వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఉ
స్వరూపం
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.
అంకెలు - అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ
డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్షడీఎల్ఐలోని తెలుగు పుస్తకాలు
[మార్చు]పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం ఉక్కు మనిషి [1] సి.హెచ్.ఆర్.రవి డిటెక్టివ్ నవల ఉక్కుమనిషి అనే ఈ పుస్తకం డిటెక్టివ్ నవల. అపరాధ పరిశోధక నవల పేరుతో జనాదరణ పొందిన ఈ రకం నవలలు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యరంగాన్ని ఓ ఊపు ఊపాయి. 9000000004835 1945 ఉగాది పిలుపు(1946) [2] సంపాదకులు: శ్రీరామా బుక్ డిపో కవితా సంకలనం 1946 నుండి శ్రీరామా బుక్ డిపో వారు ఉగాది నిర్వహించి కవితా గోష్ఠిలో కవులు చదివిన వారి కవితలని సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చారు. అలా 1946లో ప్రచురించిన కవితా సంకలనమే ఈ పుస్తకం. 9000000004674 1946 ఉచ్ఛల విషాదము [3] సురవరం ప్రతాపరెడ్డి నాటకం సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణా(అప్పటి నైజాం రాజ్యం)కు చెందిన తెలుగు వైతాళికుడు. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన వ్రాసిన చారిత్రిక నాటకమిది. 2020120002128 1933 ఉజ్జయనీ పతనము [4] బెంగాలీ మూలం:హెచ్.పి.చటోపాధ్యాయ, ఆంగ్ల అనువాదం:ప్రమోధనాథ్ బిసి, ఆంధ్ర అనువాదం:విజయ చారిత్రక నవల భారతదేశానికి ముఖ్యనగరంగా, దేశసామ్రాట్టుకు రాజధానిగా వెలుగొందిన ఉజ్జయిని పతనం కావడాన్ని ఈ చారిత్రిక నవలలో చిత్రీకరించారు. నవల మొదట బెంగాలీలో వ్రాశారు. దానికి ఆంగ్లానువాదం ప్రమోదనాథ్ చేయగా విజయ ఆంధ్రానువాదం చేశారు. 2020120035989 వివరాలు లేవు ఉజ్వల తరంగిణి [5] కల్లూరి చంద్రమౌళి ఆధ్యాత్మికం కల్లూరి చంద్రమౌళి (1898 - 1992) స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. దేవాదాయ శాఖా మంత్రిగా పనిచేసిన చంద్రమౌళి కొంతకాలము తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. ఆయన రచించిన ఆధ్యాత్మిక గ్రంథమిది. 2020120029996 1997 ఉడతమ్మ ఉపదేశం [6] రావూరి భరద్వాజ బాలల సాహిత్యం, కథా సాహిత్యం రావూరి భరద్వాజ (1927, జూలై 5 - 2013, అక్టోబరు 18 )తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. తెలుగు సాహిత్యం నుంచి జ్ఞానపీఠ్ పురస్కారం సాధించుకున్న మూడో రచయిత ఆయన. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. ఉడతమ్మ ఉపదేశం ఆయన వ్రాసిన బాల సాహిత్య రచన. 2020120007753 1991 ఉత్కల విప్ర వంశ ప్రదీపిక [7] కుప్పిలి కృష్ణమూర్తి బ్రాహ్మణ వంశముల గోత్రశాఖాది వివరములు వింధ్యకు దక్షిణమున, ఉత్తరమున నివసించు పంచద్రావిడ, పంచగౌడ బ్రాహ్మణులనబడే దశవిధబ్రాహ్మణుల వివరముల గురించి ( ఆంగీరస, కాశ్యప, వశిష్ఠాది గోత్రముల ప్రవరలు ) " విప్రవంశము", " దశవిధ బ్రాహ్మణశాఖావివరములు" అను పుస్తకములు ఈ గ్రంథకర్త రచించారు. ఆ పరంపరలో భాగంగా పంచగౌడ బ్రాహ్మణులలోని ఉత్కలవిప్రవంశములలోని వివరములు ఆపస్తంబ ఆశ్వలాయన సూత్రానుసారముగా పెక్కు గ్రంథములను పరిశీలించి వ్రాసిన అరవై పేజీల గ్రంథము. బ్రాహ్మణ చరిత్రను పరిశీలించు శోధకులకు మిక్కిలి ఉపయోగకరమైనది. సనాతన ధర్మంలోని బ్రాహ్మణ వంశములను గురించిన ముఖ్యసమాచారము గల పొత్తము. 2020050018535 1910 ఉత్తమ ఇల్లాలు [8] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:మోటూరి వెంకటేశ్వరరావు నవల రవీంద్రనాథ్ ఠాగూర్ ఆసియా నుంచే తొలి నోబెల్ బహుమతి పొందిన కవి. విశ్వకవిగా ఆయన సుప్రసిద్ధి పొందారు. ఈ నవలను రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో వ్రాయగా మోటూరి వెంకటేశ్వరరావు తెనిగించారు. 9000000004552 1958 ఉత్తమ కథలు [9] జాస్తి వేంకట నరసయ్య సాహిత్యం ఇది కథల సంకలనం. 9000000005055 1948 ఉత్తమ జీవయాత్ర [10] మేథా దక్షిణామూర్తి జీవితచరిత్ర నాదెళ్ళ పురుషోత్తమ కవి జీవిత విశేషాలను ఆయన కుమారుడు మేథా దక్షిణామూర్తి ఈ పుస్తకంలో రాశారు. 2020010002547 1954 ఉత్తమ జీవితములు [11] బాలదారి వీరనారాయణదేవు పౌరాణికం పురాణపురుషులు, కావ్యప్రశస్తి పొందినవారు అయిన ప్రహ్లాదుడు, కుచేలుడు, అంబరీషుడు, నారదుడు, తిన్నడు జీవితాలను ఈ రచనలో పొందుపరిచారు. తెలుగు చదువుకునే విద్యార్థులకు అప్పట్లో పాఠ్యాంశంగా నిర్ణయింపజేసే ఉద్దేశంతో గ్రంథాన్ని వ్రాశారు. 2020050014295 1932 ఉత్తమ బ్రహ్మ విద్యా సారః [12] శ్రీమదిలత్తూరు సుందరరాజ భట్టాచార్య ఆధ్యాత్మికం వైఖానస సంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథం ఇది. 