వడూర్ కోట
వడూర్ కోట (English: Waddur fort ) తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో ఉన్న పురాతన కోట[1]. 11వ. శతాబ్ధ కాలం నాటిది.ఆనాటి వైడూర్యపురమే నేటి ఈ వడూర్ గ్రామం.సహ్యాద్రి పర్వత శ్రేణులు చూట్టు కొండలు, అడవుల మధ్య ఉంది.ఈ కోట కాకతీయులు, కాకతీయుల సామంత రాజులైన కుంటి వేంకట్రాయుడు కాలం నాటిది[2][3].
వడూర్ కోట (వైడూర్యపురం ఖిల్లా) | |
---|---|
నేరడిగొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ | |
భౌగోళిక స్థితి | 18°57′00″N 79°24′53″E / 18.9501°N 79.4146°E |
రకము | కోట |
ఎత్తు | 50 అడుగుల ఎత్తు |
స్థల సమాచారం | |
హక్కుదారు | 11వ.శతాబ్దంలో కాకతీయులు |
నియంత్రణ | 16వ శతాబ్దంలో కుంటి వేంకట్రాయుడు, జలపత్ రావు, శ్రీనివాస్ రావు |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
పరిస్థితి | శిథిలావస్థకు చేరుకుంది |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 11.వ శతాబ్దకాలం |
కట్టించింది | 11వ. శతాబ్దంలో కాకతీయులు |
వాడుకలో ఉందా | లేదు |
వాడిన వస్తువులు | నల్లనిరాతి,డంగుసున్నం |
కోట చరిత్ర
[మార్చు]కాకతీయుల కాలంలో నిర్మితమై ఈ వడ్డూర్ కోట సుమారు 60 కిలోమీటర్ల స్థలంలో విస్తరించి ఉంది. 11 వ. శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అప్పటి కాకతీయులు సామంత రాజులైనా కుంటి వేంకట్రాయుడు, అతని అన్న కొడుకు జలపత్రావు, అతని మేనల్లుడైన కణింగరాయుని కొడుకు శ్రీనివాసరావు పరిపాలన కాలం వరకు వర్తక వ్యాపార, వాణిజ్య రాజధాని కేంద్రంగా ఉండేది. ఇచట జరిగే వారాంతపు సంతలో వజ్రాలు, బంగారం, వెండి ఆభరణాలు రాశులుగా పోసి అమ్మేవారు. ఇతర రాజ్యాలకు చెందిన రాజులు, సామంతులు గుర్రాల పై వచ్చి తమకు కావలసిన వస్తువులను ఈ వైడూర్య పురంలో వచ్చికొనుగోలు చేసేవారు.కాకతీయ పాలకులు అంతర్గత వాణిజ్యం అభివృద్ధిని ప్రోత్సాహించే వారిని, రాజ్యంలో వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించేందుకు అనేక రకాల వ్యాపార సంఘాలు ఉపయోగించేవారని చారిత్రక ఆధారాలు వలన తెలుస్తోంది. కోటలో దసరా పండుగ సందర్భంగా స్థానికులు మైసమ్మ తల్లికి పూజచేసి జంతువులను బలి ఇచ్చి మొక్కలు చేల్లించుకుంటారు.
కోట విశేషాలు
[మార్చు]ఇక్కడ జరిగే వారాంతపు సంతలో బంగారం వెండి నాణేలు రాశులుగా పోసి అమ్మేవారు.ఇక్కడే దొరికిన మేలి రకాలైన వజ్రాలు, కెంపులు,మరకట మాణిక్యాలు మొదలగు వాటిని అందంగా బంగారంలో పొదిగించుకుని అమ్మడం వలన ఇతర రాజ్యాలకు చెందిన రాజులు ఈ వైడూర్య పురానికి వచ్చి కోనుగోలు చేసి ధరించే వారు.
కోట నిర్మాణాలు
[మార్చు]ఈ వైడూర్యపురం కోట రాతి, మట్టి ఇటుకలతో నిర్మించబడింది.గోడ పోడవునా లోతైన కందకం త్రవ్వించారు.రాతి గోడ పోడవునా ఎత్తైన బురుజులు,కోటలోనికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారాలు నిర్మించారు. వైడూర్యపురం కోట నుండి నిర్మల్ కోటకు రాకపోకలు సాగించడానికి సొరంగమార్గాలు త్రవ్వించి, రెండు ద్వారాలు ఏర్పాటు చేసి సొరంగ మధ్యలో రాతి కడ్డీలను పెట్టించాడు. కోట వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ లోపలి వైపు ఉన్న రాతి గోడ ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది.
శిధిలావస్థలో కోట
[మార్చు]ఒకప్పుడు వజ్రాలు, రత్నం వైడూర్యాలకు ప్రసిద్ధ చెందిన ఈ కోట నేడు శిథిలావస్థలో ఉంది. కాలంతోపాటు కోటకు సంబంధించిన అనేక ఆనవాళ్ళు ధ్వంసమయ్యాయి. జిల్లాలో కాకతీయులు నిర్మించిన కట్టడాలు పూర్తిగా శిథిలమయ్యాయి. విలువైన వజ్రాలు, రత్నాలు ,బంగారం, వెండి ఆభరణాల నిధి నిక్షేపాల కోసం కోటలో వందలసార్లు దుండగులు తవ్వకాలు జరిపారు.
స్థానికుల డిమాండ్
[మార్చు]కాకతీయుల కాలం నాటి రాజరికపు వైభవం, ఆనవాళ్ళు గల ప్రాంతం కాబట్టి అలనాటి రాజులు, సామంతులు పెంచి పోషించిన కళా నైపుణ్యానికి నిదర్శనం ఈ వైడూర్య పురము.ఎంతో శిల్ప సంపదను కలిగి, సృజనాత్మక కళా నైపుణ్యంతో కట్టిన ఈ కోట సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.రాజులు వాడిన ఆయుధాలు , ఫిరంగులు ,వారి కాలంలో వినియోగించిన మట్టి పాత్రలు ,రాతి పనిముట్లు,వీర శిలలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, బంగారం, వెండి నాణేలు ప్రాచీన సంపద శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. దీంతో ఇంత అద్భుతమైన ఈ వడూర్ గ్రామానికి పాత పేరు వైడూర్యపురం పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
వడూర్ కోటలో మైసమ్మ తల్లికి పూజలు
-
కోటలో శివలింగం నంది విగ్రహాలు
-
కోటలోని పురాతన ఫిరంగి
-
కోట శిథిలావస్థలో ఉన్న కమాను పిల్లర్
-
కోటలో కమాను ద్వారాలు
-
కోటలో నగరేశ్వరుని గుడి శిథిలావస్థలో ఉన్న దృశ్యం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Waddur Village in Neradigonda (Adilabad) Telangana | villageinfo.in". villageinfo.in. Retrieved 2024-10-28.
- ↑ "అపురూపం.. చరిత్రకు సాక్ష్యం". EENADU. Retrieved 2024-10-28.
- ↑ "చారిత్రక కోట.. బోథ్ అడ్డా". EENADU. Retrieved 2024-10-28.