కోయంబత్తూరు
Coimbatore
Kovai, Covai (shortened) | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
Nickname(s): Kovai, Manchester of South India | ||||||||
Coordinates: 11°01′00.5″N 76°57′20.9″E / 11.016806°N 76.955806°E | ||||||||
Country | భారతదేశం | |||||||
State | Tamil Nadu | |||||||
District | Coimbatore | |||||||
Government | ||||||||
• Type | Municipal Corporation | |||||||
• Body | CCMC | |||||||
• Mayor | A.Kalpana, DMK | |||||||
• Corporation Commissioner | M.Prathap , IAS | |||||||
• Commissioner of Police | G.Balakrishanan , IPS | |||||||
విస్తీర్ణం | ||||||||
• Metropolis | 246.75 కి.మీ2 (95.27 చ. మై) | |||||||
• Metro | 799.47 కి.మీ2 (308.68 చ. మై) | |||||||
• Rank | 2 | |||||||
Elevation | 427 మీ (1,401 అ.) | |||||||
జనాభా (2011) | ||||||||
• Metropolis | 15,84,719 | |||||||
• Rank | 24th | |||||||
• జనసాంద్రత | 6,441/కి.మీ2 (16,680/చ. మై.) | |||||||
• Metro | 21,36,916 | |||||||
• Metro rank | 16th | |||||||
Demonym | Coimbatore | |||||||
Languages | ||||||||
• Official | Tamil, English | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | 641XXX | |||||||
STD Code | +91-0422 | |||||||
Vehicle registration | TN 37 (South), TN 38 (North), TN 66 (Central), TN 99 (West), TN 37Z (Sulur) |
కోయంబత్తూరు (తమిళం: கோயம்புத்தூர்), కోవై అని కూడా పిలుస్తారు (తమిళం: கோவை), తమిళనాడు రాష్ట్రం లోని రెండవ అతిపెద్ద నగరం.[1] కోయంబత్తూరు జిల్లా ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్గా పేరుగాంచింది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగం. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి, ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందింది. కామనాయకన్ పాలయం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామనాయకన్ పాలయం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కోయంబత్తూరు నగరపాలకసంస్థకు ప్రధాన కేంద్రం.
చరిత్ర
[మార్చు]దక్షిణ భారతదేశం లోని పలు సామ్రాజ్యాలు కోయబత్తూరు జిల్లా భూభాగాన్ని పాలించాయి. 11వ శతాబ్దంలో చోళచక్రవర్తుల ఆధీనంలో ఉన్న ఇరుళ సామంతులు పాలించిన కాలంలో ప్రస్తుత కోయంబత్తూరు ప్రదేశం వనాలతో నిండిన అరణ్యప్రాంతగా ఉండేది. 18వ శతాబ్దంలో ఈ జిల్లా మదురై పాలకులనుండి మైసూర్ చక్రవర్తి ఆధీనంలోకి మారింది. 1799లో మైసూరు యుద్ధాల అనంతరం ఈ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. 1947 వరకు బ్రిటిష్ పాలన కొనసాగింది.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్‌పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉంది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతుంది.[2]
దేవాలయాలు