2020120007770 1916 ఉత్తమమనుసంభవము [13][dead link] మల్లంపల్లి వీరేశ్వరశర్మ పౌరాణికం మార్కండేయ పురాణం వ్యాసుడు వ్రాశారు. దాన్ని మారన తెనిగించారు. ఇది మారన వ్రాసిన రచనకు అనుసృజన 2990100051844 1966 ఉత్తమ మార్గము [14] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. ఇది ఆయన రచన. 2020120002153 1931 ఉత్తమ వంచకుడు [15] కాశీసోమయాజుల సుందరరామమూర్తి నాటకం రైటియస్ రోగ్ అనే మారుపేరు కలిగినది ఈ నాటకం. అప్పుడప్పుడే కొత్తగా గ్రంథరచనలో ప్రాచుర్యం పొందుతున్న వ్యావహారికంలో పూర్తిగా నాటకరచన చేశారు. 2020120002154 1928 ఉత్తమ స్త్రీ చరిత్రములు [16] కందుకూరి వీరేశలింగం పంతులు సాహిత్యం కందుకూరి వీరేశలింగం పంతులు ప్రముఖ సంస్కర్త, రచయిత, పత్రికా సంపాదకుడు. ఆయన వ్రాసిన సాహిత్యంతెో తన సంస్కరణలను ప్రాచుర్యం చేసేందుకు ప్రయత్నించారు. ఈ రచన కూడా అదే కోణంలో చేశారు. 2020050006439 1949 ఉత్తమ స్త్రీలు-మొదటి భాగము [17][dead link] బుక్కపట్టణం రామానుజయ్య సాహిత్యం ఉత్తములైన పలువురు స్త్రీల జీవితాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. కథలలాగా వచనంలో వ్రాసినారు. 2020050005830 1927 ఉత్తమ స్నేహితులు [18] అనుసరణ: జొన్నలగడ్డ వెంకటరాధాకృష్ణయ్య సాహిత్యం రాజారామమోహనరాయ్, సర్ టి.ముత్తుస్వామి అయ్యర్, రవివర్మ, జంషెడ్జీ టాటా, రమేశ్ చంద్రదత్, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, బాలగంగాధర్ తిలక్ ల జీవితచరిత్రలను వ్యాసాల రూపంలో వ్రాశారు. 2020050014494 1930 ఉత్తర కాలామృతము [19] మూలం. కాళిదాసు, అనువాదం. చల్లా లక్ష్మీనరసింహశాస్త్రి జ్యోతిష్యం మహాకవి కాళిదాసు వ్రాసినట్టుగా చెప్తున్న ఈ గ్రంథాన్ని లక్ష్మీనరసింహశాస్త్రి టీకా, తాత్పర్యం వ్రాశారు. 2020120002159 వివరాలు లేవు ఉత్తర కుమార ప్రజ్ఞ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పౌరాణికం, కథ మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు మారువేషాల్లో ఉండగా వారికి ఉద్యోగాలు ఇచ్చిన రాజు విరాటుడు. ఆ విరాటుని బావమరిది కీచకుడు బలవంతుడు, దుర్మార్గుడు కాగా కొడుకు ఉత్తర కుమారుడు లేని విషయాల్లో గొప్పలు చెప్పుకునే వ్యక్తి. ద్రౌపది మాలినిగా అంతఃపురంలో పనిచేస్తూండగా కీచకుడు పరస్త్రీ అని కూడా చూడక కామించి ఇబ్బందిపెడుతూంటాడు. పరిణామక్రమంలో భీముడు వలలుడనే వంటవాడి వేషంలో కీచకుణ్ణి చంపుతాడు. కీచకుణ్ణి చంపగల బలవంతుడు భీముడే అయివుంటాడన్న అంచనాతో కౌరవులు విరాట రాజ్యంపైకి దండెత్తి వస్తారు. దక్షిణం నుంచి సుశర్మను యుద్ధానికి పంపి ఆ విరటుని సైన్యమంతా ఆ పోరులో ఉండగా భీష్మ ద్రోణ కర్ణాది అతిరథ మహారథులతో దుర్యోధనుడు ఉత్తరం నుంచి గోవులను అపహరిస్తాడు. దీన్నే ఉత్తర గోగ్రహణం అంటారు. అప్పటివరకూ యుద్ధంలో నన్ను అర్జునుడు కూడా ఎదిరించలేడు, భీముణ్ని ద్వంద్వయుద్ధంలో గెలవగలను, కర్ణాదులు నా పేరు చెప్తే భయపడతారు మొదలైన లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్న ఉత్తర కుమారుడికి నిజంగా తన పోరాట పటిమ చూపించాల్సిన అవసరం పడింది. ఉత్తర కుమారుని రథాన్ని బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు నడుపుతాడు. ఇంతాచేసి ఉత్తరకుమారుడు సైన్యాన్ని చూసి బెదిరిపోతే అర్జునుడు నిజరూపం ధరించి ఆయుధాలను బయటకుతీసి మొత్తం కౌరవసైన్యాన్ని సమ్మోహనాస్త్రంతో మత్తులో పడేస్తాడు. ఈ క్రమాన్ని తెలుగు వచనరచనుకు ఒరవడి పెట్టిన ఒజ్జ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తేటైన వచనంలో రచించిన గ్రంథమిది. 2020050019153 1915 ఉత్తర గోగ్రహణము [20] సంకలనకర్తలు:చిట్టూరి లక్ష్మీనారాయణశర్మ, దుర్గానంద్ ఆధ్యాత్మికం మహాభారతంలోని విరాటపర్వానికి సంబంధించిన కథ ఇది. ఆ ఇతివృత్తంతో వ్రాసిన గ్రంథమిది. 9000000004870 1960 ఉత్తర గోపురము [21] మూలం.ఛార్లెస్ డికెన్స్, అనుసృజన.శిష్ట్లా లక్ష్మీకాంత శాస్త్రి సాహిత్యం, చారిత్రిక నవల ప్రపంచవ్యాప్తంగా పలు సమాజాల్లో భూస్వామ్య వర్గం పతనమౌతూ పెట్టుబడిదారీ వర్గం అందలమెక్కుతున్న కాలాన్ని ఆధునిక యుగం ఆరంభంగా కొందరు సామాజికవేత్తలు, చరిత్రకారులు భావించారు. ఐతే అనివార్యంగా ఆ రెండు శక్తుల మధ్య ప్రపంచంలోని అన్ని సమాజాల్లో కొంత ప్రత్యక్షంగానూ, మరింత పరోక్షంగానూ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ నేపథ్యంలో పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల మధ్య ముఖాముఖీ పోరును చిత్రీకరించిన అపురూపమైన నవలలు ప్రపంచ సాహిత్యంలో రెండేనని అవి - గాన్ విత్ ద విండ్, టేల్ ఆఫ్ టూ సిటీస్ అంటూ సాహిత్యవేత్తలు పేర్కొన్నారు. ఇందులో గాన్ విత్ ద విండ్‌లో అమెరికా అంతర్యుద్ధం, టేల్ ఆఫ్ టూ సిటీస్‌లో ఫ్రెంచి విప్లవం చిత్రీకరణ పొందాయి. ప్రపంచ ప్రఖ్యాతీ, అజరామరత్వం పొందిన టేల్ ఆఫ్ టూ సిటీస్‌ను తెలుగులోకి రెండు మహానగరాలు, ఉత్తర గోపురం వంటి పేర్లతో వేర్వేరు రచయితలు అనుసృజించారు. ఈ నవల ఉత్తర గోపురం ప్రపంచంలోని ఉత్తమ సాహిత్య విలువలు అందుకున్న టేల్ ఆఫ్ టూ సిటీస్‌కు అనుసరణ. 2020050016573 1950 ఉత్తర భారత యాత్రాదర్శిని [22] మైథిలీ వెంకటేశ్వరరావు యాత్రా సాహిత్యం ఇది యాత్రాసాహిత్యం. రచయిత ఉత్తరభారతదేశంలోని పలు పర్యాటక ప్రాంతాల గురించి ఇందులో వ్రాశారు. 