ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఖజురహో దేవాలయాల సమూహము
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
A typical temple at Khajuraho with divine couples. Note lace-like ornamentation on the major and the minor shikharas.
రకం సాంస్కృతిక
ఎంపిక ప్రమాణం i, iii
మూలం 240
యునెస్కో ప్రాంతం ఆసియా-పసిఫిక్ వారసత్వ ప్రాంతాలు
శిలాశాసన చరిత్ర
శాసనాలు 1986 (10వ సమావేశం)

ఖజురహో (ఆంగ్లం : Khajuraho) మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం.

ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము.

చరిత్ర[మార్చు]

10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశములో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు నూరు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాతి కాలంలో చందేల రాజధాని మహోబాకు మార్చబడింది. అయినా మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.

దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కాని ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడినాయి.

ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీ.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు.

భౌగోళిక స్థానము[మార్చు]

ఖజురహో 24.85° N 79.93° E స్థానములో ఉంది. సరాసరి ఎత్తు 283 మీటర్లు (928 అడుగులు) .

ప్రస్తుత ప్రజానీకము[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం ఖజురాహో జనాభా 19, 232. ఇందులో 52 శాతం పురుషులు, 48 శాతం స్త్రీలు. ఇక్కడ అక్షరాస్యత శాతం జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా 53% ఉంది. పురుషుల్లో అక్షరాస్యతా శాతం 62%, స్త్రీలలో అక్షరాస్యతా శాతం 43% ఉంది. ఖజురాహోలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 19 శాతము ఉన్నారు.

ఖజురహో లోని శిల్పాలు మరియు శిల్పకళ[మార్చు]

ఇక్కడి శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథములోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర పఠనాలు[మార్చు]

  • Phani Kant Mishra, Khajuraho: With Latest Discoveries, Sundeep Prakashan (2001) ISBN 81-7574-101-5

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.