[మార్చు]కోయంబత్తూరు నగరంలో ప్రధాన దేవాలయాలు ఈచనరి వినాయగర్ ఆలయం, రంగనాథర్ ఆలయం, పేరూర్ పాటీశ్వరర్ ఆలయం, మరుదమలై మురుగన్ ఆలయం, కొన్నియమ్మన్ ఆలయం, తండు మారియమ్మన్ దేవాలయం, కోయంబత్తూర్ పంచముఖ ఆంజనేయ ఆలయం, రామలింగ చౌడేశ్వరి అమ్మన్ టెంపుల్, అణ్ణామలైలో కరమాదై, మాసాని అమ్మవారి ఆలయం, పొల్లాచ్చిలోలో అళగునాచ్చి అమ్మవారి ఆలయం, తిరుమూర్తి హిల్స్ లో తిరుమూర్తి ఆలయం, మెట్టుపాలయంలో సులక్కల్, భద్రకాళి అమ్మవారి ఆలయంలో మారియమ్మన్ దేవాలయం మొదలైన ఆలయాలు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 అనుసరించి కోయంబత్తూరు నగర జనసంఖ్య 3,472,578. ఇందులో పురుషుల సంఖ్య 1,737,216, స్త్రీలసంఖ్య 1,735,362 . పురుష నిష్పత్తి 1001:1000. ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య 150,580, బాలికల సంఖ్య 145,004. [3]
2001 గణాంకాలను అనుసరించి నగర ప్రజల ప్రధాన భాషలలో ప్రథమస్థానంలో తమిళం, తరువాతి స్థానంలో తెలుగు, కన్నడం, మళయాళం మాట్లాడే వారి స్వల్పంగా ఉన్నారు. నగర జనాభాలో హిందువుల శాతం 90.08%, ముస్లిములు 5.33%, క్రైస్తవులు 4.35%, ఇతరులు 0.24% ఉన్నారు.[4]
ప్రాంతం గమనిక 1: నగర పరిమితుల విస్తరణకు ముందు ప్రాంతం 105.6 చ.కి.మీ. 2010 విస్తరణ ఉత్తర్వు 12 స్థానిక సంస్థలను జోడించి మొత్తం వైశాల్యాన్ని 265.36 చ.కి.మీ.కి పెంచింది. 2011లో, మూడు స్థానిక సంస్థలైన వెల్లలూర్ (16.64 చ.కి.మీ), చిన్నియం పాళయం (9.27 చ.కి.మీ) పేరూర్ (6.40 చ.కి.మీ) విస్తరణ నుండి తొలగించబడ్డాయి. వెల్లకినార్ (9.20 చ.కి.మీ), చిన్నవేదంపట్టి (4.5. కిమీ) జోడించబడ్డాయి. విస్తరణ తర్వాత ప్రాంతం 246.75 చ.కి.మీ.
జనాభా గమనిక 1: అధికారిక జనాభా గణన 2011 ప్రకారం జనాభా విస్తరణకు ముందు నగర పరిమితుల ఆధారంగా 1,050,721. 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభా 930,882.
2010 ప్రభుత్వ ఉత్తర్వు తర్వాత, జనాభా 1,262,122 అయింది. మునుపటి నోట్‌లో పేర్కొన్న మార్పులు చేసిన తర్వాత, 2001 జనాభా సంఖ్య 1,250,446. పట్టణ సమ్మేళనం కోసం 1,601,438 స్మార్ట్ సిటీ ఛాలెంజ్ కోసం భారత ప్రభుత్వం కొత్త నగర పరిమితులతో సహా జనాభాను అందించింది.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]కోయంబత్తూరు నగరం రోడ్లు, రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. మధ్య కోయంబత్తూరు, దక్షిణ కోయంబత్తూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం, పొల్లాచ్చి, సూలూరు లలో 6 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉన్నాయి. నగరం మార్గాన్ని జాతీయరహదారి- 47, జాతీయరహదారి- 67, జాతీయరహదారి- 209 అనే 3 అనుసంధానిస్తూ ఉన్నాయి. అవి నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలతో చక్కగా అనుసంధానిస్తున్నాయి. నగరంలోని పీలమేడు, సింగనల్లూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం రైల్వే స్టేషను, ఇరుగూరు, పొదనూరు, పొళ్ళాచ్చి జంక్షన్ రైల్వేస్టేషను, సూలూరు, తుదియలూరు, పెరియనైచంపాళయంలలో రైల్వేస్టేషనులు ఉన్నాయి. కోయంబత్తురు నగర రైల్వే జంక్షన్ దక్షిణ రైల్వేస్టేషనులలో అతిపెద్దది, రైల్వేశాఖకు అధికంగా ఆదాయం అందిస్తున్న వాటిలో రెండవ స్థానంలో ఉంది.