2020120002157 1998 ఉత్తర భారత సాహిత్యములు [23] పురిపండా అప్పలస్వామి, పెన్మెత్స సత్యనారాయణరాజు, గడియారం రామకృష్ణశర్మ, కె.గోపాలకృష్ణారావు సాహిత్యం, చరిత్ర, అనువాదం ఈ రచయితలు ఉత్తరభారతదేశంలోని పలు భాషల సాహిత్యాల చరిత్రలను ఈ గ్రంథరూపంలో నమోదుచేశారు. 2990100061910 1965 ఉత్తర రాఘవము [24] మూలం.భవభూతి, అనువాదం.బలిజేపల్లి లక్ష్మీకాంతకవి నాటకం, అనువాదం ఉత్తర రామచరిత్ర సంస్కృతభాషలో అత్యంత ప్రాచుర్యం పొందిన నాటకాలలో ఒకటి. ఆ నాటకకర్త "కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి భవభూతి. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఈ నాటకమే ఆయనను సంస్కృత సాహిత్యంలో అత్యున్నత శిఖరాలపై నిలిపింది. దీనిని లక్ష్మీకాంత కవి ఎనిమిదంకాల నాటకంగా అనువదించారు. ఈ గ్రంథాన్ని 1931-32కు గాను ఆంధ్రా యూనివర్సిటీ ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యగ్రంథంగా నిర్ణయించింది. 2030020024767 1930 ఉత్తర రామచరిత [25] మూలం:భవభూతి, అనువాదం:రాయప్రోలు సుబ్బారావు నాటకం భవభూతి వ్రాసిన అతి ప్రసిద్ధమైన ఉత్తర రామచరిత్ర నాటకాన్ని రాయప్రోలు సుబ్బారావు అనువదించారు. 2020010009043 1959 ఉత్తర రామ చరితము [26] కాశీ వ్యాసాచార్య ఆధ్యాత్మికం ఉత్తర రామచరిత్రమనే ఈ రచన కాశీవ్యాసాచార్య వ్రాశారు. సీతారాములు పట్టాభిషేకానంతరం అనుభవించిన విరహం, లవకుశుల కథ వంటివి ఇందులో ఉన్నాయి. 2020010014833 1928 ఉత్తర రామ చరితము [27] మూలం:భవభూతి, అనువాదం:జయంతి రామయ్య పంతులు ఆధ్యాత్మికం, నాటకం భవభూతి వ్రాసిన అతి ప్రసిద్ధమైన ఉత్తర రామచరిత్ర నాటకాన్ని జయంతి రామయ్యపంతులు అనువదించారు. 2020010009039 1931 ఉత్తర రామ చరిత నాటకము [28] వేదము వేంకటరాయ శాస్త్రి నాటకం, అనువాదం ఉత్తర రామచరిత్ర సంస్కృతభాషలో అత్యంత ప్రాచుర్యం పొందిన నాటకాలలో ఒకటి. ఆ నాటకకర్త "కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి భవభూతి. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఈ నాటకమే ఆయనను సంస్కృత సాహిత్యంలో అత్యున్నత శిఖరాలపై నిలిపింది. దీనిని వేదము వేంకటరాయ శాస్త్రి అనువదించారు. ఈ గ్రంథంలో భవభూతి గురించీ, ఈ నాటకం ప్రాధాన్యత గురించీ కూడా చక్కని వివరాలు ఉన్నాయి. 2030020025104 1920 ఉత్తర రామచరిత నాటకము [29] మూలం:భవభూతి, అనువాదం:వాధూలవీర రాఘవాచార్య నాటకం భవభూతి వ్రాసిన అతి ప్రసిద్ధమైన ఉత్తర రామచరిత్ర నాటకాన్ని వాదూల వీర రాఘవాచార్యులు అనువదించారు. 9000000004578 1959 ఉత్తర రామాయణము [30] అనుసరణ: కంకపాటి పాపరాజుకవి పౌరాణికం, ఆధ్యాత్మికం ప్రసిద్ధమైన ఉత్తర రామాయణం కథను స్వీకరించి ప్రముఖ తెలుగు కవి కంటింటి పాపరాజు ఈ గ్రంథాన్ని వ్రాశారు. 2990100071725 వివరాలు లేవు ఉత్తర రామాయణము-రెండవ భాగము [31] అనుసరణ: కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి పౌరాణికం ఉత్తర రామాయణమనే ఈ రచన రామాయణం అంత్యంలో జరిగే సీతారామ వియోగం, పునస్సమాగమం వంటి ఘట్టాలు కలిగివుంటుంది. 9000000005099 1957 ఉత్తర రామాయణ కథలు [32] వేమూరి వేంకటేశ్వరశర్మ ఆధ్యాత్మికం ఉత్తర రామాయణమనే ఈ రచన రామాయణం అంత్యంలో జరిగే సీతారామ వియోగం, పునస్సమాగమం వంటి ఘట్టాలు కలిగివుంటుంది. ఆయా ఘట్టాలను ఈ గ్రంథంలో వివిధ కథలుగా మలిచారు. 6020010002161 1999 ఉత్తర హరివంశము (పుస్తకం) [33] రచయిత:నాచన సోమనాధుడు, సంపాదకురాలు:పి.యశోదారెడ్డి పద్యకావ్యం నాచన సోమన తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి. ఆయన రాసిన ఉత్తర హరివంశం కావ్యాన్ని పి.యశోదారెడ్డి సంపాదకత్వం వహించి ఇలా ప్రచురించారు. 2020120033032 1979 ఉత్తర హరివంశము-మొదటిభాగము [34] రచయిత:నాచన సోమనాధుడు పద్యకావ్యం నాచన సోమన తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి. ఆయన రాసిన ఉత్తర హరివంశం కావ్యాన్ని ఇలా ప్రచురించారు. 2020120007772 1937 ఉత్తర హరివంశము-3,4భాగములు [35] రచయిత:నాచన సోమనాధుడు, పరిష్కర్తలు:చదలువాడ జయరామశాస్త్రి, వజ్ఝుల వేంకట సుబ్రహ్మణ్య శర్మ పద్యకావ్యం నాచన సోమన తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి. ఆయన రాసిన ఉత్తర హరివంశం కావ్యాన్ని చదలవాడ జయరామశాస్త్రి, వజ్ఝుల వేంకట సుబ్రహ్మణ్యశర్మ పరిష్కరించి ఇలా ప్రచురించారు. 