Jump to content

ఈమని

అక్షాంశ రేఖాంశాలు: 16°19′30″N 80°39′7″E / 16.32500°N 80.65194°E / 16.32500; 80.65194
వికీపీడియా నుండి
ఈమని
పటం
ఈమని is located in ఆంధ్రప్రదేశ్
ఈమని
ఈమని
అక్షాంశ రేఖాంశాలు: 16°19′30″N 80°39′7″E / 16.32500°N 80.65194°E / 16.32500; 80.65194
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలందుగ్గిరాల
విస్తీర్ణం
23.16 కి.మీ2 (8.94 చ. మై)
జనాభా
 (2011)
7,998
 • జనసాంద్రత350/కి.మీ2 (890/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,976
 • స్త్రీలు4,022
 • లింగ నిష్పత్తి1,012
 • నివాసాలు2,403
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522308
2011 జనగణన కోడ్590270

ఈమని, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుగ్గిరాల నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2403 ఇళ్లతో, 7998 జనాభాతో 2316 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3976, ఆడవారి సంఖ్య 4022. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2529 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 86. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590270[1]

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామీణ పరిపాలనలో మండల వ్వవస్థ ప్రవేశపెట్టకముందు ఈమని ఒక పంచాయితీ సమితి కేంద్రము. మొత్తం 42 గ్రామపంచాయితీలకు ఈమని సమితికేంద్రంగా ఉండేది. (పంచాయితీ సమితిలో ఒక సమితి అభివృద్ధి అధికారి -BDO, ఒక సమితి ప్రెసిడెంటు ఉండేవారు. స్థానిక పాలనా బాధ్యతలు - విద్య, వ్యవసాయం, వైద్యం వంటివి పంచాయితీ సమితి అధికారంలో ఇండేవి), అప్పటి సమితి ఆఫీసు ఉండే భవనం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ వూరికీపేరు రావడం ఇలా జరిగిందని చెబుతారు. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. అందులో మునులు తపస్సు చేసుకొంటూ ఉండేవారు. వారు దగ్గరలో, కృష్ణానదికి అటువైపున ఉన్న మునికోటిపురం (ప్రస్తుతం మున్నంగి) అనేవూరికి అప్పడపుడూ వెళుతుండేవారు. మళ్ళీ మళ్ళీ కృష్ణాలో స్నానాలు చేసి తపస్సుకోసం "ఈ వని" (ఈ అడవి) కి తిరిగి వచ్చేవారు. "ఈ వని" కాలక్రమంలో "ఈమని"గా మారింది.

సమీప గ్రామాలు

[మార్చు]

చింతలపూడి 4 కి.మీ, దుగ్గిరాల 4 కి.మీ, కొలకలూరు 5 కి.మీ, దంతలూరు 5 కి.మీ, మోరంపూడి 6 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

పాఠశాల 1946-జులై-8న ఏర్పడినది. పెద్దిరాజు సూర్యనారాయణ, తమ గ్రామంలో పాఠశాల స్థాపించడానికి స్థల వితరణ చేసినారు. కస్తాల వెంకటసుబ్బయ్య, అంచే శివయ్య వంటివారు, అప్పట్లో ప్రజా ప్రతినిధిగా ఉన్న పాములపాటి కృష్ణయ్యచౌదరిని గ్రామంలో పాఠశాల కావాలని అడగటం, ఆయన అనుమతి చేయించడం జరిగినవి. అప్పటి నుండి ఈ పాఠశాల అభివృద్ధి చెందుతూ వచ్చినది. 1970 లోనే పదవ తరగతి పరీక్షా కేంద్రానికి అనుమతి వచ్చినది.[11] 2015,డిసెంబరు-29వ తేదీనాడు, అనంతపురంలో, రాష్ట్రస్థాయిలో "నీరు-ప్రగతి" అను అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలలో, ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న వై.ప్రవీణ్ కుమార్, కె.జ్యోష్ణవి అను విద్యార్థులు ప్రథమ, ద్వితీయస్థాయిలో నిలిచారు. వక్తృత్వ పోటీలో ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న వెంకటేష్ అను విద్యార్థి ప్రథమస్థానం సాధించాడు. ఈ విద్యార్థులు గవర్నర్ శ్రీ నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, నీటిపారుదలశాఖా మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారల చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు. [10] ఈ పాఠశాలకు దాతల వితరణతో ప్రహరీగోడ నిర్మాణం, పదవ తరగతి పరీక్షా కేంద్రానికి కావలసిన వస్తు సామాగ్రి, క్రీడా దుస్తులు, క్రీడా పరికరాలు, తదితర సదుపాయాలు అందజేయుచున్నారు. గ్రామానికి చెందిన బండి బాబూరావు, 14 సంవత్సరాలుగా, ప్రతి సంవత్స్రం 50 వేల రూపాయల్కు తక్కువగాకుండా వితరణ చేస్తున్నారు. ఈ పాఠశాల 70వ వార్షికోత్సవం, 2016, మార్చి-5వ తేదీ, శనివారంనాడు జరుపుకుంటున్నది. [11] ఈ పాఠశాలలో 2015-16 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. 45 సంవత్సరాల తరువాత ఈ పాఠశాలకు 100% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ పాఠశాలకు 2015-16 లోనే తొలిసారిగా పరీక్షా కేంద్రం వచ్చింది. [12]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

[మార్చు]

సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దుగ్గిరాలలోను, ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుగ్గిరాలలోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఈమనిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. RMP డాక్టర్లు నలుగురు ఉన్నారు. వారిలో చుక్కా గంగాధరప్రసాద్ ఒకరు.ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈమనిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఈమనిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 212 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2103 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 2103 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఈమనిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1962 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 141 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఈమనిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, పసుపు, మొక్కజొన్న

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం

[మార్చు]

పెదపాలెం, శృంగారపురం గ్రామాలు ఈ కేంద్రం పరిధిలో ఉన్నాయి.

