శ్రావణమాసము
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.
శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.
శ్రావణమాస మహత్యం
[మార్చు]శ్రావణమాస మహత్యం స్కాంద పురాణంలోనున్నది. దీనిని చల్లా నాగలింగశాస్త్రి వారి పుత్రుడైన చల్లా లక్ష్మీనృసింహశాస్త్రి ద్వారా ఆంధ్రతాత్పర్యసహితంగా అనువదించబడింది. దీనిని బ్రహ్మశ్రీ కావూరి రంగయ్య శాస్త్రులు పరిష్కరించి ఆర్యానంద ముద్రాక్షరశాల, మచిలీపట్నంలో 1932లో ముద్రించబడింది.[1]
పండుగలు
[మార్చు]ఇతర విశేషాలు
[మార్చు]- నందన నామ సంవత్సరంలో తిరుపతి వేంకట కవులు అమలాపురములో శతావధానము నిర్వహించారు.[2]
- వికారి నామ సంవత్సరంలో ఆలమూరులోను, అమలాపురం తాలూకా క్రొత్తపేటలో రామయ్యర్ గారు తిరుపతి వేంకట కవులు ద్వారా యష్టావధానములు చేయించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో శ్రావణమాస మహాత్మ్యము పుస్తక ప్రతి.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 9. Retrieved 26 June 2016.[permanent dead link]
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]