Jump to content

నలిమెల భాస్కర్

వికీపీడియా నుండి
నలిమెల భాస్కర్
నలిమెల భాస్కర్
జననం
నలిమెల భాస్కర్

1956 ఏప్రిల్ 1
వృత్తికవి, పరిశోధకుడు, బహుభాషావేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, పరిశోధకుడు, బహుభాషావేత్త
తల్లిదండ్రులు
  • రాంచంద్రం (తండ్రి)
  • బుచ్చమ్మ (తల్లి)

నలిమెల భాస్కర్ కవి, రచయిత, పరిశోధకుడు, బహుభాషావేత్త. 2024లో తెలంగాణ భాషా దినోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారం అందుకున్నాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1956 ఏప్రిల్ 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్‌లో బుచ్చమ్మ, రాంచంద్రం దంపతులకు జన్మించాడు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశాడు.[1] తెలుగు, మళయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. అతనికి తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం,కన్నడం,మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ లు 14 భాషల్లో పట్టుంది. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి 2011 నవంబర్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.[2] తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించాడు. అద్దంలో గాంధారి, మట్టిముత్యాలు, సుద్దముక్క వంటి 17 సంకలనాలను ఆవిష్కరించాడు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాడు. 2014, మార్చి 10న 2013 సంవత్సరానికిగాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీచే పురస్కారం ప్రకటించబడింది.[3] మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన "స్మారక శిశిగల్" నవలను నలిమెల భాస్కర్ తెలుగులో "స్మారక శిలలు" పేరిట తెలుగులోకి అనువదించాడు. పి.వి.నరసింహారావు తర్వాత ఈ పురస్కారం పొందిన కరీంనగర్ జిల్లా రచయితలలో భాస్కర్ రెండో వ్యక్తి.

రచనలు

[మార్చు]
  • 1974 - మానవుడా (గేయ సంపుటి)
  • 1977 - కిరణాలు (కవితా సంకలనం, రేగులపాటి కిషన్ రావు, వేముల సత్యనారాయణ, ఎర్రోజు సత్యంతో కలిసి)
  • 1978 - ఈ తరం పాటలు (రేగులపాటి కిషన్ రావు, వేముల సత్యనారాయణ, ఎర్రోజు సత్యంతో కలిసి)
  • 1993 - నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు
  • 1996 - అద్దంలో గాంధారి మరి పదకొండు కథలు
  • 2000 - సాహితీ సుమాలు (భారతీయ రచయితల పరిచయాలు
  • 2000 - తమిళ్ తోట్టత్తల్ తెలుంగు కుయిల్ గళ్ (తెలుగు కవిత్వం, 1985 నుండి 2000 వరకు తమిళంలోనికి శాంతాదత్ తో కలిసి)
  • 2003 - తెలంగాణ పదకోశం
  • 2005 - మంద (14 కథలు)
  • 2005 - మట్టి ముత్యాలు (నానీలు)
  • 2008 - బాణం (తెలంగాణ భాషా వ్యాసాలు)
  • 2008 - సుద్దముక్క (కవిత్వం)
  • 2010 - భారతీయ సాహిత్య వ్యాసాలు
  • 2010 - భారతీయ సామెతలు (తెలుగు మలయాళ సమానార్ధకాలు)
  • 2010 - భారతీయ కథలు
  • 2010 - దేశ దేశాల కవిత్వం
  • 2010 - స్మారక శిలలు (పునత్తిల్ కుంజబ్దుల్ల మలయాల నవల)
  • 2016 - నానీ కవిదైగళ్ (ఆచార్య ఎన్. గోపి గారి నానీల తమిళ అనువాదం)
  • 2017 - తెలంగాణ భాష-దేశ్య పదాలు
  • 2019 - తెలంగాణ భాష-సంస్కృత పదాలు
  • 2020 - తెలంగాణ భాష-తమిళ పదాలు
  • 2021 - తెలంగాణ భాష-క్రియా పదాలు
  • 2021 - సముద్ర శాస్త్రజ్ఞురాలు- అమ్ము
  • 2021 - చలనాచలనం - అనువాద కథలు
  • 2021 - ఇక్కడి నేల... అక్కడి వాన (అనువాద కవిత్వం)
  • 2022 - ద్రౌపది - మలయాల అనువాద పరిశోధన
  • 2022 - జీవ ద్రవ్యం (కవిత్వం)

సంపాదకత్వాలు

[మార్చు]

బసవ పురాణ పదకోశం[permanent dead link]

పురస్కారాలు

[మార్చు]
  • మళయాళంలో అనువాద నవల స్మారకశిలలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,
  • డా. బోయి భీమన్న అనువాద పురస్కారం - లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014) [4].
  • 1997లో అద్దంలో గాంధారి అనువాద రచనకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం,
  • 1998లో మద్రాస్ కళాసాగర్ సిరిసిల్ల శాఖ పురస్కారం,
  • 1999లో కళాజ్యోతి కరీంనగర్‌వారి పురస్కారం,
  • 2000లో కవిసమయం పురస్కారం,
  • 2001లో ఏపీ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,
  • 2001లో బీఎన్ శాస్త్రి పురస్కారం,
  • 2003లో సిరివెలుగులు (సిరిసిల్ల) పురస్కారం,
  • 2006లో అధికార భాషా సంఘం పురస్కారం,
  • 2008లో ద్వానా శాస్త్రి పురస్కారం,
  • 2010లో ఇండియన్ హైకూక్లబ్ అనకాపల్లివారి పురస్కారం,
  • 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు
  • 2014లో డా.బోయి భీమన్న అనువాద అవార్డు
  • 2015లో డా.సినారె అవార్డు
  • 2015గురజాడ అవార్డు
  • 2021లో కాళోజీ అవార్డు Archived 2023-06-04 at the Wayback Machine
  • 2023లో శ్రీ భాష్యం విజయ సారథి పురస్కారం
  • 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారం.[5]

బయటి లింకులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఎడారిలో ఒక్క పువ్వే.. తోటంత విలువ చేస్తుంది అన్న కవి".
  2. http://www.jagranjosh.com/current-affairs/telugu-kendra-sahitya-academy-award-announced-for-nalimela-bhasker-1394536647-3
  3. ఈనాడు దినపత్రిక, తేది 11-03-2014
  4. "నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం". Archived from the original on 2014-09-20. Retrieved 2014-09-21.
  5. telugu, NT News (2024-09-07). "Kaloji Award | న‌లిమెల భాస్క‌ర్‌కు ప్ర‌జాక‌వి కాళోజీ పుర‌స్కారం." www.ntnews.com. Retrieved 2024-09-08.