హాహాహూహూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హాహాహూహూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల. ఇది సోషియో ఫాంటసీ విభాగానికి సంబంధించిన నవల.

రచన నేపథ్యం[మార్చు]

హాహాహూహూ నవల రచనాకాలం 1952గా భావిస్తున్నట్టు గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూండగా లిపిబద్ధమైన ఈ నవలను ఎవరు లిపిబద్ధం చేశారన్నది సమాచారం, ప్రథమ ముద్రణ సంవత్సరం తెలియదని పావనిశాస్త్రి తెలిపారు. ఈ నవల1982లో ఆంధ్రజ్యోతి - సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఈ పుస్తకం ఏడవ ముద్రణ 2006లో జరిగింది. 2013లో మరో ముద్రణ జరిగింది.[1]

ఇతివృత్తం[మార్చు]

లండనులోని "ట్రెఫాల్గర్ స్క్వేర్" వద్ద గుర్రపు తల, మనిషి శరీరంతో వింతజంతువు కనిపిస్తుంది. చేతికి కడియం, ఒంటికి దుస్తులు, ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. జంతు ప్రదర్శనశాలలో ఉంచిన ఆ వింతజంతువును చూసేందుకు తీర్థప్రజల్లా జనం తండోపతండాలుగా వస్తారు. మేలుకున్నాకా ఆ జంతువు మాట్లాడుతూండడం, నవ్వుతూండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ జంతువు చివరకు ఓ పోలీస్ వద్ద తుపాకీ లాక్కోవడంతో భయమూ పొందుతారు. చివరకు ఆ జంతువు జంతువు కాదు, అది మాట్లాడుతున్న భాష సంస్కృతం అని తేలుతుంది.[2]

శైలి, శిల్పం[మార్చు]

ఉదాహరణలు[మార్చు]

ప్రాచుర్యం[మార్చు]

అనువాదాలు[మార్చు]

హాహాహూహూ నవలను ప్రముఖ విమర్శకుడు, అనువాదకుడు వెల్చేరు నారాయణరావు అదే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. 1981లో "జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్"లో ప్రచురితమైంది.[3]

విమర్శ రచనలు[మార్చు]

హార్స్ హెడెడ్ గాడ్స్ అండ్ వైట్ స్కిన్డ్ మెన్:ఎ సెకండ్ లుక్ ఎట్ హాహాహూహూ ఆఫ్ విశ్వనాథ సత్యనారాయణ శీర్షికన ప్రముఖ విమర్శకుడు, అనువాదకుడు వెల్చేరు నారాయణరావు 1981లో "జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్"లో విమర్శవ్యాసం ప్రచురితమైంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. హాహాహూహూ నవల(2013, శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురణ)లో ఒకమాట శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
  2. హాహాహూహూ, స్నేహఫలము(2013, శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురణ)
  3. http://www.mesas.emory.edu/home/assets/pdf/cv/CV_VNRao_Nov2010.pdf
"https://te.wikipedia.org/w/index.php?title=హాహాహూహూ&oldid=1760371" నుండి వెలికితీశారు