నెల్లూరు కాంతారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నెల్లూరు కాంతారావు చలన చిత్ర నటుడు, వస్తాడు, సినిమా నిర్మాత. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. టైగర్ ప్రొడక్షన్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల ఉండేది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు నెల్లూరులో 1931, జనవరి 24న జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కాలేజిలో ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. పెద్డన్న పాపయ్య, మరొక అన్న కనకంబాబు వి.ఆర్.హైస్కూల్లో పి.టి. టీచర్, కాంతారావు చిన్తననం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకున్నాడు. కాంతారావు 1948 నుండి 1956 వరకు ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి అనేక బిరుదులు, బహుమతులు, ఛాంపియన్‌షిప్‌లు సంపాదించి, 'ఆంధ్రా టైగర్' బిరుదును పొందాడు.1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్‌కు ఉమ్మడి మద్రాసురాష్ట్ర ప్రతినిధిగా, 1956లో పోలాండ్ దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు[1]. 1955 ప్రాంతాల్లో నెల్లూరుకు మల్లయుద్ధ యోధులను పిలిపించి నెల్లూరు వి.ఆర్.కళాశాల మైదానంలో కుస్తీపోటీలు నిర్వహించాడు. కింగ్ కాంగ్ , దారాసింగ్ వంటి ప్రసిద్దుల కుస్తీపోటీలు నెల్లూరివారికి చూచే అవకాశం కలిగింది. కొన్ని కుస్తీపోటీలలో కాంతారావు కూడా పాల్గొన్నాడు. ఆత్మీయులు 'కాంతం' అనే పిలిచేవారు.

నెల్లూరు కనకమహల్ థియేటర్‌లో ఇతడు, ఉమ్మడి కుటుంబంలో ఇతరులు కూడా భాగస్వాములు. కనకమహల్ వెనక భాగంలో వ్యాయామశాల, కుస్తిగరిడి  ఎర్పాటుచేసి స్థానికులకు వ్యాయామం చేసుకొనే వీలు కల్పించాడు. 1959లో రేచుక్క-పగటిచుక్క సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. టైగర్   ఫిలింస్  బ్యానరు  మీదనే సినిమాలు తీసాడు. ఇతణ్ణి సినిమాల్లో  ప్రవేశపెట్టింది ఎన్.టి,ఆర్.కు సంబంధిచిన నిర్మాణసంస్థ స్వస్తిశ్రీ ఫిలిమ్స్. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. నెల్లూరు కాంతారావుతో కలిసి హుస్సేన్ అనే మరొక వ్యక్తి టైగర్ ఫిలింస్.లో భాగ స్వామిగా  ఉండేవాడు.  కొన్ని హిందీ సినిమాలలో కూడా కాంతారావు నటించాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి అసాధ్యుడు, అఖండుడు లాంటి సినిమాలను నిర్మించాడు. 

కాంతారావు నెల్లూరు వామపక్ష రాజకీయాలకు అండదండగా ఉన్నాడు.నెల్లూరు మునిసిపల్ కవున్సిలరుగా ఎంపిక అయి కొంతకాలం సేవ చేసాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీవైపు వెళ్ళాడు. ఇతడు 1970, అక్టోబరు 8వ తేదీ నూజివీడులో ఆసుపత్రిలో మరణించాడు.[2]

చిత్రరంగం

[మార్చు]

నటుడిగా

[మార్చు]
  1. బొబ్బిలి యుద్ధం (1964) - మల్లయోధుడు
  2. అంతస్తులు (1965)
  3. జమీందార్ (1965) - మూర్తి
  4. జ్వాలాద్వీప రహస్యం (1965)
  5. నర్తనశాల (1965) - మల్లయోధుడు
  6. పాండవ వనవాసం (1965) - కిమీరుడు
  7. వీరాభిమన్యు (1965) - ఘటోత్కచుడు
  8. గూఢచారి 116 (1966)
  9. అసాధ్యుడు (1967)
  10. ఇద్దరు మొనగాళ్లు (1967)
  11. కంచుకోట (1967)
  12. నిలువు దోపిడి (1968)
  13. నేనంటే నేనే (1968)
  14. వింత కాపురం (1968) - పులి
  15. ప్రేమ మనసులు (1969)
  16. అఖండుడు (1970)
  17. అగ్నిపరీక్ష (1970)
  18. రౌడీరాణి (1970)
  19. అల్లుడే మేనల్లుడు (1970)
  20. అందరికీ మొనగాడు (1971)
  21. భలేపాప (1971)

నిర్మాతగా

[మార్చు]
  1. సర్వర్ సుందరం (1966)
  2. నువ్వే (1967)
  3. అసాధ్యుడు (1967)
  4. అఖండుడు (1970)

మూలాలు

[మార్చు]
  1. విలేకరి (23 October 1970). "నటుడు పహిల్వాన్ ఎన్.కాంతారావు మరి లేడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 1 జూలై 2020. Retrieved 30 June 2020.
  2. సంపాదకుడు (1 November 1970). "నెల్లూరు కాంతారావు మృతి వార్త: నెల్లూరు జమీన్ రైతు వారపత్రిక 9-10-1970, 16-10-1970 సంచికలు,". విజయచిత్ర. 5 (5): 29.

1.విక్రమ సిహపురి మండల సర్వస్వం, సంపాదకులు: యెన్.ఎస్.కె, నెల్లూరు జిల్లపరిషత్తు ప్రచురణ, 1964

బయటి లింకులు

[మార్చు]