Jump to content

ఉదయనిధి స్టాలిన్

వికీపీడియా నుండి
(ఉద‌య‌నిధి స్టాలిన్‌ నుండి దారిమార్పు చెందింది)
ఉద‌య‌నిధి స్టాలిన్‌
ఉదయనిధి స్టాలిన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 సెప్టెంబరు28
గవర్నరు ఆర్.ఎన్. రవి
ముందు ఓ. పన్నీరు సెల్వం

క్రీడా శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 డిసెంబరు 14
గవర్నరు ఆర్.ఎన్. రవి
ముందు శివ.వి. మెయ్యనాథన్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 మే 11
ముందు జె. అన్బళగన్
నియోజకవర్గం చేపాక్-తిరువల్లికేని

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 జులై 4
అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్
ముందు ఎంపీ సామినాథన్[2]

వ్యక్తిగత వివరాలు

జననం (1977-11-27) 1977 నవంబరు 27 (వయసు 47)
మద్రాస్, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి కృతిక
(పెళ్లి. 2002- ప్రస్తుతం వరకు)
సంతానం ఇన్బానిథి (కుమారుడు)
తన్మయ (కూతురు)
నివాసం 25/9, చిత్తరంజన్ రోడ్, ఆళ్వార్ పేట్, చెన్నై, తమిళనాడు, భారతదేశం
పూర్వ విద్యార్థి లొయోల కాలేజీ, చెన్నై
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • సినీ నటుడు
  • సినిమా డిస్ట్రిబ్యూటర్
  • నిర్మాత

ఉద‌య‌నిధి స్టాలిన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, సినీ నటుడు, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి. 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3] 2024 సెప్టెంబరు 28 నుండి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరుపున ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.[4]

జీవిత నేపథ్యం

ఉదయనిధి స్టాలిన్ 1977, నవంబరు 27న స్టాలిన్, దుర్గా దంపతులకు జన్మించాడు.[5] అతను త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మ‌నువ‌డు. ఉదయనిధి స్టాలిన్ పదవ తరగతి వరకు డోన్ బోస్కోలో పూర్తి చేసి, చెన్నైలోని లయోల కాలేజీ నుండి బీఎస్సీ పూర్తి చేశాడు.[6]

సినిమా జీవితం

ఉదయనిధి స్టాలిన్, రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై 2008లో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా 'కురువి' చిత్రం నిర్మించి, నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[7] తరువాత 2009లో ఆధవాన్, 2010లో మన్మధన్ అంబు, 2010లో 7th సెన్స్ చిత్రాలను నిర్మించాడు.[8][9] అతను 2012లో ఓరు కల్ ఓరు కన్నడి (తెలుగులో ఒకే..ఒకే ) చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

నటించిన సినిమాలు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
2009 ఆధవాన్ పనివాడు అతిథి పాత్రలో
2012 ఓరు కల్ ఓరు కన్నడి శరవణన్ తెలుగులో ఒకే ఒకే పేరిట రిలీజ్ అయింది[10]
2013 వణక్కం చెన్నై ఇంటి కిరాయిదారుడిగా అతిథి పాత్రలో
2014 ఇదు కతిరువేలన్ కాదల్ కతిరువేలన్ తెలుగులో శీనుగాడి లవ్ స్టోరీ రిలీజ్ అయింది
2015 నాన్ బెండ సత్య
2016 జీతు సేతు
మానితన్ శక్తివేల్
2017 శరవణన్ ఇరుక్క భయమెన్ శరవణన్
పోదువగా ఇమ్మనసు తంగం గణేష్
ఇప్పడై వెల్లుమ్ మధుసూదనన్
2018 నిమిరి సెల్వం
2019 కన్నె కలైమాన్ కమల కన్నన్
2020 సైకో గౌతమ్
2021 కన్నై నంబథెయ్ అరుణ్ షూటింగ్ లో ఉంది
ఏంజెల్ - షూటింగ్ లో ఉంది [11]
నెంజుక్కు నీతి షూటింగ్ ప్రీ -ప్రొడక్షన్ [12]

రాజకీయ జీవితం

ఉదయనిధి స్టాలిన్ 2019, జూలై 4న డిఎంకే పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆయన 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ తరపున చెపాక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప పీఎంకే అభ్యర్థి ఏవికే. కాసల్లిపై దాదాపు 69,355 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[13] 2024 సెప్టెంబరు 28 నుండి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరుపున ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.[14]

నిర్మాతగా

  • కురువి (2008)
  • ఆధవాన్ (2009)
  • మన్మధన్ అంబు (2010)
  • 7 ఆమ్ అరివు (2011)

డిస్ట్రిబ్యూటర్ గా

  • విన్నైతాండి వరువాయా (2010)
  • మద్రసాపట్టిణం (2010)
  • బాస్ ఎన్గిర భాస్కరన్ (2010)
  • మైనా (2010)
  • బక్రీద్ (2019)

మూలాలు

  1. Eenadu (28 September 2024). "తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
  2. Jul 5, TNN / (5 July 2019). "Another son traces dad's footsteps, rises in the DMK | Chennai News - Times of India". The Times of India. Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (3 May 2021). "Udhayanidhi Stalin : సినిమాల‌కు ఉద‌య‌నిధి స్టాలిన్‌ గుడ్ బై !". Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
  4. "Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌". EENADU. Retrieved 2024-12-08.
  5. News18 Telugu (3 May 2021). "Udhayanidhi Stalin: అతిపిన్న వయసులో ఎమ్మెల్యే అయిన హీరో ఉదయనిధి స్టాలిన్‌ ఎన్ని కోట్ల ఆస్తులన్నాయో.. అదే రేంజ్‌లో క్రిమినల్ కేసులు." Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. India Today (25 September 2010). "Udhayanidhi Stalin: Right Heir, Right Now". Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
  7. Rediff (3 May 2008). "Vijay fans will love Kuruvi". www.rediff.com. Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
  8. "Aadhavan - Tamil Movie Reviews - Suriya Nayanthara Ramesh Kanna Vadivelu K.S.Ravikumar Udhayanidhi Stalin Harris Jayaraj - Behindwoods.com". www.behindwoods.com.
  9. "MANMADHAN AMBU MOVIE REVIEW - TAMIL MOVIE MANMADHAN AMBU MOVIE REVIEW". www.behindwoods.com.
  10. "Udhayanidhi Stalin Telugu Dubbed Movies List 2021". Tollywood Ace. Retrieved 2021-08-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/udhayanidhi-to-romance-payal-rajput-in-angel/articleshow/65910659.cms?from=mdr
  12. https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/udhayanidhi-starts-shooting-for-tamil-remake-of-article-15/articleshow/82002291.cms
  13. The Times of India, D. Govardan / TNN / (3 May 2021). "Tamil Nadu: Udhayanidhi Stalin wins big, cements claim to political legacy | Chennai News - Times of India". Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
  14. ABN (2024-09-30). "తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-08.