Jump to content

నాస్తికధూమము

వికీపీడియా నుండి
నాస్తికథూమము
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ‎
సంపాదకులు: విశ్వనాథ పావనిశాస్త్రి
ముద్రణల సంఖ్య: 5(2013 వరకు)
దేశం: భారత దేశము
భాష: తెలుగు
సీరీస్: పురాణవైర గ్రంథమాల
ప్రక్రియ: నవల
ప్రచురణ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
విడుదల: 1960
పేజీలు: 223
దీనికి ముందు: భగవంతుని మీది పగ
దీని తరువాత: ధూమరేఖ

నాస్తికథూమము నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఇది పురాణవైర గ్రంథమాలలో రెండవది.

రచనా నేపథ్యం

[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ నవలను 1958 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా ఈ నవలను పాలావజ్ఝుల రామశాస్త్రి లిపిబద్ధం చేశారు. నవల ప్రథమముద్రణ 1960. నాస్తికథూమము 4వ ముద్రణ 2006లో జరిగింది. 2013లో 5వ ముద్రణ జరిగింది.[1]

పురాణవైర గ్రంథమాల

[మార్చు]

పురాణవైర గ్రంథమాల శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో నాస్తికథూమము రెండవది. భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.[2]
ఈ నేపథ్యంలో పురాణాల చారిత్రికతను తిరస్కరించిన చరిత్ర రచనా ధోరణిని విశ్వనాథ వారు పురాణవైరంగా పేర్కొన్నారు. భగవంతుని మీది పగ పుస్తకంలో పురాణవైర గ్రంథమాల ఉపోద్ఘాతంలో ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి పురాణవైరము అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.[3] ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:

  1. భగవంతుని మీది పగ
  2. నాస్తికధూమము
  3. ధూమరేఖ
  4. నందోరాజా భవిష్యతి
  5. చంద్రగుప్తుని స్వప్నము
  6. అశ్వమేధము
  7. అమృతవల్లి
  8. పులిమ్రుగ్గు
  9. నాగసేనుడు
  10. హెలీనా
  11. వేదవతి
  12. నివేదిత

ఇతివృత్తం

[మార్చు]

శైలి,శిల్పం

[మార్చు]

పాత్రలు

[మార్చు]

అంకితం

[మార్చు]

ప్రాచుర్యం

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నాస్తికథూమము నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-09. Retrieved 2014-01-25.
  3. భగవంతుని మీది పగ నవలలో పురాణవైర గ్రంథమాలకు విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఉపోద్ఘాతము