Jump to content

గోనుగుంట

అక్షాంశ రేఖాంశాలు: 15°32′16.800″N 79°51′39.600″E / 15.53800000°N 79.86100000°E / 15.53800000; 79.86100000
వికీపీడియా నుండి
గోనుగుంట
పటం
గోనుగుంట is located in ఆంధ్రప్రదేశ్
గోనుగుంట
గోనుగుంట
అక్షాంశ రేఖాంశాలు: 15°32′16.800″N 79°51′39.600″E / 15.53800000°N 79.86100000°E / 15.53800000; 79.86100000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంచీమకుర్తి
విస్తీర్ణం39.46 కి.మీ2 (15.24 చ. మై)
జనాభా
 (2011)[1]
6,841
 • జనసాంద్రత170/కి.మీ2 (450/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,439
 • స్త్రీలు3,402
 • లింగ నిష్పత్తి989
 • నివాసాలు1,679
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523226
2011 జనగణన కోడ్591092


గోనుగుంట ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చీమకుర్తి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1679 ఇళ్లతో, 6841 జనాభాతో 3946 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3439, ఆడవారి సంఖ్య 3402. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2448 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 180. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591092[2].

సమీప గ్రామాలు

[మార్చు]

పులికొండ 5 కి.మీ, గుమ్మలంపాడు 5 కి.మీ, ఎనికపాడు 6 కి.మీ, మంచికలపాడు 7 కి.మీ, చిలమకూరు 10 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  1. ఈ పాఠశాల విద్యార్థి అయిన టి.శ్రవణ్ కుమార్ రూపొందించిన పరిశ్రమల కాలుష్యం శుద్ధి చేయటం అను ప్రాజెక్టు, జాతీయ సైన్సు కాంగ్రెసులో స్థానం సంపాదించింది. సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ లో 2013 నవంబరు 11 నుండి 16 వరకూ జరిగిన జాతీయ సైన్సు కాంగ్రెసు ఫెయిర్ లో, శ్రవణ్ కుమార్ ఈ నమూనాను ప్రదర్శించి, అందరి మన్ననలనూ పొందినాడు.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న శ్రవణ్ కుమార్ అను విద్యార్థి, రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైనాడు. ఇతడు ఇటీవల ఒంగోలులోని సెయింట్ థెరెస్సా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన, జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో తన సత్తా చాటినాడు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని మార్చడం -- అందులో ఎదురయ్యే సవాళ్ళు, అనే అంశానికి సంబంధించి ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించుచున్నారు.
  3. ఈ పాఠశాల విద్యార్థి అయిన బి.నరసింహం, ఇటీవల INSPIRE ప్రదర్శనలో, దక్షిణ భారతదేశ స్థాయిలో తన ప్రతిభ చూపి, జపాను దేశం సందర్శించే అవకాశం అంది పుచ్చుకున్నాడు. ఎస్.సి.ఇ.ఆర్.టి. ద్వారా, భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఎంపిక చేసిన 25 మంది విద్యార్థులలో ఈ విద్యార్థిఒకరు కావడం విశేషం. వీరు మే/2015 నెలలో జపాను దేశంలో నిర్వహించే యూత్ ఎక్ఛేంజ్ కార్యక్రమంలో పాల్గొంటారు
  4. ఈ పాఠశాలలో షటిల్ క్రీడా మైదానం నిర్మాణానికి, 2015, ఆగస్టు-15వ తేదీనాడు భూమిపూజ నిర్వహించారు.
  5. ఈ పాఠశాల విద్యార్థి అయిన టి.ప్రవీణ్ కుమార్ రూపొందించిన "ఉప్పునీటితో విద్యుదుత్పత్తి చేయడం" అను ప్రాజెక్టు, జిల్లాస్థాయి సైన్స్ ఇన్స్ పైర్ ప్రదర్శనలో బహుమతి గెలుచుకొని, రాష్ట్రస్థాయి సైన్స్ ఇన్స్ పైర్ ప్రదర్శనకు ఎంపికైనది. 2015, నవంబరు-5 నుండి 7 వరకు విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఈ విద్యార్థి రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో గూడా ఈ ప్రాజెక్టు తన ప్రత్యేకతను చాటి, ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో, 2015, డిసెంబరు-5,6,7 తేదీలలో ప్రదర్శించు జాతీయస్థాయి పోటీలలో ప్రదర్శనకు ఎంపికైనది. జిల్లా నుండి జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైన ప్రాజెక్టు ఇదొక్కటే కావడం గమనార్హం.
  6. పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ టి.రమేష, జాతీయ స్థాయి టీచర్స్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్.టి.ఎస్.సి) కి ఎంపికైనారు. "అభ్యసనకు ఆరోగ్యానికి మధ్య సంబంధం" అన్న అంశంపై ఆయన రూపొంచిన ప్రాజెక్టు సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైనది. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో పూణే లోని మరాఠా విఙానపరిషత్తులో 2015, డిసెంబరు-17 నుండి 20 వరకు నిర్వహించు సదస్సులో ఆయన ఈ వివరాలను సమర్పించనున్నారు.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]

