భాషా బోధకులకు విశదపరిచే గ్రంథమిది. బీఈడీ వారికి పాఠ్య గ్రంథమే అయినా దానిని తెలుగుపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చదివేందుకు వీలుగా ఉంది. 2020120012742 1995
తెలుగు భాష బోధనా ప్రకాశిక [181] వడ్డి బాలిరెడ్డి భాష, సాహిత్యం తెలుగు భాషను బోధించాల్సిన విధానాన్ని భాషా బోధకులకు విశదపరిచే గ్రంథమిది. బీఈడీ వారికి పాఠ్య గ్రంథమే అయినా దానిని తెలుగుపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చదివేందుకు వీలుగా ఉంది. 2020120035928 1995
తెలుగు భాష బోధని [182] పోరంకి దక్షిణామూర్తి భాష, సాహిత్యం ఏ భాషనైన వేరే భాషీయులకు నేర్పడం సులభం కాదు. వ్యవహర్తలకు వ్యాకరణం అర్థం కావాల్సిన ప్రయత్నం లేకుండానే చక్కని భాష వచ్చేస్తుంది. ఐతే అది ఎలానో ఇతరులకు నేర్పాలంటే మాత్రం ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ఆ ఇతరులు ఆ భాష మాతృభాషగా, వ్యావహారిక భాషగా లేనివారైతే సమస్య రెట్టింపవుతుంది. అలాంటి సమస్యలకు సమాధానం ఈ గ్రంథం. ఇతర భాషా వ్యవహర్తలకు తెలుగు సులభంగా నేర్పేందుకు ఇది ఉద్దేశించింది. 2020120002053 1968
తెలుగు భాష బోధని-మొదటి భాగం [183] ఉత్పల సత్యనారాయణాచార్య భాష, సాహిత్యం 2020120002054 1968
తెలుగు భాష చరిత్ర [184] సంపాదకులు: భద్రిరాజు కృష్ణమూర్తి భాష, సాహిత్యం ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించాడు. ఆయన రచించిన ప్రామాణిక గ్రంథమిది. 2020120029956 1979
తెలుగు భాష సాహిత్యాలు-కొమ్మర్రాజు లక్ష్మణరావు [185] పాలుకుర్తి మధుసూదనరావు భాష, సాహిత్యం తెలుగు భాషాకు కొమ్మర్రాజు లక్ష్మణరావు చేసిన సేవలు, ఆయన పాత్ర, తెలుగు సాహిత్యంపై ఆయన భావాల ప్రభావం గురించి రచయిత చేసిన సిద్ధాంత గ్రంథమిది. 2990100051818 1984
తెలుగు మరుగులు [186] సంగ్రహకుడు: చీమకుర్తి శేషగిరిరావు భాషాశాస్త్రం తెలుగు గోష్ఠి అనే సంస్థ నిర్వహించిన సమావేశాలలో మరుగునపడిన తెలుగు సంస్కృతి, పూర్వీకుల కృషి, పరికరాలు, నాణాలు, పదాలు, శాసనాలు, తెలుగు పేర్లు, అజ్ఞాతంగా ఉన్న చరిత్ర గురించి చర్చించి పలువురు సభ్యులు రాసిన వ్యాసాలను సంగ్రహుకునిగా వ్యవహరించిన చీమకుర్తి శేషగిరిరావు "తెలుగు మరుగులు" పేరుతో సంస్థ సహకారంతో ఇలా పుస్తక రూపంలోకి తెచ్చారు. 2990100067554 1992
తెలుగు మాండలికాలు :కరీంనగర్ జిల్లా [187] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది కరీంనగర్ జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120029959 1979
తెలుగు మాండలికాలు :కర్నూలు జిల్లా [188] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది కర్నూలు జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120029962 1984
తెలుగు మాండలికాలు :చిత్తూరు జిల్లా [189] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది చిత్తూరు జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120002058 1983
తెలుగు మాండలికాలు :మెహబూబ్ నగర్ జిల్లా [190] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది మెహబూబ్ నగర్ జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120021354 1999
తెలుగు మాండలికాలు :వరంగల్లు జిల్లా [191] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది వరంగల్ జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120021353 1977
