ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి [1][2]అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.
విషయ సూచిక |
గవర్నర్ [మార్చు]
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ డిసెంబర్ 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ కార్యాలయము[3] గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.
ముఖ్యమంత్రి [మార్చు]
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010, నవంబర్ 25 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రి కార్యాలయము [4] ముఖ్యమంత్రి కార్యాక్రమాలను సమన్వయంచేస్తుంది.
ప్రధాన న్యాయమూర్తి [మార్చు]
పినాకి చంద్ర ఘోష్ 25 జూన్ 2012 న రాష్ట్ర ఉన్నత న్యాయాలయానికి [5] తాత్కాలిక ప్రధాన న్యాయాధికారిగా బాధ్యతలు చేపట్టాడు.
ప్రధాన ఎన్నికల అధికారి [మార్చు]
2.5 సంవత్సరాలు పైగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ లో ప్రధాన ఎన్నికల అధికారి గా బాధ్యతలు నిర్వహించిన ఐ.వి.సుబ్బారావు, 28 సెప్టెంబరు2010 న కేంద్రానికి బదీలీ అయ్యారు. కొత్త అధికారి నియామకం జరగవలసివుంది.
మంత్రివర్గం [మార్చు]
ప్రధాన వ్యాసం:ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి
ప్రభుత్వ శాఖలు [మార్చు]
ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు
30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు కలవు.
శాసనసభ [మార్చు]
చూడండి: శాసనసభ, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
శాసనమండలి [మార్చు]
శాసనమండలి [6]30 మార్చి 2007న పునరుద్ధరించబడింది.
పార్లమెంట్ సభ్యులు [మార్చు]
చూడండి: లోక్ సభ[7],రాజ్యసభ [8]
జిల్లా స్ధాయి పరిపాలన [మార్చు]
జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరు తో సమన్వయం చేసుకుంటారు. చూడండి:జిల్లాకలెక్టర్ల వివరాలు[9]
రాజ పత్రము [మార్చు]
శాసనాలు, పరిపాలన పత్రాలు రాజపత్రము (గెజెట్) [10] లో ముద్రించుతారు.