తెలంగాణ రాష్ట్ర జిల్లా ప్రజా పరిషత్‌లు
Appearance
(తెలంగాణ రాష్ట్రం - జిల్లా ప్రజా పరిషత్‌లు నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబరు 11న నూతన జిల్లాల పునర్య్వస్థీకరణ అనంతరం, రాష్ట్రంలోని 32 జిల్లాలను (జీహెచ్‌ఎంసీ మినహాయించి) 32 జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. మొత్తం 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను (50 పట్టణ స్వభావమున్న రెవెన్యూ మండలాలు మినహాయించి) మండల ప్రజా పరిషత్‌లుగా, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలుగా పరిగణిస్తారు. 32 జిల్లాల్లోని 535 మండలాల పరిధిలో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలుగా ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలకు 32 జడ్పీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 535 జడ్పీటీసీ స్థానాలు, 535 చొప్పున ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 5,984 ఎంపీటీసీలు ఉండనున్నారు.[1]
జిల్లా ప్రజా పరిషత్‌లు
[మార్చు]తెలంగాణలో జిల్లా పరిషత్ స్థానాలు సంఖ్య, ఛైర్మన్‌ల వివరాలు[2][3][4]
క్రమసంఖ్య | జిల్లా | జడ్పీటీసీ స్థానాలు | ప్రస్తుతం చైర్మన్ \ చైర్‌పర్సన్ |
---|---|---|---|
1 | నల్గొండ | 31 | బండా నరేందర్ రెడ్డి |
2 | నిజామాబాద్ | 25 | దాదన్నగారి విఠల్ రావు |
3 | సంగారెడ్డి | 25 | పట్లోళ్ల మంజుశ్రీ |
4 | ఖమ్మం | 20 | లింగాల కమల్ రాజు |
5 | కామారెడ్డి | 22 | దఫేదార్ శోభ |
6 | సూర్యాపేట | 23 | గుజ్జ దీపిక |
7 | సిద్దిపేట | 22 | వేలేటి రోజాశర్మ |
8 | వికారాబాద్ | 18 | పట్నం సునీతా రెడ్డి |
9 | జగిత్యాల | 18 | దావ వసంత సురేష్ |
10 | నాగర్ కర్నూల్ | 20 | పెద్దపల్లి పద్మావతి |
11 | భద్రాద్రి కొత్తగూడెం | 21 | కోరం కనకయ్య |
12 | మెదక్ | 20 | హేమలత శేఖర్ గౌడ్ |
13 | కరీంనగర్ | 15 | కనుమల్ల విజయ |
14 | వరంగల్ గ్రామీణ | 16 | గండ్ర జ్యోతి |
15 | యాదాద్రి భువనగిరి | 17 | ఏలిమినేటి సందీప్ రెడ్డి |
16 | మహబూబ్‌నగర్ | 14 | స్వర్ణ సుధాకర్ రెడ్డి |
17 | నిర్మల్ | 18 | విజయలక్ష్మీ |
18 | ఆదిలాబాద్ | 17 | రాథోడ్ జనార్దన్ |
19 | జోగుళాంబ గద్వాల | 12 | సరిత |
20 | నారాయణపేట | 11 | వనజ ఆంజనేయులు గౌడ్ |
21 | జనగామ | 12 | పాగాల సంపత్ రెడ్డి |
22 | పెద్దపల్లి | 13 | పుట్ట మధు |
23 | మంచిర్యాల | 16 | నల్లాల భాగ్యలక్ష్మీ |
24 | వనపర్తి | 14 | లోక్‌నాథ్ రెడ్డి |
25 | కొమురం భీం ఆసిఫాబాద్ | 15 | కోవ లక్ష్మీ |
26 | రాజన్న సిరిసిల్ల | 12 | న్యాలకొండ అరుణ |
27 | జయశంకర్ భూపాలపల్లి | 11 | జక్కు శ్రీహర్షిణి |
28 | వరంగల్ పట్టణ | 7 | మారేపల్లి సుధీర్ కుమార్ |
29 | ములుగు | 9 | కుసుమ జగదీశ్ (2019 జూన్ 8 – 2023 జూన్ 11) బడే నాగజ్యోతి (2023 జూన్ 12 - ప్రస్తుతం) |
30 | మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా | 4 | ఎం. శరత్ చంద్రారెడ్డి |
31 | రంగారెడ్డి | 21 | తీగల అనితారెడ్డి |
32 | మహబూబాబాద్ | 16 | ఆంగోతు బిందు |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 April 2019). "21 జిల్లాల్లో 3 విడతలు". Archived from the original on 17 ఏప్రిల్ 2019. Retrieved 28 January 2022.
- ↑ TV9 Telugu (8 June 2019). "జడ్పీల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం..32 స్థానాలు క్లీన్ స్వీప్". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (8 June 2019). "New zilla parishad chairpersons". Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 28 January 2022.
- ↑ Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.