2990100028724 1996 ఉత్తర హరివంశము-5,6భాగములు [36] రచయిత:నాచన సోమనాధుడు, పరిష్కర్త:జొన్నలగడ్డ మృత్యుంజయరావు పద్యకావ్యం నాచన సోమన తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి. ఆయన రాసిన ఉత్తర హరివంశం కావ్యాన్ని జొన్నలగడ్డ మృత్యుంజయరావు పరిష్కరించి ఇలా ప్రచురించారు. 2990100030427 1997 ఉత్తర హరిశ్చంద్ర కావ్యము [37] రత్నాకరం అనంతాచార్యులు పద్యకావ్యం ఉత్తర హరిశ్చంద్ర కావ్యం రత్నాకరం అనంతాచార్యులు వ్రాసిన పద్యకావ్యం. ఆయన వ్రాసిన సంవత్సరానికి ఇది ప్రచురితమైంది. 9000000005134 1937 ఉత్తరహరిశ్చంద్రోపాఖ్యానము [38] దక్కెళ్ళ పాటిలింగం పౌరాణికం హరిశ్చంద్రుని జీవిత గాథలోని ప్రముఖ ఘట్టాలతో వ్రాసిన గ్రంథం ఇది. 2020120030008 1891 ఉత్తరం [39] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:లక్కోజు అప్పారావు నాటకం, అనువాదం నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన నాటకం ఇది. దీన్ని లక్కోజు అప్పారావు అనువదించారు. 2020120012759 1956 ఉత్తరాంధ్ర [40] వంగపండు అప్పలస్వామి చరిత్ర ప్రజాకవి, ప్రజాగాయకుడు వంగపండు అప్పలస్వామి ఉత్తరాంధ్ర గురించి వ్రాసిన గ్రంథమిది. 2020120012760 2003 ఉత్తిష్ఠత, జాగ్రత్త! [41] మూలం:వివేకానంద, సంకలనం:ఏకనాథ రానడే అనువాదం:శ్రీపాదరేణువు ఆధ్యాత్మికం వివేకానందుడు ఆధ్యాత్మికవేత్త, సమాజసేవకుడు. ఆయన ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలను ఈ రూపంలో అనువదించి ప్రచురించారు. 9000000008495 1941 ఉదబిందువులు [42] జి.వి.కృష్ణారావు కవితలు, కథలు, సాహిత్య విమర్శ, నాటిక బాలమేఘము, ప్రౌఢమేఘము వంటి పద్యరచనలు, ఉదబిందువులు, చేసుకొన్న కర్మ వంటి కథలు, భిక్షాపాత్ర అనే నాటకం, కావ్యాలలో నీతిబోధ, సాహిత్య భవితవ్యం అనే సాహిత్య వ్యాసాలు ఉన్న రచనల సంకలనం ఇది. 2020120007752 1964 ఉదయ గానము [43] తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి కవితా సంకలనం తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. ఆయన రాసిన కవితా సంకలనం ఇది. 9000000004571 1954 ఉదయ ఘంటలు [44] సంపాదకత్వం.తెలంగాణ రచయితల సంఘం కవితా సంకలనం తెలుగునాట ఆ కాలంలో ప్రఖ్యాతులైన పలువురు కవుల కవితలతో ఈ సంకలనాన్ని వెలువరించారు. వట్టికోట ఆళ్వారుస్వామి నేతృత్వంలోని తెలంగాణా రచయితల సంఘం ఇందుకు పూనుకుని చేసింది. ఈ గ్రంథంలో విద్వాన్ విశ్వం, పుట్టపర్తి నారాయణాచార్యులు మొదలైనవారెందరో ప్రముఖ కవుల కవితలున్నాయి. 2030020024943 1953 ఉదయ భాను [45] ధారా రామనాథశాస్త్రి బాలల సాహిత్యం, కథల సంపుటి ధారా రామనాథశాస్త్రి నాట్యావధానిగా సుప్రసిద్ధుడు. నాట్యావధానం మాత్రమే కాకుండా రచనలు కూడా చేశాడు. విశ్వవీణ, కోటిదీపాలు వంటి రచనలు ఇరవైకి పైగా చేశారు. వాటిలో ఇది ఒకటి. 2020120002131 1985 ఉదయశ్రీ(ప్రధమ భాగము) [46] జంధ్యాల పాపయ్యశాస్త్రి కవితల సంపుటి జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912 - 1992) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. ఆయన రాసిన ప్రముఖ ఖండకావ్యాల సంపుటి ఇది. 9000000004614 1959 ఉదయశ్రీ(ద్వితీయ భాగము) [47] జంధ్యాల పాపయ్యశాస్త్రి కవితల సంపుటి జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912 - 1992) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. ఆయన రాసిన ప్రముఖ ఖండకావ్యాల సంపుటి ఇది. 2990100071723 1958 ఉద్యమ దర్శనము [48] ముదిగొండ శివప్రసాద్ సాహిత్య విమర్శము చారిత్రిక నవలా చక్రవర్తిగా పేరొందిన ముదిగొండ శివప్రసాద్ ఈ సాహిత్య విమర్శను రచించారు. 2990100051840 1990 ఉద్భటారాధ్య చరిత్రము [49] తెనాలి రామలింగకవి సాహిత్యం ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము. దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వంశ మూల పురుషుని కథ ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు. 2030020025495 1925 ఉద్యాన కృషి ప్రధమ పాఠములు [50] గోటేటి జోగిరాజు సాహిత్యం పీఠికాపురి సంస్థాన క్షేత్రాధిపతి, విజ్ఞానచంద్రికా గ్రంథమాల వారు ప్రచురించిన వ్యవసాయశాస్త్ర గ్రంథకర్త అయిన గోటేటి జోగిరాజు ఈ గ్రంథాన్ని వ్రాశారు. ఉద్యానవనాలను పెంచి అభివృద్ధి చేసుకునేందుకు ఉపకరించే పుస్తకం ఇది. 2020120002133 1914 ఉద్యాన కృషి [51] గోటేటి జోగిరాజు సాహిత్యం పీఠికాపురి సంస్థాన క్షేత్రాధిపతి, విజ్ఞానచంద్రికా గ్రంథమాల వారు ప్రచురించిన వ్యవసాయశాస్త్ర గ్రంథకర్త అయిన గోటేటి జోగిరాజు ఈ గ్రంథాన్ని వ్రాశారు. ఉద్యానవనాలను పెంచి అభివృద్ధి చేసుకునేందుకు ఉపకరించే పుస్తకం ఇది. 