షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు
షెడ్యూల్డ్ కులాలు,[1] షెడ్యూల్డ్ తెగలు భారతదేశంలో అత్యంత వెనుకబడిన సామాజిక-ఆర్థిక సమూహాలుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సామాజిక సమూహాలు.[2] ఈ పేర్లను భారత రాజ్యాంగంలో రాసారు.[3] : 3 బ్రిటిషు పాలనలో చాలా కాలం పాటు, వారిని అణగారిన తరగతులుగా పిలిచేవారు.[3] : 2
ఆధునిక సాహిత్యంలో, షెడ్యూల్డ్ కులాల వర్గంలోని అనేక కులాలను కొన్నిసార్లు దళితులుగా సూచిస్తారు.[4][5] స్వాతంత్ర్య పోరాటంలో దళిత నాయకుడు బిఆర్ అంబేద్కర్ ఈ పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. [4] గాంధీ ప్రవేశపెట్టిన హరిజన్ కంటే దళిత్ అనే పదానికి అంబేద్కర్ ప్రాధాన్యత ఇచ్చాడు. హరిజన్ అంటే "హరి ప్రజలు" అని అర్థం.[4] అదేవిధంగా, షెడ్యూల్డ్ తెగలను తరచుగా ఆదివాసీ, వనవాసి, వన్యజాతి అనీ పిలుస్తారు. అయితే, భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగంలో నిర్వచించిన విధంగా షెడ్యూల్డ్ కులాలకు అనుసూచిత్ జాతి అని, షెడ్యూల్డ్ తెగలకు అనుసూచిత్ జనజాతి అనే పదాలను ఉపయోగిస్తుంది. [6] 2018 సెప్టెంబరులో ప్రభుత్వం "దళిత్' అనే అవమానకరమైన నామకరణాన్ని ఉపయోగించవద్దని అన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్‌లకు ఒక సలహాను జారీ చేసింది. అయితే, బాగా వాడుకలో ఉన్న 'దళిత' పదాన్ని వాడవద్దనడానికి వ్యతిరేకంగా హక్కుల సంఘాలు, మేధావులు ఎలుగెత్తారు".[7]
భారతదేశ జనాభాలో ( 2011 జనాభా లెక్కల ప్రకారం) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనాభా 16.6%, 8.6% గా ఉన్నాయి. [8] [9] రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 దాని మొదటి షెడ్యూల్‌లో 28 రాష్ట్రాలలో 1,108 కులాలను జాబితా చేసింది, [10] రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్, 1950 దాని మొదటి షెడ్యూల్‌లో 22 రాష్ట్రాల్లోని 744 తెగలను జాబితా చేసింది. [11]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ హోదా, రాజకీయ ప్రాతినిధ్యం, పదోన్నతిలో ప్రాధాన్యత, విశ్వవిద్యాలయాలలో కోటా, ఉచిత, స్టైపెండ్ విద్య, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకింగ్ సేవలు, వివిధ ప్రభుత్వ పథకాలు అందించారు. ఎస్సీ, ఎస్టీల పట్ల సానుకూల వివక్ష చూపే సాధారణ సూత్రాలను రాజ్యాంగం నిర్దేశించింది.[12][13]: 35, 137
నిర్వచనం
[మార్చు]- షెడ్యూల్డ్ కులాలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (24) ప్రకారం షెడ్యూల్డ్ కులాలు ఇలా నిర్వచించబడ్డాయి: [14]
అటువంటి కులంలు, జాతులు లేదా తెగ లేదా వాటిలో కొంత భాగం లేదా ఆ కులాలు, జాతులు లేదా తెగల లోని సమూహాలు ఈ రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడతాయి
- షెడ్యూల్డ్ తెగలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (25) లో షెడ్యూల్డ్ తెగలను ఇలా నిర్వచించారు: [15] [14]
అటువంటి తెగలు లేదా గిరిజన సంఘాలు లేదా అటువంటి తెగలు లేదా గిరిజన సంఘాలలోని భాగాలు లేదా సమూహాలను ఈ [భారత] రాజ్యాంగం కోసం ఆర్టికల్ 342 కింద షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించబడతాయి
జనాభా వివరాలు
[మార్చు]జనాభా
[మార్చు]రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు | రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం జనాభా | షెడ్యూల్డ్ కులాలు | షెడ్యూల్డ్ తెగలు | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
