రకుల్ ప్రీత్ సింగ్
Appearance
రకుల్ ప్రీత్ సింగ్ | |
---|---|
జననం | 10 అక్టోబరు 1990 |
పౌరసత్వం | భారతీయురాలు |
విద్య | బి. ఎస్సి (గణితశాస్త్రం) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జాకీ భగ్నానీ |
రకుల్ ప్రీత్ సింగ్ ( జననం : అక్టోబర్ 10, 1990 ) ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు.
వివాహం
[మార్చు]రకుల్ ప్రీత్ సింగ్ 2024 ఫిబ్రవరి 21న దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో జాకీ భగ్నానీని వివాహ చేసుకుంది.[1][2]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | గమనికలు | Ref. |
---|---|---|---|---|---|
2009 | గిల్లి | అనిత | కన్నడ | నటనా రంగ ప్రవేశం | [3] |
2011 | కెరటం | సంగీత | తెలుగు | ద్విభాషా చిత్రం మరియు తమిళం మరియు తెలుగు అరంగేట్రం | |
యువన్ | మీరా | తమిళం | |||
2012 | తాడయ్యరా తాక్క | గాయత్రి రామకృష్ణన్ | తమిళం | ప్రధాన పాత్రలో తమిళ అరంగేట్రం | |
2013 | పుతగం | దివ్య | |||
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | ప్రార్థన | తెలుగు | ప్రధాన పాత్రలో తెలుగు అరంగేట్రం | ||
2014 | యారియాన్ | సలోని | హిందీ | హిందీ అరంగేట్రం | |
యెన్నమో యేదో | నిత్య | తమిళం | |||
రఫ్ | నందు | తెలుగు | |||
లౌక్యం | చంద్రకళ "చందు" | ||||
కరెంట్ తీగ | కవిత | ||||
2015 | పండగ చేస్కో | దివ్య | |||
కిక్ 2 | చైత్ర | ||||
బ్రూస్ లీ | రిషోమి "రియా" | ||||
2016 | నాన్నకు ప్రేమతో | దివ్యాంక "దివ్య" కృష్ణమూర్తి | గెలుచుకుంది - ఉత్తమ నటిగా SIIMA అవార్డు - తెలుగు | [4] | |
సరైనోడు | మహాలక్ష్మి / జాను | [5] | |||
ధృవ | ఇషికా | ||||
2017 | విన్నర్ | సితార | |||
రారండోయ్ వేడుక చూద్దాం | భ్రమరాంభ | ||||
జయ జానకి నాయక | జానకి / స్వీటీ | ||||
స్పైడర్ | చార్లీ | ద్విభాషా చిత్రం | [6] | ||
శాలిని | తమిళం | ||||
తీరన్ అధిగారం ఒండ్రు | ప్రియా తీరన్ | [7] | |||
2018 | అయ్యారీ | సోనియా గుప్తా | హిందీ | ||
2019 | ఎన్.టి.ఆర్. కథానాయకుడు | శ్రీదేవి | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | |
దేవ్ | మేఘనా పద్మావతి | తమిళం | |||
దే దే ప్యార్ దే | అయేషా ఖురానా | హిందీ | |||
ఎన్.జి.కె | వనతీ త్యాగరాజన్ | తమిళం | |||
మన్మధుడు 2 | అవంతిక | తెలుగు | |||
మార్జావాన్ | ఆర్జూ సిద్ధిఖీ | హిందీ | [8] | ||
2020 | సిమ్లా మిర్చి | నైనా శర్మ | [6] | ||
2021 | చెక్ | న్యాయవాది మానస | తెలుగు | [9] | |
సర్దార్ కా గ్రాండ్ సన్ | రాధా కౌర్ ఖాసన్ | హిందీ | [10] | ||
కొండ పొలం | ఓబులమ్మ | తెలుగు | [11] | ||
2022 | అటాక్ | డాక్టర్ సబాహా ఖురేషి | హిందీ | [12] | |
రన్‌వే 34 | తాన్య అల్బుకెర్కీ | [13] | |||
కట్పుట్ల్లి | దివ్య మల్హోత్రా | [14] | |||
డాక్టర్ జీ | డా. ఫాతిమా దుగ్గల్ | [15] | |||
థ్యాంక్ గాడ్ | సబ్ ఇన్‌స్పెక్టర్ రూహి కపూర్ | [16] | |||
2023 | ఛత్రీవాలీ | సన్యా ధింగ్రా | [17] | ||
బూ | కైరా | తమిళం | ద్విభాషా చిత్రం | [18] | |
తెలుగు | |||||
ఐ లవ్ యు | సత్య ప్రభాకర్ | హిందీ | [19] | ||
2024 | అయాలన్ | తార | తమిళం | [20] | |
మేరీ పట్నీ కా రీమేక్ † | TBA | హిందీ | చిత్రీకరణ | [21] | |
భారతీయ 2 † | TBA | తమిళం | చిత్రీకరణ | [22] |
ఇతర వివరాలు
[మార్చు]- పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
- పుట్టి పెరిగింది : ఢిల్లీలో
- చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
- తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
- సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
- తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
- నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
- సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
- ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
- హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
- నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్
పురస్కారాలు
[మార్చు]- 2016: ఉత్తమ నటి - నాన్నకు ప్రేమతో
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (21 February 2024). "జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ Eeandu (21 February 2024). "ఘనంగా సినీనటి రకుల్ ప్రీత్ వివాహం". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ "I did my first Kannada film to earn pocket money and buy a car: Rakul Preet Singh". The New Indian Express.
