రాయ్‌పూర్ జిల్లా
రాయ్‌పూర్ జిల్లా
रायपुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | రాయ్‌పూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 13,083 కి.మీ2 (5,051 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 30,09,042 |
• జనసాంద్రత | 230/కి.మీ2 (600/చ. మై.) |
సగటు వార్షిక వర్షపాతం | 1385 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాయ్‌పూర్ జిల్లా ఒకటి. రాయ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లాలో ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. జిల్లా జనసంఖ్య దాదాపు 30 లక్షలు ఉంది. జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు, వన్యమృగసంరక్షణాలయాలు ఉన్నాయి.2011 గణాంలను అనుసరించి ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాగా రాయ్‌పూర్ జిల్లా గుర్తించపడుతుంది.[1]
చరిత్ర
[మార్చు]రాయ్‌పూర్ జిల్లా ఒకప్పుడు దక్షిణ కోసలరాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. అలాగే మౌర్యసామ్రాజ్యాధీశులు దీనిని పాలిచారు. హైహయ రాజులకు రాయ్‌పూర్ రాజధానిగా ఉంటూ వచ్చింది. వారు ఛత్తీస్‌గఢ్ కోటల మీద దీర్ఘకాలం ఆధిక్యతను కలిగిఉండేవారు. 9 వ శతాబ్దం నుండి రాయ్‌పుర్ నగరం ఉనికిలో ఉందని భావిస్తున్నారు. జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న కోటలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని క్రీ.పూ 2-3 శతాబ్ధాలలో శాతవాహన రాజులు పాలించారు.
భౌగోళికం
[మార్చు]జిల్లా 22° 33' ఉ నుండి 21°14'ఉ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82° 6' నుండి 81° 38'తూ డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది.ఇది ఎగువ మహానదికి లోయకు ఆగ్నేయంలో ఉంది. జిల్లాకు దక్షిణ, తూర్పు సరిహద్దులలో పర్వాతాలు సరిహద్దుగా ఉన్నాయి. జిల్లా 2 ప్రధాన విభాగాలుగా (ఛత్తీస్‌గఢ్ మైదానాలు, పర్వతప్రాంతాలు) విభజించబడింది. జిల్లా ఉత్తర సరిహద్దులో బిలాసపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బస్తర్ జిల్లా, ఒడిషా రాష్ట్రం, తూర్పు సరిహద్దులో రాజ్‌గఢ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో దుర్గ్ జిల్లా, ఒడిషా రాష్ట్రం ఉన్నాయి. జిల్లాలో ప్రధానమైన నది మహానది.
సంస్కృతి
[మార్చు]రాయ్‌పూర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
విభాగాలు
[మార్చు]రాయ్‌పూర్ జిల్లా 13 తాకూకాలుగా, 15 రెవెన్యూ బ్లాకులు విభజించబడి ఉంది: జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు (రాయ్‌పూర్, మహాసముంద్) ఉన్నాయి. 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధాన పంట వరి. జిల్లాలో 50 మద్య, పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నాయి. అవి జిల్లాలో 10,000 మందికి ఉపాధి కలిగిస్తుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,062,160, [1] |
ఇది దాదాపు. | లిబేరియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 53 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 310 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 34.65%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 983:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.43%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
[మార్చు]జిల్లాలో చత్తీస్‌గర్హి, హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి. తరువాత స్థానంలో హల్బి, గొండి, భుంజియా భాషలు గిరిజన ప్రజలలో వాడుకలో ఉన్నాయి. భుంజియా భాషను దాదాపు 7,000 మంది భుంజియా ఆదివాసులు మాట్లాడుతున్నారు.[4]
సంస్కృతి
[మార్చు]చత్తీస్‌గరి భాష వాడుకలో ఉంది. సంప్రదాయ వైద్యులు అయిన బైగాలు వ్యాధిని నివారించడానికి, పాముకాటుకు వారి ప్రత్యేక విధానాలను ( జాద్ ఫుక్ అని అంటార్) అనుసరిస్తుంటారు. జిల్లాలో రూత్ నాచా, దేవ నాచా, పంతి & సూవా, పడ్కి, పంద్వని మొదలైన సంగీత వాయిద్యాలు, నృత్యాల డ్రమ్ములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పంద్వానీ శైలిలో మహాభారతం గానం చేయడం ప్రజాదరణ చూరగొన్నది.