నోటిఫైడ్ కమ్యూనిటీల సంఖ్య [18] (as of October 2017) |
మొత్తం జనాభా | మొత్తం షెడ్యూల్డ్ కులాల శాతం | రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల జనాభా శాతం | నోటిఫైడ్ కమ్యూనిటీల సంఖ్య (2017 డిసెంబరు నాటికి) [18] | మొత్తం జనాభా | మొత్తం షెడ్యూల్డ్ తెగల సంఖ్య శాతం | రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల జనాభా శాతం | ||
ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా) | 84,580,777 | AP: 61TN: 59 |
13,878,078 | 6.89 | 16.41 | ఎపిః 34 టిఎన్ః 32 |
5,918,073 | 5.66 | 7 |
అరుణాచల్ ప్రదేశ్ | 1,383,727 | 0 | — | — | — | 16 | 951,821 | 0.91 | 68.79 |
అస్సాం | 31,205,576 | 16 | 2,231,321 | 1.11 | 7.15 | 29 | 3,884,371 | 3.72 | 12.45 |
బీహార్ | 104,099,452 | 23 | 16,567,325 | 8.23 | 15.91 | 32 | 1,336,573 | 1.28 | 1.28 |
ఛత్తీస్గఢ్ | 25,545,198 | 44 | 3,274,269 | 1.63 | 12.82 | 42 | 7,822,902 | 7.48 | 30.62 |
గోవా | 1,458,545 | 5 | 25,449 | 0.01 | 1.74 | 8 | 149,275 | 0.14 | 10.23 |
గుజరాత్ | 60,439,692 | 36 | 4,074,447 | 2.02 | 6.74 | 32 | 8,917,174 | 8.53 | 14.75 |
హర్యానా | 25,351,462 | 37 | 5,113,615 | 2.54 | 20.17 | 0 | — | — | — |
హిమాచల్ ప్రదేశ్ | 6,864,602 | 57 | 1,729,252 | 0.86 | 25.19 | 10 | 392,126 | 0.38 | 5.71 |
జార్ఖండ్ | 32,988,134 | 22 | 3,985,644 | 1.98 | 12.08 | 32 | 8,645,042 | 8.27 | 26.21 |
కర్ణాటక | 61,095,297 | 101 | 10,474,992 | 5.2 | 17.15 | 50 | 4,248,987 | 4.06 | 6.95 |
కేరళ | 33,406,061 | 69 | 3,039,573 | 1.51 | 9.1 | 43 | 484,839 | 0.46 | 1.45 |
మధ్యప్రదేశ్ | 72,626,809 | 48 | 11,342,320 | 5.63 | 15.62 | 46 | 15,316,784 | 14.65 | 21.09 |
మహారాష్ట్ర | 112,374,333 | 59 | 13,275,898 | 6.59 | 11.81 | 47 | 10,510,213 | 10.05 | 9.35 |
మణిపూర్ | 2,855,794 | 7 | 97,328 | 0.05 | 3.41 | 34 | 1,167,422 | 1.12 | 40.88 |
మేఘాలయ | 2,966,889 | 16 | 17,355 | 0.01 | 0.58 | 17 | 2,555,861 | 2.44 | 86.15 |
మిజోరం | 1,097,206 | 16 | 1,218 | 0 | 0.11 | 15 | 1,036,115 | 0.99 | 94.43 |
నాగాలాండ్ | 1,978,502 | 0 | — | — | — | 5 | 1,710,973 | 1.64 | 86.48 |
ఒడిశా | 41,974,218 | 95 | 7,188,463 | 3.57 | 17.13 | 62 | 9,590,756 | 9.17 | 22.85 |
పంజాబ్ | 27,743,338 | 39 | 8,860,179 | 4.4 | 31.94 | 0 | — | — | — |
రాజస్థాన్ | 68,548,437 | 59 | 12,221,593 | 6.07 | 17.83 | 12 | 9,238,534 | 8.84 | 13.48 |
సిక్కిం | 610,577 | 4 | 28,275 | 0.01 | 4.63 | 4 | 206,360 | 0.2 | 33.8 |
తమిళనాడు | 72,147,030 | 76 | 14,438,445 | 7.17 | 20.01 | 36 | 794,697 | 0.76 | 1.1 |
త్రిపుర | 3,673,917 | 34 | 654,918 | 0.33 | 17.83 | 19 | 1,166,813 | 1.12 | 31.76 |
ఉత్తర ప్రదేశ్ | 199,812,341 | 66 | 41,357,608 | 20.54 | 20.7 | 15 | 1,134,273 | 1.08 | 0.57 |
ఉత్తరాఖండ్ | 10,086,292 | 65 | 1,892,516 | 0.94 | 18.76 | 5 | 291,903 | 0.28 | 2.89 |
పశ్చిమ బెంగాల్ | 91,276,115 | 60 | 21,463,270 | 10.66 | 23.51 | 40 | 5,296,953 | 5.07 | 5.8 |
అండమాన్, నికోబార్ దీవులు | 380,581 | 0 | — | — | — | 6 | 28,530 | 0.03 | 7.5 |
