మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 95,649 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
వినాయక్ దామోదర్ సావర్కర్

వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922 లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందు మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ అనే పదాన్ని వాడాడు. సావర్కర్ నాస్తికుడు.

సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... శంకర్-ఎహసాన్-లాయ్ పలు భారతీయ భాషల్లో 50కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారనీ!
  • ... ఒడిషాలో జరిగే ధను జాతర ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ అయిర్ థియేటర్లో జరిగే ప్రదర్శనగా గిన్నిస్ రికార్డులో స్థానం పొందినదనీ!
  • ... కర్ణాటకలోని బనవాసి నగరం పురాతన కన్నడ రాజవంశమైన కదంబులకు రాజధాని అనీ!
  • ... భారతదేశంలో పశ్చిమం వైపుకు ప్రవహించే అతి కొద్ది నదుల్లో మహీ నది ఒకటనీ!
  • ... 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం స్థాపించిన ఏడు కేంద్ర సాయుధ బలగాల్లో ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఒకటనీ!
చరిత్రలో ఈ రోజు
మే 27:
ఈ వారపు బొమ్మ
మిద్దె మీద మొక్కల సాగు

మిద్దె మీద మొక్కల సాగు

ఫోటో సౌజన్యం: Maheshcm76
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.