1749
Jump to navigation
Jump to search
1749 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1746 1747 1748 - 1749 - 1750 1751 1752 |
దశాబ్దాలు: | 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూన్ 6: జూన్ 29 న జరగాల్సిన బానిసల కుట్ర మాల్టాలో వెల్లడైంది.
- ఆగస్టు 3: రెండవ కర్ణాటక యుద్ధం: బ్రిటిషు మద్దతు ఉన్న ఆర్కాటు నవాబుకూ 77 ఏళ్ల అన్వరుద్దీన్ ఖాన్ కూ, ఫ్రెంచ్-మద్దతు ఉన్న చందా సాహిబ్ దళాలకూ మధ్య అంబూరు పోరు మొదలైంది. కోట గోడ దాటి వెలుపలికి వచ్చి చందా సాహిబ్ సైన్యంతో చేసిన యుద్ధంలో నవాబు ఓడిపోయాడు. యుద్ధంలో అతడు హతుడయ్యాడు. [1]
- ఆగష్టు 15 – ఆర్కిటిక్ మహాసముద్రం ద్వీపమైన ఎడ్జియాలో ఆరు సంవత్సరాలకు పైగా చిక్కుకుపోయిన రష్యన్ నావికులు-అలెక్సీ ఇంకోవ్, క్రిసాన్ఫ్ ఇంకోవ్, స్టెపాన్ షరపోవ్, ఫెడోర్ వెరిగినే లను రక్షించారు. 1743 మేలో మంచు తాకిడికి వాళ్ళ పడవ ఛిన్నమై పోయినపుడు మొత్తం 14 మంది సిబ్బందిలో వారు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. [2] ఈ నలుగురు సెప్టెంబరు 28 న ఇంటికి తిరిగి వచ్చారు. నాలుగో వ్యక్తి, ఫెడోర్ వెరిగినే, స్కర్వీ వ్యాధితో దారి లోనే మరణించాడు
- నవంబర్ 12: ఫ్రాన్స్‌లో ఆకలితో అలమటించే గ్రామీణులు పారిస్‌కు తరలిరాకుండా ఉండేందుకు గాను, కింగ్ లూయిస్ XV ఒక ఆర్డినెన్స్ జారీ చేసాడు: "పారిస్ వీధుల్లో, చర్చిలలో, చర్చి ద్వారాల వద్దా, పారిస్ శివార్లలో ఉండే గ్రామీణ ప్రాంతాలలోనూ కనిపించే బిచ్చగాళ్ళను ఏ వయస్సు వారైనా, ఏ లింగమైనా సరే అరెస్టు చేసి జైళ్లలో పెట్టాలి. ఎంత కాఅలం అవసరమైతే అంత కాలమూ అక్కడే ఉంచాలి. " [3] [4]
జననాలు
[మార్చు]- మార్చి 23: పియర్ సైమన్ లాప్లేస్, ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (మ.1827)
- మే 17: ఎడ్వర్డ్ జెన్నర్ 'రోగ నిరోధక శాస్త్ర పితామహుడు'గా పేరు పొందిన ఆంగ్ల శాస్త్రవేత్త (మ.1823)
- ఆగష్టు 28: గేథే 18, 19వ శతాబ్దపు జర్మన్ సాహిత్యం, వీమర్ క్లాసిసిజం ఉద్యమ నేత. (మ.1832)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Spencer C. Tucker, ed., A Global Chronology of Conflict: From the Ancient World to the Modern Middle East (ABC-CLIO, 2009) p756
- ↑ David Roberts, Four Against the Arctic: Shipwrecked for Six Years at the Top of the World (Simon and Schuster, 2005) p10
- ↑ "Child Abduction Panic", in Outbreak!: The Encyclopedia of Extraordinary Social Behavior, ed. by Hilary Evans and Robert E. Bartholomew (Anomalist Books, LLC, 2009) pp83-84
- ↑ Christine Pevitt Algrant, Madame de Pompadour: Mistress of France (Grove Press, 2003) p95