వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
డబ్బేనా మీకు కావలసినది! [1] పి.సూర్యకుమార్ సాహిత్యం 2020120019989 1996
డాక్టరమ్మ(నవల) [2] ఎన్.భారతీదేవి నవల 6020010004079 1980
డాక్టర్ [3] పోతురాజు వీరరాఘవరావు నాటకం ఇదొక సాంఘిక నాటకం. ఎం.బి.బి.ఎస్. చదువుతున్న విద్యార్థులు, వారి మధ్య జరిగిన సంఘటనలు దీనికి మూలం అందుకే నాటకానికి డాక్టర్ అనే పేరు పెట్టారు. 2020010004796 1944
డాక్టర్ అనీబిసెంట్ [4] గుంటూరు వేంకట సుబ్బారావు జీవితచరిత్ర అనీ బిసెంట్ ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు ఐరోపాస్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది. ఆమె జీవిత చరిత్ర ఇది. 2020050005815 1947
డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు నవలలు-సవిమర్శక పరిశీలన [5] కోసూరి దామోదరనాయిడు విమర్శక గ్రంథం కొమ్మూరి వేణుగోపాలరావు (1935 - 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత శరత్ చంద్రప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్"గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా నవల లు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో హౌస్ సర్జన్హారతివ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరిప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది. 1959 లో గోరింటాకు సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటిక లు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది. వేణుగోపాలరావు నవలల గురించి విమర్శాత్మక పరిశీలన ఈ గ్రంథం. 2990100051633 1996
డాక్టర్ పట్టాభి జీవిత చరిత్ర [6] మల్లాది జీవిత చరిత్ర డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితచరిత్ర గ్రంథమిది. పట్టాభి సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు, సుప్రసిద్ధ రాజనీతివేత్త. ఆయన ఏ పుస్తకాన్ని రిఫర్ చేయకుండా కేవలం తన అపార జ్ఞాపకశక్తిపైనే ఆధారపడి కాంగ్రెసు చరిత్ర రచించారని ప్రతీతి. ఇంత ప్రాచుర్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితచరిత్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. 5010010033108 1946
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-మొదటి సంపుటి [7] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120004080 1994
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-మూడవ సంపుటి [8] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120007162 1995
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-నాల్గవ సంపుటి [9] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120029119 1994
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-ఐదవ సంపుటి [10] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120029121 1994
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-ఎనిమిదవ సంపుటి [11] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120029122 1994
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-తొమ్మిదవ సంపుటి [12] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120029123 1994
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-పదకొండవ సంపుటి [13] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: పేర్వారం జగన్నాధం ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120029120 1994
డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ రచనలు-ప్రసంగాలు-పన్నెండవ సంపుటి [14] మూలం: ‌డాక్టర్ అంబేద్కర్, సంపాదకుడు: నాయని కృష్ణకుమారి ప్రసంగాల సంపుటి, సాహిత్య సంపుటి 2020120020045 1996
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ [15] మూలం.వసంతమూన్, అనువాదం.చాగంటి తులసి జీవిత చరిత్ర నేటి రూపంలోని భారతదేశానికి తాత్త్వికత అందించిన పలువురు మహామహుల్లో అంబేద్కర్ ఒకరు. నిమ్నకులంగా భావించబడ్డ కులంలో జన్మించి భారత న్యాయకోవిదుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన భారతీయ దళితుల పక్షాన భారత జాతీయోద్యమకాలంలో అటు ఆంగ్లేయులు, ఇటు జాతీయవాదులతో సైద్ధాంతిక పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయినా వివిధ వర్గాల మేధావులకు ప్రాతినిధ్యం కల్పించాలన్న నెహ్రూ, పటేల్‌ల నిర్ణయానుసారం రాజ్యాంగ పరిషత్‌లోకి ఆహ్వానం పొంది రాజ్యాంగ రచనలో ఒకానొక కీలక వ్యక్తిగా నిలిచారు. భారత తొలి న్యయ మంత్రిగా వ్యవహరిస్తూ నెహ్రూతో హిందూ సివిల్ కోడ్ రూపకల్పనలో కృషిచేశారు. ఆ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందలేదన్న ఆగ్రహంతో తన పదవికి రాజీనామా చేశారు.(అనంతర కాలంలో నెహ్రూ విడివిడి సూత్రాలుగా అదే చట్టాన్ని ఆమోదింపజేశారు.) చివరకు హిందూమతాన్ని వదిలిపెట్టి బౌద్ధాన్ని స్వీకరించి మరణించారు. అనంతరకాలంలోని దళిత ఉద్యమాలకు ఆయన ఒక చిహ్నంగా నిలిచారు. ఈ గ్రంథంలో ఆయన జీవితాన్ని గురించి వివరించారు. ఆయన జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. 99999990128926 1995
డాక్టర్ వచ్చేలోగా ఏం చేయాలి? [16] ఎస్.ఎల్.నరసింహారావు వైద్యం 2020010004955 1958
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ-నా సత్యాన్వేషణ [17] మూలం:సర్వేపల్లి రాధాకృష్ణన్, అనువాదం:బులుసు వెంకటేశ్వర్లు ఆత్మకథాత్మకం, అనువాద సాహిత్యం 2020010004954 1957
డిప్యూటీ ఛైర్మన్ [18] చీనా మూలం:చిన్-చాన్-యే, అనువాదం:మహీధర జగన్మోహనరావు కథల సంపుటి, అనువాద సాహిత్యం చైనా భాషలోని విప్లవ కథలను జగన్మోహనరావు తెలుగులోకి అనువదించారు. 2020010004923 1947
డంకెల్ గురి-వ్యవసాయానికి ఉరి [19] జె.కిశోర్ బాబు సాహిత్యం 2020120007144 1993