తిరువీర్
తిరువీర్ | |
---|---|
జననం | తిరుపతిరెడ్డి[1] జూలై 23 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
ఎత్తు | 6 అడుగుల 1 అంగుళం |
జీవిత భాగస్వామి | కల్పనా రావు |
తల్లిదండ్రులు | పి. వెంకట్ రెడ్డి, వీరమ్మ |
తిరువీర్ (జననం. జూలై 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, సినిమా నటుడు.[2][3] 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలోని రంగారావు పాత్రలతో గుర్తింపు పొందాడు.[4][5] 2022లో వచ్చిన మసూద సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు.[6]
జననం
[మార్చు]తిరువీర్, జూలై 23న వెంకట్ రెడ్డి, వీరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో జన్మించాడు.[7] తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఆ తరువాత కుటుంబం హైదరాబాదు నగరానికి వలస వచ్చి, కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉండేవారు.[8] తిరుపతిరెడ్డి తన తల్లి పేరులోని వీర్ అనే పదాన్ని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నాడు.[9]
విద్యాభ్యాసం
[మార్చు]మైలార్ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. హైదరాబాదులోని సిటి కళాశాలలో డిగ్రీ చదివిన తిరువీర్, నటనపై ఉన్న ఆసక్తితో తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఎ. పూర్తిచేశాడు.
వివాహం
[మార్చు]తిరువీర్ 2024 ఏప్రిల్ 21న కల్పనా రావును తిరుపతిలో వివాహం చేసుకున్నాడు.[10][11]
నాటకరంగం
[మార్చు]టాక్స్ ఫ్రీ, జూ స్టొరీ, లా ఒక్కింతయు లేదు, కిషోర్ శాంతభాయ్ కాలే, న్యూ భారత్ కేఫ్, బర్బరీకుడు,[12] ఎకనామిక్ హిట్ మాన్, ఆంటిగని, కాయితం పులి,[13] కళ్యాణి, వర్ణ నిర్మూలన సిద్ధాతం, దావత్ మొదలైన నాటకాలలో నటించాడు.
అమ్మ చెప్పిన కథ,[14] నా వల్ల కాదు, దావత్,[15][16] ఏ మాన్ విత్ ఏ లాంప్,[17] పుష్పలత నవ్వింది[18] మొదలైన నాటికలకు దర్శకత్వం వహించాడు.
దక్షిణ కొరియాలో 23 రోజులపాటు జరిగిన నాటక ఏసియన్ రెసిడెన్సి ప్రాజెక్టు (2014, జూన్ 29 నుండి జూలై 21 వరకు) లో పాల్గొని నాటక ప్రదర్శనలో మెలకువలు తెలసుకొని... నాలుగు దేశాల (బంగ్లాదేశ్, జపాన్, ద. కొరియా, భారతదేశం) నాటకరంగ కళాకారులతో కలిసి నాటికను ప్రదర్శించాడు. 2014, ఫిబ్రవరి 17-23 వరకు న్యూఢిల్లీలో జరిగిన టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవంలో పాల్గొని దాదాపు 20 దేశాల నాటకరంగ కళాకారులతో కలిసి శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. గౌహతి, తిరువనంతపురం, పాలక్కాడు, పాట్నా మొదలైన ప్రాంతాలలో జరిగిన చిన్నారుల నాటకోత్సవాలలో పాల్గొన్నాడు.
పాప్‌కార్న్ థియేటర్ స్థాపన
[మార్చు]తిరువీర్, తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది మిత్రులతో కలిసి 2014, మార్చి 20న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో అమ్మ చెప్పిన కథ అనే నాటిక ప్రదర్శనతో పాప్‌కార్న్ థియేటర్ ను ప్రారంభించాడు. పాప్‌కార్న్ థియేటర్ ద్వారా చిన్నారులను, యువతను నాటకరంగంవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.[19]
టీవీరంగం
[మార్చు]మొదట్లో టీవీల్లో వచ్చే అనువాద చిత్రాలకు, ధారావాహికలకు అనువాద కళాకారుడిగా, జీ తెలుగు ఛానల్ లో వచ్చిన డ్రామా జూనియర్స్ కు సూపర్ మెంటర్ గా పనిచేశాడు.