తెలుగు మాండలికాలు :విశాఖపట్నం జిల్లా [192] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది విశాఖపట్నం జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120021355 1972
తెలుగు మాండలికాలు :శ్రీకాకుళం జిల్లా [193] బూదరాజు రాధాకృష్ణ భాషాశాస్త్రం తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో బూదరాజు రాధాకృష్ణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాండలికాలను, మాండలిక పదాలను సేకరించి, అధ్యయనం చేసి తయారుచేసిన గ్రంథపరంపరలో ఇదీ ఒకటి. జిల్లా మాండలికాన్ని తయారుచేసేప్పుడు ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీకరించి ఒక్కో ప్రాంతంలోనూ బ్రాహ్మణ, రెడ్డి, కాపు, రజక, దళిత మొదలైన వర్గాల వ్యవహర్తలకు ముందుగా తయారుచేసిన నమూనా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రానికి అనుగుణంగా వారు సమాధానాలు చెప్తూంటే వారి మాటలను రికార్డుచేసుకుని విశ్లేషించి దీనిని రచించారు. ఒక్కో వ్యవహర్త చదువు, వయస్సు, వృత్తి వంటివి కూడా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో తయారు చేసిన ఈ గ్రంథం భాషా శాస్త్ర అధ్యయనంలో చాలా ఉపయోగకారి. ఇది శ్రీకాకుళం జిల్లా మాండలీకాలకు సంబంధించిన పుస్తకం. 2020120035936 1984
తెలుగు ముత్తరాజుల సంగ్రహ చరిత్ర [194] చెట్టి లక్ష్మయ్య ముత్తరాజు చరిత్ర, పరిశోధనాత్మక గ్రంథం ముత్తరాజులు తెలుగు రాజులు. మధుర, తంజావూరును పరిపాలించిన నాయక రాజులు, విజయనగర సంస్థానాన్ని పరిపాలించిన తుళువ, ఆరేటి వంశాల రాజులు, అనెగొందిని పరిపాలించిన సంస్థానాధీశులు కూడా ముత్త రాజులు అని ఈ పుస్తకంలో రచయిత పలు సాక్ష్యాల ద్వారా వివరించారు. ఋగ్వేదకాలం నుండి 20శతాబ్దం వరకూ లభించిన ఆధారాల ద్వారా ఆయా రాజులు ముత్తరాచలని రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నారు. 2020120002061 1988
తెలుగు మెరుగులు [195] వేటూరి ప్రభాకరశాస్త్రి వ్యాస సంపుటి వేటూరి ప్రభాకరశాస్త్రి, తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే. భారతి మాసపత్రిక, గృహలక్ష్మి మాసపత్రిక, వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా పరిషత్సంచికలోనూ, రేడియోలోనూ ప్రకటితమైన ప్రభాకరశాస్త్రిగారి వ్యాసాలను ఈ పుస్తకంలో సంపుటిగా వెలువరించారు. 2030020025452 1929
తెలుగు తీరులు [196] ప్రచురణ:తెలంగాణా రచయితల సంఘం సాహిత్యం, వ్యాస సంపుటి ఈ పుస్తకం తెలంగాణా రచయితల సంఘం ప్రచురించింది. ఈ పుస్తకంలో పుట్టపర్తి నారాయణాచార్యులు తెనాలి రామకృష్ణుని తెనుగు కవిత అంశం మీద, దివాకర్ల వేంకటావధాని విజయవిలాసము అంశం పైనా రాసిన వ్యాసాలను సంపుటిగా చేసి ప్రచురించారు. 2030020024562 1953
తెలుగు రచన [197] కె.వి.సుందరాచార్యులు సాహిత్యం, భాష 2020120029954 1980
తెలుగు రచన తప్పుల దిద్దుబాటు [198] వారణాశి రామబ్రహ్మం సాహిత్యం 2020120002068 వివరాలు లేవు
తెలుగు రచయితలు-రచనలు(1875-1980) [199] సంకలనకర్త:నే.శ్రీ.కృష్ణమూర్తి సాహిత్యం 2020120002067 1984
తెలుగురాజు [200] సత్యనారాయణరాజు పద్యకావ్యం 2020010002283 1958
తెలుగు రాజుకృతులు [201] పెనుమెచ్చ సత్యనారాయణరాజు సాహిత్యం 2020010014240 1954
తెలుగు వచన వికాసము [202] ఎం.కులశేఖరరావు సాహిత్యం 6020010029974 1975
తెలుగు వాక్యం [203] చేకూరి రామారావు భాషాశాస్త్రం తెలుగు వాక్యం దాని నిర్మాణంపై ప్రముఖ విమర్శకుడు, భాషావేత్త చేకూరి రామారావు రచించిన గ్రంథమిది. విమర్శకునిగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన మౌలిక పరిశోధన చేసింది మాత్రం భాషాశాస్త్రంపై కావడం విశేషం. ఆయన ఈ క్రమంలో చేసిన పరిశోధనలకు "తెలుగు వాక్యం" సంగ్రహరూపం. అమెరికాలోని కోర్నెల్ విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంపై ఎం.ఎ, పి.హెచ్.డి., సంపాదించారు. తెలుగు వాక్య నిర్మాణాన్ని ఇంత మౌలికంగా, సాధికారికంగా పరిశోధించినవారు లేకపోవడంతో ఆయన రాసిన ఈ గ్రంథాన్ని భాషా పరిశోధకులు అత్యంత విలువైనదిగా పరిగణిస్తున్నారు. కేంద్ర సివిల్ సర్వీస్ పరీక్షలకు, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల కోర్సులకు, ఇతర పోటీ పరీక్షలకు దీని ప్రామాణ్యత, ప్రాసంగికత కారణంగా పాఠ్యగ్రంథమైంది. 2020120029976 1975
తెలుగు వాచకం-5తరగతి [204] ఎస్.నారాయణరావు, కుంటుముక్కల లక్ష్మీనారాయణశర్మ వాచకం 2020120002074 1994
తెలుగు వ్యాకరణము [205] ఎం.విశ్వనాధరాజు సాహిత్యం, భాష, వ్యాకరణం 2020120002079 1998
తెలుగు వ్యాకరణాలపై సంస్కృత, ప్రాకృత వ్యాకరణాల ప్రభావం [206] బేతవోలు రామబ్రహ్మం సాహిత్యం, భాష, వ్యాకరణం 2020120002078 1983
తెలుగు వ్యాస పరిణామము [207] కొలకులూరి ఇనాక్ సాహిత్యం, భాష, సిద్ధాంత గ్రంథం 2020120002080 1980
తెలుగు వ్రాతప్రతుల పట్టిక [208] ప్రచురణ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం సాహిత్యం, భాష, జాబిత 2020120029980 1983
తెలుగు వ్రాతప్రతుల వివరణాత్మక సూచిక-కావ్యములు [209] వి.వి.ఎల్.నరసింహారావు జాబితా, సాహిత్యం తాళపత్రాలు, కాగితంపై వ్రాసిన గ్రంథాలు కలిపి మొత్తం వ్రాతప్రతులన్నింటి వివరాలతో సహా పుస్తకాల జాబితా ప్రచురించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రాచ్య లిఖిత భాండాగారం వెలువరించిన సూచికల్లో ఇది ఒకటి. ఇందులో కావ్యాల సూచికను అందజేశారు. మొత్తంగా 86 గ్రంథాల గురించిన వివరాలు అందజేశారు. ప్రారంభ పద్యాలు, ముగింపు పద్యాలు, ఇతివృత్తం, విశేషాంశాలు, కవి, పత్రాల సంఖ్య వంటి ఇతరల వివరాలతో ప్రచురించారు. విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో ఈ సీరీస్ ఎంతగానో ఉపకరిస్తుంది. 2020120002077 1993
తెలుగు వామన పురాణం [210] రామావఝుల కొండయ్యశాస్త్రి సాహిత్యం, ఆధ్యాత్మికం, పురాణం 2030020025432 1929
తెలుగు వారి ఆది చరిత్రము [211] వివరాలు లేవు సాహిత్యం, చరిత్ర 2020050005720 1927
తెలుగు వారి ఇంటి పేర్లు [212] తేళ్ల సత్యవతి సాహిత్యం 2990100061897 1987
తెలుగు వారి జానపద కళారూపాలు [213] మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జానపదం, సాహిత్యం 2020120029977 1992
తెలుగు వారి సంస్కృత భాషా సేవ [214] పి.శ్రీరామమూర్తి సాహిత్యం, భాష 2020120029978 1975
తెలుగు వాల్మీకము(మానికొండ రామాయణము)-అరణ్య, కిష్కింధకాండము [215] మానికొండ సత్యనారాయణశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 9000000004823 1960
తెలుగు విజ్ఞాన సర్వస్వము-మూడవ సంపుటి [216] సంపాదకులు:మల్లంపల్లి సోమశేఖరశర్మ సాహిత్యం 2020010002782 1958