1914లో ఉద్యానకృషి ప్రథమపాఠములు అన్న పేరుతో తొలి ముద్రణ పొందగా, 1941లో రెండవముద్రణ పొందింది. ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం వారు 1945లో మరిన్ని ప్రకరణములు చేర్చి మూడవ ముద్రణ వెలువరించారు. ఇది ఆ ముద్రణను అనుసరించి ప్రచురించిన తరువాతి ముద్రణ. 6020010002132 1978 ఉద్యాన పుష్పములు [52][dead link] డాక్టర్ విష్ణుస్వరూప్, అనువాదం: బి.నరసింహం వృక్షశాస్త్రం భారతదేశము-ప్రజలు శీర్షికన ప్రజలకు విజ్ఞాన సర్వస్వ శైలిలో దేశానికి సంబంధించిన పలు వివరాలు గ్రంథాల రూపంలో అందించింది-నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. ఆ క్రమంలో ఉద్యానాలలో పెంచగలిగిన పుష్పజాతుల గురించిన సమగ్రమైన వివరాలతో ఈ గ్రంథం ప్రచురించి దేశంలోని అన్ని ముఖ్యభాషలలోకి అనువదించారు. 99999990129003 1969 ఉద్యానము [53] చల్లా పిచ్చయ్యశాస్త్రి పద్య కావ్యం ఉద్యానమనే ఈ గ్రంథమొక పద్యకావ్యం. దీన్ని సాహిత్యపోషకుడు, ఉండ్రాజవరం జమీందారు ముళ్ళపూడి తిమ్మరాజు ప్రచురించారు. 2020050005770 1933 ఉదాహరణ వాఙ్మయ చరిత్ర [54] నిడదవోలు వేంకటరావు సాహితీ విమర్శ నిడదవోలు వెంకట్రావు ప్రముఖ తెలుగు పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు. ఆయన వ్రాసిన సాహిత్య చరిత్రకు సంబంధించిన గ్రంథమిది. 2020120007750 1950 ఉద్యోగము [55] ముదిగంటి జగ్గన్నశాస్త్రి వ్యాస సంపుటి ఇది తొమ్మిది వ్యాసాల సంపుటి. మొదటి వ్యాసం పేరు ఉద్యోగము. కాబట్టి ఈ పుస్తకానికి ఉద్యోగమనే పేరే పెట్టారు. 2020120012753 1953 ఉన్నది - ఊహించేది (కథలు) [56] రావూరి భరద్వాజ కథలు రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత. భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఇది ఆయన రచించిన కథల సంపుటి. 2030020024792 1955 ఉన్నది నలుబది-సద్విద్య [57] రమణ మహర్షి తత్త్వం రమణ మహర్షి తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు. ఆయన వ్రాసిన గ్రంథమిది. 2020120002136 వివరాలు లేవు ఉన్మాద సహస్రం [58] కొత్తపల్లి సూర్యారావు పద్య కావ్యం ఈ రచనకు మరో పేరు వెర్రి వేయి విధాలు. ఇదొక పద్య కావ్యం 2020120012754 వివరాలు లేవు ఉపదేశ సాహస్రి [59] మూలం.ఆది శంకరాచార్యులు అనుసృజన.పేరి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆధ్యాత్మికం ఉపదేశసాహశ్రీ అనే పేరున్న ఈ గ్రంథం వేదాంతశాస్త్రానికి సంబంధించిన ప్రకరణ గ్రంథం. దీనిని ఆది శంకరాచార్యులు గద్యపద్యాత్మకంగా వ్రాశారు. దానికి ఇది అనుసృజన. 2020120002138 1933 ఉపదేశామృత తరంగిణి-ప్రధమ భాగం [60] ఉపన్యాసము: విమలానంద భారతీ సంగ్రధనము: పోలూరి హనుమజ్జానకీరామ శర్మ ఆధ్యాత్మికం ఇది కుర్తాళం పూర్వ పీఠాధిపతులైన విమలానంద భారతీ చేసిన ప్రసంగాల సంకలనం. 2020120007757 1977 ఉపదేశామృత తరంగిణి-ద్వితీయ భాగం [61] ఉపన్యాసము: విమలానంద భారతీ సంగ్రధనము: పోలూరి హనుమజ్జానకీరామ శర్మ ఆధ్యాత్మికం ఇది కుర్తాళం పూర్వ పీఠాధిపతులైన విమలానంద భారతీ చేసిన ప్రసంగాల సంకలనం. 2020120033020 వివరాలు లేవు ఉపనయన వివాహవిధి [62] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం ప్రముఖ వేదపండితులు చర్ల గణపతిశాస్త్రి ఉపనయనం, వివాహాల విధుల గురించి వ్రాసిన రచన ఇది. 2020120035992 1993 ఉపనయన సంస్కారము [63] రాచకొండ వేంకటేశ్వర్లు ఆధ్యాత్మికం ఉపనయన సంస్కారం(ఒడుగు) గురించి వ్రాసిన గ్రంథమిది. 2020120002139 1981 ఉపన్యాసము [64] ఆత్మూరి హవిర్యాజి లక్ష్మీనరసింహ దీక్షితులు ధర్మశాస్త్రాలు ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే వేదాధికారం, ఉపనయనాధికారం ఉన్నాయంటూ కొందరు పండితులు పూర్వం విడుదల చేసిన శ్రీముఖం. పూర్వపు శాస్త్రకారులు, ప్రమాణం కలిగినవారి శ్లోకాలను ఉదహరిస్తూ వాదనకు సమర్థనలు చేసుకున్నారు. 5010010088853 1936 ఉపన్యాసములు-మొదటిభాగము [65] కృత్తివెంటి సుబ్బారావు ఉపన్యాసం, సాహిత్యం కృత్తివెంటి సుబ్బారావు సాహిత్యానికి సంబంధించి వివిధ అంశాలపై చేసిన ఉపన్యాసాల సంకలనం ఇది. దీనిలో ఆంధ్ర సారస్వత గోష్ఠి, నాటక చరిత్ర సంగ్రహము, సంగీత సాహిత్యములు అన్న ఉపన్యాసాల పాఠాలు వ్యాసాలుగా ఉన్నాయి. 2020120021467 వివరాలు లేవు ఉపన్యాసమంజరి [66] కె.సర్వోత్తమరావు ఉపన్యాసం, సాహిత్యం సర్వోత్తమరావు సంకీర్తన సాహిత్యం, మరీ ముఖ్యంగా అన్నమాచార్యుల సాహిత్యంలోని పలు కోణాల గురించి వివిధ పట్టణాల్లో ఉపన్యాసాలు చేశారు. ఆయన చేసిన ఉపన్యాస పాఠాలను ఈ గ్రంథ రూపంలోకి మలిచి ప్రచురించారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్థిక సహాయం చేశారు. 2990100047352 1994 ఉపన్యాస రామాయణము [67] ఉపన్యాసం: వి.ఎస్.