సినిమారంగం
[మార్చు]2016-2021: అరంగేట్రం - పురోగతి
[మార్చు]తిరువీర్ తన చిన్నతనంలో సినిమాల వాల్‌పోస్టర్లు చూసి కథలు చెప్పేవాడు. ఖాజా పాషా దర్శకత్వంలో వెన్నెల కిషోర్ హీరోగా వచ్చిన D/O వర్మ చిత్రంలోని పిల్లాడికి నటనలో శిక్షణ ఇస్తూ, అదే చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[20] 2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాలో మల్లేష్ పాత్రతో నటుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[21] ఆ తరువాత ఘాజీ (2017)లో దగ్గుబాటి రానా పక్కన డెప్త్ కంట్రోలర్,[22] ఏ మంత్రం వేసావె (2017)లో హరి, శుభలేఖ+లు (2018) పరిమళ్ పాత్రలలో నటించాడు.
2019లో వచ్చిన ‘మల్లేశం’ సినిమా తిరువీర్ సినీ జీవితంలో ఓ మలుపుగా నిలిచింది. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలో నటించిన లలన్ సింగ్ పాత్ర, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలోని రంగారావు పాత్రలతో తిరువీర్ నటనకు మంచి గుర్తింపు రావడంతోపాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డాడు. లలన్ సింగ్ పాత్రకు జీ సినిమా ఉత్తమ ప్రతినాయకుడు అవార్డును కూడా అందుకున్నాడు.[23][24] రంగారావు పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డు,[25][26][27] ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
2020లో ఆహలో విడుదలయిన సిన్ అనే వెబ్ సిరీస్‌లో రెండు భిన్న స్వభావాలు కలిగిన ప్రధాన పాత్రలో నటించాడు.[28] 2021లో నాని హీరోగా వచ్చిన టక్ జగదీష్ సినిమాలో తిరుమల నాయుడు అనే నెగిటీవ్ పాత్రలో నటించి, ప్రేక్షకుల నుండి తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు.[29] ఇతే సంవత్సరం ఆహలో విడుదలయిన మెట్రో కథలు అనే వెబ్ సిరీస్‌లో కూడా తిరువీర్ నటించాడు.
2022-ప్రస్తుతం: హీరోగా
[మార్చు]2022 సంవత్సరం తిరువీర్ నటనాజీవితంలో మైలురాయిలాంటింది. ఈ సంవత్సరం తిరువీర్ హీరోగా నటించిన తొలి సినిమా మసూద విడుదలై మంచి విజయాన్ని అందుకుంది, ఇందులో గోపీ పాత్రలో తిరువీర్ కామన్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు.[30][31] 2023లో తిరువీర్ హీరోగా రెండవ సినిమా పరేషాన్ విడుదలయింది. ప్రేమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కామెడీపరంగా యువతను ఆకట్టుకోవడంతోపాటు, తిరువీర్ కామెడీ టైమింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. నిత్యామీనన్ తో కలిసి నటించిన కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ 2023లో విడుదలయింది.
నటించినవి
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2016 | బొమ్మల రామారం | మల్లేష్ | తెలుగు | మొదటి సినిమా |
2017 | ఘాజీ | డెప్త్ కంట్రోలర్ | హిందీ, తెలుగు | మొదటి హిందీ సినిమా |
2017 | ఏ మంత్రం వేసావె | హరి | తెలుగు | |
2018 | శుభలేఖ+లు | పరిమళ్ | తెలుగు | |
2019 | మల్లేశం | వీరప్రతాప్ | తెలుగు | |
2019 | జార్జ్ రెడ్డి | లలన్ సింగ్ | తెలుగు | జీ సినిమా ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు |
2020 | పలాస 1978 | రంగారావు | తెలుగు | ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డ్స్ - 2020 కు నామినేట్ ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 2020 కు నామినేట్ |
2021 | టక్ జగదీష్ | తిరుమల నాయుడు | తెలుగు | |
2022 | మసూద | గోపికృష్ణ | తెలుగు | ప్రధాన పాత్రలో మొదటి సినిమా[32] |
2023 | పరేషాన్ | ఐసాక్ | తెలుగు | [33] |
2023 | భగవంతుడు | తెలుగు | నిర్మాణంలో ఉంది[34] | |
2024 | ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో | తెలుగు | నిర్మాణంలో ఉంది[35] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్రపేరు | భాష | ఛానల్ |
---|---|---|---|---|
2020 | సిన్ | ఆనంద్ | తెలుగు | ఆహా[36] |
2021 | మెట్రో కథలు | చందు | తెలుగు | ఆహా[37] |
2023 | కుమారి శ్రీమతి | అభినవ్ | తెలుగు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
లఘుచిత్రాలు
[మార్చు]అతల కుతల పాతాళం, కలర్స్, కుమార సంభవం, సోడాబుడ్డి భాస్కర్, ఆయుధం మొదలైన లఘు చిత్రాలలో నటించాడు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 'రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించబడిన సినివారంలో 2017 జనవరి 21న ప్రదర్శించిన కుమార సంభవం లఘుచిత్రంలో తన నటన చూసి జార్జిరెడ్డి సినిమాలో అవకాశం ఇచ్చారని' ఒక ఇంటర్వ్యూలో తిరువీర్ తెలిపాడు.