భౌగోళికం , వాతావరణం
[మార్చు]కోయంబత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం దక్షిణభూభాగంలో ఉంది. ఈ జిల్లాకు కేరళ రాష్ట్రానికి ఆనుకుని ఉంది. ఈ జిల్లా ఉత్తర, పడమర దిశలలో అభయారణ్యాలతో కూడుకున్న పడమటి కనుమల పర్వతశ్రేణుల మధ్య ఉపస్థితమై ఉంది. నగరానికి ఉత్తరదిశలో నీలగిరి బయోస్ఫేర్ రిజర్వ్ ఉంది [5] ఈ జిల్లాగుండా ప్రవహిస్తున్న నొయ్యాల్ నది కోయంబత్తురు నగరపాలితానికి దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది.[6][7] కోయంబత్తూరు నగరం నొయ్యల్ మైదానంలో ఉపస్థితమై ఉన్నందున ఈ ప్రదేశంలో ఉన్న విస్తారమైన చెరువులకు నొయ్యల్ నది జలాలు, వర్షాల నుండి అందుతున్న జలాలతో నిండిఉన్నాయి.[8] ఇందులో ప్రధానమైన చెరువులు, చిత్తడినేలలలో సింగనల్లూరు చెరువు, వలంకుళం, ఉక్కడం పెరుయకుళం, సెల్వంపతి, నరసంపతి, కృష్ణంపతి, సెల్వచింతామణి, కుమారస్వామి చెరువు ముఖ్యమైనవి.[9] సంగనూరు పల్లం, కోవిల్‌మేడు పల్లం, విలాన్‌కురుచ్చి-సింగనల్లూరు పల్లం, రైల్వే ఫీడర్ రోడ్డుపక్కన ఉన్న మడుగు, తిరుచ్చి- సింగనల్లూరు చెక్ డ్రైన్, గణపతి పల్లం చిత్తడినేలలలో ప్రధానమైనవి.[6][10] కోయంబత్తూరు జిల్లా తూర్పు భాగంలో పొడి నేలలు ఉంటాయి. జిల్లా అంతటా ఉత్తర, పడమర భూభాగం పడమటి కనుమల పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. వీటిలో నీలగిరి బయోస్ఫేర్, అణ్ణామలై, మూణారు పర్వతశ్రేణులు ప్రధానమైనవి. సరిహద్దులో ఉన్న పాలఘాట్ మార్గం కేరళ రాష్ట్ర మర్గాన్ని సుగమం చేస్తున్నది. అనుకూల వాతావరణం కారణంగా కోయంబత్తురు విభిన్నమైన వృక్షజాతితో సుసంపన్నమై ఉంది. కోయంబత్తురు నగర పర్వత భూభాగాలు 116 జాతుల పక్షులకు పుట్టిల్లుగా విలసిల్లుతుంది. వీటిలో 66 జాతులు ప్రాంతీయమైనవి కాగా, 33 జాతులు జాతీయ వలస పక్షులు కాగా 17 జాతులు అంతర్జాతీయ వలసపక్షులు.[11] కోయంబత్తూర్ పల్లపు భూములలో క్రమం తప్పకుండా సందర్శించడానికి వీలైన పక్షులు కొన్ని పెలికాన్, స్టార్క్, ఓపెన్ ఉదరం స్టార్క్, ఐబిస్, స్పాట్ గల బాతు పెయింటెడ్, టేల్, బ్లాక్ రెక్కలు గల స్టిల్ట్ స్పాట్ బిల్ మొదలైనవి.[5]
మైదానాలలో సాధారణంగా ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పులులు, దున్నపోతులు, జింకజాతులు, నీలగిరి తార్, స్లాత్ ఎలుగుబంటి, బ్లాక్ హెడెడ్ ఒరియోల్ ఉన్నాయి.[12] పడమటి కనుమలలో సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తున ఉన్న వన్యమృగ శరణాలయం 958 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. జిల్లాలోని ఉత్తర, పడమర భూభాగాలలో 20% కంటే అధికమైన భూభాగం అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాలలో వాణిజ్య విలువలు కలిగిన టేకు, గంధపు చెట్లు, ఎర్రచందనం, వెదురు చెట్లు అధికంగా ఉన్నాయి. నీలగిరి, మేట్టుపాళయం పర్వతాలు గంధపు చెట్లకు ప్రసిద్ధి. ఎత్తైన భూభాగం లాంటానా పొదలతో ఆక్రమితమై ఉంది. ప్రాంతీయులు వీటిని సిర్కిచెడి అని అంటారు.