శ్రీనివాసశాస్త్రి, అనువాదం. పుచ్చా వెంకట్రామయ్య ఇతిహాసం, ఉపన్యాసం, ఆధ్యాత్మికం పురాణం చెప్పడం అనే ప్రక్రియ దక్షిణ భారత దేశ సాహిత్య చరిత్రలో చాలా ప్రముఖమైనది. పలు కావ్యాలను రచించిన కవులతో పాటుగా వాటిని ఉపన్యసించే భాగవతులు, కథకులకు కూడా ప్రత్యేక కళ అవసరమయ్యేది. అటువంటి ఆధ్యాత్మికోపన్యాస సాహిత్య ప్రక్రియకు చెందిన రచన ఇది. సాధారణంగా ఉపన్యాసాలు మౌఖికమైన కళగా మిగిలిపోతూంటాయి. కానీ ఇది పుచ్చా వెంకట్రామయ్య చొరవతో ప్రచురితమయ్యింది. 2020120002148 1957 ఉపన్యాస దర్పణము [68] నందిరాజు చలపతిరావు సాహిత్యం ఇది 1936 నాటి తెలుగు కాంపోజిషన్ గైడ్. దీనిని మోడ్రన్ తెలుగు ఇంగ్లీష్ డిక్ష్నరీ వ్రాసిన ఎన్.చలపతిరావు వ్రాశారు. ఇది అప్పట్లో 4, 5, 6 ఫారాలు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులందరికీ పనికివస్తుందని వ్రాశారు. 2020120002147 1936 ఉపన్యాస పయోనిధి[69] కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ఉపన్యాసములు 19వ శతాబ్ది చివరి భాగం నుంచి తెలుగు నాట హిందూమతాచారాల ఖండన పెరగజొచ్చింది. బ్రహ్మ సమాజం, క్రైస్తవ మిషనరీలు మొదలైనవి పెరిగి సంస్కరణల పేరుతో కొన్ని కొత్త మార్పులు సమాజంలోని ఆస్తిపరులు, ఉన్నత విద్యావంతులలో కొంతవరకూ తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హిందూమతాన్ని గురించీ, బ్రహ్మసమాజం వంటివాటి గురించి, సంఘసంస్కరణల గురించి బ్రహ్మయ్యశాస్త్రి రచించిన ఉపన్యాసాల సంకలనమిది. 2020050019033 1911 ఉపయుక్త రహస్యజాలము [70] అణ్ణంగరాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం మద్రాసు సత్ గ్రంథ ప్రకాశక సభ వారు ప్రచురించిన వైష్ణవ సాహిత్యం ఇది. 5010010017441 1949 ఉపనిషత్తులు [71] ఆత్మానంద యోగి ఆధ్యాత్మికం ఉపనిషత్తుల సారాన్ని తెలుగులో తేటగీతులు, ద్విపదలు, గేయాల రూపంలో రచించి ప్రచురించిన గ్రంథమిది. దీనిలో ఈశావాస్య, కేన, ఐతరేయ, కఠోపనిషత్తుల సారాన్ని తెలుగు కవితలుగా వ్రాశారు. 2020050005637 1926 ఉపనిషచ్చంద్రిక-ప్రధమ భాగము [72] రాయప్రోలు లింగన సోమయాజి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. వేదాలకు జ్ఞానభాగంగా భావించే ఉపనిషత్తుల గురించి వ్రాసిన గ్రంథమిది. 9000000004761 1952 ఉపనిషచ్చంద్రిక-ద్వితీయ భాగము [73] రాయప్రోలు లింగన సోమయాజి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. వేదాలకు జ్ఞానభాగంగా భావించే ఉపనిషత్తుల గురించి వ్రాసిన గ్రంథమిది. 2020010009022 1953 ఉపనిషత్సార రత్నావళి [74] వకుళాభరణ పరదేశి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. వేదాలకు జ్ఞానభాగంగా భావించే ఉపనిషత్తుల గురించి వ్రాసిన గ్రంథమిది. 5010010088845 1906 ఉపనిషత్తుల కథలు [75] వివరాలు లేవు ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. వేదాలకు జ్ఞానభాగంగా భావించే ఉపనిషత్తులలోని పలు అంశాలను కథలుగా వ్రాశారు. వాటి సంకలనమిది. 9000000004527 1954 ఉపనిషత్తుల బోధలు-కథలు [76] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. వేదాలకు జ్ఞానభాగంగా భావించే ఉపనిషత్తులలోని పలు కథలను ప్రముఖ వేదపండితులు చర్ల గణపతిశాస్త్రి కథలుగా వ్రాశారు. వాటి సంకలనమిది. 2020120002143 1927 ఉపనిషత్సుధ-మొదటి భాగము [77] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. సంస్కృత భాషలోని ఉపనిషత్తులకు ప్రముఖ పండితులు గణపతిశాస్త్రి తమ పండిత వ్యాఖ్య సహితంగా దీన్ని తెలుగులో దీన్ని వ్రాశారు. 2020120007761 1977 ఉపనిషత్సుధ-రెండవ భాగము [78] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. సంస్కృత భాషలోని ఉపనిషత్తులకు ప్రముఖ పండితులు గణపతిశాస్త్రి తమ పండిత వ్యాఖ్య సహితంగా దీన్ని తెలుగులో దీన్ని వ్రాశారు. 2020120012755 1977 ఉపనిషత్సుధ-మూడవ భాగము [79] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. సంస్కృత భాషలోని ఉపనిషత్తులకు ప్రముఖ పండితులు గణపతిశాస్త్రి తమ పండిత వ్యాఖ్య సహితంగా దీన్ని తెలుగులో దీన్ని వ్రాశారు. 2020120002142 1968 ఉపనిషద్ద్వయము [80] కాశీభట్టు కృష్ణరాయ ఆధ్యాత్మికం ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రంలో విశిష్టమైన స్థానం కలిగినవి. ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. వాటి గురించిన రచన ఇది. 9000000004521 1950 ఉపవాసచికిత్స [81] మరయారు ఆర్యమూర్తి వైద్యం ఆయుర్వేదంలో ఉపవాసం కూడా ముఖ్యమైన చికిత్సగా పేరొందింది. 2990100068826 1922 ఉపవాస తత్త్వవిద్య [82] మూలం.ఎడ్వర్డ్ ఎర్ల్ పూరిన్‌టన్ అనువాదం.పుచ్చా వేంకటరామయ్య ఆధ్యాత్మికత ఆరోగ్యం పొందేందుకు, ఆనందం కొరకు, శక్తికి, విశ్వాసానికి, ధైర్యస్థైర్యాలకు, శీలానికి, ఆత్మజ్ఞానానికి, సౌందర్యానికి, తదితర లక్షణాలకు ఉపవాసం ఎలా ఉపయోగపడుతుంనేది ఈ గ్రంథంలోని పలు ప్రకరణాల్లో వ్రాశారు. 