తెలుగు వ్యుత్పత్తి కోశము-రెండవ సంపుటి [217] సంపాదకుడు:లకంసాని చక్రధరరావు సాహిత్యం, భాష తెలుగు వ్యుత్పత్తి కోశము సంపుటులలో ఇది రెండవ భాగము. ఇందులో క నుండి ఘ వరకు ఉన్న అక్షరాలతో మొదలయ్యే పదాల యొక్క వ్యుత్పత్తులు ఉన్నాయి. 6020010035951 1981
తెలుగు వ్యుత్పత్తి కోశము-మూడవ సంపుటి [218] సంపాదకుడు:లకంసాని చక్రధరరావు సాహిత్యం, భాష తెలుగు వ్యుత్పత్తి కోశము సంపుటులలో ఇది మూడవ భాగము. ఇందులో చ నుండి ణ వరకు ఉన్న అక్షరాలతో మొదలయ్యే పదాల యొక్క వ్యుత్పత్తులు ఉన్నాయి. 6020010035950 1981
తెలుగు వెలుగు [219] శ్రీనివాస సోదరులు సాహిత్యం 2020010008439 1951
తెలుగు వెలుగు చలం [220] పురాణం సుబ్రహ్మణ్య శర్మ సాహిత్యం 2020120021362 1983
తెలుగు వైతాళికులు-1 [221] ప్రచురణ:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపన్యాస సంపుటి 1975 ఆగస్టు నుండి 1976 జనవరి వరకు అకాడమీ వారు తెలుగు భాషకు సేవ చేసిన కొందరి ప్రముఖుల జీవితాంశాలపై మరికొందరు ప్రముఖులు ఉపన్యసించగా వాటిని ఈ సంపుటి రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జీవితం గురించి కె.రంగనాధాచార్యులు, కొమర్రాజు భాషాసేవ గురించి విద్వాన్ విశ్వం, నాయని వేంకట రంగారావు జీవితంపై కేశవవంశుల నరసింహశాస్త్రి, భాషాసేవపై తూమాటి దోణప్ప ఆదిరాజు వీరభద్రరావు జీవితము, భాషాసేవపై గడియారం రామకృష్ణ శర్మ, పరిశోధన, రచనలపై బి.రామరాజు, మాడపాటి హనుమంతరావు జీవితం గురించిఇల్లిందుల సరస్వతీదేవి, భాషా, దేశ సేవలపై జి.వి.సుబ్రహ్మణ్యం ఉపన్యాసాలు పొందుపరిచారు. 6020010002075 1976
తెలుగు వైతాళికులు-2 [222] ప్రచురణ:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపన్యాస సంపుటి 1976 ఏప్రిల్ నుండి 1977 జనవరి వరకు అకాడమీ వారు తెలుగు భాషకు సేవ చేసిన కొందరి ప్రముఖుల జీవితాంశాలపై మరికొందరు ప్రముఖులు ఉపన్యసించగా వాటిని ఈ సంపుటి రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జీవితం గురించి పాతూరి నాగభూషణం, దేశసేవ గురించి కోడి నరసింహం, దువ్వూరి రామిరెడ్డి జీవితంపై మరుపూరు కోదండరామిరెడ్డి, మల్లంపల్లి సోమశేఖర శర్మ జీవితముపై ముక్కామల రాధాకృష్ణశర్మ, త్రిపురనేని రామస్వామి జీవితం గురించి అమరేంద్ర, వేలూరి శివరామ శాస్త్రి గురించి మధునాపంతులు సత్యనారాయణశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు జీవితంపై గౌరిపెద్ది రామసుబ్బశర్మ, పరవస్తు వెంకట రంగాచార్యులు గురించి పురిపండా అప్పలస్వామి, వేటూరి ప్రభాకరశాస్త్రి జీవితం గురించి ఎస్.సచ్చిదానందం చేసిన ఉపన్యాసాలు పొందుపరిచారు. 6020010002076 1977
తెలుగు శాసనాలు [223] జి.పరబ్రహ్మశాస్త్రి సాహిత్యం, చరిత్ర 2020120021347 1975
తెలుగు సందేశకావ్య సమాలోచనం [224] బాపట్ల రాజగోపాలశర్మ సాహిత్యం 2990100051825 1989
తెలుగు సవరా నిఘంటువు [225] గిడుగు రామమూర్తి సాహిత్యం, నిఘంటువు తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. దగ్గర అడవుల్లో ఉండే సవర ల భాష నేర్చుకొని పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. 2040100049743 1914
తెలుగు స్వతంత్ర(1949 ఏప్రిల్ సంచిక) [226] సంపాదకుడు: బృహస్పతి మాసపత్రిక 2020050003167 1949
తెలుగు స్వతంత్ర(1951 జులై సంచిక) [227] సంపాదకుడు: బృహస్పతి మాసపత్రిక 2020050003532 1951
తెలుగు స్వతంత్ర(1951 సెప్టెంబరు సంచిక) [228] సంపాదకుడు: బృహస్పతి మాసపత్రిక 2020050003533 1951
తెలుగు స్వతంత్ర(1951 అక్టోబరు సంచిక) [229] సంపాదకుడు: బృహస్పతి మాసపత్రిక 2020050003534 1951
తెలుగు స్వతంత్ర(1951 నవంబరు సంచిక) [230] సంపాదకుడు: బృహస్పతి మాసపత్రిక 2020050003535 1951
తెలుగు స్వతంత్ర(1951 డిసెంబరు సంచిక) [231] సంపాదకుడు: బృహస్పతి మాసపత్రిక 2020050003536 1951
తెలుగు సమస్యలు [232] వివరాలు లేవు సాహిత్యం 9000000004507 1953
తెలుగు సాంఘిక నాటకం-పరిణామ క్రమం [233] పి.వి. రమణ సాహిత్యం, చరిత్ర 6020010002072 1995
తెలుగు సామెతలు-మూడవ సంపుటి [234] సంపాదకవర్గం:దివాకర్ల వేంకటావధాని, పి.యశోదారెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి సాహిత్యం 2020120035943 1959
తెలుగు సామెతలు [235] రెంటాల గోపాలకృష్ణ సాహిత్యం 2020120002071 1997
తెలుగు సాహిత్య కోశము(ప్రాచీన సాహిత్యం) [236] పరిష్కర్త:బి.విజయభారతి సాహిత్యం, చరిత్ర 2990100051822 1980
చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర [237] మండిగంటి సుజాతారెడ్డి సాహిత్యం, చరిత్ర 2990100071704 1996
తెలుగు సాహిత్యం:గాంధీజీ ప్రభావం [238] మొదలి నాగభూషణశర్మ సాహిత్యం, చరిత్ర 2990100051823 1970
తెలుగు సాహిత్యంలో పేరడి [239] వెలుదండ నిత్యానందరావు సాహిత్యం 2990100051824 1994
తెలుగు సాహిత్యంలో మరో చూపు [240] సంపాదకుడు:కె.కె.రంగనాథాచార్యులు సాహిత్యం 1979 అక్టోబరు నుంచి 1980 సెప్టెంబరు వరకు జరిగిన సారస్వత వేదికలో ప్రముఖులు తెలుగు సాహిత్యంలో మరో చూపు అంశంపై చేసిన ప్రసంగాలను వ్యాసాలుగా మలచి సంపాదకుడు సంకలనంగా వెలువరించారు. ఈ పుస్తకంలో సంపాదకుడు రంగనాథాచార్యులుతో పాటు బూదరాజు రాధాకృష్ణ, కోవెల సంపత్కుమారాచార్య, ఇరివెంటి కృష్ణమూర్తి తదితర ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు ఉన్నాయి. 2020120021358 1981
తెలుగు సాహిత్యంలో హనుమంతుని కథ-పాత్రచిత్రణ [241] ఆర్.ఎస్.సుదర్శనాచార్యులు సాహిత్యం తెలుగు సాహిత్యంలో హనుమతుని పాత్ర అనేకానేక రచనల్లో చిత్రీకరణ పొందింది. ఎందఱో కవులు రచించిన రామాయణాలలోనూ, ఉత్తర రామాయణం వంటి కావ్యాల్లోనూ, రామాయణ విషయంగా రచించిన నాటకంగానూ అనేక రూపాల్లో వచ్చిన రామాయణ సంబంధ రచనల్లో హనుమంతుని పాత్రను అనేకులు రచించారు. ఆయా రచనల్లోని హనుమంతుని కథను, పాత్రచిత్రణను పరిశోధించిన రచియిత ఈ గ్రంథంలో ఆ పరిశోధనా విశేషాలు రచించారు. 2020120004157 1992
తెలుగు సాహిత్యము-శైవమత ప్రభావము-మొదటి భాగము [242] వి.రత్నమోహిని సాహిత్యం 2990100047343 1992
తెలుగు సాహిత్యము-శైవమత ప్రభావము-రెండవ భాగము [243] వి.రత్నమోహిని సాహిత్యం 2990100047344 1992
తెలుగు సాహిత్యములో రామకథ [244] పండ శమంతకమణి సాహిత్యం, ఆధ్యాత్మికం 2020120029970 1972
తెలుగు సాహితీ వస్తు పరిణామం [245] కొలకులూరి మధుజ్యోతి సాహిత్యం 2040100047342 2001
తెలుగు సాహితీ వ్యాస మందారదామం [246] మండిగొండ నరేష్ సాహిత్యం 2990100071703 1998
తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం [247] పరుచూరి గోపాలకృష్ణ సినిమా, సాహిత్యం 2990100051826 2003
తెలుగు సీమ [248] దుగ్గిరాల బలరామకృష్ణయ్య సాహిత్యం 2990100061889 వివరాలు లేవు
తెలుగు సీమ గ్రంథాలయ ప్రగతి [249] సంపాదకులు:జె.కృష్ణాజీ, ఎన్.బి.ఈశ్వరరెడ్డి, ఇ.ఎస్.ఆర్.కుమార్ సాహిత్యం 2020120002073 1983
తెలుగు సీమలో సాంస్కృతిక పునురుజ్జీవనము [250] దేవులపల్లి రామానుజరావు చరిత్ర, భాష విదేశీ శక్తుల ఆక్రమణ, బౌద్ధిక దాడి కారణంగా అంధకారం అలముకున్నదనీ, దానిని 19వ శతాబ్ది ఉత్తరభాగంలో తెలుగువారు సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా పారద్రోలారని వివరిస్తూ ఆ పునరుజ్జీవనం గురించి వివరించిన గ్రంథమిది. 9000000004811 1956
తెలుగు హాస్యం [251] ముట్నూరి సంగమేశం భాష, సాహిత్యం హాస్యము అనేది జీవితములో చాల ప్రధానమైన రసం. హాస్యమనగా వినోదం కలిగించి నవ్వు పుట్టించే లక్షణం కలిగిన ఒక భావానుభవం. హాస్యం అంటే ఏమిటి, అది ఎలా సంభవిస్తుంది, దాని వలన ప్రయోజనాలు ఇబ్బందులు ఏమిటి అనే విషయాలపై పలు అభిప్రాయాలున్నాయి. దైనందిన జీవితంలోను, సినిమాలలోను, సాహిత్యంలోను, వ్యక్తుల వ్యవహారాలలోను హాస్యం ఒక ముఖ్యమైన పాత్ర కలిగి ఉంది. తెలుగు సాహిత్యంలో హాస్యరసము గురించి ముట్నూరు సంగమేశం తెలుగు హాస్యం పేరున ఈ గ్రంథాన్ని రచించారు. దీనిని ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు వారు 1954 లో ప్రచురించారు.ఈ గ్రంథంలో నవ్వు, హాస్యరసము, హాస్యప్రయోగములోని విభేదాలు, హాస్యకల్పన, జానపదహాస్యం, తెలుగు సాహిత్యంలో హాస్యం మరియు మన హాస్యగ్రంథాలు మొదలైన విషయాల గురించి రచయిత విశేషంగా చర్చించారు. 2020120012743 1954
తెలుగుపై ఉర్దూ పారశీకములప్రభావము [252] కె.గోపాలకృష్ణ సాహిత్యం, సిద్ధాంత వ్యాసం 2990100061896 1968
తెలుగులో అలబ్ధ వాజ్ఙయం [253] ఆర్.శ్రీహరి సాహిత్యం 2020120002051 1993
తెలుగులో ఉద్యమ గీతాలు [254] ఎస్వీ సత్యనారాయణ సాహిత్యం 2990100061894 1991
తెలుగులో గేయనాటికలు [255] తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్యం, సిద్ధాంత వ్యాసం 2990100051829 1988
తెలుగులో చిత్రకవిత్వము [256] గాదె ధర్మేశ్వరరావు సాహిత్యం, భాష 2990100051827 1986
తెలుగులో దేశిచ్ఛందస్సు [257] సంగనభట్ల నరసయ్య సాహిత్యం, సిద్ధాంత గ్రంథం 2990100051828 1991
తెలుగులో పంచతంత్ర చంపువు [258] వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం 2990100071708 1986
తెలుగులో పదకవిత [259] ప్రకాశకులు:ఆంధ్ర సాహిత్య పరిషత్ సాహిత్యం, ప్రసంగాల సంకలనం ఆంధ్ర సాహిత్య పరిషత్ రజతోత్సవ సభలో తెలుగులోని వాగ్గేయకారుల గురించి పలుఫురు వక్తలు చేసిన ప్రసంగాలను సంకలనం చేసి పరిషత్ వారు పుస్తక రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో అన్నమయ్య గురించి పుట్టపర్తి నారాయణాచార్యులు, క్షేత్రయ్య గురించి బాలాంత్రపు రజనీకాంతరావు, త్యాగరాజు గురించి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, కంచర్ల గోపన్న గురించి నూకల చినసత్యనారాయణ రజతోత్సవంలో ప్రసంగించిన వాటిని వ్యాసాలుగా ప్రచురించారు. 2020120002056 1973
తెలుగులో పరిశోధన [260] సంపాదకవర్గం:దేవులపల్లి రామానుజరావు, పి.ఎన్.ఆర్.అప్పారావు, జి.వి.సుబ్రహ్మణ్యం, ఇరివెంటి కృష్ణమూర్తి వ్యాస సంకలనం 2020120002065 1985
తెలుగులో పాళీపదాలు [261] సంగ్రహకుడు:చీమకుర్తి శేషగిరిరావు సాహిత్యం 2040100047346 1990
తెలుగులో బాలల నవలలు [262] పసుపులేటి ధనలక్ష్మి సాహిత్యం, సిద్ధాంత గ్రంథం 2990100061892 1986
తెలుగులో యాత్రాచరిత్రలు [263] మచ్చ హరిదాసు సాహిత్యం, సిద్ధాంత వ్యాసం 2990100061895 1992