- ↑ "Nannaku Prematho Cast and Crew Full Details" Archived 17 నవంబరు 2015 at the Wayback Machine, NtrNannakuPrematho.Com. Retrieved 16 November 2015.
- ↑ Sarrainodu review: Marred by a yawn-inducing plot. The Hindu (22 April 2016). Retrieved on 3 July 2016.
- ↑ 6.0 6.1 Balachandran, Logesh. "Rakul replaces Parineeti in Murugadoss's film". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 12 January 2021.
- ↑ "Karthi and Rakul Preet starrer 'Khaki' is in the last leg of production and will release very soon". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 7 October 2021.
- ↑ "Marjaavaan song Haiya Ho: Rakul Preet Singh woos a grieving Sidharth Malhotra in yet another recreated number. Watch". Hindustan Times. 26 October 2019. Retrieved 19 December 2019.
- ↑ "Nithiin, Rakul Preet Singh and Priya Prakash Varrier starrer Check to hit screens on February 19". The Times of India. 22 January 2021. Retrieved 22 January 2021.
- ↑ NTV Telugu (24 April 2021). "ట్రక్ డ్రైవర్ గా రకుల్ ప్రీత్ సింగ్". NTV Telugu. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
- ↑ Eenadu (24 August 2021). "'కొండపొలం' ఓబులమ్మ". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
- ↑ "BREAKING: John Abraham-starrer Attack to release a week after Akshay Kumar-starrer Prithviraj, on January 27, 2022". Bollywood Hungama. 30 September 2021. Retrieved 30 September 2021.
- ↑ V6 Velugu (30 November 2021). "రన్ వే 34పై రకుల్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Akshay Kumar starrer Mission Cinderella sold to Hotstar for Rs. 135 crore; Direct to digital premiere for THIS reason". Bollywood Hungama. 12 March 2022. Retrieved 12 March 2022.
- ↑ Mana Telangana (17 September 2021). "'డాక్టర్ జీ' సినిమా నుంచి రకుల్ ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 18 September 2021. Retrieved 18 October 2021.
- ↑ 10TV (21 January 2021). "అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ థ్యాంక్ గాడ్" (in telugu). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV Telugu (7 May 2021). "'ఛత్రీవాలీ'గా రకుల్ ప్రీత్ సింగ్!". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
- ↑ "Rakul Preet Singh's 'Boo' gets release date". The Hindu (in Indian English). 24 May 2023. Retrieved 27 May 2023.
- ↑ "'I Love You' fuses love, betrayal and revenge with drama, suspense". Times of India. 8 June 2023.
- ↑ Lakshmi, V. "Rakul Preet joins Sivakarthikeyan's sci-fi film". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 February 2021.
- ↑ "Meri Patni Ka Remake: Arjun Kapoor, Rakul Preet Singh, and Bhumi Pednekar come together for this Mudassar Aziz film". Bollywood Hungama. 2 September 2022. Retrieved 24 September 2022.
- ↑ "Indian 2: Kamal Haasan and Shankar's much-awaited action thriller to resume work from August 24?". Pinkvilla. 19 August 2022. Archived from the original on 31 August 2022. Retrieved 26 October 2023.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేజీ
- రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్బుక్ పేజీ
- ట్విట్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్ హంగామా లో రకుల్ ప్రీత్ సింగ్ వివరాలు
వర్గాలు:
- CS1 maint: unrecognized language
- CS1 Indian English-language sources (en-in)
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1990 జననాలు
- తెలుగు సినిమా నటీమణులు
- భారతీయ సినిమా నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు
- జీవిస్తున్న ప్రజలు