చండీగఢ్ | 1,055,450 | 36 | 199,086 | 0.1 | 18.86 | 0 | — | — | — |
దాద్రా, నగర్ హవేలీ | 343,709 | 4 | 6,186 | 0 | 1.8 | 7 | 178,564 | 0.17 | 51.95 |
డామన్, డయ్యూ | 243,247 | 5 | 6,124 | 0 | 2.52 | 5 | 15,363 | 0.01 | 6.32 |
జమ్మూ కాశ్మీర్ | 12,541,302 | 13 | 924,991 | 0.46 | 7.38 | 12 | 1,493,299 | 1.43 | 11.91 |
లక్షద్వీప్ | 64,473 | 0 | — | — | — | 61,120 | 0.06 | 94.8 | |
ఢిల్లీ | 16,787,941 | 36 | 2,812,309 | 1.4 | 16.75 | 0 | — | — | — |
పుదుచ్చేరి | 1,247,953 | 16 | 196,325 | 0.1 | 15.73 | 0 | — | — | — |
భారత్ | 1,210,854,977 | 1,284** | 201,378,372 | 100 | 16.63 | 747** | 104,545,716 | 100 | 8.63 |
- The census figures for Scheduled Castes and Scheduled Tribes represent selective demography, as the first clause of Articles 341 and 342 specifies that Schedule status is specific to state or union territory (indicating nativeness of the region), not to the whole country. For example, during the census operation, if a member of a notified community is not present in the state or union territory where the community is recognized as such, or if a member of Scheduled Castes follows religions other than Hinduism, Buddhism, or Sikhism, they are not counted as part of the Scheduled Castes or Scheduled Tribes, but rather as part of the general population.[19][20][21]
- అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లలో, షెడ్యూల్డ్ కులాలుగా ఎవరినీ గుర్తించలేదు; అందువలన, అక్కడ షెడ్యూల్డ్ కులాల జనాభా లేదు.[22]
- పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోను, ఢిల్లీ, చండీగఢ్ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలోనూ, షెడ్యూల్డ్ తెగలుగా ఎవరినీ గుర్తించలేదు; అందువలన, అక్కడ షెడ్యూల్డ్ తెగల జనాభా లేదు.[22]
మతం
[మార్చు]రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు | షెడ్యూల్డ్ కులం | షెడ్యూల్డ్ తెగ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
హిందూ | సిక్కు | బౌద్ధమతం | హిందూ | ముస్లిం | క్రిస్టియన్ | సిక్కు | బౌద్ధమతం | జైన్ | మతం పేర్కొనబడలేదు | ||
ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా) | 13,848,473 | 2,053 | 27,552 | 5,808,126 | 28,586 | 57,280 | 890 | 608 | 644 | 810 | 21,129 |
అరుణాచల్ ప్రదేశ్ | — | — | — | 97,629 | 3,567 | 389,507 | 245 | 96,391 | 441 | 358,663 | 5,378 |
అస్సాం | 2,229,445 | 1,335 | 541 | 3,349,772 | 13,188 | 495,379 | 387 | 7,667 | 424 | 12,039 | 5,515 |
బీహార్ | 16,563,145 | 1,595 | 2,585 | 1,277,870 | 11,265 | 32,523 | 150 | 252 | 123 | 10,865 | 3,525 |
ఛత్తీస్గఢ్ | 3,208,726 | 1,577 | 63,966 | 6,933,333 | 8,508 | 385,041 | 620 | 1,078 | 312 | 488,097 | 5,913 |
గోవా | 25,265 | 7 | 177 | 99,789 | 531 | 48,783 | 20 | 62 | 18 | 12 | 60 |
గుజరాత్ | 4,062,061 | 1,038 | 11,348 | 8,747,349 | 34,619 | 120,777 | 1,262 | 1,000 | 1,266 | 3,412 | 7,489 |
హర్యానా | 4,906,560 | 204,805 | 2,250 | — | — | — | — | — | — | — | — |
హిమాచల్ ప్రదేశ్ | 1,709,634 | 15,939 | 3,679 | 307,914 | 37,208 | 275 | 294 | 45,998 | 54 | 23 | 360 |