రేడియో
[మార్చు]మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినందున సినిమారంగంలో తన కెరీర్‌ను కొనసాగించడానికి ముందు కొంతకాలం హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్.ఎం (101.9) లో ఆరు నెలలపాటు ఆర్జేగా పనిచేశాడు. రేడియో నాటకాలలో కూడా పాల్గొన్నాడు.
పురస్కారాలు
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల యువ పురస్కారం 2017[38][39]
- జీ సినిమా ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు (లలన్ సింగ్ - జార్జిరెడ్డి సినిమా)
- ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ 2023 - ఉత్తమ నూతన నటుడు[40]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (29 November 2022). "సినిమా పోస్టర్లు చూసి కథ చెప్పేవాణ్ణి" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2022. Retrieved 29 November 2022.
- ↑ Namasthe Telangana (23 July 2023). "థియేటర్ ఆర్టిస్ట్ టు హీరో.. హ్యాపీ బర్త్ డే టు తిరువీర్". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.
- ↑ 10 TV (20 August 2020). "బ్యాగ్రౌండ్ లేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు!." (in telugu). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Hindu, Entertainment (Movies) (2 December 2019). "Thiruveer is the new villain on the block after 'George Reddy'". The Hindu (in Indian English). Y. Sunita Chowdhary. Archived from the original on 2 December 2019. Retrieved 2 December 2019.
- ↑ The Times of India, Entertainment (8 March 2020). "I still can't believe people are appreciating my role in Palasa 1978: Thiruveer". Paturi Rajasekhar. Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
- ↑ telugu, NT News (2022-11-20). "Thiruveer | మసూద మూవీలో ఉన్న ఈ నటుడు ఇన్ని సినిమాల్లో నటించాడా?". www.ntnews.com. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
- ↑ నాటకం కలిపింది సినిమా నడిపిస్తోంది, వి6 వెలుగు లైఫ్, నరేష్ కుమార్ సూఫీ, 11 ఫిబ్రవరి 2020, పుట. 5.
- ↑ telugu, NT News (2023-06-07). "మన యాస.. పాయసం!". www.ntnews.com. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-07.
- ↑ "నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చేవి : నటుడు తిరువీర్". Sakshi. 2022-11-28. Archived from the original on 2022-11-28. Retrieved 2022-11-29.
- ↑ Eenadu (22 April 2024). "ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
- ↑ NT News (22 April 2024). "పెళ్లి పీటలు ఎక్కిన 'మసూద' నటుడు.. వధువు ఎవరో తెలుసా.?". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
- ↑ www.mytheatrecafe.com/. "Review: "Barbareekudu": Tracing the Caste Conflict in the Epic War – Telugu Play". Archived from the original on 30 July 2016. Retrieved 25 August 2016.
- ↑ The Hindu, FRIDAY REVIEW (29 July 2011). "Tale about the downtrodden". Retrieved 25 August 2016.
- ↑ LIFESTYLE, BOOKS AND ART, Deccan Chronicle (24 March 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 23 August 2016.
- ↑ తెలుగు వన్ ఇండియా. "గోల్డెన్ త్రెషోల్డ్ లో "దావత్"". telugu.oneindia.com. Archived from the original on 15 June 2016. Retrieved 25 March 2017.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "రవీంధ్ర భారతిని నవ్వులలో ముంచెత్తిన "దావత్" : ఆకట్టుకున్న [[పాప్ కార్న్]] థియేటర్ టీమ్". telugu.filmibeat.com. Retrieved 25 March 2017.