తెలుగులో లలితగీతాలు [264] వడ్డెపల్లి కృష్ణ సాహిత్యం, సిద్ధాంత గ్రంథం 2990100061893 2000
తెలుగులో వెలుగులు [265] చేకూరి రామారావు సాహిత్యం, వ్యాససంకలనం ఆంధ్ర సారస్వత పరిషత్ వారు పండిత సారస్వత, ప్రజా సారస్వత, బాల సారస్వతల పేరుతో పుస్తకాలు ప్రచురించారు. అందులో భాగంగా చేకూరి రామారావు రాసిన ఈ పుస్తకాన్ని పండిత సారస్వత రూపంలో తెచ్చారు. రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర శాఖలో ఆచార్యునిగా పనిచేశారు. 6020010035935 1982
తెలుగులో సాహిత్య విమర్శ [266] వివరాలు లేవు సాహిత్యం 2990100067558 వివరాలు లేవు
తెఱచిరాజు [267] విశ్వనాథ సత్యనారాయణ నవల 2020050016279 1955
తేజస్సుమాలు [268] కల్లూరి శ్రీదేవి సాహిత్యం తేజస్సుమాలు అనే ఈ పుస్తకంలో రచయిత శకుంతల, వరూధిని, దమయంతి, రుద్రాణి, గిరిక, కైకేయి, సత్యభామ వంటి పలు కావ్య నాయికల గురించి, పాత్రల లక్షణాల గురించి రాశారు. 99999990030423 1997
తేజస్సు నా తపస్సు [269] సి.నారాయణ రెడ్డి కవితా సంపుటి 2990100051815 1975
తేజోబిందూపనిషత్తు [270] వివరాలు లేవు ఆధ్యాత్మికం 2020120012741 1935
తేజోవలయాలు [271] పోచిరాజు శేషగిరిరావు జీవితచరిత్రలు తేజోవలయాలు అనే ఈ పుస్తకంలో రచయిత ఏకనాధుడు, యాజ్ఞ్యవల్క్య మహర్షి, భృగు మహర్షి, అగస్త్య మహర్షి వంటి మహర్షుల గురించి, వారి జీవిత చరిత్రలు రాశారు. 2990100030424 1995
తేటగీత-భగవద్గీత [272] శ్రీరామనృసింహకవులు ఆధ్యాత్మిక సాహిత్యం 9000000005118 1958
తేనీరు విషతుల్యము-1,2భాగములు [273] మూలం: విలియం.ఎ.ఆల్కాట్, అనువాదం:జ్ఞానంబ వృక్షశాస్త్రం 2020120002091 1929
తేనె చినుకులు [274] నాళము కృష్ణారావు గేయాలు నాళం కృష్ణారావు బాల సాహిత్య కవి.తెలుగు వైతాళికుడు.సంఘ సంస్కర్త .గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు.భాషావేత్త. కందుకూరి వీరేశలింగం పంతులుగారి అనూయాయులు. బ్రహ్మ సమాజం మతస్థుడిగా చాలా ప్రసిద్ధులు. మీగడ తరకలు, గోరుముద్దలు, వెన్న బుడగలు, పాల తరకలు, తేనె చినుకులు, వెన్నెల వెలుగులు వంటి బాల సాహిత్యం రాశారు. 2030020025384 1955
తేనె తెట్టె [275] నోరి నరసింహశాస్త్రి నాటకం 2020010002838 1950
తేనెపట్టు [276] మండపాక పార్వతీశ్వరశాస్రి పద్య కావ్యం పాలవెల్లి అనే పద్యరచన చేసిన కవి దానికి అనుబంధంగా ఈ కృతి చేశారు. పాలవెల్లినీ, తేనెపట్టునూ తోబుట్టువులని కవితాత్మకంగా వ్యక్తీకరించారు. 2030020025070 1933
తేనె సోనలు- ప్రథమ భాగము [277] వేదము వేంకటకృష్ణశర్మ గేయాలు 9000000004615 1952
తేనె సోనలు-ద్వితీయ భాగము [278] వేదము వేంకటకృష్ణశర్మ గేయాలు 2020050016136 1953
తేనె సోనలు-తృతీయ భాగము [279] వేదము వేంకటకృష్ణశర్మ గేయాలు 9000000004561 1954
తేయాకు-తేనీరు [280] ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి వృక్షశాస్త్రం 2020120029982 1999
తైత్తరీయ సంహితా [281] త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120002105 1988
త్రైశంకు విజయము [282] బి.బాలాజీదాసు సాహిత్యం 2020120002102 1930
తొట్టి వైద్యము [283] పుచ్చా వెంకట్రామయ్య వైద్యం 2020010008935 1951
తోటల పెంపకం [284][dead link] ఎ.రాఘవయ్య సాహిత్యం 99999990128956 2000
తోమాలియా [285] కాంచనపల్లి కనకాంబ సాహిత్యం 2990130066884 1942