జార్ఖండ్ | 3,983,629 | 669 | 1,346 | 3,245,856 | 18,107 | 1,338,175 | 984 | 2,946 | 381 | 4,012,622 | 25,971 |
కర్ణాటక | 10,418,989 | 2,100 | 53,903 | 4,171,265 | 44,599 | 12,811 | 802 | 472 | 1,152 | 665 | 17,221 |
కేరళ | 3,039,057 | 291 | 225 | 431,155 | 18,320 | 32,844 | 42 | 44 | 18 | 376 | 2,040 |
మధ్యప్రదేశ్ | 11,140,007 | 2,887 | 199,426 | 14,589,855 | 33,305 | 88,548 | 1,443 | 1,796 | 852 | 584,338 | 16,647 |
మహారాష్ట్ర | 8,060,130 | 11,484 | 5,204,284 | 10,218,315 | 112,753 | 20,335 | 2,145 | 20,798 | 1,936 | 93,646 | 40,285 |
మణిపూర్ | 97,238 | 39 | 51 | 8,784 | 4,296 | 1,137,318 | 209 | 2,326 | 288 | 11,174 | 3,027 |
మేఘాలయ | 16,718 | 528 | 109 | 122,141 | 10,012 | 2,157,887 | 301 | 6,886 | 254 | 251,612 | 6,768 |
మిజోరం | 1,102 | 9 | 107 | 5,920 | 4,209 | 933,302 | 62 | 91,054 | 343 | 751 | 474 |
నాగాలాండ్ | — | — | — | 15,035 | 5,462 | 1,680,424 | 175 | 4,901 | 500 | 3,096 | 1,380 |
ఒడిశా | 7,186,698 | 825 | 940 | 8,271,054 | 15,335 | 816,981 | 1,019 | 1,959 | 448 | 470,267 | 13,693 |
పంజాబ్ | 3,442,305 | 5,390,484 | 27,390 | — | — | — | — | — | — | — | — |
రాజస్థాన్ | 11,999,984 | 214,837 | 6,772 | 9,190,789 | 13,340 | 25,375 | 663 | 445 | 622 | 1,376 | 5,924 |
సిక్కిం | 28,016 | 15 | 244 | 40,340 | 369 | 16,899 | 72 | 1,36,041 | 125 | 12,306 | 208 |
తమిళనాడు | 14,435,679 | 1,681 | 1,085 | 783,942 | 2,284 | 7,222 | 84 | 50 | 45 | 55 | 1,015 |
త్రిపుర | 654,745 | 69 | 104 | 888,790 | 2,223 | 153,061 | 250 | 1,19,894 | 318 | 768 | 1,509 |
ఉత్తర ప్రదేశ్ | 41,192,566 | 27,775 | 137,267 | 1,099,924 | 21,735 | 1,011 | 264 | 353 | 410 | 2,404 | 8,172 |
ఉత్తరాఖండ్ | 1,883,611 | 7,989 | 916 | 287,809 | 1,847 | 437 | 364 | 1,142 | 7 | 9 | 288 |
పశ్చిమ బెంగాల్ | 21,454,358 | 3,705 | 5,207 | 3,914,473 | 30,407 | 343,893 | 1,003 | 220,963 | 876 | 774,450 | 10,888 |
అండమాన్, నికోబార్ దీవులు | — | — | — | 156 | 1,026 | 26,512 | 0 | 85 | 0 | 344 | 407 |
చండీగఢ్ | 176,283 | 22,659 | 144 | — | — | — | — | — | — | — | — |
దాద్రా, నగర్ హవేలీ | 6,047 | 0 | 139 | 175,305 | 242 | 2,658 | 15 | 12 | 4 | 54 | 274 |
డామన్, డయ్యూ | 6082 | 1 | 41 | 15,207 | 125 | 16 | 0 | 1 | 1 | 0 | 13 |
జమ్మూ కాశ్మీర్ | 913,507 | 11,301 | 183 | 67,384 | 1,320,408 | 1,775 | 665 | 100,803 | 137 | 1,170 | 957 |
లక్షద్వీప్ | — | — | — | 44 | 61,037 | 3 | 4 | 2 | 10 | 4 | 16 |
ఢిల్లీ | 2,780,811 | 25,934 | 5,564 | — | — | — | — | — | — | — | — |
పుదుచ్చేరి | 196,261 | 33 | 31 | — | — | — | — | — | — | — | — |
భారత్ | 189,667,132 | 5,953,664 | 5,757,576 | 84,165,325 | 1,858,913 | 10,327,052 | 14,434 | 866,029 | 12,009 | 7,095,408 | 206,546 |