9000000004839 1954 ఉపాధ్యాయుడు(పుస్తకం) [83] మునిమాణిక్యం నరసింహారావు కథా సాహిత్యం మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది. ఉపాధ్యాయుల జీవితాల గురించి స్వయంగా ఉపాధ్యాయునిగా పనిచేసిన మునిమాణిక్యం వారు రచించిన కథలివి. 2030020024546 1946 ఉపాధ్యాయుడు(కథ) [84] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:కె.రమేశ్ కథ నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన కథ ఇది. దీనిని కె.రమేశ్ తెనిగించారు. 2020010008407 1960 ఉపాహారము [85] శ్రీనివాస సోదరులు పధ్యకావ్యం శ్రీనివాస సోదరకవులు ప్రముఖ శతావధానులు. నూజివీడు, పెద్దాపురం మొదలైన సంస్థానాలలో శతావధానాల వల్ల సన్మానితులయ్యారు. వీరు శతావధానాలతో పాటు చారిత్రిక, ఆధ్యాత్మిక విశేషాలపై పలు పద్య కావ్యాలు రచించారు. వాటిలో ఒకటైన ఈ కావ్యాన్ని తెలంగాణా రచయితల సంఘం ప్రచురించింది. సినారె దీనికి పీఠిక రాశారు. 9000000004536 1956 ఉప్పునూతల కథ [86] కపిలవాయి లింగమూర్తి ఆధ్యాత్మిక సాహిత్యం, స్థల పురాణం ఉప్పునూతల కథ అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశం. ఇదొక స్థలపురాణం. 2020120012756 1983 ఉభయ కుశలోపరి [87] గోపీచంద్ రేడియో ప్రసంగాలు ఉభయకుశలోపరి పేరున్న ఈ పుస్తకంలో రేడియో ప్రసంగ పాఠాలున్నాయి. గోపీచంద్ తన చిన్నతనంలో చూసిన గ్రామాల జీవనాన్ని గురించి రేడియోలో చేసిన ప్రసంగాలివి. 9000000004591 1956 ఉభయ భారతి [88][dead link] రవ్వా శ్రీహరి వ్యాస సంపుటి తెలుగు అధ్యాపకులైన ఆచార్య రవ్వా శ్రీహరి ఈ గ్రంథాన్ని వ్రాశారు. ఇది భాషా సాహిత్య వ్యాసాల సంకలనం. 2990100071721 1996 ఉమర్ ఆలీషా కవి ఖండకావ్యములు [89] ప్రచురణ:ఉమర్ ఆలీషా ప్రచురణ సంఘం ఖండ కావ్యం ఉమర్ ఆలీషా కవి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాహిత్యకారుడు. ఆయన వ్రాసిన ఖండకావ్యాల సంకలనం ఇది. 9000000004710 1952 ఉమర్ ఖయ్యమ్ [90] ఉమర్ అలీషా కవి పద్య కావ్యం, అనువాద సాహిత్యం ఉమర్ ఆలీషా ప్రఖ్యాత కవి, ఆధ్యాత్మికవేత్త. ఆయన పిఠాపురంలోని విశ్వ, విజ్ఞాన, ఆధ్యాత్మిక పీఠానికి పూర్వపీఠాధిపతి. ఉమర్ ఖయ్యమ్ కవిత్వాన్ని పార్శీకం నుంచి తెలుగు పద్యాలలోకి అనువదించారు. 99029990033011 1952 ఉమర్ ఖయ్యామ్ [91] చిల్లర భావనారాయణరావు నాటకం ఉమర్ ఖయ్యామ్ రుబాయిల ద్వారా ప్రపంచమంతటా ప్రఖ్యాతి పొందిన పారశీక కవి. ఆయన వ్రాసిన కవిత్వం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమైంది. ఇది ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని చిల్లర భావనారాయణరావు వ్రాసిన నాటకం. 9000000004690 1957 ఉమర్ ఖయ్యమ్ రుబాయిల అనుశీలన [92] షేక్ మొహమ్మద్ ముస్తఫా పరిశోధనా గ్రంథం ఉమర్ ఖయ్యామ్ రుబాయిల ద్వారా ప్రపంచమంతటా ప్రఖ్యాతి పొందిన పారశీక కవి. ఆయన వ్రాసిన కవిత్వం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమైంది. ఇది ఆయన రుబాయిల గురించి షేక్ మొహ్మద్ ముస్తఫా చేసిన పరిశోధన గ్రంథం. 2020120002135 1987 ఉమర్ ఖయాం [93][dead link] మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి కావ్యం, అనువాద కావ్యం ఉమర్ ఖయ్యామ్ రుబాయిల ద్వారా ప్రపంచమంతటా ప్రఖ్యాతి పొందిన పారశీక కవి. ఆయన వ్రాసిన కవిత్వం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమైంది. మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి వ్రాసిన అనువాదకావ్యం. 5010010031958 1944 ఉమ్మడి కొంప [94] రామమోహన్ నాటకం ఈ నాటకంలో ఊరిపెద్ద, ఆస్తి పెత్తందారు, పెత్తందారు అన్నకొడుకులు, వారి బంధువు, పెత్తందారు అన్న పెద్దకొడుకు భార్యలు వంటి పాత్రలున్నాయి. ఇది ఒకానొక తెలుగు పల్లెటూర్లో ఆస్తుల విషయమై జరిగే వివాదం గురించిన నాటకం. 2020010002708 1953 ఉమా మహేశ్వర శతకము [95] అంగూరు అప్పలస్వామి శతక సాహిత్యం శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ క్రమంలో ఉమామహేశ్వరా యన్న మకుటంతో వెలువడినదే ఈ శతకం. 2020050014266 1942 ఉమా సహస్రము-ద్వితీయ భాగము [96] వాసిష్ఠ గణపతిముని ఆధ్యాత్మికం అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (1878 - 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. ఆయన వ్రాసిన గ్రంథమిది. 9000000008022 1929 ఉమా సహస్రము-తృతీయ భాగము [97] వాసిష్ఠ గణపతిముని ఆధ్యాత్మికం అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (1878 - 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. ఆయన వ్రాసిన గ్రంథమిది. 