అల్లసాని వాని అల్లిక జిగిబిగి (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లసాని వాని అల్లిక జిగిబిగి
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
సంపాదకులు: విశ్వనాథ పావని శాస్త్రి
ముద్రణల సంఖ్య: 3
అంకితం: బెజవాడ గోపాలరెడ్డి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: విమర్శ
ప్రచురణ:
విడుదల: 1958 (పత్రికలో)
1961 (పుస్తకంగా)
పేజీలు: 70
విశ్వనాధ సత్యనారాయణ గారు

అల్లసాని వాని అల్లిక జిగిబిగి పుస్తకం జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన సాహిత్యవిమర్శ.

రచన నేపథ్యం[మార్చు]

అల్లసాని వాని అల్లిక జిగిబిగి విమర్శగ్రంథాన్ని విశ్వనాథ సత్యనారాయణ 1958లో వ్రాసివుండవచ్చని విశ్వనాథ సాహిత్యసర్వస్వానికి సంపాదకత్వం వహించిన ఆయన కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రి భావించారు. నవభారతి పత్రికలో 1958 జూన్ నుంచి 1959 జనవరి వరకూ అల్లసాని వాని అల్లిక జిగిబిగి ప్రచురితమైంది. ఈ గ్రంథం 1961లో ప్రథమ ముద్రణ పొందింది. 1970లో మలిముద్రణ పొందింది. మూడవముద్రణ 2007లో జరిగింది.

అంకితం[మార్చు]

అల్లసాని వాని అల్లిక జిగిబిగి గ్రంథాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖ రాజకీయనేత, సాహిత్యవేత్త బెజవాడ గోపాలరెడ్డికి అంకితమిచ్చారు. అందుకుగాను విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన అంకితం పద్యాలివి:

ఇది మూడవ గ్రంథమ్ముగ
నొదవించెద నంకితమ్ము నొగి నీకు సదా
భ్యుదయ పరంపరగా దొం
బదియేం డ్లా పైన స్వర్గ మహిమలు కలుగున్ !!

ఈ కాలంబున గాఢశిల్పమతి లేనేలేడు సాహిత్య వీ
థీ కైంకర్య విశారదాత్ములకు పై తెన్నొప్ప పాండిత్య వీ
థీ కౌశల్య నిగీతి వాదులకు నీ ధీ వేఱుగా నెంచి నీ
కీ కావ్యార్థము నంకితం బొసగు టయ్యెన్ దీని గైకోగదే!!

రచన అంశాలు[మార్చు]

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవి, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన కథాకథన శిల్పవైభవాన్ని విశ్వనాథ ఈ విమర్శ రచనలో విశదీకరించారు. పెద్దన పరంగా సుప్రసిద్ధమైన అల్లసాని వాని అల్లిక జిగిబిగి వాక్యం ఔచిత్యాన్ని, ఆయన మనుచరిత్ర పరంగా ఆ వాక్యం అన్వయాన్ని వివరించారు. పెద్దన కవిత్వంలోని గొప్పదనాన్నే కాక కావ్యకవుల కవిత్వానికి పరిమితులు, తెలుగు సాహిత్యంలో ఆనాటికే ప్రతిభావంతులైన కవులెందరో ఉండగా కృష్ణదేవరాయలు పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడని ఎందుకు సంబోధించారు వంటి అంశాలను లోతుగా విశ్లేషించారు.

ప్రాచుర్యం[మార్చు]

  • ప్రముఖ అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు వేల్చేరు నారాయణరావు తన సిద్ధాంత గ్రంథం తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలో అల్లసాని వాని అల్లిక జిగిబిగి గురించి పలు ప్రస్తావనలు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ స్వతాహాగా కథాకావ్యాలను అభిమానించే, పౌరాణిక సంప్రదాయానికి చెందిన సాహిత్యకారుడని, అందుకే పద్యశిల్పానికి ప్రసిద్ధి చెందిన అల్లసాని వాని అల్లిక జిగిబిగి వాక్యాన్ని కథాశిల్పంలో జిగిబిగిగా వర్ణించారని వెల్చేరు పేర్కొన్నారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]మూలాలు[మార్చు]

  1. వెల్చేరు, నారాయణరావు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. తానా ప్రచురణలు.