వస్త్రధారణ , అలంకరణ
[మార్చు]స్త్రీలు చీరెను కచోరా పద్ధతిలో ధరిస్తుంటారు. స్త్రీలు లుడ్గ (చీరె), పొల్క (జాకెట్) ధరిస్తారు. అలాగే ఛత్తీస్‌గఢ్ సంప్రదాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ధరిస్తారు. స్త్రీలు సాధారణంగా కాసుల హారం (బాంధా) ధరిస్తారు. అలాగే వెండి హారం (సుత), మూక్కెరగా ఫులి, చెవులకు బలి, కుంతీలు ధరిస్తుంటారు. అలాగే ముంజేతులకు అంథి (వెండి కంకణం), పట్టా, చూరా (గాజులు), కర్ధాని (వెండి వడ్రాణం), పౌంచి (వెండివంకీ), కాలి వేళ్ళకు బిచియా (మెట్టెలు) ధరిస్తుంటారు. పురుషులు కూడా కుంధీ, కథాహ్ (కంకణం) వంటివి నర్తించే సమయంలో ధరిస్తుంటారు.
హరేలి ఉత్సవం
[మార్చు]జిల్లాలో గౌరీ-గౌరా, సుర్తి, హరేలి, పోలా, తీజ వంటి ఉత్సవాలు ప్రధానంగా నిర్వహించబడుతున్నాయి. శ్రావణ మాసంలో పచ్చదనానికి గుర్తుగా హరేలి పండుగ జరుకుంటారు. ఈ పండుగ సందర్భంలో వ్యవసాయదారులు వారి వ్యవసాయ పనిముట్లు, ఆవులకు పూజలు నిర్వహిస్తారు. వారు బెల్వా చెట్టు కొమ్మలను (ఈ జిల్లా గ్రామాలు, అరణ్యాలలో కనిపించే జీడి చెట్టు వంటి చెట్టు) పొలాలలో నాటి మంచి పంటను ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తుంటారు. ఈ ఉత్సవ సందర్భంలో ప్రజలు వ్యాధులను నివారించడానికి నివాస గృహాల ముఖద్వారాలకు వేపకొమ్మలను తోరణంగా కట్టడం ఆచారం. బైగాలు వరి శిష్యులకు వైద్యచిట్కాలలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ శ్రావణ బహుళ పంచమి రోజు ప్రారంభమై బాధ్రపద శుద్ధ పంచమి వరకు కొనసాగుతుంది. చివరిరోజున గురువులు వారి శిస్యులకు పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు స్వయంగా మెడికల్ ప్రాక్టిస్ పెట్టడానికి అనుమతి లభిస్తుంది.
హరేలి, పోలా సందర్భాలలో పిల్లలు గెడి (వేదురు మీద నడవడం) అనే ఆటలను ఆడుతుంటారు. గెడి ఆటలో పలు విన్యాసాలను ప్రదర్శించడం కాక వీటిలో పోటీలు కూడా నిర్వహించబడుతుంటాయి. చిత్తీస్‌గఢ్ ప్రజలలో హరేలీ నుండి పండుగలు ఆరంభం ఔతుంటాయి. హరేలీ తరువాత పోలా, తీజా పండుగలు వస్తాయి. పోలా పండుగకు ప్రజలు ఎద్దులను పూజిస్తారు. తీజ స్త్రీల ఉత్సవం. ఈ ఉత్సవసమయంలో వివాహిత స్త్రీలు తమభర్తల రక్షణార్ధం భగవంతుని ప్రార్థిస్తుంటారు. ఈ పండుగను స్త్రీలు తమ పుట్టింట జరుపుకోవడం అలవాటు. ఈ పండుగ జరుపుకోవడానికి పుట్టింటికి పోవడానికి ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. ఛత్తీస్‌గఢ్ సంప్రదాయంలో పండుగలు మానసంబంధాలను మరింత మెతుగుపరుస్తూ ఉంటాయి.
- వల్ల్లభాచార్య జన్మస్థలమైన చనోఅరణ్ ఈ జిల్లాలోనే ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oregon 3,831,074
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.