9000000008073 1942 ఉమ్రావ్ జాన్ ఆదా [98][dead link] ఉర్దూ మూలం:మీర్జా రుస్వా, ఆంధ్రానువాదం:దాశరథి రంగాచార్య నవల, అనువాదం ఉమ్రావ్ జాన్ అదా 18, 19 శతాబ్దాలలో లక్నో నగరపు సంస్కృతిని అభివర్ణించిన నవల. ఉమ్రావ్ జాన్ అనే వేశ్య జీవితాన్ని రుస్వాకు చెబుతూండగా వ్రాసినట్టు దీన్ని మలిచారు. ఈ నవలను ఆధారంగా చేసుకుని హిందీ(లేదా ఉర్దూ)లో విజయవంతమైన రెండు సినిమాలు తీశారు. ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్యులు దీన్ని తెలుగులోకి అనువదించారు. 2990100061906 1990 ఉర్దూ-తెలుగు నిఘంటువు [99] వివరాలు లేవు భాష, నిఘంటువు ఉర్దూ - తెలుగు నిఘంటువు ఇది. 2020010009028 1938 ఉర్దూ కథలు [100][dead link] మూలం: సయ్యద్ హుస్సేన్ అఖ్తరీ, రుకైయ్యా రీహానా, జాకిర్ హుసేన్, మహమ్మద్ ముజీబ్, అనువాదం:వేమూరు ఆంజనేయశర్మ కథాసాహిత్యం, అనువాదం, కథల సంపుటి ఉర్దూ భాషలోని కథాసాహిత్యాన్ని వేమూరు ఆంజనేయశర్మ అనువదించి ఈ గ్రంథంలో ప్రచురించారు. 2020050016126 1946 ఉర్దూ కథానికలు [101] బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి కథానికల సంపుటి ఉర్దూ భాషలోని కథాసాహిత్యాన్ని బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి అనువదించి ఈ గ్రంథంలో ప్రచురించారు. 2020120002149 1963 ఉర్దూ సాహిత్య చరిత్ర [102] మూలం: ఎహతెషాం హుస్సేన్, అనువాదం:సామల సదాశివ సాహిత్యం, అనువాదం సామల సదాశివ బహుభాషావేత్త, సంగీత రసజ్ఞుడు. ఆయన యాది పేరిట వ్రాసిన ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. ఎహతెషాం హుస్సేన్ ఉర్దూ సాహిత్య చరిత్రను వ్రాయగా సామల సదాశివ అనువదించారు. 2020120002150 1963 ఉష(కావ్యం) [103] దేవులపల్లి సత్యారావు కావ్యం విశాఖపట్నం జిల్లాకు చెందిన కశింకోటకు చెందిన వారు కావ్యకర్త. ఆయన వ్రాసిన ఉష కావ్యం ఇది. సంస్కరణాత్మకమైన రచన. 2020010002281 1951 ఉషః కిరణాలు [104] వై.సత్యనారాయణరావు సాహిత్యం ఉష: కిరణాలు గ్రంథానికి 19వ శతాబ్ది తెనుగుసాహిత్యచరిత్ర అనేది ఉపశీర్షిక. 1959 - 60లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు రెండువేల రూపాయల బహుమతిని అందుకున్న గ్రంథం ఇది. 6020010002151 1960 ఉషా కళ్యాణము [105][dead link] తాళ్ళపాక తిరువెంగళనాథుడు ద్విపద, పౌరాణికం తాళ్ళపాక అన్నమాచార్యుల వంశీకులు ఆయన వలెనె సంగీత సాహిత్య సేవ, వైష్ణవ భక్తి ప్రచారం కొనసాగించారు. ఆ క్రమంలో వారు అనేక ద్విపద కావ్యాలు, సంకీర్తనలు వంటివి రచించారు. అలా తాళ్ళపాక తిరువెంగళనాథుడు వ్రాసిన ద్విపద కావ్యం ఈ ఉషా కళ్యాణము. 5010010088208 1920 ఉషా నాటకము [106] వేదము వేంకటరాయ శాస్త్రి నాటకం, పౌరాణిక నాటకం శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడు, బాణాసురుని కుమార్తెయైన ఉషల ప్రణయం ఈ నాటకంలోని ప్రధానాంశం. అనిరుద్ధునితో తన కుమార్తె వివాహాన్ని నిరాకరించిన బాణాసురుని కృష్ణుడు ఓడించి తుదకు ఉషానిరుద్ధుల వివాహం చేయడంతో కథ ముగుస్తుంది. ఈ నాటకకర్త ప్రఖ్యాత పండితుడు, కవి వేదము వేంకటరాయశాస్త్రి. 2030020025270 1913 ఉషా పరిణయం [107] తడకమళ్ళ రామచంద్రరావు నాటకం, పౌరాణిక నాటకం శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడు, బాణాసురుని కుమార్తెయైన ఉషల ప్రణయం ఈ నాటకంలోని ప్రధానాంశం. అనిరుద్ధునితో తన కుమార్తె వివాహాన్ని నిరాకరించిన బాణాసురుని కృష్ణుడు ఓడించి తుదకు ఉషానిరుద్ధుల వివాహం చేయడంతో కథ ముగుస్తుంది. ఈ నాటకాన్ని తడకమళ్ళ రామచంద్రరావు రచించారు. 2040100047353 2001 ఉషా పరిణయము [108] ఆసూరి మరిగంటి వేంకట నరసింహాచార్యులు నాటకం, పౌరాణిక నాటకం శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడు, బాణాసురుని కుమార్తెయైన ఉషల ప్రణయం ఈ నాటకంలోని ప్రధానాంశం. అనిరుద్ధునితో తన కుమార్తె వివాహాన్ని నిరాకరించిన బాణాసురుని కృష్ణుడు ఓడించి తుదకు ఉషానిరుద్ధుల వివాహం చేయడంతో కథ ముగుస్తుంది. అంతకుమునుపు పద్మవ్యూహమనే నాటకాన్ని రచించిన నరసింహాచార్యులు ఈ నాటకకర్త. 2030020025302 1930 ఉషా పరిణయం(పద్య కావ్యం) [109] రంగాజమ్మ, పరిష్కర్త:విఠలదేవుని సుందరశర్మ పద్యకావ్యం నాయకరాజుల కాలంలో ప్రసిద్ధి పొందిన రచయిత్రుల్లో రంగాజమ్మ ఒకరు. ఇది ఆమె వ్రాసిన కావ్యం. 2020010002142 1995 ఉషా సుందరి [110] పైడిపాటి సుబ్బరామశాస్త్రి నాటకం శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడు, బాణాసురుని కుమార్తెయైన ఉషల ప్రణయం ఈ నాటకంలోని ప్రధానాంశం. అనిరుద్ధునితో తన కుమార్తె వివాహాన్ని నిరాకరించిన బాణాసురుని కృష్ణుడు ఓడించి తుదకు ఉషానిరుద్ధుల వివాహం చేయడంతో కథ ముగుస్తుంది. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి గంట నాటకంగా ప్రసారమైంది. 2030020025195 1950