- The census figures for Scheduled Castes and Scheduled Tribes represent selective demography, as the first clause of Articles 341 and 342 specifies that Schedule status is specific to state or union territory (indicating nativeness of the region), not to the whole country. For example, during the census operation, if a member of a notified community is not present in the state or union territory where the community is recognized as such, or if a member of Scheduled Castes follows religions other than Hinduism, Buddhism, or Sikhism, they are not counted as part of the Scheduled Castes or Scheduled Tribes, but rather as part of the general population.[19][20][21]
- అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లలో, షెడ్యూల్డ్ కులాలుగా ఎవరినీ ప్రకటించలేదు; అందువలన, అక్కడ షెడ్యూల్డ్ కులాల జనాభా లేదు.[22]
- పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోను, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలోనూ, షెడ్యూల్డ్ తెగలుగా ఎవరినీ గుర్తించలేదు; అందువలన, అక్కడ షెడ్యూల్డ్ తెగల జనాభా లేదు.[22]
రాజ్యాంగం లోను, ఇతర చట్టాలలోనూ నిర్మితమైన రక్షణలను సమర్థవంతంగా అమలు చేయడానికి, 338, 338A అధికరణాల కింద రాజ్యాంగంలో రెండు రాజ్యాంగ కమిషన్లకు స్థానం కల్పించింది: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, [23] షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్. [24] ఈ రెండు కమీషన్ల అధ్యక్షులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు.
షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్
[మార్చు]1979 నాటి షెడ్యూల్డ్ కులాల ఉప-ప్రణాళిక (SCSP) షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక , విద్యా అభివృద్ధికీ, వారి పని, జీవన పరిస్థితులలో మెరుగుదల కోసమూ ఒక ప్రణాళిక ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఇది ఒక గొడుగు వ్యూహం, సాధారణ అభివృద్ధి రంగం నుండి షెడ్యూల్డ్ కులాలకు ఆర్థిక భౌతిక ప్రయోజనాలు లభించేలా చూస్తుంది.[25] రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (UTలు) వార్షిక ప్రణాళిక నుండి జాతీయ SC జనాభాకు ఒక కనీస నిష్పత్తిలో నిధులు, సంబంధిత ప్రయోజనాలను కలగజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గణనీయమైన SC జనాభా ఉన్న ఇరవై ఏడు రాష్ట్రాలు, కేం.పా.ప్రాలు ఈ ప్రణాళికను అమలు చేస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా 16.66 కోట్లు (మొత్తం జనాభాలో 16.23%) ఉన్నప్పటికీ, SCSP ద్వారా చేసిన కేటాయింపులు దామాషా జనాభా కంటే తక్కువగా ఉన్నాయి.[26] భూసంస్కరణలు, వలసలు (కేరళ గల్ఫ్ డయాస్పోరా), విద్య యొక్క ప్రజాస్వామ్యీకరణ కారణంగా కేరళలో షెడ్యూల్డ్ కులాల సంతానోత్పత్తి చాలా తక్కువగా ఉన్న ఒక విచిత్రమైన అంశం బయటపడింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Scheduled Caste Welfare – List of Scheduled Castes". Ministry of Social Justice and Empowerment. Archived from the original on 13 September 2012. Retrieved 16 August 2012.
- ↑ "Scheduled Castes And Scheduled Tribes". United Nations in India. Archived from the original on 22 November 2021. Retrieved 2021-11-21.
- ↑ 3.0 3.1 "Scheduled Communities: A social Development profile of SC/ST's (Bihar, Jharkhand & West Bengal)" (PDF). Planning Commission (India). Archived from the original (PDF) on October 20, 2019. Retrieved 1 October 2017.
