తెఱచిరాజు
స్వరూపం
తెఱచిరాజు | |
కృతికర్త: | విశ్వనాథ సత్యనారాయణ |
---|---|
ముద్రణల సంఖ్య: | 7 |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: | 1955 |
తెఱచిరాజు నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.
రచనా నేపథ్యం
[మార్చు]తెఱచిరాజు నవలను విశ్వనాథ సత్యనారాయణ 1954లో రచించారు. ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూ ఉండగా గంధం నాగేశ్వరరావు లిపిబద్ధం చేశారు. 1954-55 సంవత్సరాలలో ఆంధ్రపత్రిక దినపత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. 1955లో ప్రథమ ముద్రణ పొందిన ఈ నవల బహుళ ప్రచారాన్ని పొంది 2006లో ఆరవ ముద్రణ, 2013లో ఏడవ ముద్రణ పొందింది.