1950 లో ఈ గ్రామ పంచాయతీ, ఆరు గ్రామాలతో ఏర్పాటయినది. కూనంనేనివారిపాలెం, మువ్వావారిపాలెం, మర్రిపాలెం, ఏలూరివారిపాలెం, గుడిపూడివారిపాలెం గ్రామాలతో పంచాయతీ ఏర్పాటయి, 25 సంవత్సరాల పాటు ఇలాగే ఉంది. మొదటి సర్పంచిగా మర్రిపాలెంకు చెందిన శ్రీ గోరంట్ల రామయ్య పనిచేశారు. తరువాత మువ్వావారిపాలెంకు చెందిన బొడ్డు, 1971 నుండి 1981 వరకు, అత్యధిక కాలం సర్పంచిగా పనిచేశారు. తరువాత కూనంనేనివారిపాలెంకు చెందిన శ్రీ పమిడి నరసింహారావు, ఏలూరివారిపాలెంకు చెందిన శ్రీ గోగినేని యల్లమంద, తరువాత ఇదే గ్రామానికి చెందిన శ్రీ ఏలూరి కోటేశ్వరరావు, ఈ ఆరు గ్రామాల పంచాయతీకి సర్పంచులుగా పనిచేశారు. 1981లో కూనంనేనివారిపాలెం, ఏలూరివారిపాలెం గ్రామాలు, ఈ పంచాయతీ నుండి విడిపోయినవి. మిగిలిన నాలుగు గ్రామాల పంచాయతీకి, గోనుగుంటకు చెందిన శ్రీ రాయిని వెంకయ్య, గుడిపూడివారిపాలేనికి చెందిన శ్రీ గొట్టిపాటి రాఘవరావు, సర్పంచులుగా పనిచేశారు. 1994 ప్రాంతంంలో మువ్వవారిపాలెం, మర్రిపాలెం గ్రామాలు గూడా వేరే వెళ్ళీపోయినవి. ఇప్పుడు గోనుగుంట మరియూ గుడిపూడివారిపాలెం గ్రామాలు రెండూ ఒక పంచాయతీ క్రింద ఉన్నాయి. ఆయా కాలాలలో పనిచేసిన సర్పంచులు, తమ తమ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువైనారు. గ్రామంలో వెంకటగిరి రాజుల కాలంలో నిర్మించిన లింగేశ్వర స్వామి వారి ఆలయం ఈ గ్రామ ప్రత్యేకత. ఇప్పటికీ ఈ గ్రామం, ఈ ఆరు గ్రామాలకీ రెవెన్యూ గ్రామంగా ఉంది. ఈ గ్రామం వెంకటగిరి రాజుల కాలంలో మజారా గ్రామం.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో కొరిశపాటి వెంకాయమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం

[మార్చు]

ఈ గ్రామంలోని ఈ దేవాలయం 1252 లో వెంకటగిరి రాజుల కాలంలో నిర్మితమయినది. శ్రీరాముడు రావణుని జయించి లంక నుండి తిరిగి వచ్చుచూ ఈ దేవుని పూజించెనట. రు. 38 లక్షల కామన్ గుడ్ ఫండ్ ద్వారా The Hindu Religious & Endowment Board మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామస్థులు స్వయంగా శ్రమదానంతో ఈ దేవాలయ అభివృద్ధికి నడుం బిగించారు. 'నాగతీర్ధం' మరుగున పడిపోగా దానిని తిరిగి త్రవ్వి పునర్నిర్మాణం చేయాలని పనులు మొదలు పెట్టిచేస్తున్నారు. ఒకప్పుడు ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది. 'నాగదోషం' నివారణకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకొనేవారు. ఈ దేవాలయానికి 300 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి.

ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం వైభవంగా పూర్తిగావించారు. 2016, నవంబరు-12న కుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి జగద్గురు శ్రీ శంకరాచార్య స్థాపించిన ఉత్తరామ్నాయ బద్రీనాథ్ జ్యోతిర్, ద్వారక శారద పీఠాధిపతిగా ఎనిమిది రాష్ట్రాలకు ధార్మిక పీఠాధిపతిగా వ్యవహరించుచున్న శ్రీ స్వరూపానంద సరస్వతి మహారాజ్ ముఖ్య అతిథిగా రానున్నారు.

శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం

[మార్చు]

ఈ గ్రామంలోని ఈ దేవాలయం జీర్ణోద్ధరణ పనులు రు. 10.8 లక్షలతో ప్రారంభమైనవి. దేవాదాయశాఖవారు రు.8.5 లక్షలు మంజూరుచేయగా, భాగస్వామ్య నిధులుగా ఒకటిన్నర లక్షల రూపాయలను అందజేసినారు. ఒంగోలుకు చెందిన బొమ్మిశెట్టి కుటుంబీకులు మరికొంత మొత్తాన్ని సమకూర్చి ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు గూడా రు. 10.8 లక్షలతో చేస్తున్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మే నెల-21వ తేదీనాడు, స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసెదరు.ఈ కళ్యాణోత్సవాలకు ప్రతి సంవత్సరం, బెంగళూరు నుండి మద్దెల వెంకటేశ్వర్లు, స్వామివారికి ముత్యాల తలంబ్రాలు తీసికొని రావడం ఆనవాయితీగా వచ్చుచున్నది.

ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలను 2017, మే-21వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. నవదంపతులు పీటలపై కూర్చున్నారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నప్రసాదాలతో విందుచేసారు.

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,257. ఇందులో పురుషుల సంఖ్య 3,179, మహిళల సంఖ్య 3,078, గ్రామంలో నివాస గృహాలు 1,386 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,946 హెక్టారులు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

గోనుగుంటలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

గోనుగుంటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 17 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

గోనుగుంటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 491 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 354 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 205 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 159 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 61 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2673 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2225 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 509 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

గోనుగుంటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 127 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 341 హెక్టార్లు
  • చెరువులు: 40 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

గోనుగుంటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, పొగాకు, కంది

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గోనుగుంట&oldid=4267496" నుండి వెలికితీశారు