గ్రామంలో ఈ కేంద్రానికై నూతనంగా నిర్మించిన భవనాన్ని,2017,ఫిబ్రవరి-21న ప్రారంభించెదరు.

అంగనవాడీ కేంద్రం

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యడ్ల పాండురంగ విజయలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది. ఉప సర్పంచిగా చినగోపాలరావు ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ వినాయకస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయం

[మార్చు]

దేవాలయంలో, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో, మూడురోజులపాటు, కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా కలశపూజ, స్వామివారి కళ్యాణం, అర్చకుల పవిత్ర వేదమంత్రాలతో, వైభవంగా నిర్వహించెదరు. విఘ్నేశ్వర పూజ అనంతరం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, శాంతి కళ్యాణం నిర్వహించెదరు.

శ్రీ కోదండరామస్వామి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం, నల్లమేకలపాలెం వెళ్ళే దారిలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు, శ్రీరామనవమి పర్వదినానా, ధనుర్మాసం సమయంలోనూ, దసరా నవరాత్రి ఉత్సవాలలోనూ, వైకుంఠఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం సందర్భంలోనూ, నిత్యం, అధికసంఖ్యలో వస్తుంటారు. దాతల పెద్ద మనసుతో, గ్రామస్తుల సహకారంతో, ఆరు లక్షల అంచనా వ్యయంతో, ఈ ఆలయం నూతనరూపు సంతరించుకొనుచున్నది. గతంలో శిథిలమైన యాగశాలను, నాలుగు లక్షల రూపాయలతో పునర్నిర్మించారు. ఒకటిన్నర లక్షల రూపాయల వ్యయంతో, పశ్చిమగోదావరి జిల్లా శిల్పుల చేత, దశావతార రూపాలు ఏర్పాటుచేస్తున్నారు. యాభై వేల రూపాయలతో ఆలయగోపురానికి మరమ్మత్తులు చేస్తున్నారు. [6]

4 లక్షల రూపాయల దాతల, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో, ఈ ఆలయానికి నూతనంగా ఫ్లోరింగ్, సిమెంట్ రహదారి పనులు పనులు జరుపుచున్నారు. ఇందువలన ప్రదక్షిణలు చేయు భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

2017, ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, మాఘపౌర్ణమి సందర్భంగా, ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠ, 30 సంవత్సరాల క్రితం జూన్-20న నిర్వహించారు. ఈ సందర్భంగా 2017,జూన్-20వతేదీ మంగళవారంనాడు, ఏకాదశి రోజున, ఆలయంలో స్వామివారికి పూలంగిసేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ గంగానమ్మ దేవాలయం

[మార్చు]

శ్రీ దత్తసాయి మందిరం

[మార్చు]

శ్రీ దత్తసాయి మందిరం, అన్నపూర్ణ ఉచిత హోమియో కేంద్రం, నవమ ప్రతిష్ఠా వార్షికోత్సవం సందర్భంగా, 2015, జూన్-19వ తేదీ శుక్రవారంనాడు, భజన కార్యక్రమం నిర్వహించెదరు. 20వ తేదీ శనివారంనాడు సామూహిక సాయినామ పారాయణం, సత్య వ్రతాలు, గ్రామోత్సవం నిర్వహించెదరు. 21వ తేదీ ఆదివారంనాడు, ఉదయం అభిషేకాలు, మద్యాహ్నం అన్నసంతర్పణ, సాయంత్రం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. ఈమని గ్రామానికి చెందిన, 10 సంవత్సరాల 4 నెలల వయసుగల, 6వ తరగతి చదువుచున్న కుందేటి నాగసాయిమల్లిక అను బాలిక, హిందీ ప్రవీణ-ఉత్తరార్ధ పరీక్ష (అంటే సాధారణ డిగ్రీ స్థాయి పరీక్ష) మంచిమార్కులతో పూర్తిచేసి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు విద్యార్థినిగా రికార్డులకెక్కింది. ఈమె మూడవ తరగతినుండియే, వరుసగా హిందీ పరీక్షలు వ్రాయుచూ, ఇప్పటివరకూ 8 పరీక్షలు వ్రాసినది. ఈమె తండ్రి శ్రీ కుందేటి శివరామకృష్ణ.
  2. ఈమని గ్రామానికి చెందిన శ్రీ బండి బాబూరావు, 13 సంవత్సరాలుగా గ్రామానికి సేవచేస్తున్నారు. ప్రధానంగా పాఠశాలలకు వితరణ చేస్తున్నారు.
  3. ఈమని గ్రామానికి చెందిన శ్రీ దీవి సీతారామమూర్తి ఒక విశ్రాంత ఉపధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. వీరు 2015, నవంబరు-12,13 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో, 60 సంవతరాల విభాగంలో, ట్రిపుల్ జంప్, 100 మీ. మరియూ 400 మీటర్ల హర్డిల్స్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి, 33 స్వర్ణపతకలు గెల్చుకున్నారు.
  4. జీవిత బీమా సంస్థ ఈమని గ్రామాన్ని బీమా గ్రామం గా ఎంచుకుని, 2017,జూన్-25న గ్రామ పంచాయతీకి 75వేల రూపాయల ప్రోత్సాహక నగదు పురస్కారం అందజేసినది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,117. ఇందులో పురుషుల సంఖ్య 4,060, స్త్రీల సంఖ్య 4,057, గ్రామంలో నివాస గృహాలు 2,173 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,316 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈమని&oldid=4249951" నుండి వెలికితీశారు