{{cite web}}
: URL–wikilink conflict (help)[permanent dead link] - ↑ Youtube. "A Man with a Lump". Retrieved 25 August 2016.
- ↑ నవతెలంగాణ, జాతర-స్టోరి (16 July 2019). "ప్రయోగాత్మక నాటికలు". Archived from the original on 16 July 2019. Retrieved 7 September 2019.
- ↑ "నటించటం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు :"ఘాజి" తిరువీర్ (ఇంటర్వ్యూ )". telugu.filmibeat. 2017-03-06. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
- ↑ Eenadu (19 September 2021). "నాటకమే.. నడక నేర్పింది". EENADU. Archived from the original on 18 September 2021. Retrieved 19 September 2021.
- ↑ Bommalaramaram. "Bommalaramaram Team". Bommalaramaram. Archived from the original on 8 August 2016. Retrieved 23 August 2016.
- ↑ నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (1 August 2019). "విప్లవమే జీవితం". www.ntnews.com. Archived from the original on 2 August 2019. Retrieved 2 August 2019.
- ↑ Hindustan Times, Regional News (12 January 2020). "Zee Cine awards Telugu 2020: Samantha Akkineni, Chiranjeevi and Nani win top laurels" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2020. Retrieved 15 January 2020.
- ↑ SIIMA (2021). "SIIMA AWARDS | 2020 | Nominations". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
- ↑ టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "లాక్ డౌన్ రివ్యూ: " సిన్ "- తెలుగు వెబ్ సిరీస్(ఆహా) | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings". www.123telugu.com. 2020-04-23. Archived from the original on 2020-04-26. Retrieved 2024-04-18.
- ↑ "Tuck Jagdish will release on 16 April, Nani, director Shiva Nirvan announce with new poster - Entertainment News". Firstpost. 9 January 2021. Retrieved 25 April 2021.
- ↑ "సినిమా పోస్టర్లు చూసి కథ చెప్పేవాణ్ణి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-11-29. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
- ↑ "హీరో.. అనడం నాకు నచ్చదు". EENADU. 2022-11-29. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
- ↑ Namasthe Telangana (30 November 2022). "విలక్షణ నటుడు అనిపించుకోవాలి". www.ntnews.com. Archived from the original on 2022-11-29. Retrieved 30 November 2022.
- ↑ "Actor Thiruveer: Theatre and cinema helped me survive". The Hindu. 2023-05-30. ISSN 0971-751X. Archived from the original on 2023-05-30. Retrieved 2023-05-31.
- ↑ Namasthe Telangana (10 April 2023). "మసూద హీరో తిరువీర్ పీరియాడిక్ సినిమా.. వివరాలివే". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
- ↑ NT News (11 October 2024). "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో". Retrieved 11 October 2024.
- ↑ India Today Features New, Life Style (27 March 2020). "Your Weekend Planner March 27: How to get through a lockdown?". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2020. Retrieved 30 March 2020.
- ↑ The Times of India (6 August 2020). "Harish Sankar launches the poster of Karuna Kumar's Metro Kathalu" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి (09.05.2017). "రంగస్థలానికి ఉజ్వల భవిష్యత్తు". Archived from the original on 10 మే 2017. Retrieved 10 May 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ ప్రజాశక్తి, తెలంగాణ (18 March 2017). "20 నుంచి జాతీయ నృత్యోత్సవం". Archived from the original on 27 March 2019. Retrieved 27 March 2019.
- ↑ Chitrajyothy (30 June 2024). "బెస్ట్ హీరో ఆనంద్ దేవరకొండ.. బెస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
ఇతర లంకెలు
[మార్చు]- CS1 maint: unrecognized language
- CS1 Indian English-language sources (en-in)
- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- 1988 జననాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు రంగస్థల దర్శకులు
- తెలుగు రంగస్థల కళాకారులు
- తెలుగు రంగస్థల నటులు
- తెలుగు నాటక రచయితలు
- జీవిస్తున్న ప్రజలు
- రంగారెడ్డి జిల్లా రంగస్థల నటులు
- రంగారెడ్డి జిల్లా సినిమా నటులు
- తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు