Jump to content

చింతామణి నాగేశ రామచంద్ర రావు

వికీపీడియా నుండి
(సి. ఎన్. ఆర్. రావు నుండి దారిమార్పు చెందింది)
C.N.R. Rao (ಸಿ. ಎನ್. ಆರ್. ರಾವ್ )
జననం (1934-06-30) 1934 జూన్ 30 (వయసు 90)
బెంగళూరు, మైసూరు రాజ్యం, బ్రిటీష్ ఇండియా
నివాసంభారతదేశం
జాతీయతభారతీయుడు
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుఇస్రో
ఐఐటి కాన్పూర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా
జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాంస్డ్ సైంటిఫిక్ రీసెర్చ్
చదువుకున్న సంస్థలుమైసూరు విశ్వవిద్యాలయం
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
పర్డ్యూ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిసాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ
మెటీరియల్ సైన్స్
ముఖ్యమైన పురస్కారాలుహ్యూగ్స్ మెడల్ (2000)
ఇండియన్ సైన్స్ అవార్డ్ (2004)
(రాయల్ సొసైటీ) (1984)
అబ్దుస్ సలాం మెడల్ (2008)
డాన్ డేవిడ్ ప్రైజ్ (2005)
లీజియన్ ఆఫ్ ఆనర్ (2005)
పద్మశ్రీ (1974)
పద్మ విభూషణ్
(1985)
భారతరత్న (2013)

సి.ఎన్.ఆర్.రావుగా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేశ రామచంద్ర రావు (కన్నడభాష: ಚಿಂತಾಮಣಿ ನಾಗೇಶ ರಾಮಚಂದ್ರ ರಾವ್) (జూన్ 30, 1934) భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత. ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు రసాయన శాస్త్ర పరిశోధకుడు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సి.వి.రామన్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంల తరువాత భారతరత్న అవార్డుకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త.

బాల్యం

[మార్చు]

ఈయన 1934 జూన్‌ 30న బెంగళూరులోకన్నడ భాష మాట్లాడే దేశస్థ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[1] తండ్రి హనుమంత నాగేశ రావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ. ఆమె ప్రాథమిక విద్య వరకే చదివినా ఆయనకు ఆమె తొలి గురువు. భారత రామాయణ కథలు, పురందర దాసు కీర్తనలు మొదలైనవి వినిపించేది. నాన్న ఆంగ్లం నేర్పించేవాడు.

రామచంద్ర ఉన్నత పాఠశాలలో ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు ఆరాధ్య నాయకుడు. నేతాజీ పోరాటాన్ని గురించి మిత్రులకు కథలుగా చెప్పేవాడు.

పదేళ్ళు నిండక మునుపే లోయర్ సెకండరీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. పెద్దయ్యేకొద్దీ స్వాతంత్ర్యోద్యమ తీవ్రత కూడా పెరిగింది. అందుకు గాంధీ టోపీ, ఖద్దరు ధరించాడు.

విద్యాభ్యాసం, ఉద్యోగాలు

[మార్చు]

ఉన్నత పాఠశాల విద్య పూర్తయ్యే సరికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ మైసూరు సంస్థానం మాత్రం ఇంకా మహారాజుల పాలనలో ఉండేది. దాన్ని భారత్ లో విలీనం చేయాలంటూ పోరాటం మొదలైంది. రామచంద్ర కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పదిహేడేళ్ళకే బీయెస్సీ పట్టా అందుకుని మైసూరు విశ్వవిద్యాలయంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

మైసూరు విశ్వవిద్యాలయం నుంచి 1951లో, ఆయన బీ.ఎస్సీ. పూర్తి డిగ్రీ పుచ్చుకున్న తరువాత కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువు పూర్తి చేసుకొని, 1958లో పుర్డ్యూ యూనివర్సిటీలో పి.హెచ్.డి. సాధించి బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో లెక్చరర్ ‌గా చేరారు. 1963లో కాన్పూర్‌ ఐఐటీలో అధ్యాపకుడిగా చేరారు.1984-1994 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కి డైరెక్టరుగా పనిచేశాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. "జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చి" సంస్థను స్థాపించాడు. ఇంకా చాలా ఉన్నత పదవులు నిర్వహించాడు.

సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్సు రంగాలలో సి.ఎన్. ఆర్. రావు శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యాడు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడుల గురించి అతని పరిశోధనలు ఆ రంగంలో ముఖ్యమైనవి.

నానో పదార్థాల రంగంలో రావు విశేష కృషి చేశారు. 1400 పరిశోధన పత్రాలను వెలువరించారు. 45 పుస్తకాలు ప్రచురించారు. పద్మశ్రీ, పద్మ విభూషణ్‌, కర్ణాటక అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న పురస్కారాలను అందుకున్నారు. 2000 సంవత్సరంలో రాయల్‌ సొసైటీ ఆయనకు హ్యూగ్స్‌ మెడల్‌ను అందించింది.

2005 నుంచి ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలికి అధిపతిగా ఉన్నారు. ఆయన 1963 నుంచి 1976 వరకూ కాన్పూర్‌ ఐఐటీలో డీన్‌గా వ్యవహరించారు. 1984 నుంచి పదేళ్ల పాటు ఐఐఎస్‌సీకి సంచాలకులుగా పనిచేశారు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగానికి, పదార్థ పరిశోధన ప్రయోగశాలకు వ్యవస్థాపక ఛైర్మన్‌. బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌కు ఆయన వ్యవస్థాపకుడు. సీ.ఎన్.‌ఆర్‌ రావుపై గ్రంథచౌర్యం ఆరోపణలు కూడా వచ్చాయి. తన పరిశోధన పత్రంలో ఇతర శాస్త్రవేత్తల పత్రాల్లోని వ్యాక్యాలను ఎత్తిరాసినందుకు 'అడ్వాన్స్డ్‌ మెటీరియల్స్‌' అనే పత్రికకు క్షమాపణ చెప్పారు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Second Bharat Ratna for Chikkaballapur". Times of India. Retrieved 17 November 2013.
  2. "Dan David Prize". Archived from the original on 2008-05-11. Retrieved 2008-05-06.

ఇతర లింకులు

[మార్చు]