- ↑ 4.0 4.1 4.2 Roychowdhury, Adrija (September 5, 2018). "Why Dalits want to hold on to Dalit, not Harijan, not SC". The Indian Express. Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ "Dalit". Merriam-Webster.com Dictionary. Archived from the original on 6 October 2022. Retrieved 6 October 2022.
- ↑ Bali, Surya (2018-10-26). "We are 'Scheduled Tribes', not 'Adivasis'". Forward Press (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-05.
- ↑ Union minister: Stick to SC, avoid the term 'Dalit' Archived 22 అక్టోబరు 2018 at the Wayback Machine "Union social justice minister Thawarchand Gehlot said media should stick to the constitutional term "Scheduled Castes" while referring to Dalits as there are objections to the term to the term "Dalit" – backing the government order which has significant sections of scheduled caste civil society up in arms." Times of India 5 September 2018.
- ↑ "2011 Census Primary Census Abstract" (PDF). Censusindia.gov.in. Archived (PDF) from the original on 5 August 2020. Retrieved 1 October 2017.
- ↑ "Half of India's dalit population lives in 4 states". The Times of India. 2 May 2013. Archived from the original on 11 November 2020. Retrieved 1 October 2017.
- ↑ "Text of the Constitution (Scheduled Castes) Order, 1950, as amended". Lawmin.nic.in. Archived from the original on 19 June 2009. Retrieved 1 October 2017.
- ↑ "Text of the Constitution (Scheduled Tribes) Order, 1950, as amended". Lawmin.nic.in. Archived from the original on 20 September 2017. Retrieved 1 October 2017.
- ↑ Kumar, K Shiva (17 February 2020). "Reserved uncertainty or deserved certainty? Reservation debate back in Mysuru". The New Indian Express. Archived from the original on 21 November 2021. Retrieved 29 November 2021.
- ↑ "THE CONSTITUTION OF INDIA [As on 9th December, 2020]" (PDF). Legislative Department. Archived (PDF) from the original on 26 November 2021. Retrieved 29 November 2021.
- ↑ 14.0 14.1 "Chapter- II, Social Constitutional Provisions for Protection and Development of the Scheduled Castes and Scheduled Tribes" (PDF). ncsc.nic.in.
- ↑ "Chapter III" (PDF). dopt.gov.in. Archived (PDF) from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
- ↑ "Basic Population Figures of India and States, 2011". Office of the Registrar General & Census Commissioner, India. Archived from the original on 10 May 2022.
- ↑ "Government of India, Ministry of Social Justice website". Archived from the original on 5 March 2021. Retrieved 6 March 2021.
- ↑ 18.0 18.1 Handbook on Social Welfare Statistics (PDF) (Report). New Delhi: Ministry of Social Justice and Empowerment, Government of India. September 2018. Archived from the original (PDF) on 30 June 2020.
- ↑ 19.0 19.1 Bhagat, Ram B. (2006). "Census and caste enumeration: British legacy and contemporary practice in India". Genus. 62 (2): 119–134. ISSN 0016-6987.
- ↑ 20.0 20.1 Nongkynrih, A K (2010). "Scheduled Tribes and the Census: A Sociological Inquiry". Economic and Political Weekly. 45 (19): 43–47. ISSN 0012-9976.
- ↑ 21.0 21.1 Sahgal, Kelsey Jo Starr and Neha (2021-06-29). "Measuring caste in India". Pew Research Center (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-07.
- ↑ 22.0 22.1 22.2 22.3 Social Studies Division : works and activities (details) (PDF). censusindia.gov.in (Report). Archived (PDF) from the original on 7 జూలై 2024. Retrieved 13 ఆగస్టు 2024.
- ↑ "National Commission for Schedule Castes". Indiaenvironmentportal.org. Archived from the original on 31 August 2013. Retrieved 1 October 2017.
- ↑ "THE CONSTITUTION (EIGHTY-NINTH AMENDMENT) ACT, 2003". Indiacode.nic.in. Archived from the original on 15 September 2008. Retrieved 1 October 2017.
- ↑ Sridharan, R (October 31, 2005). "Letter from Joint Secretary (SP) to Planning Secretaries of All Indian States/UTs". Planning Commission (India). Archived from the original on 26 February 2009. Retrieved 1 October 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Bone, Omprakash S. (2015). Mannewar: A Tribal Community in India. Notion Press. ISBN 978-9352063444.