తృణధాన్యములు-రెండవ భాగము [286] గోటేటి జోగిరాజు సాహిత్యం 9000000004630 1944
తందనాన శ్రీ మహాభారతం [287] రుక్మాభట్ల విధుమౌళిశర్మ సాహిత్యం ఈ గ్రంథంలో కవి మహేతిహాసమైన మహాభారతాన్ని గేయాల రూపంలో మలిచాడు. ప్రతి గేయం చివరిలో తందనాన అనేది ఉండడంతో, వీటిని తందనాన గేయాలని, గ్రంథాన్ని తందనాన మహాభారతమని పిలిచారు. 9000000004523 1955
తంజావూరు తెలుగుకవులు [288] శిష్టా అక్ష్మీకాంతశర్మ సాహిత్యం తంజావూరు నాయక రాజుల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో దక్షిణాంధ్ర నాయకుల కాలంగా విలసిల్లింది. ఈ కాలం నుంచి తంజావూరు పరిసర ప్రాంతాలు ఎందఱో తెలుగు కవులకు కొన్ని శతాబ్దాలుగా ఆలవాలమైంది. వారి గురించి ఈ గ్రంథంలో వివరించారు. 2990100051814 1981
తంజావూరు పతనం [289] మల్లాది వసుంధర చారిత్రిక నవల, సాహిత్యం ఆంధ్రవిశ్వకళా పరిషత్ వారు తమ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా నిర్ణయించేందుకు ఉత్తమమైన వచన రచనలు వెలువరించడానికి పోటీలు నిర్వహించేవారు. ఆ పోటీల్లో గెలుపొందిన గ్రంథాల్లో తెలుగు సాహిత్య రంగంలో అజరామరంగా నిలిచిపోయే వేయిపడగలు, నారాయణరావు వంటి రచనలు ఉన్నాయి. అలా ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు తమ విద్యార్థులకు ఉప వాచకంగా నిర్ణయించేందుకు ఏర్పరిచిన చారిత్రిక నవలల పోటీలో తంజావూరు పతనం గెలుపొందింది. మల్లాది వసుంధర రచించిన ఈ గ్రంథంలో తంజావూరు నాయకరాజుల పరిపాలన అంతమయ్యే కాలాన్ని చిత్రీకరించారు. రాయల యుగం పేరిట అత్యున్నత స్థితికి అందుకున్న తెలుగు సాహిత్యానికి విజయనగర రాజ్య పతనానంతరం పోషణ, ప్రోత్సాహం అందించి విజయవిలాసం, ఉత్తర రామాయణం వంటి రచనలు వెలువడేందుకు కారణమయ్యారు. సుప్రసిద్ధమైన సరస్వతీ మహల్ గ్రంథాలయం వారి హయాంలో ఆ వంశరాజుల ద్వారానే ఏర్పడి అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో తంజావూరు నాయకుల పతన చరిత్రను చారిత్రికనవలగా రచించడం విశేషం 2990100071694 1965
తంజావూరు యక్షగానములు [290] విజయ రాఘవ రాయలు, మన్నారు దేవుడు యక్షగానం, జానపద సాహిత్యం యక్షగానం నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది ఒక కళారీతిగా పేరొందింది. నేటి కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ కాగా గత శతాబ్ది వరకూ ఆంధ్రదేశంలోని వివిధ గ్రామాల్లో ప్రముఖంగా ప్రదర్శితమైన కళ. యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై సవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా, వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. రాయల యుగానంతరం తెలుగు సాహిత్యానికి ఆవాసంగా మారిన తంజావూరు నాయక రాజుల కాలంలో ఆ ప్రాంతంలో రూపుదిద్దుకున్న నాలుగు యక్షగానాలు గంటి సోమయాజులు పరిష్కరించి, సంకలించి ప్రచురించారు.రచన 17, 18 శతాబ్దుల్లో జరుగగా సంకలించి ప్రచురించింది 1955 2030020025469 1955
తండ్లాట [291] శ్రీదాస్యం లక్ష్మయ్య కవితా సంపుటి 2020120002087 1936
తాండవ కృష్ణ భాగవతము-దశమ స్కంధము [292] జనమంచి శేషాద్రి శర్మ ఆధ్యాత్మిక సాహిత్యం, పురాణం 2020120002086 1936
తుండము నేకదంతము [293] మైలవరపు శ్రీనివాసరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120002103 1998
తెంకణాదిత్యకవి [294] దేవరపల్లి వేంకటకృష్ణారెడ్డి సాహిత్యం 2020010001863 1960