జిల్లకు పడమటి సరిహద్దులలో కేరళ రాష్ట్రానికి చెందిన పాలక్కాడు జిల్లా, దక్షిణ సరిహద్దులో నీలగిరి జిల్లా , ఈశాన్యం, తూర్పున ఈరోడ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన ఇడుక్కి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో దిండిగల్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 7,649 చదరపు కిలోమీటర్లు. జిల్లా నైరుతి, ఉత్తర సరిహద్దులలో ఉన్న పడమటి కనుమల పర్వతశ్రేణుల వలన జిల్లాలో సంవత్సరమంతా ఆహ్లాదమైన వాతావరణం ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వేరుచేస్తున్న పడమటి కనుమలలో రెండు రాష్ట్రాలను అలాగే కోయంబత్తూరు, పాలక్కాడు జిల్లాలను పాలఘాట్ అనుసంధానిస్తున్నది. రెండు రాష్ట్రాలకు ఇది ప్రధానమైన అనుసంధానంగా ఉంది. మిగిలిన జిల్లా అంతా సంవత్సరమంతటా పర్వతశ్రేణుల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. జిల్లాలో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు 35° సెంటీగ్రేడ్ నుండి 18° సెంటీగ్రేడ్ ఉంటుంది.[13] సరాసరి వర్షపాతం 700 మిల్లీమీటర్లు. మొత్తం వర్షపాతంలో ఈశాన్య రుతుపవనాలు 47% వర్షపాతానికి కారణం కాగా నైరుతి రుతుపవనాలు 28% వర్షపస్తానికి కారణమౌతున్నాయి.[13] జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనవి భవాని, నొయ్యల్, అమరావతి, అలియార్ ముఖ్యమైనవి. జిల్లాకు తియ్యటి మంచినీటిని అందిస్తున్న ప్రధానవరు సిరువాణి ఆనకట్ట. కోయంబత్తూరు జిల్లాలో ఉన్న జలపాతాలలో గుర్తించతగినవి చిన్నకళ్ళర్ జలపాతం, మంకీ జలపాతం, సెంగుపతి జలపాతం, త్రిమూర్తి జలపాతం, వైదేహి జలపాతం ముఖ్యమైనవి.
-
కోయంబత్తూరు జంక్షన్
-
కోయంబత్తూరు-జంక్షన్-1930-ఏరియల్-వ్యూ.
-
కోయంబత్తూరు బస్సు స్టాండు
-
నెహ్రూ స్టేడియం, కోయంబత్తూరు.
-
కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల
మూలాలు
[మార్చు]- ↑ Tamil Nadu: largest cities and towns and statistics of their population, World gazetteer
- ↑ E.g. India Rail Info: Coimbatore Junction/CBE
- ↑ "Provisional Population Totals - Tamil Nadu-Census 2011" (PDF). Census Tamil Nadu. Archived from the original (PDF) on 17 జూన్ 2013. Retrieved 4 July 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-06. Retrieved 2014-03-14.
- ↑ 5.0 5.1 L. Joseph Reginald; C. Mahendran; S. Suresh Kumar; P. Pramod (December 2007). "Birds of Singanallur lake, Coimbatore, Tamil Nadu" (PDF). Zoos' Print Journal. 22 (12): 2944–2948. Archived from the original (PDF) on 2011-09-29. Retrieved 2014-03-14.
- ↑ 6.0 6.1 "Business Plan for Coimbatore Corporation" (PDF). Wilbur Smith Associates. Archived from the original (PDF) on 15 ఆగస్టు 2014. Retrieved 9 May 2011.
- ↑ "Noyyal flows on like a quiet killer". Deccan Chronicle. 28 January 2011. Archived from the original on 14 ఫిబ్రవరి 2011. Retrieved 9 May 2011.
- ↑ "A river runs through it". The Hindu. 28 January 2006. Archived from the original on 10 నవంబరు 2012. Retrieved 9 May 2011.
- ↑ "'Maintenance of tanks not at cost of environment'". The Hindu. 27 October 2010. Archived from the original on 10 నవంబరు 2012. Retrieved 9 May 2011.
- ↑ "Corporation begins storm water drain project in Coimbatore". The Hindu. 5 January 2011. Archived from the original on 10 జనవరి 2011. Retrieved 9 May 2011.
- ↑ "CONSERVATION OF BIRD LIFE IN AN URBAN WETLAND: PROBLEMS CONCERNS — A CASE STUDY". CHEMICAL, BIOLOGICAL AND ENVIRONMENTAL ENGINEERING Proceedings of the International Conference on CBEE 2009. World Scientific Publishing Co. Archived from the original on 15 ఆగస్టు 2011. Retrieved 9 May 2011.
- ↑ "Coimbatore - a hot spot of bio-diversity". The Hindu. 17 February 2011. Retrieved 9 May 2011.
- ↑ 13.0 13.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2010-03-31. Retrieved 2014-03-14.