సంజీవకరణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'పాతిపెట్టిన నాణెములు'
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
సీరీస్: కాశ్మీర రాజవంశ నవలలు
ప్రక్రియ: నవల
ప్రచురణ:
విడుదల:
దీనికి ముందు: మిహిరకులుడు
దీని తరువాత: కవలలు (నవల)

సంజీవకరణి నవల తెలుగులో తొలి జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన రచయిత విశ్వనాథ సత్యనారాయణ రచించిన చారిత్రిక నవల. ఆయన రాజతరంగిణిని ఆధారం చేసుకుని రచించిన కాశ్మీర రాజవంశ నవలల్లో ఇది ఒకటి.

రచన నేపథ్యం[మార్చు]

కాశ్మీర రాజవంశ నవలలు[మార్చు]

కల్హణుడు రాసిన కశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని విశ్వనాథ రాసిన ఆరు నవలల మాలికలో యశోవతి మొదటిది. వేలయేళ్ల చరిత్రను సాధికారికంగా నిర్ధారించుకుని ఆసక్తికరమైన వర్ణనలతో కల్హణుడు 11శతాబ్దిలో రాసిన కశ్మీర రాజతరంగిణి అటు చారిత్రిక గ్రంథంగా, ఇటు కావ్యంగా ప్రాముఖ్యత పొందింది[1].
పాశ్చాత్య చరిత్ర పండితులు, వారిని అనుసరించిన భారతీయ చరిత్ర పండితులు చరిత్రలోని ఎన్నో అంశాలను విస్మరించి మన గతానికి అన్యాయం చేశారని చెప్పే విశ్వనాథ దృష్టి సహజంగానే కశ్మీర రాజతరంగిణిపై పడింది. రాజతరంగిణిలో రాసిన పలువురు రాజులు, రాణులు, వారి జీవితాలు, ఆనాటి వాతావరణాన్ని అంశంగా తీసుకుని 6 నవలల మాలికను విశ్వనాథ సృష్టించారు. కాశ్మీర రాజవంశ నవలలు ఇవి:

  1. యశోవతి
  2. పాతిపెట్టిన నాణెములు
  3. మిహిరకులుడు
  4. సంజీవకరణి
  5. కవలలు
  6. భ్రమరవాసిని

రచయిత[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఇలా అన్ని విధాలైన సాహిత్య ప్రక్రియలలోనూ విశ్వనాధ ప్రతిభ కనిపించింది. 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు.

వేయి పడగలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిన్నెరసాని పాటలు, మధ్యాక్కఱలు వంటివి విశ్వనాధ రచనలలో ప్రసిద్ధమైనవి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.