Jump to content

బుద్గాం జిల్లా

వికీపీడియా నుండి
(బుద్గం జిల్లా నుండి దారిమార్పు చెందింది)
బుద్గాం జిల్లా
జిల్లా
బుద్గాం జిల్లాలోని దూద్‌పత్రి పచ్చిక బయళ్ళు
బుద్గాం జిల్లాలోని దూద్‌పత్రి పచ్చిక బయళ్ళు
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో బుద్గాం జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో బుద్గాం జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
స్థాపన1979
ప్రధాన కార్యాలయంబుద్గాం
విస్తీర్ణం
 • Total1,370 కి.మీ2 (530 చ. మై)
జనాభా
 (2011)
 • Total7,35,753
 • జనసాంద్రత537/కి.మీ2 (1,390/చ. మై.)
భాషలు
 • అధికారం భాషఉర్దూ
Time zoneUTC+5:30
లింగ నిష్పత్తి1.13250283 /
అక్షరాస్యత57.98%

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో బుద్గాంం జిల్లా ఒకటి. ఇది 1979లో రూపొందించబడింది.[1]

నిర్వహణ

[మార్చు]

బుద్గాం జిల్లా 1979 నుండి ఉనికిలో ఉంది. మునుపు ఈ భూభాగం శ్రీనగర్ జిల్లాలో భాగంగా ఉంది. పాతకాలంలోబుద్గాం బారముల్లా జిల్లాలో భాగంగా ఉంది. అదేసమయంలో శ్రీనగర్ అనంతనాగ్ జిల్లాలో భాగంగా ఉంది. అప్పుడు ఇది శ్రీప్రతాప్ తాలూకాగా ఉండేది. చారిత్రక ఆధారాలు బుద్గాం దీసుపరగణాగా ఉండేదని తెలియజేస్తుంది. ప్రఖ్యాత చరిత్రకారుడు ఖ్వాజా అజం దెమారి ఈ ప్రాంతం ఒకప్పుడు దీద్మార్బగ్ అని పిలువవడిందని భావిస్తున్నారు.

సరిహద్దులు

[మార్చు]

బుద్గాం జిల్లాకు ఉత్తరాన శ్రీనగర్, దక్షిణాన పుల్వామా,నైరుతిన పూంచ్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రెవెన్యూ విభాగాలు

[మార్చు]

బీర్వా, నాగం, బుద్గం, బి.కె పోక్రా, ఖాన్, ఖాగ్, నర్బల్, చదోరా.[2]

తాలూకాలు

[మార్చు]

షెరారీ షరీఫ్, బీర్వా, బాద్‌గం, చదూరా, ఖాంసాహిబ్[3]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం బుద్గాం జిల్లా మొత్తం జనాభా 753,745. బుద్గాం జనాభాలో ముస్లింలు 97.65% ఉన్నారు.[4]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 735,753,[5]
ఇది దాదాపు. గయానా దేశ జనసంఖ్యకు సమానం..[6]
అమెరికాలోని. అలాస్కా రాష్ట్ర జనసంఖ్యకు సమం[7]
640 భారతదేశ జిల్లాలలో. 494 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 537 .[5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.18%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 883:1000 [5]
అక్షరాస్యత శాతం. 57.98%.,[5]
జాతియ సరాసరి (72%) కంటే.
2001-2011 మధ్య అక్షరాస్యతాభివృద్ధి 39.54%

విద్య

[మార్చు]

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి బుద్గం జిల్లాలో 98 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33 హైస్కూల్సు ఉన్నాయి. బుద్గం జిల్లాలోని పల్లార్ గ్రామంలో ఒక ప్రభుత్వ డిగ్రీకాలేజ్ ఉంది.1990 నుండి బుద్గంలో అక్షరాస్యత అభివృద్ధికి పాటుబడిన పాఠశాలలలో ప్రధానమైనది ఆర్.ఎం.పి స్కూల్. ఈ పాఠశాల విద్యార్థులు ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, పాత్రికేయులు, లాయర్లు, విజయవంతమైన వ్యాపాలుగా గుర్తింపు పొందారు. ఈ పాఠశాల ప్రస్తుతం నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తుంది. ఈ పాఠశాల స్థాపించినప్పటి నుండి 100% ఫలితాలను సాధించడం విశేషం. 1990లో ఈ పాఠశాలను నూర్ ముహమ్మద్ చేత ప్రారంభించబడింది.

ఆకర్షణలు

[మార్చు]
  • దూద్పాథర్.
  • యూస్మార్గ్
  • టాస్మైదాన్
  • నీల్నాగ్, ఖాగ్

ప్రముఖులు

[మార్చు]
  • ఆగా సైద్ యూసఫ్ - అల్ - మూసవి:- జమ్మూ కాశ్మీర్ అంజుమన్ షరీ షియాన్ అధ్యక్షుడు. అతను కాశ్మీర్ హింసాత్మకచర్యలకు ముగింపు కలిగించాడని గుర్తించబడుతున్నాడు.అతను విద్యాభివృద్ధికి, సాంఘిక సంస్కరణలకు, సేవాకార్యక్రమాలకొరకు విశేషకృషి చేసాడు.[8][9][10]
  • శ్రీ సైద్ సాని మవ్లానా సైద్ అలీ షాహ్ బుఖార:- 1914 నవంబరు 30లో జన్మించాడు.అతనిని శ్రీ సైద్ అని కూడా పిలువబడ్డాడు.
  • మీర్ వైజ్.
  • ముస్లే మిలత్ (మత, రాజకీయ నాయకుడు):- అతను ప్రాంత సాంఘిక - ఆర్థిక అభివృద్ధికి కృషిచేసాడు. అంజుమన్ మఝర్ ఉల్ హాక్ స్థాపించాడు. 1957-1977 లో శాసనసభ ఎన్నికలో పాల్గొన్నాడు. ఒకసారి బుద్గం మరొకసారి బీర్వా నియోజకవర్గాంలో పోటీచేసాడు.ఒకసారి నేషనల్ కాంఫరెంస్ తరఫున మరొకసారి జనతాపార్టీ తరఫున పోటీ చేసాడు.[11][12][13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-21. Retrieved 2014-06-30.
  2. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  3. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  4. "Badgam District Religion Data - Census 2011". www.census2011.co.in. Retrieved 2020-11-29.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guyana 744,768
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231
  8. Behnegarsoft.com (2012-09-09). "Taqribnews (TNA) - Daylong Hajj conference held in Kashmir". Taghribnews.com. Retrieved 2013-09-30.
  9. Behnegarsoft.com (2012-09-22). "Taqribnews (TNA) - Protests Against Anti-Islam Film Rock Kashmir". Taghribnews.com. Retrieved 2013-09-30.
  10. "Pairwan-e-Vilayat conference pitches for unity among Muslims". Dailykashmirimages.com. Archived from the original on 2013-10-03. Retrieved 2013-09-30.
  11. "Beerwah Assembly Election 1977, Jammu & Kashmir". Empoweringindia.org. Archived from the original on 2013-06-20. Retrieved 2012-12-24.
  12. "Making democracy meaningful, Know our Representative & Candidate". Empowering India. Archived from the original on 2013-06-20. Retrieved 2012-12-24.
  13. "Budgam â€" This Central Kashmir district has 5 segments, 3,83,914 voters - Early Times Newspaper Jammu Kashmir". Earlytimesnews.com. 2008-12-07. Archived from the original on 2014-02-01. Retrieved 2012-12-24.

బయటి లింకులు

[మార్చు]