విశ్వనాథన్ ఆనంద్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విశ్వనాథన్ ఆనంద్ | |
---|---|
పూర్తి పేరు | విశ్వనాథన్ ఆనంద్ |
దేశం | భారతదేశం |
టైటిల్ | గ్రాండ్‌మాస్టర్ (1988) |
ప్రపంచ ఛాంపియన్ | 2000-2002 (FIDE), 2007-present |
ఫిడే రేటింగ్ | 2799 (జనవరి 2008 FIDE ర్యాంకింగుల్లో రెండవ స్థానం) |
అత్యున్నత రేటింగ్ | 2803 (April 2006) |
ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. 16 వ ఏటనే 1985లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.2000 లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. 2003లో ఫ్రాన్స్లో జరిగిన రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో కూడా గెల్చి తన ఘనతను మరింతగా ప్రపంచానికి చాటిచెప్పాడు. 2007 సెప్టెంబరు 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. 2007 అక్టోబరు 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు.
సాధించిన అవార్డులు
[మార్చు]- 1985లో అర్జున అవార్డు
- 1987లో పద్మశ్రీ అవార్డు
- 1987 లోనే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు
- 1988లో పద్మశ్రీ అవార్డు లభించింది.
- 1991-92 లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఖేల్ రత్న అవార్డు స్వీకరించిన మొట్టమొదటి క్రీడాకారుడు
- 1992లో కే.కే.బిర్లా అవార్డు పొందినాడు
- 1997, 1998, 2003, 2004 లలో చెస్ ఆస్కార్ అవార్డులు
- 1998లో స్పోర్ట్స్ స్టార్ ప్రధానం చేసిన మిలీనియం అవార్డు
- 2000లో పద్మభూషణ్ అవార్డు
- 2007లో పద్మ విభూషణ్ అవర్డు
ఇవికూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- మూలాలు లేని వ్యాసాలు
- రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1969 జననాలు
- పద్మభూషణ పురస్కారం పొందిన తమిళనాడు వ్యక్తులు
- అర్జున అవార్డు గ్రహీతలు
- చెస్ ఆస్కార్ అవార్డు గ్రహీతలు
- తమిళనాడు చదరంగ క్రీడాకారులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన తమిళనాడు వ్యక్తులు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన తమిళనాడు వ్యక్తులు
- జీవిస్తున్న ప్రజలు
- చదరంగం గ్రాండ్ మాస్టర్లు