Coordinates: 17°23′45″N 78°25′52″E / 17.3959°N 78.4312°E / 17.3959; 78.4312

అత్తాపూర్ (రాజేంద్రనగర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తాపూర్
సమీపప్రాంతం
పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే
అత్తాపూర్ is located in Telangana
అత్తాపూర్
అత్తాపూర్
Location in Telangana, India
అత్తాపూర్ is located in India
అత్తాపూర్
అత్తాపూర్
అత్తాపూర్ (India)
Coordinates: 17°23′45″N 78°25′52″E / 17.3959°N 78.4312°E / 17.3959; 78.4312
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
 • ఎంపిజి.రంజిత్ రెడ్డి
 • ఎమ్మెల్యేటి.ప్రకాశ్‌ గౌడ్‌
 • మేయర్గద్వాల విజయలక్ష్మి
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 028
Vehicle registrationటిఎస్ 13
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ
శాసనసభ నియోజకవర్గంరాజేంద్రనగర్
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
పోలీసు కమీషనర్స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్, సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు

అత్తాపూర్[1] తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఒక ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతం.[2] దీనికి స్థానిక ముస్లిం జమీందార్ లేదా భూస్వామి నవాబ్ అత్తావుల్లా పేరు పెట్టారు. ఇది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండల పరిధిలోకి వస్తుంది.[3] ఈ ప్రాంతం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపబడివుంది.ఈ ప్రాంతం మీదుగా పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఉంది. మెహదీపట్నం, రాజేంద్రనగర్‌ ప్రాంతాలకు సమీపంలో ఉండటం వల్ల ఈ అత్తాపూర్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీపప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో రాజేంద్ర నగర్, బద్వేల్, గగన్‌పహడ్, హైదర్‌గూడ, శివరాంపల్లి, ఉప్పరపల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

కార్యాలయాలు[మార్చు]

అత్తాపూర్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్టు పన్నులు, నార్కోటిక్స్ జోనల్ శిక్షణా సంస్థ ఉంది. రాజేంద్రనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, XVI అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, రెవెన్యూ డివిజన్ కార్యాలయం కూడా ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

225 సంవత్సరాల పురాతనమైన రాంబాగ్ రామాలయం దేవాలయం ఉంది. దీని నిర్మాణం, ప్రాంగణం విషయంలో 2015లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ హెరిటేజ్ అవార్డును పొందింది. ఇక్కడున్న స్వయంభు అనంత పద్మనాభస్వామి దేవాలయంలో 1100 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అత్తాపూర్‌లో ముస్లిం జనాభా గణనీయంగా ఉండడం వల్ల ఇక్కడ చాలా మసీదులు ఉన్నాయి. స్వాగత్ గ్రాండ్ హోటల్ వెనుక అహ్ల్ ఇ హదీస్ మసీదు ఉంది.[5] 1832లో నిర్మించిన హైదరాబాద్ సిక్కు పురాతన గురుద్వారా, 1681లో నిర్మించిన ముషాక్‌మహల్ ప్యాలెస్ ఉన్నాయి.[6]

విద్యాసంస్థలు[మార్చు]

పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ ప్రాంతాని సమీపంలో ఉన్నాయి.

మాల్స్[మార్చు]

డిమార్ట్, స్పెన్సర్స్ రిటైల్, ఘనశ్యాయం, విజేత, వాల్‌మార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ మొదలైనవి అత్తాపూర్ చుట్టూ ఉన్న పెద్ద సూపర్‌మార్కెట్లు. మంత్ర మాల్, ఎంక్యూబ్ సినిమా హాళ్ళు, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే, పిజ్జా హట్, డొమినోస్, ప్యారడైజ్, కెఎఫ్ సి, బర్గర్‌కింగ్, ఎస్.వి.ఎం., పాలమూరు గ్రిల్ వంటి అనేక ఫుడ్ కోర్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

వైద్యం[మార్చు]

జోయి హాస్పిటల్స్, జర్మంటెన్ హాస్పిటల్స్, ప్రీమియర్ హాస్పిటల్స్, మైత్రి హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి.

ప్రజా రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అత్తాపూర్ నుండి సికింద్రాబాద్ జంక్షన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్), దిల్ సుఖ్ నగర్ బస్ స్టేషన్, గోల్కొండ బస్ స్టాప్, సిబిఎస్ బస్ స్టాప్, అఫ్జల్‌గంజ్ బస్ స్టాప్, కోకాపేట సరస్సు, కోఠి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[7]

మూలాలు[మార్చు]

  1. "Attapur". www.attapur.in. Retrieved 2021-10-18.
  2. "Attapur , Hyderabad". www.onefivenine.com. Archived from the original on 2020-09-28. Retrieved 2021-10-18.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  5. "Open Mosque at Masjid-e-Quba today". The Hans India (in ఇంగ్లీష్). 16 June 2018. Retrieved 2021-10-18.
  6. "Mushk Mahal Attapur, Hyderabad, Telangana Tourism". 18 November 2016.
  7. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-18.

వెలుపలి లంకెలు[మార్చు]